మీ గుండెల్లో నాన్న ఉన్నాడు కాబట్టే మీరు ఆదరణ ఆప్యాయతలు చూపిస్తున్నారు.' అంటూ జగన్ ప్రసంగించారు. ఆయన్ని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వారందరికి జగన్ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.
జనం - జగన్
ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......
Saturday, July 10, 2010
'ఓదార్పు' లో వైయస్ జగన్ సెంటిమెంట్ కు కళ్ళనీళ్ళు పెడుతున్న జనం
నరసన్నపేట (శ్రీకాకుళం జిల్లా): జగన్ యాత్రకు మంచి స్పందన కనిపిస్తోంది. ఓదార్పు యాత్రలో భాగంగా వైఎస్ జగన్ శుక్రవారం నరసన్నపేటలో వైఎస్ రాజశేఖరరెడ్డి
విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 'నాన్న చనిపోతూ ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చిపోయారు. ఇంత పెద్ద కుటుంబంలో నన్ను ఒక కొడుకుగా దీవిస్తున్నారు, తమ్ముడిలా ఆదరిస్తున్నారు.
మీ గుండెల్లో నాన్న ఉన్నాడు కాబట్టే మీరు ఆదరణ ఆప్యాయతలు చూపిస్తున్నారు.' అంటూ జగన్ ప్రసంగించారు. ఆయన్ని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వారందరికి జగన్ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.
మీ గుండెల్లో నాన్న ఉన్నాడు కాబట్టే మీరు ఆదరణ ఆప్యాయతలు చూపిస్తున్నారు.' అంటూ జగన్ ప్రసంగించారు. ఆయన్ని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వారందరికి జగన్ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.
Labels:
Congress,
gouthamaraju,
odarpu yatra,
Y.S.Jaganmohana Reddy,
ఓదార్పు యాత్ర,
జగన్,
శ్రీకాకుళం
ఓదార్పు యాత్రపై అధిష్ఠానం మౌనం
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాన్ని పెడచెవిన బెట్టి దివంగత నేత వైఎస్ తనయుడు, కడప ఎంపీ జగన్మోహన్‌రెడ్డి ప్రారంభించిన 'ఓదార్పు యాత్ర'కు పెద్దగా ప్రాధాన్యతనివ్వరాదనే అధిష్టానం ఇప్పటికీ భావిస్తోంది.
వైఎస్ పుట్టినరోజునాడు గురువారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ప్రారంభమైన జగన్ యాత్ర విజయవంతంగా రెండవరోజుకు చేరుకొన్నప్పటికీ దీనిపై స్పందించేందుకు అధిష్ఠానం ప్రతినిధులు ముందుకు రావడం లేదు.
పెద్దసంఖ్యలో ప్రజల భావోద్వేగాలతో ముడివడిన ఈ యాత్ర గురించి ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు చేయకుండా వేచిచూడాలనే వైఖరినే ఎఐసిసి అధికార ప్రతినిధులు కూడా అవలంబిస్తున్నారు. జగన్ ఓదార్పు యాత్ర గురించి తనకేమీ తెలియదని, ఒక కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు సాగిస్తున్న ఈ యాత్రపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడైన కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీని మాత్రమే అడగాలని శుక్రవారంనాడిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికాగోష్ఠిలో మాట్లాడిన ఎఐసిసి అధికార ప్రతినిధి డాక్టర్ షకీల్ అహ్మద్ విలేఖరుల ప్రశ్నలను తప్పించుకొనే ప్రయత్నం చేశారు. జగన్ కొత్త పార్టీ పెడుతున్నారనే వార్తలపై మీ అభిప్రాయమేమిటన్న విలేఖరుల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చేందుకు నిరాకరించారు. పార్టీ ఆదేశాన్ని ధిక్కరించి నాయకత్వంపై దండయాత్ర మాదిరిగా ఆయన సాగిస్తున్న వోదార్పు యాత్ర రెండవ రోజుకు చేరినా స్పందించరా అన్న ప్రశ్నలకు 'యాత్ర గురించి నాకెలాంటి సమాచారం లేదు, యాత్రకు అధిష్ఠానం అనుమతి ఉన్నదా లేదా కూడా నాకు తెలియదు, యాత్ర సందర్భంగా ఆయన పార్టీపై ధ్వజమెత్తినట్లు కూడా ఎలాంటి సమాచారం లేదు' అన్న మాటలే ఆయన నుండి సమాధానంగా లభించాయి.
అయితే, అంతకుముందు కేరళలో వామపక్ష కూటమితో చేతులు కలపాలన్న యుపిఎ భాగస్వామ్యపక్షంఎన్‌సిపిలో చోటుచేసుకొంటున్న పరిణామాల గురించి, బీహర్ పరిణామాల గురించి వివరించిన ఆయనపై విలేఖరులు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌లో చోటుచేసుకొంటున్న పరిణామాలపై ఎందుకు వ్యాఖ్యానించరంటూ విరుచుకుపడినా ఆయన మౌనం వీడలేదు. కాకపోతే, ఒక దశలో ఓదార్పు యాత్రను పార్టీ జాగ్రత్తగా గమనిస్తోందని, ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ తిరిగి వచ్చాక సమర్పించే నివేదిక ఆధారంగానే అధిష్ఠానం ఏ నిర్ణయమైనా తీసుకొంటుందని మాత్రం వివరించారు.

- మొయిలీ నివేదికపైనే ఏ నిర్ణయమైనా : షకీల్ అహ్మద్ ప్రకటన
Labels:
Congress,
gouthamaraju,
odarpu yatra,
Y.S.Jaganmohana Reddy,
ఓదార్పు యాత్ర,
జగన్
నాన్న పోయాక రాజకీయాలు దిగజారాయి !
ఓదార్పులో ఇతర జిల్లాల నాయకుల హవా
శ్రీకాకుళం, మేజర్‌న్యూస్: జగన్ ఓదార్పు యాత్రలో ఇతర జిల్లాల నాయకుల హవా కనిపిస్తోంది. అదీకూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఎక్కువగా కనిపిస్తున్నారు. గురువారం జరిగిన జగన్ ఓదార్పు యాత్రలో ఇతర జిల్లాల నాయకులు పల్చగా కన్పించినా రెండోరోజు ఆ లోటు పూర్తిగా తీరింది. మాజీ మంత్రి మారెప్ప మొదటి రోజు హాజరుకాగా, రెండోరోజు పక్క జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ మందీ మార్బలంతో వచ్చారు. దాదాపు వంద వాహనాలతో జగన్ కాన్వాయిలో ఆయన అనుచరగణం కన్పించారు.
