జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Showing posts with label prakasam. Show all posts
Showing posts with label prakasam. Show all posts

Thursday, September 9, 2010

అదను చూసి పంజా ఇది సోనియా నైజం.. జగన్‌పై మేడమ్ ఆగ్రహం


ఆయనపై చర్య ఖాయం.. సరైన సమయంలో అనూహ్య నిర్ణయం
మధ్యే మార్గానికి అవకాశం శూన్యం
పార్టీ వర్గాల స్పష్టీకరణ
ఎన్ని హెచ్చరికలు చేసినా, ఎలాంటి సంకేతాలు పంపినా పట్టించుకోని కడప ఎంపీ వైఎస్ జగన్‌పై అధిష్ఠానం వైఖరి ఏమిటి? ఆయనకు ఎలాంటి హానీ తలపెట్టబోరనే వాదనలో నిజం ఎంత? ఈ ప్రశ్నకు కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ వైఖరినే సమాధానంగా చూపిస్తున్నారు. "అదను చూసి పంజా విసరడం ఆమె నైజం. జగన్ విషయంలోనూ ఇదే జరుగుతుంది' అని చెబుతున్నారు.

జగన్ పట్ల సోనియాగాంధీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసినప్పటికీ ఆమె నుంచి తగిన ఆదేశాలు రానందునే ఇప్పటిదాకా 'ఓర్పు' ప్రదర్శిస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు. "జగన్ విషయంలో మేమేమీ చేయలేం. బంతి సోనియా కోర్టులో ఉంది. ఆమె జగన్ పట్ల ఏ చర్య తీసుకోవాలో నిర్దేశించేదాకా ఈ విషయంలో ఏమీ చెప్పలేం'' అని ఒక సీనియర్ నాయకుడు తెలిపారు. జగన్‌పట్ల మేడమ్ చాలా ఆగ్రహంగా ఉన్నారని తమకు తెలుసని... ఆయనను క్షమించే అవకాశమే లేదని కూడా తెలుసని చెప్పారు.

"అదను చూసి పంజా విసరడమే సోనియా తత్వం. తగిన సమయంలో ఆమె సంకేతాలు ఇస్తారు'' అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తామే కాదు, జగన్ స్వయంగా వచ్చి వివరణ ఇచ్చినా సోనియా వినిపించుకునే పరిస్థితి లేదని... మధ్యేమార్గానికి అవకాశం లేనే లేదని ఏఐసీసీ నేతలు అంటున్నారు. "జగన్ వలలో పడవద్దు. జాగ్రత్తగా ఉండండి. నాకు తెలుసు మీరు ఓదార్పు యాత్రకు జనాన్ని పంపించారు'' అని సోనియా పార్లమెంట్ సమావేశాల సమయంలో ఒక ఎంపీని హెచ్చరించడం ఆమె ఆలోచనా విధానానికి అద్దం పడుతుందని ఒక నేత చెప్పారు.

ఏ చర్య, ఎప్పుడు, ఏ సమయంలో తీసుకోవాలనే దానిపై అధిష్ఠానం ఒక స్పష్టతతో ఉందని... సరైన సమయంలో అనూహ్యమైన చర్యలుంటాయని ఒక సీనియర్ నాయకుడు అన్నారు. ఈ అంశంపై ఎవరైనా ప్రశ్నించినప్పుడు "మాకు లేని తొందర మీకెందుకు? చర్యలు ఎప్పుడు తీసుకోవాలో మాకు బాగా తెలుసు'' అని ఆయన అంటున్నారు. అయితే, ప్రస్తుతానికి మాత్రం టెన్ జనపథ్‌లో కదలిక కనపడకపోవడంతో ఏఐసీసీ నేతలు కూడా అయోమయంలో ఉన్నారని, అందుకే విలేకరులు అడిగిన వివిధ ప్రశ్నలకు రకరకాల సమాధానాలు చెబుతున్నారని పేర్కొంటున్నారు.

వైఎస్ మరణానంతరం ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు పార్టీయే సహాయం చేయాలనడం, ఓదార్పు యాత్రకు వెళ్లవద్దని చెప్పడం సోనియా ఆదేశాలకు అనుగుణంగానే జరిగిందని... పార్టీ నుంచి స్పష్టమైన సంకేతాలు వెళ్లడంతో జగన్ యాత్రకు పార్టీ శ్రేణుల రాక తగ్గిందని పేర్కొంటున్నారు. ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్ర తర్వాత అధిష్ఠానం మాట వింటానని జగన్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీకి చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

జగన్‌పై తీసుకోవాల్సిన చర్యలపై అధిష్ఠానం ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌తో పాటు ఒకరిద్దరు నేతలతో చర్చించింది. జగన్ వ్యాపార లావాదేవీలు, ఆయన, ఆయన ఆనుచరుల ఆర్థిక సంబంధాల గురించి సమగ్రమైన సమాచారమూ అధిష్ఠానం వద్ద పూర్తిగా ఉంది. ఒకరిద్దరు రాష్ట్ర మంత్రులు, గవర్నర్ నరసింహన్, కొందరు అధికారులు రాష్ట్రంలో పరిస్థితుల గురించి, జగన్ వ్యవహారాల గురించి కేంద్రానికి, పార్టీ పెద్దలకు పూర్తి సమాచారాన్ని అందించినట్లుతెలుస్తోంది.

Sunday, September 5, 2010

ప్రకాశంలో ఓదార్పునకు ప్రజాప్రతినిధులు దూరం * బెడిసికొట్టిన జగన్ వర్గం వ్యూహం * ‘ఓదార్పు’ లో ‘ధిక్కారం’

odarpu 
అధిష్టానంపైనే యుద్ధం
మింగుడుపడని తాజా పరిణామాలు
బయటకు వస్తున్న మనసులోని మాటలు
ఎమ్మెల్యేల కంటే ప్రజలు పెద్ద మద్దతుదారులన్న జగన్
వారిని కట్టడి చేసినా నష్టమేమి లేదని పరోక్ష హెచ్చరిక
జగన్ నాయకత్వం కావాలన్న మంత్రి బాలనేని
‘ఓదార్పు’ లో ‘ధిక్కారం’ 
కడప ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఓదా ర్పు క్రమంగా ధిక్కార యాత్రగా మారు తోంది. రాష్ట్ర మంత్రి, వైఎస్‌ సమీప బంధు వయిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఓదార్పు యాత్ర వేదిక నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఈ రాష్ట్రానికి జగన్‌ ముఖ్య మంత్రి అయితే తప్ప వైఎస్‌ ప్రారంభించిన సంక్షేమ పథకాలు కొనసాగవని విస్పష్టంగా ప్రకటించారు. ఇది నేరుగా రోశయ్యపై జగన్‌ వర్గం ప్రారంభించిన దాడిగానే స్పష్టమవు తోంది.

ప్రకాశం జిల్లాలో జరుగుతున్న జగన్‌ ఓదార్పు యాత్ర ముఖ్యమంత్రి రోశయ్యను ధిక్కరించే వేదికగా మారుతోంది. గనుల శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తాను రోశయ్యను ముఖ్యమంత్రిగా పరిగణించడం లేదని, తనకు కాంగ్రెస్‌ వల్ల కాకుండా వైఎస్‌ రాజశేఖరరెడ్డి వల్లే మంత్రి పదవి వచ్చిందని చెప్పకనే చెప్పడం సంచలనం సృష్టించింది. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం వైఎస్‌ ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలు అమలుకావన్న పరోక్ష వ్యాఖ్యలు చర్చనీ యాంశంగా మారాయి. ఇవి తిరుగుబాటు దిశగా సాగుతున్న ఆలోచన లుగానే సీని యర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

జగన్‌కు మద్దతుదారుగా ఉన్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఓదార్పు ఇకపై ధిక్కారయాత్రగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జగన్‌ వెంట ఉన్న వారిపై వేటు వేయడం ద్వారా, జగన్‌ను నిర్వీర్యం చేయాలన్న అధిష్ఠానం ఆలోచనను పసిగట్టిన ఆయన అనుచరులు, దేనికయినా సిద్ధంగా ఉన్నామన్న తెగింపు సంకేతాలు బాలినేని వ్యాఖ్యల బట్టి స్పష్టమ వుతున్నాయి. ‘నా పదవి పోయినా ఫర్వా లేదు. జగన్‌ మాత్రం సీఎం కావాల’ని బాలి నేని విస్పష్టంగా వ్యాఖ్యానించడం బట్టి.. జగన్‌ అనుచరులయిన మంత్రులు, ఎమ్మె ల్యేలు ఎంతవరకూ తెగించేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టమవుతోంది. గతంలో మాజీ మంత్రి కొండా సురేఖ వ్యవహారశైలి కూడా ఇలాగే కనిపించింది.

ప్రజలు రోశయ్యను ముఖ్యమంత్రిగా చూడ లేకపోతు న్నారని, తాను ఆయన ముఖం చూడలేకపోతున్నానంటూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఆమె మంత్రివర్గం నుంచి వైదొలగారు. ఇప్పుడు బాలినేని వ్యవహారశైలి అదేవిధంగా ఉన్నప్పటికీ.. తనను ముఖ్యమంత్రే తొలగించాలన్న ధోరణి ఆయన మాటల్లో స్పష్టమవుతోంది. కాంగ్రెస్‌ నాయకత్వం తమపై ఎందాకా వెళుతుందో చూసే వైఖరిని జగన్‌ వర్గం ప్రదర్శి స్తోంది. లేకపోతే ఇంకా మంత్రిగా కొనసాగుతున్న బాలినేని, ముఖ్యమంత్రిపై అంతఘాటు వ్యాఖ్యలు చేయలేరని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

కాగా.. తూర్పు గోదావరి జిల్లా యాత్రలో జన సమీరకణకు అంతగా ప్రాధాన్యం ఇవ్వని జగన్‌ వర్గం, ప్రకాశం జిల్లాలో అడుగుపెట్టగానే తన వ్యూహం పూర్తిగా మార్చుకుంది. భారీ జన సమీకరణపెనేై ప్రధానంగా దృష్టి సారించింది. ద్వితీయ స్థాయి నేతలను సమీకరించి, కింది స్థాయి కార్యకర్తలను రోడ్లపై నింపే వ్యూహానికి తెరలేపారు. వైఎస్‌ బంధువు వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో, మంత్రి బాలినేని స్వీయ దర్శకత్వంలో తరలింపు వ్యవహారాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు జనసమీకరణ స్పష్టం చేస్తోంది.
ప్రకాశం జిల్లాలో జగన్‌ యాత్ర ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకూ మునుపటి మాదిరిగానే ఎక్కడా సోనియా ప్రస్తావన గానీ, పార్టీ పలుకు గానీ వినిపించకపోవడం ప్రస్తావనార్హం.

పార్టీ పేరు, అధ్యక్షురాలు సోనియాగాంధీ సమర్థతను ప్రస్తావించాలని మొయిలీ విధించిన షరతులు ఓదార్పు యాత్రలో ఎక్కడా కనిపించకపోవడం బట్టి.. పూర్తిగా తెగించడానికే సిద్ధమయినట్లు జగన్‌ వ్యవహారశైలి చెప్పకనే చెబుతోంది. జగన్‌ తన యాత్రలో చేస్తున్న ప్రసంగాల్లో తండ్రి వైఎస్‌ కాంగ్రెస్‌ పార్టీకి చేసిన సేవలు, తన గురించి చెప్పుకోవడానికే పరిమితమవుతున్నారు. కాగా జగన్‌ ఓదార్పు యాత్ర సందర్భంగా ఆయన ఆవిష్కరిస్తున్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు, వాటిని ఏర్పాటుచేసే ద్వితీయ శ్రేణి నేతలకు గిరాకీ పెరిగింది.

విగ్రహంతో పాటు.. అవి ఏర్పాటు చేసే నాయకులకు లక్ష రూపాయల చొప్పున నగదు ఇస్తుండటంతో నేతల మధ్య పోటీ పెరిగింది. ఫలితంగా.. అరి లోమీటరులో రెండేసి విగ్రహాలు వెలుస్తున్న దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. ఇక వీటికి అనుమతుల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. అటు మునిసిపాలిటీలు గానీ, ఇటు పంచాయతీలు గానీ ఎవరూ అభ్యంతరం పెట్ట పోవడంతో విగ్రహాల ఏర్పాటు కోసం నేతల మధ్య పోటీ పెరిగింది.
కడప ఎంపీ వైఎస్ జగన్మోహనరెడ్డి వర్గం అధిష్ఠానంపై ధిక్కార స్వరానికి దిగుతోంది. ప్రకాశం జిల్లా ఓదార్పు యాత్రలో అధిష్ఠానం ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు గైర్హాజరు కావడం ఆ వర్గానికి మింగుడు పడడం లేదు. ద్వితీయ శ్రేణి నేతల ద్వారా ప్రజాప్రతినిధులను కట్టడి చేయాలన్న వ్యూహమూ పూర్తిగా బెడిసికొట్టింది. దీంతో మనసులోని భా వాలను క్రమంగా బయటకు వెల్లడిస్తున్నారు. ప్రకాశం ఓదా ర్పు యాత్రలో భాగంగా ఆదివారం జగన్ మాట్లాడుతూ.. ఎ మ్మెల్యేల కంటే ప్రజలే తనకు అతిపెద్ద మద్దతుదారులని వ్యా ఖ్యానించారు.

"నన్ను మీ సోదరుడిగా, కుమారుడిగా ఆశీర్వదిస్తున్నారు. నాపై ఇంత ప్రేమాభిమానాలు చూపుతున్నారు. ఇదంతా చూసిన తర్వాత కూడా జగన్ ఒంటరి అని ఎవరైనా అనగలరా? మద్దతు అంటే ఒక్క ఎమ్మెల్యేలేనా!?'' అని ప్ర శ్నించారు. తద్వారా, ప్రజాప్రతినిధులను కట్టడి చేసినా తనకు వచ్చే నష్టమేమీ లేదంటూ అధిష్ఠానానికి జగన్ పరోక్ష హెచ్చరికలు చేశారని పార్టీవర్గాలు విశ్లేషిస్తున్నాయి. అదే సమయంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా వైఎస్ ప్రారంభించిన సంక్షేమ పథకాలు అమలు కావాలంటే జగన్ నాయకత్వం కావాలని చెప్పడాన్ని కాంగ్రెస్ నేతలు తప్పుబడుతున్నారు.

అధిష్ఠానం బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి రోశయ్య సమర్థంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయలేకపోతున్నారని చెప్పడమే ఇందులోని మర్మమని వారు వివరించారు. దీనికితోడు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సమర్థుడైన నా యకుడు లేడని వ్యాఖ్యానించడం ద్వారా పార్టీకి జగన్ తప్ప మరో దిక్కు లేదని చెప్పడమేనని విశ్లేషించారు. తన సందేశాన్ని స్వయంగా ముఖ్యమంత్రి రోశయ్యే మంత్రి బాలినేనికి స్పష్టం చేసినా.. ఆయన బేఖాతరు చేయడంపై అధిష్ఠానం ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, మరో వారం రోజుల్లో ఆయనపై వేటు పడే అవకాశం ఉందన్న కథనాలూ వచ్చిన సంగతి తెలిసిందే.

దీంతో, తనపై వేటు తప్పదన్న అభిప్రాయానికి వచ్చినందునే మంత్రి బాలినేని పైవిధంగా వ్యాఖ్యానించారని అంటున్నారు. ఇక, జగన్ వర్గానికే చెందిన మరో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆదివారం చేసిన వ్యాఖ్యలు అధిష్ఠానాన్ని ధిక్కరించేవిగానే ఉన్నాయంటున్నారు. అధిష్ఠానానికి భయపడి జగన్ వెంట ప్రజాప్రతినిధులు రావడం లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఇందుకు ఉదాహరిస్తున్నారు. వాస్తవానికి, ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్రకు ప్రజాప్రతినిధుల నుంచి ఈస్థాయిలో సహాయ నిరాకరణ ఎదురవుతుందని జగన్ వర్గం ఊహించలేదు.

జిల్లాలో ద్వితీయ శ్రేణి నేతల ద్వారా ఒత్తిడి పెంచితే ఎమ్మెల్యేలు దిగివస్తారని, జగన్ యాత్రలో పాల్గొంటారని ఊహించారు. కానీ, అధిష్ఠానాన్ని తక్కువగా అంచనా వేస్తూ ఈ తరహా వ్యూహాలను అమలు చేసినా ఫలించలేదని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ఒక బలమైన సామాజికవర్గానికి చెందిన నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ జిల్లాలో అధిష్ఠానం మాట జవదాటి ప్రజాప్రతినిధులు పాల్గొంటారేమోనని కొందరు భావించారు. ఈ జిల్లా యాత్రపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులందరూ ఉత్కంఠతో చూశారు. అయితే అధిష్ఠానం గీసిన లక్ష్మణ రేఖను దాటకుండా ప్రజాప్రతినిధులు ఉన్నారు.

దీంతో మిగిలిన జిల్లాల్లోనూ ప్రధానంగా, పొరుగున ఉన్న నెల్లూరు జిల్లాలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు ఒక మార్గదర్శకాన్ని చూపినట్లయిందని పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే ఒరవడి నెల్లూరు జిల్లాలోనూ కొనసాగుతుందని చెబుతున్నాయి. దీనికితోడు, జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొంటున్న వారు ఎవరు? వారు ఎక్కడెక్కడ నుంచి వాహనాలను తరలించారు? వాటిని ఎవరు బుక్ చేశారు? తదితర సమాచారాన్ని ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా అధిష్ఠానం తెప్పించుకుంటోంది. అలాగే, తన మాటను ధిక్కరించే వారిపై చర్యలకు కూడా అధిష్ఠానం రంగం సిద్ధం చేస్తోందని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.

రాష్ట్ర పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న అధిష్ఠానం త్వరలోనే తన నిర్ణయాలకు పదునుపెట్టే అవకాశం ఉందని వివరించాయి. మొత్తానికి అధిష్ఠానానిదే పైచేయిగా కనిపిస్తుండడంతో జగన్ వర్గం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దీనిప్రభావం వారి ప్రకటనల ద్వారా బహిర్గతమవుతోంది. అధిష్ఠానం కూడా ఇదే కోరుకుంటోందని, జగన్ వర్గం అసహనమే ఢిల్లీకి ఆయుధంగా మారుతుందని పార్టీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. మొత్తానికి ప్రకాశం జిల్లా ఓదార్పు యాత్ర నేపథ్యంలో జగన్ బలమేమిటో, అధిష్ఠానం శక్తియుక్తులేమిటో తేటతెల్లమయ్యాయని చెప్పారు.

ఇకముందు అధిష్ఠానం మాటను జవదాటే అవకాశం తగ్గుతుందని, ఇది జగన్ వర్గంలో కలవరం పుట్టిస్తోందని.. ఫలితంగా అధిష్ఠానంపై విమర్శలు గుప్పించడం మొదలైందని వివరించారు. వీటి ఫలితం ఏవిధంగా ఉంటుందో త్వరలోనే అధిష్ఠానం స్పష్టం చేస్తుందని ఆయన తెలిపారు. అధిష్ఠానం కూడా సందర్భోచితంగా వ్యవహరిస్తుందని, మరో వారం రోజుల్లో చోటుచేసుకోనున్న పరిణామాలు ఇందుకు నిదర్శనంగా ఉంటాయని చెప్పారు.

Saturday, September 4, 2010

పదవిస్తారా పంపిస్తారా!: కడప ఎంపీ వైఎస్ జగన్ కు షోకాజ్‌ ?

ముఖ్యమంత్రిని చేయడమో, బయటకు పంపడమో!
అదిష్ఠానం ముందు రెండే దారులు...
దేనికైనా సిద్ధం
ఓదార్పపై మరో మాట లేదు..
సన్నిహితులకు జగన్ స్పష్టీకరణ
ఆర్భాటంగా 'ప్రకాశం ఓదార్పు'.. 250 వాహనాలతో కదిలిన కడప ఎంపీ
'కాబోయే సీఎం' నినాదాల జోరు...
8 మంది ఎమ్మెల్యేలు యాత్రకు దూరం
పీసీసీ నివేదిక కోరిన అదిష్ఠానం?.. దాని ద్వారానే చర్య
'ఒకటి నన్ను సీఎంను చేయడం! రెండు... పార్టీ నుంచి బయటకు పంపడం!'
కాంగ్రెస్ అధిష్ఠానానికి కడప ఎంపీ వైఎస్ జగన్ ఇచ్చిన ఆప్షన్లు ఇవి! అంతేకాదు... తాను దేనికైనా సిద్ధంగా ఉన్నానని కూడా జగన్ మోహన్ రెడ్డి తన సన్నిహితులకు స్పష్టం చేసినట్లు తెలిసింది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం...

శుక్రవారం ఇడుపులపాయ నుంచి ప్రకాశం జిల్లాకు బయలు దేరే ముందు జగన్ కొందరు సన్నిహితులతో మాట్లాడారు. భవిష్యత్ కార్యాచరణపై తన మనసులో మాట బయటపెట్టారు. ఓదార్పుపై మరో మాటకు ఆస్కారం లేదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. తనకు సంబంధించి అధిష్ఠానం ముందు రెండే రెండు మార్గాలున్నాయని తెలిపారు. ఒకటి సీఎం పదవి అప్పగించడమైతే... రెండో మార్గం పార్టీ నుంచి పంపించడమని వివరించారు. పార్టీ నేతలంతా తన వెంట నడిస్తేనే మంచిదని జగన్ పేర్కొన్నట్లు తెలిసింది.

పీసీసీ ద్వారా చర్యకు శ్రీకారం?
పార్టీని ధిక్కరిస్తున్న వైఎస్ జగన్‌తోపాటు మరికొందరు పార్టీ నేతలపై పీసీసీ నుంచి నివేదిక తెప్పించుకున్న తర్వాత చర్య తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు భావిస్తున్నట్లు తెలిసింది. జగన్ వైఖరితోపాటు ఓదార్పు యాత్రలో పాల్గొంటున్న నేతల గురించి నివేదిక ఇవ్వాల్సిందిగా అధిష్ఠానం పీసీసీని కోరినట్లు సమాచారం. ఢిల్లీలో ఉన్న పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌తో జగన్ విషయమై పార్టీ సీనియర్ నేతలు ఇప్పటికే చర్చించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

అధిష్ఠానం కూడా ఒక పథకం ప్రకారం జగన్‌పై చర్యకు రంగం సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ప్రకాశం జిల్లా ఓదార్పు యాత్ర పూర్తయిన తర్వాతే ఇతర ప్రాంతాల్లో పర్యటించే విషయం పరిశీలిస్తానని జగన్ వీరప్ప మొయిలీకి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అధిష్ఠానం చర్య తీసుకోకుండా కొద్ది కాలం ఆగితే... బలం పుంజుకోవచ్చని జగన్ ఈ ఎత్తుగడ వేశారని సీనియర్ నేతలు భావిస్తున్నారు. ఇప్పటి వరకూ అధిష్ఠానం ప్రదర్శించిన మౌనం వల్ల ఏదైనా కీడు జరిగిందో లేదో తెలియదని, ఇక ముందు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తే మాత్రం పార్టీకి ప్రమాదమని రాష్ట్ర మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు.

అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటున్న ప్రజా ప్రతినిధులపై జగన్ వర్గం నుంచి ఒత్తిడి పెరుగుతోందని.. ఈ సమయంలో అధిష్ఠానం ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటించకపోతే.. తమకు రాజకీయంగా నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే... అధిష్ఠానం ఇప్పటికే దీనిపై వ్యూహ రచన చేస్తోందని.. తన వైఖరిని వెల్లడిస్తుందని మరికొందరు నేతలు అంటున్నారు.

250 వాహనాలతో ఓదార్పు 'యాత్ర'
పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ హితోక్తులు జగన్‌ను ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయాయని స్పష్టమైపోయింది. ప్రకాశం జిల్లా ఓదార్పు యాత్రను జగన్ గతంలోకంటే అట్టహాసంగా ప్రారంభించారు. జగన్‌తోపాటు ఇడుపులపాయ నుంచి 250కి పైగా వాహనాలు కదిలాయి. ముందుకు కదిలేకొద్దీ వాహనాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. దీంతో.. వీటి సంఖ్య 750 వరకూ చేరిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ వాహనాల్లోని వారి సంఖ్యే 3750 మంది వరకూ ఉంటుందని చెబుతున్నారు. స్థానికంగానూ భారీగానే జన సమీకరణ జరిగినట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యేలు దూరం
అధిష్ఠానం ఆదేశాలు కచ్చితంగా తెలిసిన ప్రకాశం జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తన వైఖరిని బయటపెట్టారు. తొలి రోజు యాత్రలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, దర్శి ఎమ్మెల్యే శివప్రసాద రెడ్డి మాత్రమే యాత్రలో పాల్గొన్నారు. మిగిలిన 8 మంది... దగ్గుబాటి వెంకటేశ్వర రావు (పర్చూరు), ఎ.సురేశ్ (ఎర్రగొండపాలెం), గొట్టిపాటి రవికుమార్ (అద్దంకి), ఆమంచి కృష్ణ మోహన్ (చీరాల), బీఎన్ విజయకుమార్ (సంతనూతలపాడు), మహీధర్ రెడ్డి (కందుకూరు), జీవీ శేషు (కొండెపి), ఉగ్ర నరసింహారెడ్డి (కనిగిరి) ఓదార్పు యాత్రకు దూరంగా ఉన్నారు. అధిష్ఠానంతో నేరుగా భేటీ అయినందున ప్రకాశం జిల్లాలో మెజారిటీ ప్రజా ప్రతినిధులు ఓదార్పు యాత్రకు దూరంగా ఉంటారని జగన్ వర్గం ముందే ఓ అంచనాకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకూ ఏ జిల్లాలోనూ జరగనంత జన సమీకరణ ఈ జిల్లాలో జరిగిందని పార్టీ నేతలు చెబుతున్నారు.

సొంత బాటే..
జగన్ తన ప్రసంగంలో ఎప్పట్లాగానే అధిష్ఠానం ప్రస్తావన తీసుకురాలేదు. అధిష్ఠానం స్వయంగా ప్రకటించిన 'ఓదార్పు' గురించి కూడా మాట్లాడలేదు. ఫ్లెక్సీలలో సోనియా ఫొటోలు కనిపించలేదు. జగన్ కూడా తన ప్రసంగాల్లో సోనియా మాటెత్తలేదు. 'కాబోయే సీఎం జగన్' అనే నినాదాలు గతంలోకంటే ఎక్కువగా మిన్నంటాయి. జగన్ ఈ నినాదాలను ఆపే ప్రయత్నం చేయలేదు. 
జగన్‌కు షోకాజ్‌ ?
jagan--odaru
కడప ఎంపీ వైఎస్‌ జగ న్మోహన్‌రెడ్డికి షోకాజ్‌ నోటీసు జారీ చేసేందుకు ఏఐసీసీ లో రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో అతనికి నోటీసు ఇచ్చే అవకాశాలున్నట్లు ఏఐసీసీ వర్గాల సమాచారం. అధిష్ఠానం ఆదేశాలను సైతం ధిక్క రిస్తూ జగన్‌ ఓదార్పు యాత్రకు బయలు దేరడంపై ఢిల్లీలో పార్టీ పెద్దలు, ప్రధానంగా పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అగ్రహంతో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. పార్టీకి చెందిన పలువురు సీనియర్‌ నేతలు, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహా రాల ఇన్‌చార్జీ, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ ఓదార్పుకు వెళ్ళొద్దని స్వయంగా నచ్చజెప్పినా వినకుండా జగన్‌ యాత్రకు బయలు దేరాడు. దీంతో హైకమాండ్‌ ఇక అతని విషయంలో ఏ మాత్రం ఉపేక్షించడం మంచిది కాద నే నిర్ణయానికి వచ్చినట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి.

రెండు, మూడు రోజుల్లో జగన్‌పై వేటు వేయడం ఖాయ మని హస్తిన వాతావరణం ద్వారా స్పష్టమవుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏఐసీసీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్‌ ఎ.ె .ఆంటోని, సభ్యులు మోతీలాల్‌వోరా తదితరులు రెండు రోజుల్లో సమావేశమై జగన్‌ పై వేటు వేసే విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దాని కంటే ముందు పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌, రాష్ట్రానికి చెందిన పలువురు సీనియర్‌ నేతల అభిప్రాయాన్ని కూడా పార్టీ తెలుసుకుంటుందని వినిపిస్తోంది. పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌, శాసన సభలో పార్టీ నేత, మంత్రి జె.గీతారెడ్డి 24 గంటలు గడవక ముందే శుక్రవారం మరో సారి ఢిల్లీ బయలు దేరి వెళ్ళారు. నాలుగవ సారి పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ ఎన్నికైనందుకు ఆమెకు అభినందనలు తెలియ జేసేందుకు వీరు ఢిల్లీ వెళ్ళినట్లు బయటికి చెబుతున్నప్పటికీ, అసలు జగన్‌పై చర్యలు తీసుకునే విషయంలో చర్చించేందుకే వారిని పార్టీ హైకమాండ్‌ హుటా హుటిన పిలిపించినట్లు ఎఐసీసీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఓదార్పు యాత్ర పట్ల అధినేత్రి అగ్రహంతో ఉన్నారని, వైఎస్‌ బాధితులను పార్టీ పరంగా ఓదార్చి ఆర్ధిక సహాయం అందజేస్తామని ప్రకటించినందున ఇక ఓదార్పు యాత్ర మానుకోవాలని గురువారం ఇడుపుల పాయలో వైఎస్‌ వర్ధంతిలో పాల్గొనేందుకు ఎఐసీసీ దూతగా వచ్చిన మొయిలీ జగన్‌కు నచ్చజెప్పారు. ఆయనతో పాటు పార్టీ సీనియర్లు సైతం అధిష్ఠాన నిర్ణయానికి కట్టుబడి ఉండాలని జగన్‌కు హితవు పలికారు. పార్టీ అధినేత్రి సోనియా వ్యతి రేకంగా ఉన్నా, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జీ మొయిలీ వద్దని వారించినా వినిపించుకో కుండా జగన్‌ శుక్రవారం ఉదయం నుంచి ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్ర కు బయలు దేరారు. ఎఐసీసీ నేతలు జగన్‌ వద్దకు మొయిలీ రూపంలో రాయ బారం పంపించినా ఫలితం లేక పోవడంతో ఇక అతనిపై చర్యలు తీసుకోవడం తప్ప మరో మార్గం లేదని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్ర ద్వారా బలప్రదర్శనకు జగన్‌ సిద్ధం కావడంతో హైకమాండ్‌ అతనిపై సీరియస్‌గా ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

నేడు డిఎస్‌, గీతాతో భేటి కానున్న సోనియా

పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నిక కావడంతో అభినందనలు తెలియజేయడానికి వచ్చే పార్టీ నేతలతో శుక్రవారం బిజీ బిజీగా ఉన్న సోనియా శనివారం నుంచి రాష్ట్రాల వారిగా పార్టీ నేతలతో సమావేశం కానున్నట్లు ఎఐసీసీ వర్గాలు తెలిపాయి. పార్టీ అధ్యక్షురాలిగా గెలిచిన తరువాత ఆయా రాష్ట్రాల పీసీసీ అధ్య క్షులు, ముఖ్యమంత్రులు, సిఎల్పీ నేతలతో సోనియా సమావేశం కావడం సంప్రదాయంగా వస్తుంది. అందులో భాగంగానే శనివారం పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌, గీతారెడ్డిలతో సోనియా సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా జగన్‌ వ్యవహారం, రోశయ్య ఆరోగ్య పరిస్థితులు వంటి ఆంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. జగన్‌పై చర్యలు తీసు కుంటే రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు ఎలా ఉంటాయి? తదితర విషయాలను చర్చించే అవకాశం ఉన్నట్లు ఎఐసీసీవర్గాల ద్వారా తెలు స్తోంది. రాష్ట్ర నేతలు సోనియాకు సమర్పించే నివేదిక ద్వారా ఎఐసీసీ క్రమశిక్షణ సంఘం జగన్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేసే అవకాశాలుంటాయని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

Thursday, September 2, 2010

ఇక ఫైనల్స్ * ఓదార్పు ఆపేందుకు జగన్ ససేమిరా * ఫలించని మొయిలీ రాయబారం * యువనేత ససేమిరా !

నా కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.. నేతలూ నాతో వస్తేనే మంచిది
యాత్రతో పార్టీకి ప్రయోజనమే.. మొయిలీకి కడప ఎంపీ స్పష్టీకరణ
ప్రకాశం టూరు తర్వాత అయితే ఆలోచిస్తానని ఉద్ఘాటన
చర్యలేమీ ఉండవంటూ ఎమ్మెల్యేలకు అభయం.. యాత్రకు రప్పించే యత్నాలు
యువ ఎంపీ స్పందనపై అదిష్ఠానం ఆగ్రహం..
ఏక్షణమైనా షోకాజ్ జారీ!ఇక నా చేతుల్లో ఏమీ లేదు: మొయిలీ..
హెలిప్యాడ్ వద్ద జగన్‌తో ఆలింగనం
నేగి నుంచే ప్రకాశంలో ఓదార్పు.. గిద్దలూరు నుంచి ప్రారంభం
వైఎస్ కుటుంబం కోసం పదవి పోయినా బాధ పడను : బాలినేని
యాత్న ఆపితే సోనియాకే అవమానం : అంబటి
క్లైమాక్స్‌కు సర్వం సిద్ధమైంది. అధిష్ఠానం ఇచ్చి న ఆఖరి అవకాశాన్నీ కడప ఎంపీ జగన్ కాదన్నారు. ఓదార్పును ఆపేందుకు ససేమిరా అనేశారు. అధిష్ఠానం దూతగా ఇడుపులపాయకు వచ్చిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ వీరప్ప మొయిలీ మాటను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. శుక్రవారం నుంచి ప్రకాశం జిల్లాలో ఓ దార్పు యాత్రను ప్రారంభించి తీ రుతానని జగన్ స్పష్టంచేశారు. మాట తప్పడం.. మడమ తిప్పడం తమ ఇంటా వంటా లేదంటూ తెగేసి చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు తన యాత్రలో పాల్గొంటేనే మంచిదంటూ.. పార్టీ యావత్తూ తన బాటలోకే రావాలని పరోక్షంగా సూచించారు.