దిగివచ్చిన వారసులు
శ్రీకాకుళం జిల్లాలో జగన్ ప్రారంభించిన ఓదార్పు యాత్రకు మంత్రులు, ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నా వారి అనుచరులు, వారసులు మాత్రం పాల్గొన్నారు. జగన్మోహన్‌రెడ్డికి ఘనంగా స్వాగత సత్కారాలు చేశారు. వారసులు కీలక పాత్ర పోషించడంతో నరసన్నపేట సభ విజయవంతమైంది. మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఆయన సోదరుడు కృష్ణదాస్ అసెంబ్లీ సమావేశంలో ఉండడతో వారు రాలేకపోయినా లోపాయికారిగా అన్ని పనులు చక్కదిద్దారు. ధర్మాన కృష్ణదాస్ సతీమణి పద్మప్రియ, ఆమె కుమారుడు రామలింగంనాయుడు, రెవిన్యూమంత్రి ధర్మాన కుమారుడు రామ్‌మనోహర్ నాయుడు జగన్‌కు ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం వాళ్లు వెంటరాగా నరసన్నపేటలో వైఎస్‌ఆర్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. ధర్మాన కుటుంబ సభ్యులను చూసి జగన్ మరింత ఉత్సాహంతో మాట్లాడారు. ఈసం దర్భంగా ఎమ్మెల్యే కృష్ణదాస్ సతీమణి పద్మప్రియ మాట్లాడి జగన్‌బాబు రావడం వల్ల మీరంతా ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాన్నారు.మొత్తం మీద జగన్ నరసన్నపేట వచ్చేసరికి పార్టీ తోడు లేనట్టు ఎవరూ ఊహించలేదు.
జగన్ కోసం ఎంపి కృపారాణి ఎదురు చూపు
శ్రీకాకుళం, మేజర్‌న్యూస్: కడప ఎంపి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మొదటి రోజు పర్యటన రాత్రంతా జరిగింది. షెడ్యూల్ ప్రకారం గురువారం సాయంత్రం 6.30గంటలకు టెక్కలి చేరుకోవాల్సి ఉండగా తెల్లవార్లు ఓదార్పు కొనసాగింది. శుక్రవారం ఉదయం 7 గంటలకు జగన్ కోసం పార్లమెంటు సభ్యురాలు కిల్లి కృపారాణి తన స్వగృహంలో ఎదురు చూశారు. కేవలం రెండు గంటల సమయం గెస్ట్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకున్న జగన్ తిరిగి ఓదార్పు యాత్రకు సిద్ధమయ్యారు. ఎచ్చెర్ల ఎంపిపి బల్లాడ హేమమాలిని రెడ్డి హారతులతో రెండవ రోజు యాత్ర ప్రారంభమైంది. మొదటి రోజు , రెండవ రోజు కూడా ఎంపి కృపారాణి భర్త కిల్లి రామ్మోహన్‌రావు జగన్ పక్కనే ఉండి అన్ని వ్యవహారాలు చూస్తున్నారు.
Labels:
gouthamaraju,
odarpu yatra,
Y.S.Jaganmohana Reddy,
ఓదార్పు యాత్ర,
జగన్,
శ్రీకాకుళం
అంత డబ్బెక్కడిది? కాంగ్రెస్‌ది పదవుల కోసం ఆరాటం: బాబు - ‘దేశం’ పై జ‘గన్’!
వైఎస్ కొడుకు కావడం తప్ప
'రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆకలి చావులు, ప్రకృతి వైపరీత్యాల మరణాల సమయంలో నష్ట పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వాలే ముందూ వెనకా చూసుకుంటున్నాయి. ప్రభుత్వాలు ఇవ్వలేనంత డబ్బు జగన్ ఎలా ఇవ్వగలుగుతున్నారు?' ఇది టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రశ్న. శుక్రవారం అసెంబ్లీ లాబీల్లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ 'ఓదార్పు' గురించి ప్రస్తావించారు.
'వైఎస్ చనిపోయినప్పుడు ఆవేదనతో మరణించారంటూ 700 మందిని లెక్కగట్టి తలా రూ. లక్ష చొప్పున ఇస్తున్నారు. అంటే రూ.7 కోట్లు పంచుతున్నారు. జగన్‌కు ఇంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది?' అని ప్రశ్నించారు. ఆ సమయంలో పక్కనే ఉన్న టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత ముద్దు కృష్ణమ నాయుడు జోక్యం చేసుకున్నారు.
'బాధిత కుటుంబాలకు ఇస్తున్నది ఏడుకోట్ల రూపాయలైతే, పరామర్శ పేరుతో జరుపుతున్న యాత్రకు పెడుతున్న ఖర్చు వంద కోట్లు' అని తెలిపారు. 'వైఎస్ ముఖ్యమంత్రికాక ముందు జగన్ ఆదాయం ఎంత? ఆస్తులెన్ని? ఇప్పుడు ఎన్ని? అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? సొంత పత్రిక సాక్షికి ఏడాదిలో రూ.250 కోట్ల నష్టం చూపించారు. అంత నష్టం భరించేంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది?' అని బాబు ప్రశ్నించారు.
వివాదాలకు, నెగెటివ్ అంశాలకు ప్రచారం ఎక్కువ వస్తుందని, జగన్ యాత్ర విషయంలో అదే జరుగుతోందని చెప్పారు. తాము ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు పదవులు, అధికారం కోసం పోరాడుకొంటున్నారన్నారు.
జగన్ పార్టీ పెడితే రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీల మధ్యే కీలక పోరు ఉంటుందా అని ప్రశ్నించగా. 'రాష్ట్రానికి ప్రాంతీయ పార్టీలు కొత్త కాదు. చాలామంది పెట్టారు. తర్వాత అవి కనిపించలేదు'' అని అన్నారు.
చతికిలబడుతున్న రోశయ్య
దివంగత ముఖ్యమంత్రి కుమారుడు కావడం మినహా జగన్‌కు ఉన్న అర్హత, ప్రత్యేకత ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. "వేటగాళ్లు పక్షులకు ఎర వేసినట్లుగా వైఎస్ రేషన్ కార్డులు, పింఛన్లు, ఆరోగ్య శ్రీ కార్డులు వంటి పథకాలు విసిరి ప్రజలను ఆకట్టుకున్నారు. వాటిచాటున రాష్ట్రాన్ని ఇష్టానుసారం దోపిడీ చేశారు. ఆ తర్వాత రోశయ్యకు జాక్‌పాట్ తగిలి వచ్చారు. కానీ, ఏమీ చేయలేక చతికిలబడుతున్నారు' అని అన్నారు.
వారంపాటు తనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని రోశయ్య చేసిన ప్రకటనను తేలిగ్గా తోసిపుచ్చారు. 'సీఎం పదవి నాకేమైనా కొత్తా? రోశయ్య మాకు ఇచ్చేదేమిటి? కాంగ్రెస్ అధిష్ఠానం ఇస్తే ఆయన తీసుకున్నారు. మాకు ప్రజలే అధిష్ఠానం. ఇస్తే వాళ్లే ఇస్తారు'' అని అన్నారు.
కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి, సొంత పార్టీ పెట్టాలని యోచి స్తున్న కడప ఎంపీ వైఎస్ జగన్ తెలుగుదేశం పార్టీని దెబ్బతీసే లక్ష్యంతో వ్యూహరచన చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న విధానాలతో విసిగెత్తిపోయిన వారిని తన పార్టీలో చేర్చుకోవాలని జగన్ పావులు కదుపుతున్నట్లు సమాచారం. పార్టీలో సగానికి పైగా బాబుపై అవిశ్వాసంతో ఉన్నట్లు గమనించిన జగన్ దానిని సద్వినియోగం చేసు కునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. దీనికోసం 10 వేల కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ వ్యవహారంలో చంద్రబాబునాయుడును తీవ్రంగా వ్యతి రేకిస్తున్న కర్నాటక మైనింగ్ కింగ్ ఒకరు ప్రధాన సూత్రధారిగా పనిచేస్తున్నారని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీకి క్షేత్రస్థాయిలో కీలకమైన నేతలను గుర్తించి వారి అవసరాలను తీర్చి, తన పార్టీలో చేర్చుకోవాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. అదేవిధంగా, ఆ పార్టీకి అత్యంత కీలకమైన నాయకులకు 25 కోట్ల రూపాయల చొప్పున ఆఫర్ చేసి, వారిని పార్టీ వైపు ఆకర్షించాలని భావిస్తున్నారు. ఈ విషయంలో సీనియారిటీ బట్టి రేటు నిర్ణయిస్తున్నారని చెబుతున్నారు. అందులో భాగంగా అనంతపురం, వరంగల్, గుంటూరు, విశాఖ, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాలకు చెందిన కొందరు నేతలను గుర్తించారు.
టీడీపీలో యువకులు నిరాశగా ఉన్నారని, నమ్ముకున్న వారికి చంద్రబాబునాయుడు న్యాయం చేయడం లేదని, బీసీ నేతలకూ సరైన న్యాయం చేయడం లేదని, ఎన్నికల వరకూ ఆ పార్టీలో ఎంత మంది ఉంటారో తెలియని పరిస్థితి ఉందని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు కోసం అంకితభావంతో పనిచేస్తున్న సీనియర్లు కూడా ఆయన తమకు న్యాయం చేయ రన్న అపనమ్మకంతో ఉన్న వాతావరణాన్ని సద్వినియోగిం చేసు కోవాలని భావిస్తున్నారు. వారి ఆర్థిక అవసరాలుతీర్చడం ద్వారా వారందరినీ పెద్ద సంఖ్యలో తీసుకుని టీడీపీని దెబ్బతీయాలన్నది జగన్ అసలు లక్ష్యమంటున్నారు. వైఎస్ మృతి చెందడ ంతో ఇక తానే ముఖ్యమంత్రినన్న మితిమీరిన ఆత్మవిశ్వా సంతో ఉన్న బాబు తమను లెక్కచేయడం లేదన్న అసంతృప్తిని వినియోగించుకుని ఏవిధంగానైనా తన వైపు తీసుకురావాలన్నది ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు.
అదే విధంగా, కాంగ్రెస్‌తో పాటు టీడీపీలో కూడా వృద్ధతరం నేతలే ఎక్కువయ్యారని, వాళ్లు పార్టీలో ఉన్నంతకాలం తమకు భవిష్యత్తు లేదన్న అసంతృప్తితో ఉన్న యువ నేతలను కూడా లక్ష్యంగా ఎంచుకున్నట్లు తెలిసింది. సదరు యువ నేతలు కూడా జగన్ వెంట యువకులే ఎక్కువగా ఉన్నందున తాము కూడా ఆయన పార్టీలోకి వెళ్లా లని యోచిస్తున్న సమాచారం అందిందని తెలి సింది. బాబు మితిమీరిన ఆత్మవిశ్వాసంతో తాను అనుకున్నదే చేస్తుండటంతో పార్టీకి, తమకు భవిషత్తు లేదని యువనాయకులు భావిస్తున్నం దున, వారిని గుర్తించి వారి ఆర్థిక అవసరాలు తీర్చ డం ద్వారా జగన్ వైపు చేర్చాలని ఆయన వర్గీ యులు వ్యూహరచన చేస్తున్నారు. ఇదిలాఉండగా, జగన్ ముఖ్యమంత్రి కావాలని కర్నాటక మైనింగ్ కింగ్ ఒకరు దేశవ్యాప్తంగా ఉన్న వేదపండితులను పిలిపించి వారితో సుదర్శనయాగం బెంగళూరులో నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ లక్ష్యం కోసం పనిచేస్తున్న సదరు ప్రముఖుడు కాంగ్రెస్‌ను కాకుండా ప్రధానంగా చంద్రబాబునాయుడును దెబ్బతీసేందుకే వ్యూహరచన చేస్తున్నారు.
జగన్‌కు ఉన్న అర్హత ఏమిటి?
వేటగాడిలా పథకాల ఎర వేశారు
వేల కోట్లు పిండుకున్నారు
మాది ప్రజల కోసం పోరాటం
వేటగాడిలా పథకాల ఎర వేశారు
వేల కోట్లు పిండుకున్నారు
మాది ప్రజల కోసం పోరాటం
'వైఎస్ చనిపోయినప్పుడు ఆవేదనతో మరణించారంటూ 700 మందిని లెక్కగట్టి తలా రూ. లక్ష చొప్పున ఇస్తున్నారు. అంటే రూ.7 కోట్లు పంచుతున్నారు. జగన్‌కు ఇంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది?' అని ప్రశ్నించారు. ఆ సమయంలో పక్కనే ఉన్న టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత ముద్దు కృష్ణమ నాయుడు జోక్యం చేసుకున్నారు.
'బాధిత కుటుంబాలకు ఇస్తున్నది ఏడుకోట్ల రూపాయలైతే, పరామర్శ పేరుతో జరుపుతున్న యాత్రకు పెడుతున్న ఖర్చు వంద కోట్లు' అని తెలిపారు. 'వైఎస్ ముఖ్యమంత్రికాక ముందు జగన్ ఆదాయం ఎంత? ఆస్తులెన్ని? ఇప్పుడు ఎన్ని? అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? సొంత పత్రిక సాక్షికి ఏడాదిలో రూ.250 కోట్ల నష్టం చూపించారు. అంత నష్టం భరించేంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది?' అని బాబు ప్రశ్నించారు.
వివాదాలకు, నెగెటివ్ అంశాలకు ప్రచారం ఎక్కువ వస్తుందని, జగన్ యాత్ర విషయంలో అదే జరుగుతోందని చెప్పారు. తాము ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు పదవులు, అధికారం కోసం పోరాడుకొంటున్నారన్నారు.
జగన్ పార్టీ పెడితే రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీల మధ్యే కీలక పోరు ఉంటుందా అని ప్రశ్నించగా. 'రాష్ట్రానికి ప్రాంతీయ పార్టీలు కొత్త కాదు. చాలామంది పెట్టారు. తర్వాత అవి కనిపించలేదు'' అని అన్నారు.