కావాలంటే ఆ తర్వాత పార్టీతో కలిసి ఓదార్పులో పాల్గొనే అంశాన్ని పరిశీలిస్తానంటూ ముక్తాయించారు. పైగా తన ఓదార్పుతో పార్టీకి ప్రయోజనమేనంటూ సూత్రీకరించారు. ఇప్పటిదాకా యాత్రలో పాల్గొన్న వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోని విషయాన్ని ప్రస్తావిస్తూ.. ప్రకాశం,నెల్లూరు జిల్లా నేతలను యాత్రకు రప్పించేందుకు జగన్ వర్గం ప్రయత్నాలు ప్రారంభించడం మరో కీలకాంశం.

మొత్తానికి జగన్ స్పందన అధిష్ఠానానికి తీవ్ర ఆగ్రహం కలిగించినట్టు తెలిసింది.ఎంత చెప్పినా జగన్ వినిపించుకోకపోవడంతో.. 'ఐ యామ్ హెల్ప్‌లెస్. ఇక నా చేతుల్లో ఏమీ లేదు' అంటూ, వీరప్ప మొయిలీ నిట్టూర్చారు. జగన్‌ను ఒక్కసారి గట్టిగా ఆలింగనం చేసుకొని హెలికాప్టర్‌లో బెంగళూరు బయల్దేరి వెళ్లిపోయారు. ఇదీ గురువారంనాటి సీన్. ఇక అధిష్ఠానం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరం. యాత్ర ప్రారంభిస్తే ఏ క్షణమైనా షోకాజ్ ఇచ్చేందుకు అది సిద్ధమవుతోందన్నది తాజా సమాచారం! 
యువనేత ససేమిరా !
Jagan-yuva
అధిష్ఠానం మాట వినకుండా సొంత దారిలో వెళుతున్న కడప ఎంపీ వైఎస్‌ జగన్‌కు నచ్చచెప్పి, పార్టీ దారిలో తెచ్చుకునేందుకు అధిష్ఠానం వీరప్ప మొయిలీ ద్వారా పంపిన రాజీ సూత్రాన్ని జగన్‌ తిరస్కరించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, కేంద్రమంత్రి వీరప్పమొయిలీ గురువారం వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా ఇడుపుల పాయకు వచ్చి వైఎస్‌ సమాధి వద్ద నివాళులర్పిం చారు. ఆ తర్వాత జగన్‌, ఆయన తల్లి ఎమ్మెల్యే విజయలక్ష్మితో పావుగంట సేపు చర్చలు జరిపారు. మొయిలీ మాట్లాడుతున్నప్పుడు జగన్‌ మధ్యలో ఎక్కడా అడ్డుపడకుండా మౌనంగా విన్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం... తాను సోనియాగాంధీ దూతగానే ఇక్కడికి వచ్చానని, మీ కుటుంబంపై సోనియాకు అభిమానం ఉన్నం దుకే ఆమె తనను హైదరాబాద్‌లో జరిగే అధి కారిక కార్యక్రమానికి కాకుండా, వైఎస్‌ కుటుం బం అమితంగా ప్రేమించే ఇడుపులపాయకు పంపిస్తే వచ్చానని మొయిలీవివరించారు. వైఎస్‌ కాంగ్రెస్‌ పార్టీకి చేసిన సేవలను సోనియాగాంధీ ఇప్పటికీ ప్రస్తావిస్తుంటారని, కానీ జగన్‌ వ్యవహారశైలి ఆమెలో ఉన్న ఆ సానుభూతి స్థానంలో ఆగ్రహానికి కారణమవుతోందని వారికి స్పష్టం చేశారు. తాను వద్దన్నా వినకుండా ఓదార్పు యాత్రకు వెళ్లడాన్ని ఆమె సహించలేకపోతున్నారని, అదీగాకుండా జగన్‌ తన యాత్రలో ఎక్కడా పార్టీ పేరు ప్రస్తావించ కుండా, రాజకీయ అంశాలు ప్రస్తావించడంపై సోనియా ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. ఎంతో భవిష్యత్తు ఉన్న జగన్‌ ఈవిధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో విచారించి, నచ్చచెప్పి సరైన దారిలో వెళ్లేలా చూడాలని తనను ఆదేశించినట్లు వారికి వివరించారు.

amma
ఓదార్పు యాత్రలో సోనియాగాంధీ, పార్టీ పేరు, వైఎస్‌కు పార్టీ ఇచ్చిన అవకాశాలను ప్రస్తావించడం ద్వారా సోనియా ఆగ్రహాన్ని చల్లార్చాలని మొయిలీ సూచించారు. పార్టీకి విధేయత ప్రకటించడం ద్వారా ఉజ్వల భవిష్యత్తును కాపాడుకోవాలని జగన్‌కు సలహా ఇచ్చారు. మీకు మద్దతుదారుగా ఉన్నట్లు తనపై కూడా దుష్ర్పచారం జరుగుతోందని మొయిలీ వాపోయారు. ప్రస్తుతం పార్టీలో మీకు వ్యతిరేక వాతావరణం ఉందని, దానిని విధేయ వైఖరితో సానుకూలంగా మార్చుకోవాలని సలహా ఇచ్చారు. ఒకవేళ కాదని, ఓదార్పు యాత్రకు వెళితే అధిష్ఠానం చర్యలు తీసుకోవాలన్న ఆలోచనతో ఉందని, క్రమశిక్షణ కమిటీ కూడా కేవలం మీ యాత్ర, అందులో మీరు అనుసరించే వ్యవహారశైలి కోసమే ఎదురుచూస్తోం దని స్పష్టం చేశారు. అయితే, తాను పార్టీపై తిరుగుబాటు చేయడం లేదని, ఓదార్పు యాత్రకు వస్తానని తన తండ్రి మృతి చెందిన రోజు నల్లకాలువ వద్ద ప్రకటించిన విషయాన్ని జగన్‌ ఆయన వద్ద గుర్తు చేశారు.

పార్టీ కార్యకర్తలు మృతి చెందిన సమయంలో వారిని పరామర్శించడం తప్పెలా అవుతుందని, దానిని నాయకత్వం కూడా తన ప్రత్యర్థుల మాటలు విని తనను అణచివేసే విధంగా వ్యవహరించడం సరైంది కాదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ నాయకత్వం కూడా పోటీ ఓదార్పు యాత్రను ప్రారంభించడాన్ని జగన్‌ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రజలకు అన్నీ తెలుసు అని మాత్రమే వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రోశయ్య తనను అణచివేయడమే పనిగా పెట్టుకున్నారని, తన ప్రత్యర్థులు ప్రతిరోజూ ఆయనను కలుస్తున్నారని, సీఎంను కలిసిన తర్వాత వారు తనపై ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నారని, మళ్లీ సీఎంను కలుసుస్తున్నారని ఫిర్యాదు చేశారు. తన యాత్రకు వెళ్లవద్దని ఎమ్మెల్యేలకు స్వయంగా ఫోన్లు చేయటంపెద్ద మనిషి లక్షణమా అని అసహనంతో ప్రశ్నించారు.

ఇప్పటికే నాలుగు జిల్లాల్లో ఓదార్పు యాత్ర పూర్తి చేసినందున, మిగిలిన జిల్లాల్లో కూడా పర్యటించి, బాధిత కుటుంబాలను ఓదార్చ వలసిన బాధ్యత తనపై ఉందన్నారు. మడమ తిప్పని యోధుడిగా పేరున్న రాజశేఖరరెడ్డి తనయుడిగా ఇచ్చిన మాట నెరవేర్చడం తన ధర్మమని వాదించారు. ఓదార్పు రాజకీయాలతో సంబంధం లేని యాత్ర అని, తాను వెళ్లేది ఖాయమని తేల్చిచెప్పారు. ‘మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు. నేను చెప్పాల్సింది నేను చెప్పాను. నా పరిస్థితిని అర్థం చేసుకుని నాకు సహకరించండి. నేను ఓదార్పు తర్వాత పార్టీ అధ్యక్షురాలిని వచ్చి కలుస్తా. ఆలోగా మీరు చర్యలు తీసుకోవాలంటే మీ ఇష్టం. నేను అన్ని ంటికీ సిద్ధమయ్యే ఉన్నా. మీరు వ్యక్తిగతంగా నాపై చూపిన అభిమానానికి, మా కుటుంబంపై చూపిన ప్రేమకు కృతజ్ఞత’లని జగన్‌ చెప్పారు. ఆ తర్వాత మొయిలీ వెళ్లే సమయంలో వారిద్దరూ ఆలింగం చేసుకున్నారు.

Monday, August 23, 2010

వేరుబాటే...!

jagan-console
అధిష్ఠానంపై ధిక్కార అస్త్రాలను పరంపరగా వదులుతున్న కడప ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తాను ఏర్పాటు చేయదలచు కుంటున్న కొత్త పార్టీకి ఇప్పటినుంచే పునాదులు వేసుకుంటున్నారు. అధిష్ఠానం నుంచి ఎదురవు తున్న ‘అవమానాలను’ సహిస్తూ ఇక ఎంతోకాలం పార్టీలో ఇమడలేనని గట్టి నిర్ణయానికి వచ్చిన జగన్‌, గత కొద్ది రోజుల నుంచీ కొత్త పార్టీ నిర్మా ణం, స్వరూప స్వభావాలు, నామకరణం వంటి వాటిపై పలువురితో మంతనాలు జరుపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఒకవైపు ఓదార్పు యాత్రకు సన్నద్ధం అవుతూనే పార్టీ విషయమై తీరిక చిక్కినప్పుడల్లా అన్ని జిల్లాల నాయకులతో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. అన్నీ కలసి వస్తే సెప్టెంబర్‌ రెండున వైఎస్‌ఆర్‌ప్రథమ వర్ధంతి రోజునే ఆలోచనను ఆవిష్కృతం చేయాలనుకుంటున్న జగన్‌, ఒకటి, రెండు రోజులు అటూ ఇటూ అయినా పార్టీ పెట్టి తీరాల్సిందే అనే గట్టి నిర్ణయానికి వచ్చేసినట్టు తెలిసింది.

క్షేత్ర స్థాయి సర్వేలు...
ఒకసారి పార్టీ పెట్టటం అంటూ జరిగితే అది టీడీపీ, కాంగ్రెస్‌ ఉత్తమమైన, బలమైన ప్రత్యామ్నాయంగా నిలిచిపోవాలన్న ఆలోచనతో జగన్‌ ఉన్నట్టు సమాచారం. ప్రజారాజ్యం పార్టీ మాదిరిగా హడావుడి ఏర్పాట్లు, టికెట్ల పంపిణీలో అవకతవకలు, చిట్ట చివరకు పట్టుమని 50 స్థానాలు అయినా రాని దుస్థితి, ఆ తర్వాత వరుస ఓటముల వంటివి ఎదురు కాకుండా అతి జాగ్రత్తగా పార్టీ నిర్మాణం జరగాలన్న ఆలోచనతో జగన్‌ అడుగులు వేస్తున్నట్టు చెబుతున్నారు.

ఇందుకోసం క్షేత్ర స్థాయిలో ముమ్మరంగా సర్వేలు ప్రారంభమయ్యాయంటున్నారు. తనకు అత్యంత నమ్మకస్థులైన గ్రామ, మండల, తాలూకా స్థాయి యువతతో అతి గోప్యంగా ఆయా ప్రాంతాల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. మండలాలు, పంచాయతీలు, నియోజకవర్గాలలో వీరంతా ఎవరికీ తెలియకుండా జనం మధ్యనుంచి సమాచారం సేకరించటం, హైదరాబాద్‌కు చేరవేయటం జరిగిపోతున్నది.

పోటీ ఇచ్చిన వారికి ప్రాధాన్యం

పార్టీకి అండగా నిలిచే వారిని ఎంపిక చేసుకోవటంలోనూ జగన్‌ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి ఓటమిపాలైన వారు, ఆయా పార్టీలలో అసంతృప్తితో ఉన్న వారు, ఇక తమకు మనుగడ లేదని నిరాశతో ఉన్న వారు, అంగ, అర్ధబలాలతో పాటు జనంలో మంచి పేరు ఉన్న వారు, అవసరం అయితే దేనికైనా వెనుకాడని వారు...ఇలా విభజించి వీరిలో తమకు ఎవరు అనుకూలంగా ఉంటారో, పార్టీపరంగా వారికి ఎలాంటి గుర్తింపు ఇవ్వాలో అభిప్రాయ సేకరణ జరుగుతున్నది. ఇందులో కేవలం ఒకే పార్టీ నుంచే లాగాలనే ఆలోచన కాకుండా అన్ని పార్టీల నుంచి ఆకర్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.

ప్రాంతాల వారీగా వివరాలు...
ఇలా వివరాలు సేకరించటంలో జగన్‌ కానీ, ఆయన సలహాదారులు కానీ ఎలాంటి తొందరపాటు కనబరచటం లేదు. ఒకేసారి రాష్ట్రం మొత్తం నుంచి సమాచారం తెప్పించుకుని హడావుడి నిర్ణయాలు తీసుకోకుండా, ప్రాంతాల వారీగా వివరాలు సేకరిస్తున్నట్టు చెబుతున్నారు. ఉత్తరాంధ్ర, కోస్తా, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, రాయలసీమ...ఇలా ఒక్కో ప్రాంతం నుంచి కొన్ని నియోజకవర్గాలను ఎంపిక చేసి అక్కడి పరిస్థితులు, బలంగా ఉన్న పార్టీలు, నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల్లో బలమైన నేతలు, వారికి ఉన్న పలుకుబడి వంటి వాటిపై దృష్టి సారిస్తున్నారు. అవసరం అనుకున్న పక్షంలో తన అనుయాయులతో మంతనాలు జరిపిస్తున్నారు. మొదట సన్నిహితులు, సలహాదారులు ఎంపిక చేసిన వారితో మాట్లాడి ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత వారితో సంప్రదించిన అనంతరమే దగ్గరకు తీసుకోదలచిన వారితో జగన్‌ స్వయంగా మాట్లాడతారని తెలిసింది. ఇప్పటికే కొందరు నేతలతో మంతనాలు పూర్తి అయ్యాయని చెబుతున్నారు.

ప్రధాన టార్గెట్‌ కాంగ్రెస్‌...
కాంగ్రెస్‌ నాయకత్వం తనను అవమానాల పాలు చేస్తున్నదని ఆగ్రహంతో ఉన్న జగన్‌, పార్టీ ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్‌నే ప్రధాన లక్ష్యం చేసుకోవాలని భావిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. వైఎస్‌ఆర్‌ విషాదాంతం తర్వాత కొంతకాలం తన వెంట ఉన్న ట్టు ‘నటించి’, ఇప్పుడు అధిష్ఠానం పేరు చెప్పి ముఖాలు చాటేస్తున్న వారిపై గుర్రుగా ఉన్నారు.

అలాంటి వారిని ప్రధాన లక్ష్యాలుగా చేసుకుని, వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా వారు గెలవకుండా చేయాలన్న దృక్పథంతో వ్యూహ రచన చేస్తున్నట్టు తెలిసింది.ఆ తర్వాత ఓదార్పు యాత్రకు గైర్హాజరయ్యేవారు, కొంత తగ్గి అధిష్ఠానం మాట వినాలని హితవు పలికిన వారు, తనపైన, తన తండ్రి పైన దురుసు వ్యాఖ్యలు చేస్తున్న వారు...ఇలా ఒక్కో స్థాయి వారందరినీ ఒక చూపు చూడాలన్న ఆలోచనతో జగన్‌ ముందుకు సాగుతున్నట్టు కాంగ్రెస్‌లో బలమైన వర్గాలు చెబుతున్నాయి.

పేరు ఓదార్పు... ప్రయత్నం సమాచార సేకరణ
ప్రస్తుతం సొంత జిల్లాలో ఓదార్పు యాత్ర జరుపుతున్న జగన్‌, వచ్చేనెలలో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆ యాత్రకు ఎంతమంది వచ్చేదీ ఇంకా తేలకపోయినా, యాత్ర మాత్రం జరిగితీరుతుందని ఇప్పటికే స్పష్టమైంది. అయితే తనకు కావలసిన సమాచారాన్ని సేకరించటానికి ఓదార్పు యాత్ర కూడా ఉపకరిస్తుందని జగన్‌ విశ్వసిస్తున్నారు. పార్టీలోకి రాజకీయ నాయకులను లాగడానికి తాను ఏర్పాటు చేసుకున్న ప్రాతిపదికల ప్రకారం వెళ్ళిన చోటల్లా అలాంటివారు ఎవరెవరు ఉన్నారో కూపీ లాగుతున్నారు. ఈ విషయంలో జగన్‌కు అత్యంత విశ్వసనీయమైన నెట్‌వర్క్‌ టీమ్‌ పూర్తిగా సహకరిస్తున్నట్టు తెలిసింది.