చతికిలబడుతున్న రోశయ్య
దివంగత ముఖ్యమంత్రి కుమారుడు కావడం మినహా జగన్‌కు ఉన్న అర్హత, ప్రత్యేకత ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. "వేటగాళ్లు పక్షులకు ఎర వేసినట్లుగా వైఎస్ రేషన్ కార్డులు, పింఛన్లు, ఆరోగ్య శ్రీ కార్డులు వంటి పథకాలు విసిరి ప్రజలను ఆకట్టుకున్నారు. వాటిచాటున రాష్ట్రాన్ని ఇష్టానుసారం దోపిడీ చేశారు. ఆ తర్వాత రోశయ్యకు జాక్‌పాట్ తగిలి వచ్చారు. కానీ, ఏమీ చేయలేక చతికిలబడుతున్నారు' అని అన్నారు.
వారంపాటు తనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని రోశయ్య చేసిన ప్రకటనను తేలిగ్గా తోసిపుచ్చారు. 'సీఎం పదవి నాకేమైనా కొత్తా? రోశయ్య మాకు ఇచ్చేదేమిటి? కాంగ్రెస్ అధిష్ఠానం ఇస్తే ఆయన తీసుకున్నారు. మాకు ప్రజలే అధిష్ఠానం. ఇస్తే వాళ్లే ఇస్తారు'' అని అన్నారు.
‘దేశం’ పై జ‘గన్’!
ఈ వ్యవహారంలో చంద్రబాబునాయుడును తీవ్రంగా వ్యతి రేకిస్తున్న కర్నాటక మైనింగ్ కింగ్ ఒకరు ప్రధాన సూత్రధారిగా పనిచేస్తున్నారని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీకి క్షేత్రస్థాయిలో కీలకమైన నేతలను గుర్తించి వారి అవసరాలను తీర్చి, తన పార్టీలో చేర్చుకోవాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. అదేవిధంగా, ఆ పార్టీకి అత్యంత కీలకమైన నాయకులకు 25 కోట్ల రూపాయల చొప్పున ఆఫర్ చేసి, వారిని పార్టీ వైపు ఆకర్షించాలని భావిస్తున్నారు. ఈ విషయంలో సీనియారిటీ బట్టి రేటు నిర్ణయిస్తున్నారని చెబుతున్నారు. అందులో భాగంగా అనంతపురం, వరంగల్, గుంటూరు, విశాఖ, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాలకు చెందిన కొందరు నేతలను గుర్తించారు.
టీడీపీలో యువకులు నిరాశగా ఉన్నారని, నమ్ముకున్న వారికి చంద్రబాబునాయుడు న్యాయం చేయడం లేదని, బీసీ నేతలకూ సరైన న్యాయం చేయడం లేదని, ఎన్నికల వరకూ ఆ పార్టీలో ఎంత మంది ఉంటారో తెలియని పరిస్థితి ఉందని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు కోసం అంకితభావంతో పనిచేస్తున్న సీనియర్లు కూడా ఆయన తమకు న్యాయం చేయ రన్న అపనమ్మకంతో ఉన్న వాతావరణాన్ని సద్వినియోగిం చేసు కోవాలని భావిస్తున్నారు. వారి ఆర్థిక అవసరాలుతీర్చడం ద్వారా వారందరినీ పెద్ద సంఖ్యలో తీసుకుని టీడీపీని దెబ్బతీయాలన్నది జగన్ అసలు లక్ష్యమంటున్నారు. వైఎస్ మృతి చెందడ ంతో ఇక తానే ముఖ్యమంత్రినన్న మితిమీరిన ఆత్మవిశ్వా సంతో ఉన్న బాబు తమను లెక్కచేయడం లేదన్న అసంతృప్తిని వినియోగించుకుని ఏవిధంగానైనా తన వైపు తీసుకురావాలన్నది ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు.
అదే విధంగా, కాంగ్రెస్‌తో పాటు టీడీపీలో కూడా వృద్ధతరం నేతలే ఎక్కువయ్యారని, వాళ్లు పార్టీలో ఉన్నంతకాలం తమకు భవిష్యత్తు లేదన్న అసంతృప్తితో ఉన్న యువ నేతలను కూడా లక్ష్యంగా ఎంచుకున్నట్లు తెలిసింది. సదరు యువ నేతలు కూడా జగన్ వెంట యువకులే ఎక్కువగా ఉన్నందున తాము కూడా ఆయన పార్టీలోకి వెళ్లా లని యోచిస్తున్న సమాచారం అందిందని తెలి సింది. బాబు మితిమీరిన ఆత్మవిశ్వాసంతో తాను అనుకున్నదే చేస్తుండటంతో పార్టీకి, తమకు భవిషత్తు లేదని యువనాయకులు భావిస్తున్నం దున, వారిని గుర్తించి వారి ఆర్థిక అవసరాలు తీర్చ డం ద్వారా జగన్ వైపు చేర్చాలని ఆయన వర్గీ యులు వ్యూహరచన చేస్తున్నారు. ఇదిలాఉండగా, జగన్ ముఖ్యమంత్రి కావాలని కర్నాటక మైనింగ్ కింగ్ ఒకరు దేశవ్యాప్తంగా ఉన్న వేదపండితులను పిలిపించి వారితో సుదర్శనయాగం బెంగళూరులో నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ లక్ష్యం కోసం పనిచేస్తున్న సదరు ప్రముఖుడు కాంగ్రెస్‌ను కాకుండా ప్రధానంగా చంద్రబాబునాయుడును దెబ్బతీసేందుకే వ్యూహరచన చేస్తున్నారు.
ఒక్కరికే ఓదార్పు పదినిమిషాలు... మిగతా... జైత్రయాత్రే , 'ఓదార్పు'లో రాజకీయం లేదనడం అవివేకం: మందా., జగన్ యాత్రలో స్థానికేతర నేతలదే హవా
లక్ష రూపాయల చెక్ ఉన్నట్లు చెబుతున్న కవర్‌ను కుటుంబ సభ్యులకు అందించారు. మిగిలిన సమయమంతా వివిధ ప్రాంతాల్లో ఉపన్యాసాలకు, రోడ్లకు ఇరువైపులా ఉన్న జనాన్ని పలకరించేందుకు, నేతల ఇళ్లలోకి వెళ్లి.. పరామర్శించేందుకు కేటాయించారు.
రెండో రోజు షెడ్యూల్‌లో రెండు కుటుంబాలను ఓదార్చాలని నిర్ణయించినా... యాత్ర ఆరు గంటల ఆలస్యంగా సాగుతున్నదన్న కారణంతో ఒక్క కుటుంబంతోనే సరిపెట్టారు. ఎల్ఎన్‌పేట మండలం యంబరాం గ్రామంలో కిలారి సరస్వతి కుటుంబాన్ని ఓదార్చడం ఈ రోజుకు సాధ్యం కాకపోవచ్చని జగన్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
యాత్ర మరో రోజు పొడిగింపు:
శ్రీకాకుళం జిల్లాలో జగన్ యాత్రను మరో రోజు పొడిగిస్తున్నట్టు ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి. మొదట నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు మూడు రోజులపాటు ఓదార్పు యాత్ర సాగించాల్సి ఉంది. కానీ కుటుంబాలను ఓదార్చడంతో పాటు.. విగ్రహావిష్కరణలు, నేతల ఇళ్లలో పలకరింపులు, అడిగిన చోటల్లా ఉపన్యాసాలతో మొదటిరోజు నుంచి యాత్రలో జాప్యం జరుగుతోంది.