హై కమాండ్‌ ఆరా?
సొంత కుంపటి పెట్టుకునేందుకు జగన్‌ ప్రయత్నిస్తున్నట్టు వస్తున్న వార్తలు ఢిల్లీ దాకా చేరినట్టు సమాచారం. ఇందులో వాస్తవాలేమిటో తెలుసుకునేందుకు హై కమాండ్‌ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే జగన్‌ ఉంటే ఎంత? పోతే ఎంత? అని ప్రణబ్‌ ముఖర్జీ లాంటి వారు వ్యాఖ్యానించటంతో జగన్‌కు ఇక కాంగ్రెస్‌లో ఎలాంటి గుర్తింపూ ఉండబోదని తేలిపోయింది. అయినప్పటికీ వేరు కుంపటి పెట్టే విషయం వాస్తవమే అయితే ఆ వ్యూహాన్ని ఎదుర్కునేందుకు ఏమి చేయాలన్న దానిపై అంత సీరియస్‌గా కాకపోయినా ఒక కన్ను మాత్రం వేసి ఉంచాలని హైకమాండ్‌ పెద్దలు భావిస్తున్నట్టు చెబుతున్నారు. రాష్ట్ర, కేంద్ర ఇంటిలిజెన్స్‌ వర్గాల ద్వారా జగన్‌ పార్టీ ప్రయత్నాలపై ఎప్పటికప్పుడు కూపీలు లాగుతున్నారు. పార్టీ ఏర్పాటు నిజమే అయితే పార్టీలో ఉన్న వారు ఎంత మంది అటువైపు దూకుతారన్న స్థాయిలో ఆలోచించకపోయినా ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకుంటూ, జగన్‌ వ్యూహాలను గమనిస్తూ ఉండాలని మాత్రం అధిష్ఠానం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.

Sunday, August 22, 2010

రెచ్చగొట్టే ధోరణి ?

Jagan9
కడప ఎంపి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శిబిరానికి చెందిన నేతలు రాష్ట్ర కాంగ్రెస్‌లో ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలను రెచ్చగొట్టే ధోరణి అవలంబిస్తున్నారంటూ పార్టీలో విమర్శలు గుప్పుమంటున్నా యి. మరో వైపు జగన్‌ శిబిరం నేతల వైఖరి చూస్తుంటే ఈ విమ ర్శ లకు బలం చేకూరుతున్నది. ఓదార్పు యాత్రకు బ్రేకు వేసేం దుకు పార్టీ అధిష్ఠానం ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు ఎవరూ కూడా యాత్రలో పాల్గొనవద్దంటూ నేతల ద్వారా తమ వైఖరి స్పష్టం చేసిన నేపథ్యంలో జగన్‌ శిబిరం దాన్ని తిప్పి కొట్టేందుకు రంగంలో దిగింది. ఓదార్పు యాత్రలో పాల్గొనకుంటే, యాత్ర ను వ్యతిరేకించినా జనం రాళ్ళతో కొడతారంటూ తాజాగా ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలపై ఒత్తిడి పెంచడానికి సరికొత్త తరహా ప్రచారాన్ని ప్రారంభించింది. తద్వారా ఓదార్పును వ్యతిరేకిస్తున్న వారిని, ఓదార్పు యాత్రలో పాల్గొనే విషయంలో ఊగిసలాడు తున్న వారికి జనం భయం చూపించి యాత్రకు రప్పించే ప్రయ త్నాలను ఆ శిబిరం ముమ్మరం చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అప్పటికి యాత్రకు రాని నేతలపై కార్యకర్తల రూ పంలో తమ వర్గం క్యాడర్‌ను రెచ్చగొట్టి, దాడులు చేయిం చేందుకు వ్యూహ రచన చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

తాజాగా ఆదివారం ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కొండా సురేఖ తదితరులు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే జగన్‌ ఓదార్పు యాత్రను వ్యతిరేకిస్తున్న ప్రజా ప్రతినిధులపై పార్టీ ద్వితీయశ్రేణు నేతలు, క్యాడర్‌ను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని పలువురు నేతలు విమర్శించారు. కేంద్ర మంత్రులు దగ్గుబాటి పురంధేశ్వరి, పనబాక లక్ష్మి ద్వారా అధిష్ఠానం ఓదార్పు యాత్ర విషయంలో ఇచ్చిన సంకేతాలు జగన్‌ వర్గానికి ఎంత మాత్రం మింగుడు పడటం లేదు. హైకమాండ్‌ పేరుతో పురంధేశ్వరి మాట్లాడటమేమిటి, యాత్ర విషయంలో అధిష్ఠానం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలనుకుంటే పార్టీ అధికార ప్రతినిధులు, ఎఐసీసీ ప్రధాన కార్యదర్శుల ద్వారా విడుదల చేస్తుందని, అలా కాకుండా పురంధేశ్వరి ద్వారా ఓదార్పు యాత్రకు ఆదేశాలివ్వాల్సిన కర్మ పార్టీకి పట్టలేదని ఇప్పటికే జగన్‌ శిబిరం నిప్పులు చెరిగింది. దగ్గుబాటి దంపతులే ఓదార్పును అడ్డుకునేందుకు ఈ వ్యూహం వేశారని ఆరోపించింది. కాగా సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్‌ పటేల్‌ చెప్పమన్న విషయాలను మాత్రమే తాను చెప్పడం జరిగిందని, పైగా ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీల ఎదుట హైకమాండ్‌ ఓదార్పు యాత్రపై తన వైఖరి స్పష్టం చేసిందని పురంధేశ్వరి ఆదివారం వైజాగ్‌లో స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన మరో ఎంపి పనబాక లక్ష్మి కూ డా స్పందిస్తూ ఓదార్పు యాత్ర పార్టీకి లాభమా? నష్టమా అన్నది ప్రజలే నిర్ణయిస్తారని, తాను మాత్రం యాత్ర కు వెళ్ళేది లేదని, ఇప్పటికే తన వైఖరి స్పష్టం చేశాను, ఇక పదే పదే దీనిపై మాట్లాడాల్సిన అవసరం లేదని ఆమె ఆదివారం తేల్చి చెప్పారు.

ఒక వైపు అధిష్ఠానం యాత్రకు వెళ్ళొద్దంటూ ఆదేశించినట్లు వార్తలు రావడం, మరో వైపు ప్రకాశం జిల్లాకు చెందిన ఎంపీలు, మరి కొందరు ఎమ్మెల్యేలు తాము అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, అందుకే యాత్రకు వెళ్ళబోమని స్పష్టం చేయడంతో జగన్‌ శిబిరం ఆందోళనలో పడింది. ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్రను సక్సెస్‌ చేయడానికి, అధిష్ఠానం కల్పిస్తున్న అడ్డంకులను అధిగమించేందుకు జగన్‌ శిబిరం సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ‘ఓదార్పు యాత్రకు వెళ్ళక పోతే జనం రాళ్ళతో కొడతారు’ అనే సరికొత్త నినాదాన్ని జగన్‌ శిబిరం తెరమీదకు తీసుకొచ్చి బహుళ ప్రచారం సాగిస్తోంది. ‘90 శాతం మంది వైఎస్‌ అభిమానులు ఉన్నారు, వైఎస్‌ను వ్యతిరేకించినా, ఓదార్పు యాత్రను వ్యతిరేకించినా జనం సహించే పరిస్థితుల్లో లేరు, రాళ్ళతో కొట్టే పరిస్థితి ఉంది’ అని ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ప్రకటించడం, ‘ఓదార్పు యాత్రలో పాల్గొనవద్దని పార్టీ హైకమాండ్‌ స్పష్టంగా ఎక్కడా చెప్పలేదు.

ఈ యాత్రకు వెళ్ళక పోతే ప్రజలు నిలదీస్తారు. రాళ్ళతో కొడతారు. యాత్రను వ్యతిరేకించే నేతలకు కనిగిరి ఎమ్మెల్యేకు పట్టిన గతే పడుతుంది’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ నెల్లూరులో చేసిన వ్యాఖ్యలు పార్టీ ప్రజా ప్రతినిధుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలను రెచ్చగొట్టడం ద్వారా ఓదార్పుకు దూరంగా ఉండే ప్రజా ప్రతినిధులపై ఉసిగొల్పే వ్యూహంలో ఇది భాగమేనని పార్టీ నేతలు కొందరు భగ్గుమంటున్నారు. ఢిల్లీ వెళ్ళి అహ్మద్‌ పటేల్‌తో కలిసి వచ్చిన ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలలో సభ్యుడైన కనిగిరి ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి ఓదార్పు యాత్రలో పాల్గొనే విషయంలో తమ కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆ మేరకు రెండు రోజుల క్రితం తన నియోజకవర్గం కనిగిరిలో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి అభిప్రాయం తెలుసుకున్నా రు.

జగన్‌ శిబిరం నేతలు, కార్యకర్తలుగా చెబుతున్న వారు యాత్రకు వెళ్ళవలసిందే నని పట్టుబట్టి ఒక దశలో ఎమ్మెల్యేపై దాడికి దిగినంత పనిచేశారు. దీంతో ఇదే ఘటన ను జగన్‌ శిబిరం తెరపైకి తీసుకొచ్చి విస్తృత ప్రచారం సాగిస్తూ ప్రజాప్రతినిధుల్లో భయాందోళనలు కల్పిస్తున్నదనే కొందరు నేతలు విమ ర్శిస్తున్నారు. మరో వైపు ఓంగోలు ఎంపి మేకపాటి రాజ్‌మోహ న్‌రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే, మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి తాము జగన్‌ యాత్రలో ఎట్టి పరిస్థితుల్లో పాల్గొంటామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా మరో వైపు జగన్‌ శిబిరం ఓదార్పు యాత్రలో పాల్గొనాలంటూ ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి పెంచడా నికి వివిధ జిల్లాల్లో పలు కార్యక్రమాలు చేపట్టింది. అనం తపురం, ఖమ్మం జిల్లాల్లో జగన్‌ శిబిరం నేతలు ఓదార్పు యాత్ర కు మద్దతుగా ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. అనంతపు రంలో రఘువీరాను సైతం ఘెరావ్‌ చేసినంత పనిచేశారు.

విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్‌ మరో అడుగు ముందుకు వేసి జగన్‌కు బాసటగా నిలిచారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలను జిల్లాకు ఒకటి చొప్పున ఆవిష్కరించాలంటూ హైకమాండ్‌ ఆంక్షలు విధించడాన్ని తప్పుపట్టారు. కేంద్ర మంత్రి పురంధేశ్వరి ద్వారా అహ్మద్‌ పటేల్‌ ఇదే చెప్పించారు. అంతే కాకుండా జిల్లాల్లో వైఎస్‌ విగ్రహాం ఆవిష్కరించే చోటనే బాధితులను పిలిపించి ఆర్ధిక సహాయం చేయాలని ఆయన సూచించారు. అయితే హైకమాండ్‌ సూచనలను లగడపాటి వ్యతిరేకించడమే కాకుండా పరోక్షంగా జగన్‌ కు బాసటగా నిలిచిచారని పార్టీ వర్గాల్లో విమర్శలు భగ్గుమన్నాయి.

కౌంట్‌డౌన్‌ ! * సెప్టెంబర్‌లో సంక్షోభమేనా?

Sonia-gandhi
కాంగ్రెస్‌లో ఇక ఇమడగలిగే పరిస్థితులు కనిపించటం లేదని నిర్ధారణకు వచ్చిన కడప ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కొత్త పార్టీ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తు న్నారా? ఆ పార్టీకి తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ పేరు కానీ, ఇందిరాగాంధీ పేరు కానీ ఖాయం చేయబోతున్నారా?...కాంగ్రెస్‌ వర్గాలలో ఆసక్తిరంగా సాగుతున్న చర్చ ఇది. పార్టీ నుంచి జగన్‌ పోతే పోనీ అని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ కుమార్‌ ముఖర్జీ ఘాటైన వ్యాఖ్యలు చేసినా బెదరని జగన్‌ సోమ, మంగళవారాలలో తన తండ్రి అనాదిగా ప్రాతినిధ్యం వహించి, ప్రస్తుతం తల్లిగారైన విజయమ్మ ఎమ్మెల్యేగా ఉన్న పులి వెందుల నియోజకవర్గం నుంచి రెండురోజుల పాటు ఓదార్పు యాత్ర జరపబోతున్నారు.

జగన్‌ ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడినా చర్యలు తప్పవంటూ ప్రణబ్‌ తొలిసారిగా ఘాటైన హెచ్చరిక చేసినా పట్టించుకోకుండా తన ప్రయ త్నాలు తాను చేసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నాయకత్వం తనపై చర్య తీసుకున్నా, లేకపోయినా కొత్త పార్టీ స్థాపించి ఎఐసిసికి తన దెబ్బ ఏమిటో రుచి చూపించాలన్న ధోరణి జగన్‌లో కనిపిస్తున్నదని పార్టీ వర్గాలు చెబు తున్నాయి. అయితే అధిష్ఠానం మాత్రం నోటి మాటలుగా తప్ప జగన్‌ విషయంలో చేతల్లో ఏ తీవ్రమైన చర్యా తీసుకోవటం లేదు. జగన్‌ ము న్ముందు ఏమి చేయబోతున్నారో తేలిన తర్వాతనే ఏదైనా నిర్ణయించాలని హై కమాండ్‌ భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.

పార్టీ ఏర్పాటు జరిగితే...
ఒకవేళ జగన్‌ ఊహాగానాలను నిజం చేస్తూ స్వంతంగా పార్టీ పెట్టాలనుకుంటేదాని నామకరణం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను రెండుసార్లు ఒంటి చేత్తో అధికారంలోకితీసుకు వచ్చిన తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరు పెట్టాలా? లేక అనాదిగా తమ కుటుంబం నమ్ముకుని ఉన్న కాంగ్రెస్‌కు మకుటం లేని మహారాణిలా వెలిగిన ఇందిరాగాంధీ పేరు పెట్టాలా అనే ఆలోచనలో ఆయన ఉన్నట్టు చెబుతున్నారు. అయితే ఇందిరాకాంగ్రెస్‌ అనే పేరు ఖాయం చేయటానికి కొన్ని ఇబ్బందులున్నాయని ఆంతరంగికులు చెబుతున్నట్టు తెలిసింది.

jagan-speach
ఎఐసిసి అధినేత్రి సోనియా గాంధీ స్వయంగా ప్రతి బహిరంగ సభలో ఇందిర పేరును ప్రస్తావించకుండా ఉపన్యాసాన్ని కొనసాగించని నేపథ్యంలో ఇందిర పేరును తాము వాడుకుంటే రాజకీయంగా పెద్ద ప్రయోజనం ఉండదన్న ఆలోచనను కొందరు అనుయాయులు జగన్‌ వద్ద బయట పెట్టినట్టు చెబుతున్నారు. ఎలాగూ వైఎస్‌ పేరిటనే ఓదార్పు యాత్ర చేస్తున్నారు కాబట్టి పార్టీ పేరును సైతం ఆయన పేరుతోనే కొనసాగిస్తే రాజకీయంగా మనుగడ ఉంటుందన్న ఆలోచన అనుయాయుల నుంచి వస్తున్నట్టు తెలిసింది. పైగా ఈ తరం వోటర్లకు సోనియాగాంధీ తప్ప ఇందిర అంతగా తెలియకపోవ చ్చునని, అలాంటప్పుడు ఆమె పేరు పెడితే మరోరకమైన ఇబ్బంది ఎదురు కావచ్చునని కొందరు జగన్‌తో మాట్లాడినప్పుడు అభిప్రాయపడినట్టు చెబుతున్నారు.

సెప్టెంబర్‌లో సంక్షోభమేనా?
జగన్‌ తీసుకునే ఏ నిర్ణయం అయినా కాంగ్రెస్‌లో సంక్షోభం సృష్టించక తప్పదన్న వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి. జగన్‌ పార్టీ నుంచి బయటకు వెళ్తే ఆయన వెంట ఏమేర ఎమ్మెల్యేలు, ఎంపీలు వెళ్తారన్న దానిపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఒకవేళ జగన్‌ గణనీయమైన సంఖ్యలో ఎమ్మెల్యేలను చీల్చుకుపోతే రోశయ్య సర్కారు భవితవ్యం ఎలా ఉంటుందన్న చర్చ సైతం పార్టీ వర్గాలో జోరుగానే సాగుతున్నది. అంటే తన తండ్రి ప్రథమ వర్ధంతి వచ్చేనెల రెండున జరగనున్న నేపథ్యంలో ఆ రోజు కానీ, ఆ తర్వాత కానీ జగన్‌ తీసుకునే ఏ నిర్ణయం అయినా పార్టీలో సంక్షోభానికి తెర తీయక తప్పదన్న ఊహాగానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

వచ్చేనెలలో ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో జరపబోయే ఓదార్పు యాత్రకు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, నెల్లూరు ఎంపీ మేకపాటిరాజమోహన్‌రెడ్డి, ఆయన సోదరుడు చంద్రశేఖరరెడ్డి, మరి కొందరు నేతలు బహిరంగంగా మద్దతు పలికారు. ఓదార్పు యాత్ర ఏర్పాట్లన్నీ బాలినేని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. యాత్ర జరపటం ఖాయం అని, ఇష్టం ఉన్న వారు రావచ్చునని, లేనివారు రాకపోయినా బలవంతం ఏమీ లేదని బాలినేని ఇప్పటికే స్పష్టం చేశారు. ఇటీవల ఢిల్లీలో తనను కలిసిన నేతలకు జగన్‌ సైతం ఇదే మాట చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఈ లెక్కన పార్టీలో పెను సంక్షోభం సృష్టించి తన సత్తా ఏమిటో కాంగ్రెస్‌ నాయకత్వానికి చూపించాలని జగన్‌ వ్యూహ రచన చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. సోమ, మంగళ వారాలలో స్వంత జిల్లాలో జరిపే ఓదార్పు యాత్ర సందర్భంగా తనకు అనుకూలురైన ఎమ్మెల్యేలతో భవిష్యత్‌ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి.

బల సమీకరణ మొదలు...
ఢిల్లీ వెళ్ళి అధిష్ఠానం మనుషులతో మాట్లాడిన తర్వాత ఇక తనను పార్టీ పట్టించుకునే స్థితిలో లేదని నిర్ణయానికి వచ్చినజగన్‌, శనివారం తన మద్దతుదారులతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. తన రాజకీయ భవిష్యత్తుపై నీలి నీడలు ముసిరేలా దగ్గుబాటి దంపతులు చేశారని ఆగ్రహంగా ఉన్న జగన్‌, తన మనుషులతో వారిపై కారాలు, మిరియాలు నూరిస్తున్నారు. వరంగల్‌ జిల్లా ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి లాంటి వారి ద్వారా కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరిని, మరో మంత్రి పనబాక లక్ష్మిని తీవ్రంగా విమర్శించేలా చేస్తున్నారు.

అలా చేస్తూనే మరోవైపు ప్రముఖులు అనుకున్న వారితో స్వయంగా మాట్లాడి అనుకూలంగా మలచుకుంటున్నారు. అలా రోజు రోజుకూ తనకు మద్దతు దారులు పెరిగేలా చూసుకుంటున్నారు. తాజాగా విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ రంగ ప్రవేశం చేశారు. ఓదార్పు యాత్ర విషయంలో కానీ, మరో అంశంపై కానీ ఎక్కువగా వ్యాఖ్యలు చేయని లగడపాటి, హఠాత్తుగా తెరపైకి వచ్చి జిల్లాకు ఒక వైఎస్‌ఆర్‌ విగ్రహం ఉంటే సరిపోతుందని అధిష్ఠానం చెప్పినట్టు వచ్చిన వార్తలపై మండి పడ్డారు. అది సరైన నిర్ణయం కాదని స్పష్టం చేశారు. ఇప్పటికే నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి యాత్రకు మద్దతు ఇచ్చిన నేపథ్యంలో లగడపాటి అదనంగా జగన్‌కు అండగా మిగిలారు.

హడావుడి లేకుండానే...
తన పట్ల అధిష్ఠానం అనుసరిస్తున్న వైఖరికి రగిలిపోతున్న జగన్‌ ఎలాంటి హడావుడీ లేకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. ఏమి చేస్తున్నదీ పది మందికి తెలియకుండా అత్యంత జాగరూకతతో వ్యవహరిస్తున్నా రు. ప్రతి జిల్లాలో తన వారెవరో, పరాయివారెవరో అంచనాలు వేసుకుంటున్నారు. తన సర్వేలు తనకు ఉన్నాయని ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఎమ్మెల్యేలతో కొద్ది రోజుల క్రితమే చెప్పిన ఆయన వాటి ప్రకారమే తన బలం ఎంతో, స్థాయి ఏమిటో అంచనాలు వేసుకుంటున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో సెప్టెంబర్‌ మాసం కాంగ్రెస్‌ పార్టీ పాలిట సంక్షోభ మాసం అవుతుందా? సామరస్యంగా ముగుస్తుం దా అనేది చూడాల్సి ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కొందరు అభిప్రాయపడ్డారు.

అధిష్ఠానం చెప్పిందే చెప్పా - పురంధేశ్వరి
D.Purandhareswar
ఓదార్పు యాత్రపై వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పలేదు, రాష్ట్ర నేతలందరి సమక్షంలో అహ్మద్‌ పటేల్‌ ఏం మాట్లాడారో అదే మీడియాకు చెప్పా.

రోశయ్య సర్కారుపై కుట్ర - జి. వెంకటస్వామి
venkataswami
రోశయ్య ప్రభుత్వాన్ని కూల్చడానికి ఒక వర్గం కుట్ర పన్నుతున్నది. సీడబ్యూసీలో సభ్యుడినైనందున కుట్ర దారుల పేర్లు వెల్లడించలేను

రాకపోతే ప్రతిఘటన తప్పదు - మేకపాటి
mekapatichandra
ఓదార్పునకు రాకపోతే జనం నుంచి తీవ్ర ప్రతిఘట నలను నేతలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రాష్ట్రానికి జగన్‌లాంటి నేత కావాలి.

విషం చిమ్ముతున్న నేతలు - కొండా సురేఖ
sureka
జగన్‌పై కాంగ్రెస్‌ పార్టీలోనే కుట్ర జరుగుతున్నది. ఓదార్పుయాత్రపై మాట్లాడే అర్హత దగ్గుబాటి దంపతులకు ఏమాత్రం లేదు.

కాంగ్రెస్ పార్టీలో జగన్ ఉంటే ఎంత? పోతే ఎంత? జగన్‌ను బుజ్జగించం ఓదార్పు వద్దే వద్దు కోల్‌కతాలో ప్రణబ్ స్పష్టీకరణ

జగన్ వర్గం ఒత్తిడి రాజకీయం
ఎమ్మెల్యేలపై కార్యకర్తలే అస్త్రాలు
ద్వితీయ శ్రేణితోనే ముందుకు
అధిష్ఠానానికి సవాల్
భూమన దీక్షకు మద్దతు
  ఓదార్పుపై జగన్ వర్గం వాదనలు, వేదనలు వినే మూడ్‌లో అధిష్ఠానం లేదని మరోమారు స్పష్టమైంది. ఓదార్పు వద్దని జగన్‌తో ఆంతరంగికంగా చెప్పిన కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ తన సొంత రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ బహిరంగంగానే ఈ విషయం స్పష్టం చేశారు.

పైగా... జగన్ పార్టీలో ఉంటే ఎంత, పోతే ఎంత అని వ్యాఖ్యానించారు. శనివారం కోల్‌కతాలో బెంగాలీ విలేఖరులతో ప్రణబ్ మాట్లాడారు. "ఓదార్పు యాత్ర వద్దని జగన్‌కు స్పష్టంగా చెప్పాం. ఒక వ్యక్తి గురించి ఇంతగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనను బుజ్జగించే ప్రసక్తే లేదు. జగన్ పార్టీలో ఉంటే ఎంత? లేకపోతే ఎంత?'' అని ప్రణబ్ వ్యాఖ్యానించారు. ఆయన తన వైఖరిని స్పష్టం చేయడం ఇదే మొదటిసారి కాదు.

జగన్ ఓదార్పు యాత్ర చేపట్టడం పార్టీని ధిక్కరించినట్లు భావిస్తున్నామని రెండు నెలల క్రితమే ప్రణబ్ బెంగళూరులో విలేకరులతో అన్నారు. ఆయనపై చర్య తీసుకుంటామని కూడా సంకేతాలు పంపారు. తాజాగా ప్రణబ్‌తో జగన్ చర్చలు జరిపిన నేపథ్యంలో అధిష్ఠానం వైఖరి మారుతుందేమో అని ఆయన సన్నిహిత వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. అయితే... ఈ ఆశ అడియాసే అని ప్రణబ్ ముఖర్జీ తాజా స్పందనతో స్పష్టమైంది.

అధిష్ఠానానికి సవాల్
ఓదార్పు పట్ల అధిష్ఠానం వైఖరి స్పష్టం కావడంతో... ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలలో ప్రస్తుతానికి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మరో ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డి మాత్రమే యాత్రలో పాల్గొనేందుకు సన్నద్ధమయ్యారు. జగన్ తన యాత్రపై అధిష్ఠానం వైఖరి గురించి కొన్ని విషయాలు దాచారని స్పష్టం కావడంతో... రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆలోచనా ధోరణి కూడా మారింది.

జగన్ హైదరాబాద్‌లో బస చేసినప్పుడు ఆయనను కలిసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉత్సుకత చూపే వారు. కానీ, శనివారం జగన్‌ను మంత్రి బాలినేనితోపాటు ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, కమలమ్మ, శ్రీకాంత్‌రెడ్డి, అమర్నాథ రెడ్డి మాత్రమే కలవడం గమనార్హం. యాత్రపై బాలినేని, జగన్‌లు గంటకు పైగా చర్చించుకున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎంపీలు వెంట వచ్చే అవకాశాల్లేకపోవడంతో ద్వితీయ స్థాయి నేతలను భాగస్వాములను చేయాలనే నిర్ణయానికి వచ్చారు.

ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చినా రాకున్నా యాత్రను విజయవంతం చేయాలని జగన్ వర్గీయులు తీర్మానించారు. ఇదే సమయంలో కిందిస్థాయి కార్యకర్తల ద్వారా ఎమ్మెల్యేలపై ఒత్తిడి చేయించే వ్యూహాన్ని మరింత చురుగ్గా అమలు చేయాలని జగన్ వర్గం నిర్ణయించినట్లు తెలిసింది. యాత్రలో పాల్గొనాల్సిందేనని డిమాండ్ చేయడం, దూరంగా ఉండే ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలు దహనం చేయడం, ఆ నాయకులను ఘెరావ్ చేయడం వంటి చర్యలకు దిగాలని భావిస్తున్నారు.

యాత్రలో పాల్గొనరాదని భావిస్తున్న ఎమ్మెల్యేలకు 'మేం నియోజకవర్గ ప్రజలం' అంటూ ఇప్పటికే భారీగా ఫోన్లు వస్తున్నాయి. ఏదిఏమైనా ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్రను విజయవంతం చేసి అధిష్ఠానానికి ఒక సవాల్ విసరాలనే కృత నిశ్చయం జగన్ వర్గంలో కనిపిస్తోంది. పార్టీకే తమ అవసరం ఉందనే సంకేతాలు పంపేందుకు జగన్ వర్గం కార్యాచరణను రూపొందిస్తోంది.

సబ్బం హరి ఆశాభావం అనకాపల్లి ఎంపీ సబ్బం హరి ఇప్పటికీ ఓదార్పు యాత్ర విషయంలో అధిష్ఠానం వైఖరిని మార్చగలమని నమ్మకం వ్యక్తం చేయడంపై పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. "తన యాత్రలో రాజకీయాలు లేవని, అందులో రాజకీయాలు చూడరాదని జగన్ పదే పదే అందర్నీ అభ్యర్థిస్తున్నారు. జగన్‌పై కక్షతో కొందరు శక్తులు చేస్తున్న కుట్ర వల్లే అధిష్ఠానానికీ, ఆయనకూ మధ్య అగాధం పెరిగిందనే ప్రచారం జరుగుతోంది.

జగన్‌కు కానీ, మాకు కానీ సోనియాను ధిక్కరించే ఆలోచనే లేదు'' అని సబ్బం హరి ఢిల్లీలో విలేకరులతో అన్నారు. ఒక్క ఓదార్పు యాత్ర విషయంలోనే తన కోణాన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నామన్నారు. మొయిలీ విందు ఏర్పా టు చేయడం, జగన్‌ను ప్రణబ్ రెండుసార్లు కలుసుకోవడం మంచి పరిణామాలలో భాగమని సబ్బం హరి తెలిపారు.

"అధిష్ఠానం మాతో కూడా మాట్లాడుతుంటుంది. అయితే... మేము మైకులకు ఎక్కి ఆ విషయాలను బయటికి చెప్పం'' అంటూ పరోక్షంగా దగ్గుబాటి దంపతులను విమర్శించారు. ఓదార్పు యాత్రకు వెళ్లవద్దని అధిష్ఠానం ఎవరికైనా చెప్పడంలో ఆశ్చర్యం లేదని, నిజానికి జగనే ఎవరూ తమ పనులు మానుకుని యాత్రకు రావద్దని విజ్ఞప్తి చేశారని సబ్బం హరి గుర్తు చేశారు. ఏ అంశాన్నైనా సానుకూల మనసుతో అర్థం చేసుకుంటే సానుకూలంగానే అర్థమవుతుందని అ న్నారు.

ఓదార్పు యాత్ర రాష్ట్రమంతటా జరుగుతుందని... దానిని అధిష్ఠానానికి వ్యతిరేకంగా భావించనవసరం లేదన్నారు. "కాంగ్రెస్‌కు, సీఎంకు వ్యతిరేకంగా జగన్ ఒక్క మాటైనా మాట్లాడారా? మాట్లాడితే బయటపెట్టండి'' అని సవాల్ విసిరారు. మొయిలీ, అహ్మద్ పటేల్, ప్రణబ్ తమతో కూడా మాట్లాడుతున్నారని అన్నారు. ఓదార్పు యాత్ర వద్దని అధిష్ఠానం చెబుతున్నట్లు వస్తున్న ఊహాగానాలకు తాము జవాబిచ్చే ప్రసక్తే లేదన్నారు. జగన్ యాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీయే బలపడుతుందని సబ్బం హరి తెలిపారు.
వేడెక్కుతున్న రాజకీయం
'ఓదార్పు' యాత్ర సమీపించే కొద్దీ రాష్ట్ర రాజకీయం వేడెక్కుతోంది. అవకాశం దొరకడమే ఆలస్యమన్నట్లుగా 'వైరి వర్గాలు' కత్తులు దూసుకుంటున్నాయి. యాత్రలో పాల్గొనాల్సిందిగా ఒత్తిడి రాజకీయం కొనసాగుతోంది. ఇది మున్ముందు మరింత ఉధృతం కానుంది. శనివారం అనంతపురం జిల్లాలో మంత్రి రఘువీరారెడ్డిని కార్యకర్తలు నిలదీశారు.

ఓదార్పుపై వైఖరేమిటో చెప్పాలంటూ ఆయనను ప్రశ్నించారు. అటు... ప్రకాశం జిల్లాలో దగ్గుబాటి దంపతులు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి దిష్టిబొమ్మల దహనం రెండోరోజూ కొనసాగింది. ఓదార్పును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే తగిన బుద్ధి చెబుతామంటూ కార్యకర్తలు హెచ్చరించారు. టీటీడీలో అక్రమాలకు పాల్పడినట్లుగా తనపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ తిరుపతిలో భూమన కరుణాకరరెడ్డి చేపట్టిన దీక్ష రాజకీయ రంగు పులుముకుంటోంది.

జగన్ వర్గీయులు ఒక్కొక్కరుగా వచ్చి దీక్షకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. శనివారం అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి, ఎమ్మెల్యేలు అమర్‌నాథ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి నిరశన శిబిరాన్ని సందర్శించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి వైఎస్ కుటుంబానికి తన పూర్తి విధేయత ప్రకటించారు.

Saturday, August 21, 2010

తెగతెంపులే !

pranab 
కాంగ్రెస్‌తో తెగ తెంపులు చేసుకునేందుకు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సిద్ధమయ్యారు. ఏ నెపం పెట్టి పార్టీ నుంచి బయటకు రావాలో మార్గాలు అన్వేషిస్తున్నారు. ఓదార్పు యాత్ర వద్దన్నందుకే పార్టీ నుంచి బయటకు వస్తే అలిగి వెళ్ళిపోయారన్న మాట వస్తుందని, అంతకు మించిన బలమైన కార ణాన్ని చూపిస్తూ, ఇటు ముఖ్యమంత్రి రోశ య్యను, అటు అధిష్ఠానాన్ని టార్గెట్‌ చేసి పదు నైన, పరుషమైన పదజాలంతో మాట్లాడిన తర్వాత ఇక మూటా ముల్లె సర్దుకోవాలని జగన్‌ ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అటుఅధిష్ఠానం సైతం పోతే పోనీ అనే రీతిలో వ్యవహరి స్తున్నది.
పార్టీలో సోనియా తర్వాత అంతటి స్థానంలో ఉన్న కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్‌ ముఖర్జీ శనివారం కోల్‌కతాలో మాట్లా డుతూ జగన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటం, పార్టీనుంచి పోతే పోనీ అని స్పష్టంగా ప్రకటిం చటంతో జగన్‌ తెగతెంపుల దిశగానే ఆలోచిస్తు న్నారనటానికి సూచన. తన ఓదార్పు యాత్ర పార్టీకి వ్యతిరేకం కాదని, తిరుగుబాటుఅంతకన్న కాదని, ఇందులో రాజకీయాలేవీ లేవని ఎంత చెబుతున్నా అధిష్ఠానం ఆ మాటే పట్టించుకోకుండా యాత్రపై ఆంక్షలు విధిం చటం, ఎమ్మెల్యేలు, ఎంపీలకు హుకుం జారీ చేయటం వంటి చర్యలు తీసుకుంటుండటంతో ఇక తాను ఇమిడే అవకాశం కనిపించటం లేదని, పొమ్మనక ముందే దుమ్మెత్తిపోసి వెళ్ళిపోతే తర్వాత సంగతి చూసుకోవచ్చునని జగన్‌ తన ఆంతరంగికులతో తరచుగా చెబుతున్నట్టు సమాచారం.