ఫలితంగా కార్యక్రమాలు షెడ్యూల్ ప్రకారం పూర్తి కావడంలేదు. దీంతో ఈ నెల 11న ఆదివారం ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఓదార్పు యాత్రను పూర్తి చేసి తర్వాత తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లడానికి జగన్ నిర్ణయించుకున్నట్టు సమాచారం.
'ఓదార్పు'లో రాజకీయం లేదనడం అవివేకం: మందా
న్యూఢిల్లీ : జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర వెనుక రాజకీయ కోణం లేదనుకోవడం తెలివి తక్కువతనమని కాంగ్రెస్ ఎంపీ మందా జగన్నాథం వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధిష్ఠానం ఓదార్పు యాత్ర వద్దనలేదని అన్నారు. ఆర్భాటాలతో చేస్తున్న యాత్ర వల్ల జరగబోయే పరిణామాలను దృష్టిలో ఉంచుకుని వారించిందన్నారు.
వైఎస్ కుమారుడిగా జగన్‌ను పార్టీ, ప్రజలు గుర్తించారన్నారు. అయితే ఆయన సీఎం కావాలని కోరుకున్నారని, వైఎస్ అకాల మరణం తర్వాత అధిష్ఠానం అన్ని కోణాల్లో ఆలోచించి రోశయ్యను పీఠంపై కూర్చోబెట్టిందని జగన్నాథం అన్నారు. జగన్ యాత్రలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొంటున్నారన్న దానిపై స్పందిస్తూ, వైఎస్ఆర్ కొడుకుగా ఆయనను చూడటానికి జనం రావడంలో విశేషమేమీ లేదన్నారు.

జగన్ యాత్రలో స్థానికేతర నేతలదే హవా
స్థానిక ప్రజలతో వీరు కలిసిపోవడంతో జగన్ అడుగుపెట్టిన చోటల్లా వేలాది మంది కన్పించారు. రెండో రోజు యాత్రలో జిల్లాకు చెందిన రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఆయన సోదరుడు నరసన్నపేట ఎమ్మెల్యే కృష్ణదాస్‌ల హవా బాగా కనిపించింది. ప్రసాదరావు కుమారుడు రామమనోహర్ హైదరాబాద్ నుంచి హుటాహుటిన టెక్కలి చేరుకొని యాత్ర పొడవునా జగన్‌తో ఉన్నారు.
నరసన్నపేట పట్టణంలో వైఎస్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జగన్‌ను ఆహ్వానిస్తున్నట్టుగా ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్‌ల ఫొటోలతో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. కార్యక్రమం ఎలా జరుగుతోందంటూ నరసన్నపేటలో నాయకులకు కృష్ణదాస్ ఫోన్ చేసి ఆరా తీశారు. యాత్రలో కృష్ణదాస్ సతీమణి పద్మప్రియ, కుమారుడు రామలింగంనాయుడు కూడా పాల్గొన్నారు.
బాధితుల కన్నా నేతలే మిన్న
జగన్ యాత్ర రెండో రోజూ అదే తీరు
అడిగిన చోట కాదనకుండా ఉపన్యాసాలు
వీధి వీధికీ వైఎస్ విగ్రహావిష్కరణలు
ఏడు కుటుంబాల కోసం గంట
ఎమ్మెల్యేలు, నేతల ఇళ్లలో ఐదు గంటలు
వీధి వీధికీ వైఎస్ విగ్రహావిష్కరణలు
ఏడు కుటుంబాల కోసం గంట
ఎమ్మెల్యేలు, నేతల ఇళ్లలో ఐదు గంటలు
స్థానిక నాయకుల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం ప్రస్ఫుటమైంది. రెండో రోజు రెండు కుటుంబాలను ఓదార్చాలనుకున్నా... ఒక్క కుటుంబంతోనే సరిపెట్టారు. మొత్తంగా యాత్రలో పది శాతం సమయాన్ని కూడా బాధిత కుటుంబాల 'ఓదార్పు'నకు కేటాయించడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
గురువారం మధ్యాహ్నం ఇచ్ఛాపురంలో ప్రారంభించిన ఓదార్పు యాత్ర తొలిరోజును శుక్రవారం ఉదయం 8 గంటలకు టెక్కలితో ముగించారు. సుమారు 22 గంటలపాటు కంటి మీద కునుకు లేకుండా యాత్ర కొనసాగించినప్పటికీ బాధిత కుటుంబాలను పరామర్శించడానికి కేటాయించింది గంట సమయం మాత్రమే! మిగిలిన సమయమంతా నేతలతో గడిపేందుకు, రోడ్డుపక్కల జనాన్ని పలకరించేందుకు వినియోగించారు.
టెక్కలిలో డీసీసీ అధ్యక్షురాలు, ఎంపీ కిల్లి కృపారాణి స్వగృహంలో శుక్రవారం ఉదయం రెండున్నర గంటలు విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత ఉదయం 10.30 గంటలకు రెండోరోజు యాత్రను ప్రారంభించారు. 11 గంటలకు టెక్కలి రైల్వే గేటు వద్ద వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. 12 గంటలకు కోటబొమ్మాళిలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు.
మధ్యాహ్నం 3 గంటలకు నరసన్నపేటలో భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడే పెద్ద సంఖ్యలో ఉన్న ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాత్రి 7 గంటల సమయంలో గార మండలం హుకుంపేటకు చేరుకొని మరువాడ జానకిరాం కుటుంబాన్ని ఓదార్చారు. అక్కడ పది నిమిషాలు గడిపారు.
అడిగిన చోటల్లా ప్రసంగాలు
జగన్ ఓదార్పు యాత్రలో రెండో రోజు కూడా జనం కోరిన దగ్గరల్లా ప్రసంగాలు చేశారు. పాత ప్రసంగాలనే వల్లెవేసినప్పటికీ... తన తండ్రి చనిపోయిన 9 నెలల్లో రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా అట్టడుగుకు దిగజారిపోయాయని కాంగ్రెస్ పాలనపై సంచలన విమర్శలు గుప్పించడం ఇందులో కొత్తదనం. ఓదార్పు యాత్రను శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించగానే ఎక్కడికక్కడ వైఎస్ విగ్రహాలు పుట్టుకొచ్చేశాయి.
చాలా మంది ఫైబర్‌తో తయారైన తేలికపాటి రెడీమేడ్ విగ్రహాలను ఏర్పాటు చేశారు. 3గంటల ఆలస్యంతో మొదలైన యాత్ర తొలి రోజు ముగిసే సరికి 12 గంటల ఆలస్యంతో ఉంది. శుక్రవారం నిర్ణీత సమయం కన్నా 6గంటల ఆలస్యంగా జరుగుతోంది.