వచ్చేనెల రెండున దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రథమ వర్ధంతిని తన తెగతెంపుల వ్యూహానికి ముహూర్తంగా జగన్‌ నిర్ణయించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మాట నిజమే అన్నట్టుగా జగన్‌ విధేయులు అంబటి రాంబాబు లాంటి వారు ఓదార్పుయాత్రకే జగన్‌ కట్టుబడి ఉన్నారని బల్లగుద్ది మరీ చెబుతు న్నారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తన ఉద్యోగం ఊడినా ఫరవాలేదన్న రీతిలో మాట్లాడుతూ ఓదార్పు యాత్రకు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు.

బాలినేనితో జోరుగా మంతనాలు...
తన పట్ల అధిష్ఠానం వైఖరి మారే అవకాశం లేదని, ప్రణబ్‌ ముఖర్జీ, వీరప్ప మొయిలీ లాంటివారిని కలసి దగ్గుబాటి దంపతులపైన ఫిర్యాదు చేసినప్పటికీ హై కమాండ్‌ తనవైపే వేలెత్తి చూపిస్తున్నదన్న నిర్ణయానికి వచ్చిన జగన్‌, తెగతెంపులు చేసుకుని తన ప్రయత్నాలు తాను చేసుకోవాలన్న ఆలోచనతో కనిపిస్తు న్నారు. అందుకోసం తనవారనుకున్న వారితో ఎడతెరిపి లేని మంతనాలు సాగిస్తున్నారు. శుక్రవారం ఢిల్లీలో ప్రణబ్‌ ముఖర్జీని రెండు సార్లు, మొయిలీని చివరి ఆశగా మరోసారి కలసిన తర్వాత జగన్‌ రాత్రికి హైదరాబాద్‌ చేరుకున్నారు. శనివారం మంత్రి, వైఎస్‌ బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి, మరి కొందరు నేతలు జగన్‌తో కలసి ఓదార్పు యాత్రపై మంతనాలు జరిపారు. అధిష్ఠానం అనుసరిస్తున్న వైఖరిపై సైతం ఈ చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది.

jagan-sirజగన్‌తో మంతనాలు జరిపిన తర్వాత బాలినేని మీడియాతో మాట్లాడుతూ ఓదార్పు యాత్ర జరిగి తీరుతుందని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పటాన్ని బట్టి చూస్తే జగన్‌ ఎంత గట్టి నిర్ణయానికి వచ్చారో అర్థం అవుతుంది. బాలినేనితో పాటు మరి కొందరు నేతలు సైతం జగన్‌ను కలుసుకుని చర్చించారు. జగన్‌ పట్ల అధిష్ఠానానికి ఎలాంటి సానుకూలతా లేదని ఇటీవలే మరోసారి రుజువైంది. లోక్‌సభలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ వెళ్తుండగా జగన్‌ తన స్థానం నుంచి లేచి అభివాదం చేసినా పట్టించుకోకుండా వెళ్ళిపోవటం ఇందుకు సంకేతం. సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్‌ పటేల్‌ ఓదార్పు యాత్ర విషయంలో మేడం తరఫున గట్టి ఆదేశాలు జారీ చేశారు. వీటన్నిటి నేపథ్యంలో పార్టీలో తాను ఇక ఇమిడే వాతావరణం లేదన్న నిర్ణయానికి జగన్‌ వచ్చినట్టు స్పష్టమవుతున్నది.

ప్రణబ్‌ ధమ్‌కీ...
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో జగన్‌ ఏ స్థాయికీ సరిపోరన్న నిర్ణయానికి అధిష్ఠానం వచ్చేసింది. యాత్రకు వెళ్ళరాదని ఆదేశాలు జారీ చేయటం తోనే ఆయనను సమర్థించిన వారు చల్లగా వెనక్కి తగ్గటమే అందుకు ఉదాహరణ అని హైకమాండ్‌ భావిస్తున్నది. జగన్‌ పట్ల అధిష్ఠానం పెద్దగా ఆలోచించటం లేదనటానికి ప్రణబ్‌ ముఖర్జీ శనివారం కోల్‌కతాలో చేసిన వ్యాఖ్యలే తాజా ఉదాహరణ. ఆయన ఏమన్నారంటే ‘ఓదార్పు యాత్రకు వెళ్ళవద్దని ఆయనకు స్పష్టంగా చెప్పాం...జగన్‌ పార్టీలో ఉంటే ఎంత? పోతే ఎంత?...ఒక వ్యక్తి గురించి ఇంతగా చెప్పాల్సినఅవసరం అధిష్ఠానా నికి లేదు...ఆయనను బుజ్జగించే ప్రసక్తే లేదు...’ అంటూ అధిష్ఠానం మదిలో ఏమున్న దో తేటతెల్లం చేశారు. ప్రణబ్‌ కానీ, అధిష్ఠానం నేతలు అహ్మద్‌ పటేల్‌ లాంటివారు కానీ ఇలా చెప్పటం ఇదే మొదటిసారి కాదు...గతంలోనూ ఓదార్పు యాత్ర విషయంలో తనను కలిసేందుకు వచ్చినప్పుడు సైతం ప్రణబ్‌ ఘాటుగానే మాట్లాడారు. బెంగళూరులో పత్రి కల వారితో కొద్దిరోజుల క్రితం మాట్లాడుతూ జగన్‌ ఇలాగే వ్యవహరిస్తే చర్యలు తీసుకునే అవ కాశాలు లేకపోలేదని కూడా సంకేతం ఇచ్చారు.

మాటల దాడికి మరింత పదను...
ప్రణబ్‌ వ్యాఖ్యలు అలా ఉంటే, అధిష్ఠానానికి, సోనియాగాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా పేరు పొందిన రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు సైతం మాటల దాడిని మరింత పెంచారు. ముఖ్యమంత్రి రోశయ్య సర్కారును కూల్చేందుకు గాలి జనార్దనరెడ్డిని, ఆయన సోదరులను రంగంలోకి దించి, వారితో కుమ్మక్కయి కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని వీహెచ్‌ శనివారం బాహాటంగా వ్యాఖ్యానించారు. జగన్‌ పేరును ప్రస్తావించకపోయినా ఆయన ఎవరిని ఉద్దేశించి విమర్శించిందీ అందరికీ సులభం గానే తెలిసిపోయింది.

దింపుడు కళ్ళం ఆశ...
ఒకవైపు అధిష్ఠానం ఇంత స్పష్టంగా సంకేతాలు ఇస్తుంటే, ఇక వారితో మాటలేమిటి? తెగతెంపులు చేసుకుందామని జగన్‌, ఆయన ఆంతరంగికులు భావిస్తుంటే...మరి కొందరు మాత్రం దింపుడు కళ్ళం ఆశలు వదులుకోవటం లేదు. అనకాపల్లి ఎంపీ సబ్బం హరి లాంటి వారు ఏదో ఒక మూల తమకు ఇంకా ఆశ మిగిలి ఉందన్నట్టు మాట్లాడుతున్నారు. జగన్‌ తలపెట్టిన యాత్రకు రాజకీయ రంగు పులమాల్సిన అవసరం లేదని సబ్బం మళ్ళీ మళ్ళీ చెబుతున్నారు.

కాంగ్రెస్‌ పార్టీపై కానీ, ముఖ్యమంత్రి రోశయ్యపై కానీ జగన్‌ ఒక్కసారైనా వ్యతిరేక వ్యాఖ్యలు చేశారా అని సవాల్‌ విసిరారు. జగన్‌పై రాజకీయ, వ్యక్తిగత కక్షలతో కొన్ని శక్తులు చేస్తున్న కుట్ర వల్లనే అధిష్ఠానానికీ, జగన్‌కూ మధ్య అగాథం పెరిగిందని వెనకేసుకు వచ్చే ప్రయత్నం చేశారు. ఓదార్పు యాత్ర వల్ల పార్టీకి మరింత బలం చేకూరుతుందని సబ్బం హరి పదే పదే చెప్పారు. మరోవైపు నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి సోదరుడు, ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సైతం ఓదార్పుయాత్రను, జగన్‌ను సమర్థిస్తూ మాట్లాడారు.

డెడ్‌లైన్‌ సెప్టెంబర్‌ రెండు?...
తాను ఏమి చెప్పినా అధిష్ఠానం వినే ప్రసక్తి లేదని తేల్చుకున్న జగన్‌, ఇక తెగతెంపులు చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. తన తండ్రి ప్రథమ వర్ధంతి రోజున కానీ, ఆ తర్వాత ఏ క్షణంలో అయినా తెగతెంపుల ప్రకటన బహిర్గతమవుతుందని, ఆలోగా తన వెంట ఎవరెవరు వస్తారో చూసుకుని, రాని వారి నియోజకవర్గాలలో వారి ప్రత్యర్థులు, రెండవ శ్రేణి నేతలందరినీ తన వైపు తిప్పుకునే కార్యక్రమం పూర్తి అయిన తర్వాత కడపలో లేదా మరో ప్రాంతంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి తెగతెంపులు చేసుకుంటున్నట్టు ప్రకటిస్తారని విశ్వసనీయ సమాచారం. అటు అధిష్ఠానం మాత్రం ఈ అంశాలను పెద్దగా పట్టించుకోవటం లేదు.

ఒక వ్యక్తికి ఇంత ప్రాధాన్యం ఇస్తే ఇక పార్టీ మనుగడ కష్టతరమవుతుందని, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచటమే మేలన్న ఆలోచనతో హై కమాండ్‌ ఉంది. జగన్‌ తెగతెంపులు చేసు కున్నా ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో రోశయ్య సర్కార్‌కు ముంచుకు వచ్చే ప్రమాదం ఏమీ లేదన్న ధీమా హైకమాండ్‌లో వ్యక్తం అవుతున్నది. ఒకవేళ ఏ కొందరు ఎమ్మెల్యేలో ఆయన వెంట వెళ్ళినా ఆదుకోవటానికి ప్రజా రాజ్యం పార్టీ, మజ్లిస్‌ తదితర పార్టీలు ఉండనే ఉన్నాయి కనుక పెద్ద ఇబ్బందేమీ ఎదురుకాదన్నది హై కమాండ్‌ ఆలోచన. ఒకవేళ జగన్‌ మరీ గణనీయ సంఖ్యలో ఎమ్మెల్యేలను చీల్చి మధ్యంతర ఎన్నికలకు మార్గం వేసే వ్యూహాన్ని అనుసరిస్తే దాన్ని కూడా ఎదుర్కునేందుకు లేదా రాష్టప్రతి పాలన విధించి, ఆరు మాసాల్లోగా మళ్ళీ పుంజుకుని ఎన్నికలకు వెళ్ళేందుకైనా వెనుకాడకూడదన్న ఆలోచనతో హై కమాండ్‌ ఉన్నట్టు చెబుతున్నారు.

జగన్ పార్టీలో ఉంటే ఉండవచ్చు... వెళితే వెళ్లవచ్చు... ఓదార్పుపై నిప్పులు చెరిగిన ప్రణబ్


ఓదార్పు యాత్ర తిరుగుబాటు కాదని, పార్టీకి వ్యతిరేకం కావని, ఇందులో రాజకీయాలు లేవని జగన్ కాంగ్రెస్ అధిష్ఠానానికి స్పష్టంగా చెబుతున్నప్పటికీ అధిష్ఠానం వినే మూడ్‌లో లేదని తేలిపోయింది. గత వారం సీనియర్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీని కలిసిన జగన్ తన కోణాన్ని వివరించే ప్రయత్నం చేశారని ఆయన అస్మదీయులే చెబుతున్నారు. అయితే ప్రణబ్ మాత్రం ఓదార్పు యాత్రను మానుకొమ్మని జగన్‌కు స్పష్టంగా చెప్పారని కూడా తేలిపోయింది. శనివారం కోల్‌కటాలో ప్రణబ్ బెంగాలీ విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఓదార్పు యాత్ర వద్దని ఆయనకు స్పష్టంగా చెప్పామని వెల్లడించడం గమనార్హం. జగన్ పార్టీలో ఉంటే ఎంత? పోతే ఎంత? ఒక వ్యక్తి గురించి ఇంతగా చెప్పాల్సిన అవసరం లేదని, ఆయనను తాము బుజ్జగించే ప్రసక్తే లేదని చెప్పారు.

ప్రణబ్ తన వైఖరిని స్పష్టం చేయడం ఇది మొదటి సారి కూడా కాదు. రెండు నెలల క్రితమే జగన్ ఓదార్పు యాత్ర చేపట్టడం పార్టీని ధిక్కరించినట్లు భావిస్తున్నామని ప్రణబ్ బెంగళూర్‌లో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఆయనపై చర్య తీసుకుంటామని కూడా సంకేతాలు ఇచ్చారు. తాజాగా జగన్ ప్రణబ్‌తో చర్చలు జలిగిననేపథ్యంలో అధిష్టానం వైఖరి ఏమైనా మారుతుందోనేమోనని ఆయన సన్నిహిత వర్గాలు ఆశాభావాన్ని వ్యక్తం చేశాయి. కాని ప్రకాశం ఎమ్మెల్యేలతో అహ్మద్ పటేల్ వ్యాఖ్యలు, సోనియా ఎంపిలకు స్వయంగా ఓదార్పు యాత్రకు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేయడం, ప్రణబ్ కూడా కోల్‌కటాలో జగన్ వైఖరి పట్ల అసహనం వ్యక్తం చేయడంతో అధిష్టానం మనసు మార్చుకునే అవకాశమే లేదని మరింత స్పష్టమైనది.

అయినప్పటికీ అనకాపల్లి ఎంపి సబ్బం హరి ఇప్పటికీ ఓదార్పు యాత్ర విషయంలో అధిష్ఠానం వైఖరిని మార్చగలమన్న నమ్మకాన్ని వ్యక్తం చేయడంపై పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తన యాత్రలో రాజకీయాలు లేవని, అందులో రాజకీయాలు చూడరాదని జగన్ పదే పదే అందర్నీ అభ్యర్థిస్తున్నారని సబ్బం హరి శనివారం విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. జగన్ పై రాజకీయ, వ్యక్తిగత కక్షలతో కొందరు శక్తులు చేస్తున్న కుట్ర వల్లే అధిష్టానానికీ, ఆయనకూ మధ్య అగాధం పెరిగిందన్న ప్రచారం జరుగుతున్నదని సబ్బం హరి అన్నారు. నిజానికి జగన్‌కు కానీ, తమకు కానీ, అధిష్టానాన్ని, సోనియాను ధిక్కరించే ఆలోచనే లేదన్నారు. ఒక్క ఓదార్పు యాత్ర విషయంలోనే తన కోణాన్ని అర్థం చేసుకొమ్మని కోరుతున్నామని ఆయనచెప్పారు.

వీరప్ప మొయిలీ విందు ఏర్పాటు చేయడం, జగన్ ను ప్రణబ్ రెండుసార్లు కలుసుకోవడం మంచి పరిణామంలో భాగమని అన్నారు. అధిష్ఠానం తమతో కూడా మాట్లాడుతుంటుందని, అయితే తాము మైకులకెక్కి ఆ విషయాన్ని చెప్పుకోబోమనని ఆయన పరోక్షంగా దగ్గుబాటి దంపతులను విమర్శించారు. తమకూ బాధ్యతలు, పరిధులు ఉంటాయన్నారు. ఓదార్పు యాత్రకు వెళ్లవద్దని అధిష్టానం ఎవరికైనా చెప్పడంలో ఆశ్చర్యం లేదని, నిజానికి జగనే ఎవరూ తమ పనులు మానుకుని ఓదార్పు యాత్రకు రావద్దని ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారని సబ్బం హరి అన్నారు.

తన యాత్ర వ్యక్తిగతమని, ఎవరైనా తమంతట తాము వస్తే తనకు అభ్యంతరం లేదని చెప్పారని తెలిపారు. ఏ అంశాన్నైనా సానుకూల మనసుతో అర్థం చేసుకుంటే సానుకూలంగానే అర్థమవుతుందని, వ్యతిరేక కోణంతో ఆలోచిస్తే అంతా వ్యతిరేకంగానే కనపడుతుందని అన్నారు. ఓదార్పు యాత్ర రాష్ట్రమంతటా జరుగుతుందని దాన్ని అధిష్ఠానానికి వ్యతిరేకంగా ఎవరూ భావించనవసరంలేదని సబ్బం హరి అన్నారు.