నేతలకే సమయం
ఎక్కువ సమయం నేతల ఇళ్లలో గడపడానికి జగన్ ప్రాధాన్యం ఇచ్చారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో పీసీసీ సంయుక్త కార్యదర్శి నర్తు రామారావు, మాజీ ఎమ్మెల్యే నరేష్ కుమార్ అగర్వాలా ఇళ్లలో అర గంట సమయం చొప్పున గడిపారు. మందస మండలం హరిపురంలో పలాస ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు ఇంటికి వెళ్లారు.
ఎమ్మెల్యే హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ వారి కుటుంబ సభ్యులను పలకరించి అక్కడ అర గంట గడిపారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు పలాస- కాశీబుగ్గ చేరుకున్న జగన్ టెక్కలి ఎమ్మెల్యే కొర్ల భారతి ఇంటికి వెళ్లారు. ఆమె అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడానికి హైదరాబాద్ వెళ్లినప్పటికీ వారి కుటుంబ సభ్యులతో అరగంటపైన మాట్లాడారు.
జగన్‌తో కరచాలనం చేసేందుకు పలువురు ఎగబడ్డారు. నరసన్నపేటకు జలుమూరు, పోలాకి, సారవకోట, నరసన్నపేట మండలాల నుంచి ప్రజలను లారీలతో తీసుకువ చ్చారు. యాత్ర ఆలస్యమౌతున్న కొలదీ జనం పలచబడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రెండో రోజూ కూడా చిన్న అపశ్రుతి దొర్లింది.
గారలో విద్యుత్ షాక్‌కు గురై సింహాచలం అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఓదార్పు యాత్రతో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని అర్థం వచ్చేవిధంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఉన్న ఇందిరా విజ్ఞాన భవన్‌లో ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని రద్దు చేశారు.
Labels:
gouthamaraju,
odarpu yatra,
Y.S.Jaganmohana Reddy,
ఓదార్పు యాత్ర,
జగన్,
శ్రీకాకుళం
Friday, July 9, 2010
ఓదార్పు... ఓనర్ షిప్, జగన్‌కు ఎందరి మద్దతు? ఎమ్మెల్యేల యాత్ర ఓదార్పునకు క్యూ - జాబితాలో 24 మంది: వారిలో నలుగురు మంత్రులు
ఓదార్పు... ఓనర్ షిప్
... వై.ఎస్. వారసుడిగా, తండ్రి ఆస్తిపాస్తులు వచ్చినట్టే, ముఖ్యమంత్రి పదవి కూడా తనకే రావాలన్నది జగన్ పట్టుదల. కాంగ్రెస్ కనుక అలా సీఎం సీటును స్వచ్ఛందంగా అప్పగించడానికి సిద్ధపడకపోతే, వైఎస్ పేరు, 'సానుభూతి' మంత్రంతో, ఏకంగా రాష్ట్ర కాంగ్రెస్‌నే హైజాక్ చేయాలన్నది ఆయన ఎత్తుగడ!...
ఆంధ్రప్రదేశ్‌లో కొన్నేళ్లుగా పట్టు 'చే'జారిన 'తన కాంగ్రెస్' పార్టీని, ఇకనైనా ఎలాగోలా మళ్లీ 'హస్త'గతం చేసుకోవాలన్నది సోనియాగాంధీ పట్టుదల. అందుకోసం ఎంతకైనా సిద్ధపడాలి, ఎవరినైనా వదులుకోవాలన్నది ఆమె ఆలోచన! ఇప్పుడు తలెత్తింది 'ఓదార్పు- అనుమతి' సమస్య కాదు! రాష్ట్ర కాంగ్రెస్‌పై 'ఓనర్‌షిప్ ఎవరిది' అన్న ప్రశ్న!.... 'ఆదిత్య' రాసిన 'సానుభూతి వ్యూహం'

ఎమ్మెల్యేల యాత్ర ఓదార్పునకు క్యూ
జాబితాలో 24 మంది: వారిలో నలుగురు మంత్రులు
పిల్లి, పినిపె, బాలినేని, అహ్మదుల్లా
కొండ్రుతో కేవీపీ మంతనాలు
తూర్పుగోదావరి ఎమ్మెల్యేల భేటీ
యాత్రలో పాల్గొనాలని నిర్ణయం
వెళ్లకపోతే స్థానికంగా దెబ్బతింటామని భయం
అధిష్ఠానం వైఖరిపై నేతల్లో అయోమయం
కొండ్రుతో కేవీపీ మంతనాలు
తూర్పుగోదావరి ఎమ్మెల్యేల భేటీ
యాత్రలో పాల్గొనాలని నిర్ణయం
వెళ్లకపోతే స్థానికంగా దెబ్బతింటామని భయం
అధిష్ఠానం వైఖరిపై నేతల్లో అయోమయం
కడప ఎంపీ జగన్ మలి విడత ఓదార్పు యాత్ర కాంగ్రెస్ శాసనసభ్యుల్లో కలకలం సృష్టిస్తోంది. యాత్రలో తాము పాల్గొనకపోయినా, ప్రజా స్పందన బాగుండడం, నియోజక వర్గాల్లోని ద్వితీయ శ్రేణి క్యాడర్ క్రియాశీల పాత్రను పోషించడం వారిని కలవర పెడుతున్నాయి. దీంతో అసెంబ్లీ సమావేశాల కారణంగా హైదరాబాద్‌లోనే ఉండిపోవాల్సి వచ్చిన శాసనసభ్యుల పరిస్థితి, మనసొక చోట, తనువొక చోట అన్నట్లుగా మారింది. 
తమ నియోజకవర్గాల్లో, జగన్‌తో మమేకమై తిరుగుతున్న యువ నేతల వల్ల, భవిష్యత్తులో తమ రాజకీయ మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. జగన్‌తోపాటు ఓదార్పు యాత్రలో పాల్గొనకుంటే... రాజకీయంగా తాము వెనకబడి పోయే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. కీలకమైన సమయంలో జగన్ వెంట తాము లేకుంటే బాగుండదని యువ ఎమ్మెల్యేలు కొందరు పేర్కొంటున్నారు.
అందుకే ముఖ్యమంత్రి, అధిష్ఠానం మనోగతం ఏమైనప్పటికీ, యాత్రలో పాల్గొనడానికే కొందరు సిద్ధపడుతున్నారు. దీంతో జగన్ యాత్రలో పాల్గొంటామని ప్రకటించే శాసన సభ్యుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు శుక్రవారంనాడు హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో, జగ్గంపేట ఎమ్మెల్యే తోట వెంకట నరసింహులు నివాసంలో సమావేశమయ్యారు.
జగన్ యాత్రలో పాల్గొనే విషయంలో అందరిదీ ఒకే బాటగా ఉండాలని ఇందులో తీర్మానించారు. మెజారిటీ శాసనసభ్యుల అభిప్రాయం మేరకు, జిల్లాలోని ఎమ్మెల్యేలంతా యాత్రలో పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు రాజా అశోక్‌బాబు (తుని), పి.సతీష్‌కుమార్ (ముమ్మడివరం), రేపాక వరప్రసాద్ (రాజోలు), పి.రాజేశ్వరి దేవి (గన్నవరం), ఎన్.శేషారెడ్డి (అనపర్తి), రౌతు సూర్యప్రకాశ్‌రావు (రాజమండ్రి) ఈ భేటీకి హాజరయ్యారు. ఎమ్మెల్యేలందరం ఒకే మాటపై ఉండాలని తీర్మానించినట్టు తోట నరసింహులు 'ఆన్‌లైన్'కు చెప్పారు.