కాంగ్రెస్ పార్టీకి కానీ, ముఖ్యమంత్రికి కానీ వ్యతిరేకంగా గానీ జగన్ ఒక్క మాటైనా మాట్లాడారా, మాట్లాడితే బయటపెట్టండి.. అని ఆయన సవాలు విసిరారు .మొయిలీ, అహ్మద్‌పటేల్, ప్రణబ్ తమతో కూడా మాట్లాడుతున్నారని అన్నారు. ఓదార్పు యాత్ర వద్దని అధిష్టానం చెబుతున్నట్లు వస్తున్న ఊహాగానాలకు తాము జవాబిచ్చే ప్రసక్తే లేదన్నారు. జగన్ యాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీ యే బలపడుతుందని ఆయన అన్నారు.

ఓడలు బళ్ళు...

jagan3
కాలం కలసి రానప్పుడు ఓడలు బళ్ళు అవుతాయన్న సామెత కడప ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పట్ల అక్షరాల నిజమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మహబూబాబాద్‌లో ఓదార్పు యాత్ర అర్ధంతరంగా నిలిపివేసి, చాలాకాలానికి ఉభయ గోదావరి జిల్లాల్లో జగన్‌ ఆ యాత్రను ప్రారంభించినప్పుడు మొదట్లో ఎమ్మెల్యేలు ఎవరూ ఆసక్తి కనబరచకపోయినా వారి సమీప బంధువులు, అన్నదమ్ములు తదితరులు జగన్‌కు అండగా నిలిచారు. ఉదాహరణకు శ్రీకాకుళంలో ఎంపీ కిల్లి కృపా రాణి బంధువులు, మంత్రి ధర్మాన ప్రసాదరావు కుమారుడు లాంటివారు ఓదార్పుయాత్రలో బాహాటంగానే పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు వచ్చేసరికి మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ లాంటివారు అడుగడుగునా వెంట ఉన్నారు. యాత్ర ముగింపు సందర్భంగా కాకినాడలో జరిగిన బిహ రంగ సభకు దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు, ఇద్దరు మంత్రులూ హాజరయ్యారు.

మారిన సీన్‌...
ఇప్పుడు వాతావరణం, పరిస్థితీ మారిపోయాయి. ఓదార్పు యాత్రకు అనుమతి లేదని, ఎవరూ వెళ్ళకూడదని ఎప్పుడైతే అధిష్ఠానం కరాఖండిగా చెప్పేసిందో ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు కిక్కురుమనకుండా మౌనం వహించారు. కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి లాంటి వారు తాము యాత్రకు వెళ్ళటం లేదని బహిరంగంగానే చెప్పేశారు. జగన్‌ బంధువు, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డి మినహా ఓదార్పు యాత్రలో పాల్గొం టామని ఇప్పటిదాకా ఎవరూ బాహాటంగా ప్రకటించలేదు.

నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇప్పటికైతే యాత్రలో పాల్గొంటానని చెప్పినా, తనకు అధిష్ఠానం నుంచి స్పష్టమైన ఆదేశాలంటూ ఏవీ రాలేదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మరోవైపు కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసిం హారెడ్డి శుక్రవారం నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయం అడిగినప్పుడు యాత్రకు వెళ్ళా ల్సిందే అని అందరూ చెప్పినట్టు వార్తలు వచ్చాయి. దాన్ని మొదట్లో ఉగ్రనరసింహారెడ్డి అంగీకరించినా, ఆ తర్వాత మాట మార్చి ఈ నెల 24 తర్వాత కానీ ఏ విషయం చెప్ప బోనని స్పష్టం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజ శేఖరరెడ్డికి సన్నిహితులుగా పేరున్న సీనియర్‌ మంత్రులు గాదె వెంకటరెడ్డి, శిల్పా మోహన్‌రెడ్డి లాంటి వారు అధిష్ఠానం సూచన మేరకే నడుచుకుంటే బాగుంటుందని హిత వాక్యా లు పలుకుతున్నారు.

దగ్గుబాటి దంపతుల లాబీయింగ్‌?...
మరోవైపు ఢిల్లీలో కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి, ఆమె భర్త, ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఓదార్పు యాత్రకు, ప్రత్యేకించి వైఎస్‌జగన్‌కు వ్యతిరేకంగా భారీ ఎత్తున లాబీయింగ్‌ జరుపుతున్నట్టు వార్త లు తెలుపుతున్నా యి. జగన్‌కుతాము అందించిన నోట్‌ను పత్రికలు లీక్‌ చేద్దా మని దగ్గుబాటి చెప్పినప్పుడు తాను తీవ్రంగా వ్యతిరేకించా నని ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే, వైఎస్‌ సన్నిహితుడు మహీధర రెడ్డి బహిరంగంగానే చెప్పేశారు. తనకు అడ్డం తగులుతున్న దగ్గుబాటి దంపతులపై జగన్‌ కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీకి ఒకటికి రెండుసార్లు ఫిర్యాదు చేయటం విశేషం. తనకు వ్యతిరేకంగా ఈ స్థాయి ప్రయత్నాలు జరగటాన్ని జగన్‌ జీర్ణించుకోలేకపోతున్నారనటానికి ఈ ఫిర్యాదు అద్దం పడుతుంది.

ఈ నేపథ్యంలో జగన్‌ పరిస్థితి ఒక అడుగు ముందుకు, ఆరడుగులు వెనక్కు చందంగా తయారైంది. ఏకంగా అధిష్ఠానమే తనకు రెడ్‌ సిగ్నల్‌ ఇచ్చినప్పుడు ఏమి చేయాలో తెలియక కొట్టుమిట్టాడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఒకరిద్దరు మద్దతుదారులు గట్టిగా తనను సమర్థించినా, పార్టీలో మెజారిటీ నేతలు అధిష్ఠానం మాటే తమ మాట అంటుండటం, అందులోనూ నిన్న మొన్నటిదాకా తానే ముఖ్యమంత్రి కావాలని సంతకాలు పెట్టిన వారు సైతం ఇప్పు డు తనకే హితోక్తులు నూరి పోసే ప్రయత్నాలు చేస్తుండటం జగన్‌కు ఏమాత్రం మింగుడు పడటం లేదు

రాజకీయ రణరంగం హోరా... హోరీ

 jagan roshiah
రాష్ట్ర కాంగ్రెస్‌లో రెండు శిబిరాల మధ్య దాడి... ఎదురు దాడి జరుగుతోంది. ప్రత్యేకించి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి కుమారుడు, కడప ఎంపి జగన్మోహన్‌రెడ్డి నిర్వహి స్తున్న ఓదార్పు యాత్ర ఈ రెండు శిబిరాల మధ్య యుద్ధ వాతావర ణానికి నాంది పలుకుతోంది. పార్టీ నేతలు జగన్‌ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలిపోరుు పోరు తీవ్రతరం చేశారు. పార్టీ అధిష్ఠానాన్నే లెక్క చేయని రీతిలో జగన్‌ వర్గం వ్యవహరిస్తుండగా, హైకమాండ్గ ఆదేశాలే మాకు శిరోధార్యమంటూ జగనే టార్గెట్‌గా వ్యతిరేక వర్గం ఎదురు దాడికి దిగు తున్నది. ఓదార్పు యాత్రే కాంగ్రెస్‌లో కల్లోలానికి దారి తీస్తున్నది. పార్టీ శ్రేణుల్లో అంతా అయోమయ పరిస్థితి నెలకొంది.

jaganఓదార్పు యాత్రపై కాంగ్రెస్‌ పార్టీలో ఇరు వర్గాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నది పరస్పర విమర్శలతో రాష్ట్ర రాజ కీయం వేడెక్కింది. ఇంత వరకూ యాత్రపైనే దృష్టి పెట్టిన జగన్‌ ఇప్పుడు తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న నేతలపై దూకుడుగా వ్యవహరించడం ప్రారంభించారు. పార్టీలో తనను ఏకాకిని చేసేందుకు కొందరు నేతలు చేస్తున్న ప్రయత్నాలపై జగన్‌ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఇప్పటికే రెండు విడతల్లో నాలుగు జిల్లాల్లో ఓదార్పు యాత్ర పూర్తయిన తరుణంలో హైకమాండ్‌ ద్వారా ఎటూ అడుగు వేయలేని పరిస్థితి కల్పిస్తున్న నేతల పట్ల జగన్‌ భగ్గుమంటున్నారు. అధిష్ఠానాన్ని రంగంలో దించి తన యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే నేపంతో దగ్గుబాటి దంపతులపై జగన్‌, ఆయన వర్గం కారాలు, మిరియాలు నూరుతున్నది. వచ్చే నెల 3 నుంచి ప్రకాశం జిల్లాలో తన ఓదార్పు యాత్ర ప్రారంభం కానున్న తరుణంలో ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలను, ఎంపీలను ఢిల్లీ పిలిపించుకుని హైకమాండ్‌తో సమావేశాలు ఏర్పాటు చేసిన దగ్గుబాటి దంపతులు, చివరకు సోనియా, అహ్మాద్‌పటేల్‌లను రంగంలోకి దింపి ఓదార్పు అడ్డుకునేందుకు ప్రయత్నిం చారంటూ జగన్‌, అతని వర్గానికి చెందిన నేతలు మండిపడుతు న్నారు.

పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు ఎవరు కూడా ఓదార్పు యాత్రకు వెళ్ళవద్దని సోనియా, అహ్మద్‌ పటేల్‌ చెప్పారంటూ కేంద్ర మంత్రి పురంధేశ్వరి ఢిల్లీలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ తరువాత ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ చెప్పారు. మరో వైపు ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వర్‌రావు కూడా జగన్‌ ఓదార్పు యాత్ర విషయంలో కామెంట్లు చేశారు. గత రెండు రోజులుగా ఢిల్లీలో దగ్గుబాటి దంపతులు ఓదార్పు యాత్ర ఎపిసోడ్‌లో వ్యవహరించిన పాత్ర యువనేత జగన్‌కు అగ్రహాన్నే తెచ్చిపెట్టింది. ఆయన అనుచరగణం కూడా దగ్గుబాటి దంపతులపై ఎదురు దాడికి దిగారు.

roshiahజగన్‌ ఒక మరో అడుగు ముందుకు వేసి ఏకంగా దగ్గుబాటి దంపతులపై ఫిర్యాదు చేశారు. తనకు వ్యతిరేకంగా వ్యవహరించే నేతలు, ప్రత్యేకించి ఓదార్పు విషయంలో ఆటంకాలకు ప్రయత్నించే వారి పట్ల తగిన రీతిలోనే స్పందిస్తామంటూ జగన్‌ ఈ ఫిర్యాదు ద్వారా సంకేతాలు అందించారు. ప్రకా శం జిల్లా ఎమ్మెల్యేలను ఢిల్లీకి తీసుకొచ్చి తనకు నీతులు చెప్పించే ప్రయత్నాలు చేయడం, అధిష్ఠానంతో ఓదార్పు యాత్రను అడ్డుకునేందుకు వ్యూహాలు రచించారంటూ దగ్గుబాటి దంపతులపై జగన్‌ నిప్పులు చెరుగుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహరాల ఇన్‌చార్జీ డాక్టర్‌ వీరప్ప మొయిలీ హస్తినాలో రాష్ట్ర ఎంపీలకు ఇచ్చిన విందులో కూడా జగన్‌ పట్టుపని పదినిమిషాలు కూడా ఉండకుండా వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఆయన ఆనకాపల్లి ఎంపి సబ్బం హరిని వెంటబెట్టుకుని కాంగ్రెస్‌లో కీలక నేత, సీడబ్ల్యూసీ సభ్యుడు, కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ ఇంటికి వెళ్ళి కొంత సేపు ఆయనతో సమావేశ మయ్యారు. ఈ భేటి సారాంశమేమిటో అధికారికంగా వెల్లడించనప్పటికీ దగ్గుబాటి దంపతులు, ఓదార్పు యాత్ర విషయంలోనే జగన్‌, ప్రణబ్‌తో చర్చించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. హైదరాబాద్‌కు వచ్చే ముందు శుక్రవారం ఉదయం జగన్‌ మరో సారి ప్రణబ్‌తో భేటి అయ్యారు. ఆ తరువాత ఆయన సాయంత్రం వీరప్ప మొయిలీతో సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఇద్దరు నేతల వద్ద కూడా దగ్గుబాటి దంపతుల వ్యవహార శైలీపై ఫిర్యాదు చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. సోనియాగాంధీ తనకు చెప్పారంటూ పురంధేశ్వరి ప్రకటన చేసిన కొంత సేపటికే జగన్‌, ప్రణబ్‌ను కలువడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నది.

ఇలా ఉండగా జగన్‌ వర్గం నేతలు కూడా దగ్గుబాటి దంపతుల నిప్పులు చెరుగుతున్నారు. ఓదార్పు యాత్ర విషయంలో పార్టీ అధిష్టానం ఏదైనా చెప్పా ల్సి ఉంటే నేరుగా జగన్‌నే పిలిపించి చెప్పవచ్చు, అలా కాకుండా తమతో సోనియా, పటేల్‌ చెప్పారంటూ దగ్గుబాటి దంపతులు జగన్‌ ఓదార్పు యాత్ర ను అడ్డుకునే రాజకీయాలు చేస్తున్నారంటూ పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. అదే విధంగా జగన్‌ వర్గ నాయకు లుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్‌రావు, పార్టీ నేత గట్టురామచంద్ర రావు తది తరులు కూడా దగ్గుబాటి దంపతులపై చిందులు తొక్కారు.

ఎన్టీఆర్‌ను గద్దె దించడంలో కీలక పాత్ర వహించారంటూ దగ్గుబాటి వెంకటేశ్వర్‌రావు మండి పడ్డారు. మరో వైపు తిరుపతిలో ఉన్న జగన్‌ బాబాయ్‌ వైఎస్‌ వివేకానందరెడ్డి కూడా ఓదార్పు విషయంలో పురంధేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వర్‌రావు అతిగా స్పందించారంటూ ఢిల్లీలో వారు వ్యవహరించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో దగ్గుబాటి దంపతులు కీలక పాత్ర పోషించిన దాఖలాలు లేవని, పదవులు కాపాడుకోవడానికే కొందరు జగన్‌ను టార్గెట్‌ చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఇక మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మరో అడుగు ముందుకు వేసి మంత్రి పదవులు తనకు శాశ్వతం కాదని, అధిష్ఠానం వద్దన్నా తాను ఓదార్పు యాత్రకు వెళ్ళి తీరుతానని మరో సారి పునరుద్ఘాటించి జగన్‌కు విధేయతను ప్రకటించుకున్నారు.

ఎదురుదాడి....
ఇదిలా ఉండగా జగన్‌ వ్యతిరేక వర్గం అతనిపై ఎదురు దాడి ప్రారంభిం చింది. అధిష్ఠానం ఆదేశాలను సైతం లెక్క చేయకుండా, పార్టీని శాసించే స్థా యిలో జగన్‌ వ్యవహరిస్తున్న తీరుపై ఆ వర్గం కన్నెర్ర చేస్తున్నది. రోజు వారిగా జగన్‌పై విమర్శలు సంధిస్తున్న నేతలతో పాటు శుక్రవారం ముఖ్యమంత్రి రోశయ్య, పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హన్మంత రావు తదితరులు జగన్‌ పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా అతనిపై బాణాలు ఎక్కుపెట్టారు. ఈ ముగ్గురు నేతలు కూడా రాజీవ్‌ జయంతి వేడుకల కార్యక్రమాన్ని వేదికగా చేసుకుని జగన్‌పై తమదైన శైలీలో మండిపడ్డారు. నిజమైన నాయకులు ఎవరూ కూడా పదవుల కోసం పాకులాడరంటూ ముఖ్య మంత్రి రోశయ్య చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా జగన్‌ను ఉద్దేశించి మాట్లాడిన వేనని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

అదే విధంగా పీసీసీ చీఫ్‌ డిఎస్‌ కూడా యుననేత జగన్‌పై గురిపెట్టి కొందరు నేతలు పార్టీలో కాలుమోపగానే పదవు ల కోసం పోటీ పడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని, రాహుల్‌ గాంధీని ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని హితవు పలికారు. మరో సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు విహెచ్‌, జగన్‌ పేరు ప్రస్తావించకుండానే నాడు రాజీవ్‌ గాంధీ ఆశీస్సుల వల్లే వైఎస్‌కు పీసీసీ అధ్యక్ష పదవి దక్కిందని, రాజీవ్‌ లేక పోతే వైఎస్‌కు ఆ పదవి వచ్చేదా? అని ప్రశ్నించారు. అంబేద్కర్‌ కాదు, గాంధీ కాదు, అంతా మా నాన్నేనని కొందరంటున్నారు, అది సరికాదు, పార్టీకి సేవచేయకుండా పదవులు ఎలా వస్తాయి? హైకమాండ్‌ను నమ్ముకుంటేనే పదవులు వస్తాయన్న విషయాన్ని అందరు గ్రహించాలని ఆయన జగన్‌కు చురకలంటించారు. మరో సీనియర్‌ నేత, మాజీ మంత్రి శంకర్‌రావు కూడా ఓదార్పు యాత్ర వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, జగన్‌ చుట్టు ఉన్న నేతలందరు నీళ్ళ తరహాలాంటి వారేనంటూ జగన్‌ వర్గంపై ధ్వజమెత్తారు.