యాత్రలో ఒకరు పాల్గొని, మరొకరు పాల్గొనకపోవడం సరికాదని నిర్ణయించామన్నారు. రాజమండ్రిలో జగన్‌కు స్వాగతం పలుకుతానని రౌతు సూర్యప్రకాశరావు చెప్పగా, వైఎస్ వల్లే తాను రాజకీయంగా ఎదిగానని, అందువల్ల యాత్రకు వెళతానని రేపాక వరప్రసాద్ అన్నారు. అందరిదీ ఒకే మాటగా ఉంటే, అధిష్ఠానం కూడా చర్య తీసుకునేందుకు వెనుకా ముందూ ఆలోచిస్తుందని ఎమ్మెల్యేలు భావించినట్టు తెలిసింది.
కాగా సొంత నియోజకవర్గంలో ఉన్న జగన్ సన్నిహిత ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి (కాకినాడ సిటీ) ఈ భేటీకి హాజరు కాలేదు. అయితే అక్కణ్నుంచే ఆయన 'ఆన్‌లైన్'తో మాట్లాడుతూ, యాత్రలో పాల్గొంటానని స్పష్టం చేశారు.
"శ్రీకాకుళం జిల్లాలో శాసనసభ్యులు ఓదార్పు యాత్రలో పాల్గొనకపోయినా నడుస్తుంది. కానీ తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం సాధ్యంకాదు. యాత్రలో పాల్గొనకుంటే ప్రజలు నిలదీస్తారు. మేం పాల్గొనకపోయినా, జిల్లా అంతా, అన్ని నియోజకవర్గాల్లో ఉన్న వైఎస్ అభిమానులు ఏకమవుతారు. చివరికి మమ్మల్ని (ఎమ్మెల్యేలను) కూడా పట్టించుకోరు'' అని ఆయన వ్యాఖ్యానించారు.
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, పినిపె విశ్వరూప్ జగన్ యాత్రలో పాల్గొనాలని ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఓదార్పులో పాల్గొంటానని సుభాష్ చంద్రబోస్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం రోశయ్య స్పందన తర్వాత కూడా, తన వైఖరిలో మార్పేమీ లేదని బోస్ సన్నిహితుల వద్ద స్పష్టం చేశారు.
పాల్గొన వద్దని అధిష్ఠానం హుకుం జారీ చేస్తే, మంత్రి పదవి విడిచి పెట్టేందుకైనా సిద్ధమేనని ఆయన వ్యాఖ్యానించినట్టు సమాచారం. జిల్లాలో జగన్ యాత్ర చేపట్టేందుకు ఇంకా సమయం ఉందని, తానేం చేయబోతున్నదీ అప్పుడే స్పష్టమవుతుందనీ పినిపె 'ఆన్‌లైన్'తో అన్నారు.
ఇతర ప్రాంతాల్లో...:
ఇక మిగిలిన ప్రాంతాల పరిస్థితిని పరిశీలిస్తే... ప్రస్తుతం యాత్ర జరుగుతున్న శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యేలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మార్గదర్శనం కోసం వారు మంత్రి ధర్మాన ప్రసాదరావు వైపు చూస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి యువ ఎమ్మెల్యేలు జోగి రమేశ్, ఉగ్ర నరసింహారెడ్డి, గుర్నాథరెడ్డి, అమర్నాథరెడ్డి, లబ్బి వెంకట స్వామి, సాయిప్రసాద్‌రెడ్డి తదితరులు తాము ఓదార్పు యాత్రలో పాల్గొంటామని స్పష్టం చేస్తున్నారు.
తనకు రెండు రోజుల పాటు సొంత పనులు ఉన్నాయని, అవి చక్కదిద్దుకొని, యాత్రలో పాల్గొంటానని పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే రాజేశ్ వివరించారు. శని, ఆదివారాల్లో అసెంబ్లీ సమావేశాలు లేనందున, ప్రభుత్వ విప్ కోండ్రు మురళి, జగన్ యాత్రలో పాల్గొనేందుకు శుక్రవారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లాకు పయనమయ్యారు.
అంతకుముందు ఆయన అసెంబ్లీ ప్రాంగణంలోనే మరోవైపు వైఎస్ కుటుంబ సన్నిహితుడు, ఎంపీ కేవీపీ రామచంద్రరావుతో మాటామంతీ జరిపారు. వైఎస్ కుటుంబ బంధువు, ఒంగోలు జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటికే జగన్ వెంట నిలిచారు.
శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ పరిస్థితులకు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో స్థితిగతులకు చాలా వైవిధ్యం ఉంటుందని ఈ ప్రాంత ఎమ్మెల్యేలు చెబుతున్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలలో ముఠా రాజకీయాలు ఎక్కువగా ఉన్నందున, ఏ గ్రూపునకు ఆ గ్రూపు, రాజకీయంగా బలోపేతం అయ్యేందుకు నిత్యం ప్రయత్నాలు నెరపుతుంటాయి.
ప్రత్యర్థుల ఎత్తులకు పైఎత్తులు వేసే ఈ జిల్లాల కాంగ్రెస్ నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి కాంగ్రెస్‌లో కన్పిస్తోంది. మిగతా ప్రాంతాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా యాత్రలో పాల్గొనాలా వద్దా అనే విషయంలో ఊగిసలాడుతున్నారు.
అధిష్ఠానం వైఖరిపై అయోమయం: జగన్ యాత్ర విషయంలో అధిష్ఠానం వైఖరి అర్థం కాక పార్టీ నేతలు అయోమయంలో పడుతున్నారు. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు, బుధవారం ఉదయం, ముఖ్యమంత్రి రోశయ్య విలేఖరులతో చెప్పిన మాటలకు, అదే రోజు సాయంత్రం ఢిల్లీలో విడుదల చేసిన లేఖకూ సారాంశంలో తేడా ఉందన్న అభిప్రాయం శాసనసభ్యుల్లో వ్యక్తమవుతోంది.
జగన్ యాత్ర మొదలై రెండు రోజులైనా అధిష్ఠానం నుంచి స్పష్టత రాలేదని, దీంతో ఓదార్పు పట్ల అధిష్ఠానం సుముఖతతో ఉందో, విముఖతతో ఉందో తెలియడం లేదని వారు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న పరిణామాలకు అధిష్ఠానం, రాష్ట్ర నాయకత్వం కారణమని తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రి ఒకరు అభిప్రాయపడ్డారు.
"జగన్ యాత్రపై అధిష్ఠానం ఇప్పటివరకూ స్పష్టమైన వైఖరిని వెల్లడించక పోవడం ఒక కారణమైతే, కీలకమైన ఇలాంటి సమయంలో రాష్ట్ర నాయకత్వం చురుకుగా స్పందించక పోవడం మరో కారణం. ఇలాంటి సంక్లిష్ట సమయంలో ప్రజా ప్రతినిధుల్లో చిన్నపాటి సందేహం ఉన్నా, నివృత్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర నాయకత్వానిదే.
సీఎల్పీని పిలిచి, అందులో ఓదార్పు యాత్రపై అధిష్ఠానం వైఖరి ఏమిటో, రాష్ట్ర నాయకత్వం ఏమనుకుంటుందో స్పష్టం చేసి ఉంటే .. ఈ రోజు శాసనసభ్యుల్లో ధర్మ సందేహాలు వచ్చి ఉండేవి కావు. సీఎల్పీ సమావేశం కాకున్నా, కనీసం మంత్రివర్గాన్నైనా సమావేశపరిచి, వైఖరిని చెబితే బాగుండేది'' అని ఆ మంత్రి పేర్కొన్నారు.
మరికొందరు మంత్రులు కూడా ఇదేరకంగా అభిప్రాయపడడం విశేషం. మొత్తమ్మీద జగన్ యాత్ర- పరిణామాలు మున్ముందు కాంగ్రెస్‌లో కల్లోలానికి దారితీస్తాయేమోనన్న ఆందోళన శాసనసభ్యుల్లో కన్పిస్తోంది!
1. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి,
2. మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్,
3. మంత్రి పినిపె విశ్వరూప్,
4. మంత్రి అహ్మదుల్లా,
5. పి. సతీష్‌కుమార్,
6. రేపాక వర ప్రసాద్,
7. పి. రాజేశ్వరీ దేవి,
8. ఎన్.శేషారెడ్డి,
9. రౌతు సూర్యప్రకాశరావు,
10. తోట నరసింహులు,
11. ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి,
12. జోగి రమేష్,
13. ఉగ్ర నరసింహారెడ్డి,
14. గుర్నాథరెడ్డి,
15. అమర్నాథరెడ్డి,
16. లబ్బి వెంకటస్వామి,
17. సాయి ప్రసాద్‌రెడ్డి,
18. కోండ్రు మురళి,
19. రాజేశ్,
20. గురుమూర్తిరెడ్డి,
21. శివప్రసాదరెడ్డి,
22. శ్రీకాంతరెడ్డి,
23. దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి,
24. రాజా అశోక్‌బాబు

జగన్‌కు ఎందరి మద్దతు?
ఓదార్పు యాత్ర చేస్తున్న జగన్‌కు మద్దతు తెలుపుతూ, యాత్రలో పాల్గొంటామని చెబుతున్న మంత్రులు, శాసనభ్యుల పేర్లు ఇవీ...
1. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి,
2. మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్,
3. మంత్రి పినిపె విశ్వరూప్,
4. మంత్రి అహ్మదుల్లా,
5. పి. సతీష్‌కుమార్,
6. రేపాక వర ప్రసాద్,
7. పి. రాజేశ్వరీ దేవి,
8. ఎన్.శేషారెడ్డి,
9. రౌతు సూర్యప్రకాశరావు,
10. తోట నరసింహులు,
11. ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి,
12. జోగి రమేష్,
13. ఉగ్ర నరసింహారెడ్డి,
14. గుర్నాథరెడ్డి,
15. అమర్నాథరెడ్డి,
16. లబ్బి వెంకటస్వామి,
17. సాయి ప్రసాద్‌రెడ్డి,
18. కోండ్రు మురళి,
19. రాజేశ్,
20. గురుమూర్తిరెడ్డి,
21. శివప్రసాదరెడ్డి,
22. శ్రీకాంతరెడ్డి,
23. దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి,
24. రాజా అశోక్‌బాబు
Labels:
gouthamaraju,
odarpu yatra,
Y.S.Jaganmohana Reddy,
ఓదార్పు యాత్ర,
జగన్,
శ్రీకాకుళం
నాతో రండి ఏ మలుపు తీసుకున్న నా వెంట నిలవండి - వైఎస్ మరణాంతరం రాజకీయం దిగజారింది 'ఓదార్పు'లో జగన్ కొత్త మాట రెండో రోజే మారిన స్వరం
నరసన్నపేటలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఈ వ్యాఖ్య చేశారు. అంతటితో ఆగలేదు! "నేను రాజకీయాల్లో ఒంటరిని కాను. ఇంతమంది నా వెనుక ఉండగా... నేను ఒంటరినెలా అవుతాను! రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఎలాంటి మలుపు తీసుకున్నా, మీరంతా నావెంటే ఉంటారని ఆశిస్తున్నాను'' అంటూ అభిమానులకు కొత్త పిలుపు ఇచ్చారు. సరికొత్త సంకేతాలు పంపారు.
శ్రీకాకుళం జిల్లా ఓదార్పులో రెండో రోజుకే జగన్ ప్రసంగంలో తేడా రావడం గమనార్హం. మొదటి రోజు ఆయన ప్రసంగం ప్రజలు తన మీద కురిపిస్తున్న ప్రేమ, తన తండ్రిపై ఉన్న అభిమానానికే పరిమితమైంది. రెండో రోజు ప్రసంగంలో రాజకీయ కోణం తొంగి చూసింది. నరసన్నపేట తర్వాత భైరి జంక్షన్, గార మండలం హుకుంపేట, గార తదితర ప్రాంతాల్లో జగన్ ప్రసంగించారు.
"రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం జీవితాన్ని అంకితం చేసిన వైఎస్ చనిపోలేదు. మీ అందరి గుండెల్లో ఇంకా చిరంజీవిగా ఉన్నారు. అందువల్లే నేను ఏ జిల్లాకు వెళ్లినా ఒక కొడుకులా ప్రేమ పంచుతున్నారు. సోదరునిలా ఆత్మీయతను అందిస్తున్నారు. నాతో ఎవరున్నా, లేకపోయినా మీరున్నారు. ఈ అభిమానాన్ని మరిచిపోలేను'' అని తెలిపారు. జగన్ ఓదార్పు యాత్రకు రెండో రోజు కూడా విశేష ఆదరణ లభించింది.
జగన్ కంటి మీద కునుకు లేకుండా యాత్రను కొనసాగించారు. ద్వితీయ శ్రేణి నాయకులు, వారి వెనుక ఉన్న ముఖ్య నేతల ప్రోత్సాహంతోనే యాత్ర విజయవంతమవుతోందన్న విషయాన్ని జగన్ కూడా గుర్తించారు. అందువల్లే ఈ జిల్లాలో లేకపోయినప్పటికీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు తనకు దూరం కాదనేలా వారి ఇళ్లకు వెళ్లడానికి ప్రాధాన్యం ఇచ్చారు.
Labels:
gouthamaraju,
odarpu yatra,
Y.S.Jaganmohana Reddy,
ఓదార్పు యాత్ర,
జగన్,
శ్రీకాకుళం
Subscribe to:
Posts (Atom)