Friday, August 20, 2010

నేను చెప్పిందేమిటి ? జగన్‌ చేస్తున్నదేమిటి ? * వివేకా ఇన్‌...

sonia2
‘జగన్‌, ఆయన కుటుంబసభ్యులు నా వద్దకు వచ్చిన ప్పుడు నేను వాళ్లకు చెప్పిందేమిటి? ఇప్పుడు జగన్‌ అక్కడ చేస్తున్నదేమిటి? జగన్‌ ఒక సాధారణ ఎంపీ. మిగిలిన ఎంపీల్లో ఆయనొకడు. పార్టీ కోసం కృషి చేసిన వైఎస్‌ కుటుంబంపై మాకున్న సానుభూతి మీకు తెలుసు. అందు కే జగన్‌కు గౌరవం ఇస్తున్నా దాన్ని ఆ యంగ్‌బాయ్‌ కాపాడుకోలేపోతున్నాడు. పార్టీని కాదంటే పరిస్థితి ఏమవుతుంది’ అని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తనను కలసిన కేంద్రమంత్రి పురంధేశ్వరితో సోనియా ఓదార్పు యాత్రకు అధిష్ఠానం అనుమతి లేదని స్పష్టం చేశారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం... జగన్‌ ఓదార్పు యాత్రకు ఎంపి, ఎమ్మెల్యే, మంత్రులను వెళ్లవద్దని చెప్పాలని తానే అహ్మద్‌పటేల్‌కు స్పష్టమైన ఆదేశాలిచ్చానని సోనియా వెల్లడించారు. మీరు కూడా ఈ విషయాన్ని మీ ఎమ్మెల్యేలకు స్పష్టం చేయండన్నారు. జగన్‌ వ్యవహారశైలి పార్టీ విధానాలకు పూర్తి విరుద్ధంగా ఉందని, సొంత అజెండాలు పార్టీలో కుదరవని స్పష్టం చేశారు. ఓదార్పు యాత్రను పార్టీపరంగా నిర్వహించాలని, జిల్లాల్లో వైఎస్‌ విగ్రహాలు పెట్టాలని, బాధితులందరినీ ఒకచోట చేర్చి పార్టీ పరంగా సాయం చేయాలని తానిచ్చిన ఆదేశాలకు విరు ద్ధంగా జగన్‌ వ్యవహరిస్తున్నారనఇసంతృప్తి వ్యక్తం చేశారు.

జగన్‌ తన యాత్రలో కాంగ్రెస్‌ పార్టీ గురించి గానీ, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమా ల గురించి ఎక్కడా ప్రస్తావించని వైనాన్ని తాను కూడా పరిశీలించానన్నారు. పార్టీ కంటే వ్యక్తి గొప్ప కాదని, నాయకత్వం సూచనలు కాదని వెళుతున్న జగన్‌ యాత్రలో పాల్గొంటే పార్టీ నాయకులకు కష్టాలు తప్పవని హెచ్చరిం చారు. ఇదే విషయాన్ని తాను అహ్మద్‌పటేల్‌, వీరప్ప మొయిలీకి స్పష్టంగా చెప్పానని, ముఖ్యమంత్రి రోశయ్యకూ ఇదే సందేశం పంపించామన్నారు. జగన్‌ యాత్రలో ద్వితీయశ్రేణి నేతలు పాల్గొంటున్నందున.. తాము వెళ్లవలసిన అనివార్య పరిస్థితి ఏర్ప డిందన్న ఎమ్మెల్యేల ఆవేదనను అర్థం చేసుకున్నానని, ఆ మేరకు ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ఆదేశాలు జారీ చేశామ న్నారు. జగన్‌ వెంట వెళ్లిన వారికి భవిష్యత్తులో ఎలాంటి గుర్తింపు ఇవ్వరన్న సంకేతాలు వెళ్లినందున, ఎమ్మెల్యేలు, ఎంపీలు భయపడనవసరం లేదన్నారు. జగన్‌ పార్టీ విధానాలను గౌరవించినంతకాలమే నాయ కత్వం కూడా అతనినీ గుర్తిస్తుందని, సొంత అజెండాతో పార్టీని, నాయకులను ఇబ్బందిపెడితే అతడే నష్టపోతాడని స్పష్టం చేశారు.

యాత్రను పార్టీపరంగా చేయాలన్న ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేల సూచనలను పట్టించుకోకపోగా, వారిపై జగన్‌ విరుచుకుపడిన విషయం తన దృష్టికి వచ్చిందని, అహ్మద్‌పటేల్‌ తనకు ఆ సమావేశ వివరాలు చెప్పారన్నారు. ‘ఎప్పుడేం చేయాలో పార్టీకి తెలుసు. కొంద రి సమస్యలను కాలమే పరిష్కరిస్తుందని’ నర్మగర్భంగా వ్యాఖ్యానించినట్లు తెలిసింది. సాయంత్రం వీరప్ప మొయిలీ ఇచ్చే విందులో సైతం పటేల్‌ వెళతారని, మొయిలీ-పటేల్‌ ఇద్దరూ జగన్‌ యాత్రకు ఎంపీలు వెళ్లవద్దని స్పష్టం చేస్తారని, అప్పుడు ఆ సందేశం కింది స్థాయి వరకూ వెళుతున్నందున ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇబ్బందిపడనవసరం లేదని భ రోసా ఇచ్చారు.

పటేల్‌ చెప్పింది నిజమే: పురంధరీశ్వరి
కాగా, జగన్‌ యాత్రకు అధిష్ఠానం అనుమతి లేదని సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్‌పటేల్‌ ఎంపీలకు చెప్పడం వాస్తవమేనని కేంద్రమంత్రి పురంధేశ్వరి అంగీకరించారు. ఈ విషయాన్ని సోనియాగాంధీ తనకు స్వయంగా చెప్పారని మీడియాకు వెల్లడించారు. పార్టీపరంగానే యాత్ర చేయాలన్నది నాయకత్వం అభిమతమన్నారు. జిల్లాల్లో వైఎస్‌ విగ్రహాల ఏర్పాటు, బాధితులందరినీ కలిపి అక్కడే ఓదార్చమని సోనియా గతంలోనే జగన్‌కు సూచించారని, పార్టీ నాయకత్వం ఇప్పుడూ అదే వైఖరితో ఉందని వివరించారు.
వివేకా ఇన్‌...
YS-Viveka
అవసరం అయితే కుటుంబాన్ని సైతం కాదని పార్టీకి వీర విధేయత ప్రకటిస్తే అందుకు తగిన బహుమానం కూడా ఘనంగానే ఉంటుం దని కాంగ్రెస్‌ అధిష్ఠానం రుజువు చేయ దలచుకున్నట్టు కనిపిస్తున్నది. కడప ఎంపీ, తన అన్నయ్య కుమారుడు వైఎస్‌ జగ న్మోహన్‌రెడ్డి తలపెట్టిన ఓదార్పు యాత్ర నేపథ్యంలో ఎమ్మెల్సీ వైఎస్‌ వివేకానం దరెడ్డి అధినేత్రి సోనియా గాంధీకి రాసిన లేఖ పట్ల అధిష్ఠానం సంతోషంగా ఉన్నట్టు తెలిసింది. రాష్ట్రంలో పార్టీ రాజకీయాలు అట్టుడికి పోతున్న తరుణంలో వివేకా నందరెడ్డి ‘సాహసోపేతంగా’ వ్యవహరించి రాసిన లేఖకు నజరానాగా ఆయనకు ఏదైనా ఘనమైన బహుమతి ఇచ్చేందుకు అధినాయకత్వం నిర్ణయించుకున్నట్టు విశ్వ సనీయ సమాచారం.

పార్టీకన్నా తమకు ఎవరూ ఎక్కువ కాదని, అధినాయకత్వానికే తమ కుటుంబం విధేయతగా ఉంటుం దంటూ వివేకానందరెడ్డి బుధవారం రాసిన లేఖ అధిష్ఠానం చాణక్యంలో భాగమే అయినా, జగన్‌ ఛత్రఛాయ నుంచి వివే కాను విజయవంతంగా బయటకు లాగ టంలో మాత్రం విజయం సాధించినట్ట యింది. గతంలో ఎన్నడూ నేరుగా పార్టీ వివాదాల పరిష్కార ప్రయత్నాలు చేయని సోనియా, ఓదార్పు యాత్రవిషయంలో కఠినంగా వ్యవహరించకపోతే పార్టీకి నష్టదాయకం అనే నిర్ణయానికి వచ్చి యాత్రలో ఎవరూ పాల్గొనవద్దంటూ ఆంక్షలు విధించారు. వాటి నేపథ్యంలో వివేకా రాసిన లేఖ రాజకీయంగా అపరిమిత ప్రాధాన్యం సంతరించుకుంది. వైఎస్‌ మరణించిన తర్వాత తమ కుటుంబానికి జగన్‌ ఒక్కడే పెద్ద దిక్కు అని పైకి చెబుతున్నా, వివేకా రాసిన లేఖ అంతరార్థం చూస్తే తాను ఇక ముందు జగన్‌ అడుగుజాడల్లో నడిచేందుకు సిద్ధంగా లేనన్న భావనను వివేకా తన లేఖ ద్వారా అధినాయకత్వానికి స్పష్టం చేశారు.

ఏమిటా బహుమానం?
తాము ఊహించినట్టే ఓదార్పు యాత్రపై విధించిన ఆంక్షలు ఫలించి ప్రకాశం, నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలలో అధికశాతం మనసు మార్చుకోవటం, అదే సమయంలో వివేకానందరెడ్డి అధినేత్రిని ఉద్దేశించి రాసిన లేఖ లీక్‌ కావటం, ఆ లేఖను తానే రాశానని వివేకా అంగీకరించటం వంటి పరిణామాలు సహజంగానే అధినాయకత్వానికి సంతోషం కలిగించాయి. తన సోదరుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏనాడూ అధిష్ఠానం ఆదేశాలను కాదని పక్కకు పోలేదని, అధిష్ఠానం చలువ వల్లనే ఆయన రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారని, తమ కుటుంబం ఏనాటినుంచో కాంగ్రెస్‌ పట్ల విధేయతతో ఉందంటూ వివేకా తన లేఖలో పేర్కొన్నారు.

అంటే వద్దు వద్దన్నా పట్టించుకోకుండా ధిక్కార స్వరాన్ని వినిపించటంతో పాటు తనను అనునయించేందుకు వచ్చిన ఎమ్మెల్యేలపై సైతం పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేసి, ఎవరు వచ్చినా రాకపోయినా తన యాత్ర ఆగదని స్పష్టం చేసిన జగన్‌కు పార్టీ పట్ల ఏమాత్రం విధేయత లేదన్న అంశాన్ని తన లేఖ ద్వారా అధిష్ఠానానికి స్పష్టం చేశారు. సంచలనం సృష్టించే రీతిలో వివేకా లేఖ రాసినందుకు బహుమతిగా ఆయనకు రానున్న కేబినెట్‌ విస్తరణలో కీలకమైన మంత్రి పదవిని ఇచ్చే అవకాశాలున్నట్టు పార్టీ వర్గాలు బహిరంగంగానే చెప్పుకుంటున్నాయి. ఈ నజరానా ఇవ్వటం ద్వారా జగన్‌ వైపు దింపుడు కళ్ళం ఆశతో మొగ్గు చూపాలనుకుంటున్న పార్టీ ఎమ్మెల్యేలకు చెక్‌ పెట్టే వ్యూహానికి అధిష్ఠానం పదును పెట్టింది. చేసిన మేలును పార్టీ మరవదని, వెన్నంటి ఉండే వారిని కంటికి రెప్పలా చూసుకుంటుందన్న సంకేతాన్ని ఎటువైపు ఉండాలో తేల్చుకోలేక సతమతమవుతున్న ఎమ్మెల్యేలు, ఎంపీలకు వివేకా ద్వారా అధిష్ఠానం ఇవ్వదలచినట్టు కనిపిస్తున్నది.

అంతరం ఇప్పటిది కాదు...
వాస్తవానికి చాలాకాలం నుంచే వివేకా వైఎస్‌ కుటుంబానికి అంతరం పాటిస్తున్నారు. జగన్‌ను కడప ఎంపీగా నిలబెట్టాలనుకుంటున్నానని, అందుకు వీలుగా పదవికి రాజీనామా చేయాలని రాజశేఖరరెడ్డి చెప్పినప్పుడు వివేకా అంత సులభంగా మాట వినలేదు. రాజీనామా చేయకుండా అమెరికా వెళ్ళి కూర్చున్నారు. కుమారుడి కోసం తన పదవికే ఎసరు పెట్టిన వైఎస్‌పై కోపంతోనే అలిగి వెళ్ళిపోయారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత వచ్చి రాజీనామా చేయటం వేరే సంగతి. ఇక ఇటీవలి పరిణామాలు పరిశీలిస్తే జగన్‌ ఓదార్పు యాత్రలో వివేకా ఎక్కడా పాల్గొనలేదు. జగన్‌ పిలవనూ లేదు...పైగా వివేకా ఈ యాత్రకు మద్దతుగా ఎక్కడా ప్రకటనలూ ఇవ్వలేదు. తాజాగా పులివెందులలో జరగాల్సిన ఓదార్పు యాత్ర నేపథ్యంలో వివేకా రాసిన లేఖ సంచలనానికి తెర లేపింది. ఎఐసిసి వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ ఇవ్వదలచుకున్న విందుకు హాజరయ్యేందుకు వీలుగా జగన్‌ పులివెందుల యాత్రను వాయిదా వేసుకున్నారు.

అన్నిటికీ మించి గురుకుల్‌ ట్రస్టులో తాను విలువైన భూములను ఆక్రమించి ఇల్లు నిర్మించుకున్నట్టు విపక్షాలు పరంపరగా విమర్శల వర్షం కురిపిస్తున్నా తనను ఎవరూ ఆదుకునేందుకు ముందుకు రాలేదన్న బాధ సైతం వివేకాలో ఉన్నట్టు చెబుతున్నారు. రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నప్పటినుంచే విపక్షాలు ఈ ఆరోపణలు చేస్తున్నాయి. తనను అనరాని మాటలు అంటున్నా సోదరుడు కానీ, జగన్‌ కానీ పల్లెత్తు మాట అయినా మాట్లాడకపోవటం వివేకాను ఆవేదనకు గురి చేసిందని సమాచారం. సహజంగానే ముక్తసరిగా మాట్లాడే తత్వం, రాజకీయాలను పెద్దగా పట్టించు కోకుండా తన పని తాను చేసుకుపోయే అలవాటు ఉన్న వివేకా మొత్తం మీద తాను చేయదలచుకున్నది సమయం, సందర్భం చూసి మరీ చేశారని, అందుకు అధినాయకత్వం ఆయనకు భారీ నజరానాయే ఏదో ఒక రూపంలో సమర్పించనున్నదని పార్టీ వర్గాలు చెప్పు కుంటున్నాయి.

ఢి అంటే ఢీ * జగన్‌ వర్గీయులకు ఉద్వాసన?

Jagan1
కాంగ్రెస్‌ అధిష్ఠానం జగన్‌ వేలితోనే ఆయన కన్ను పొడిచే దిశగా పావులు కదుపుతోంది. అంబుల పొదిలో దాచుకున్న అస్త్రాలను ఒకొక్కటిగా ప్రయోగించేందుకు సన్నద్ధమవు తోంది. జగన్‌ దూకుడు యాత్రకు కళ్లె వేసేందుకు అదే వేగంతో సమాయత్తమవుతోంది. ఓదార్పు యాత్ర ఎవరు కాదన్నా ఆపేది లేదని తెగేసి చెప్పిన జగన్‌ ధిక్కార స్వరానికి విరుగుడుగా అధిష్ఠానం వైఎస్‌ జపంతోనే తిప్పికొడు తోం ది. వైఎస్‌ కాంగ్రెస్‌కు చేసిన సేవలు అనంతమని కీర్తిస్తూనే జగన్‌ అనుసరిస్తున్న పంథాలోనే తిరిగి అస్త్రాలను సంధి స్తోంది. జగన్‌ యాత్రకు అధిష్ఠానం ఎప్పుడూ అడ్డు చెప్ప లేదని, ఎదురు దాడికి దిగుతోంది. జగన్‌ ఓదార్పును కొన సాగించాలని కోరడం ముందరకాళ్లకు బంధం వేస్తోంది. అయితే దానిని సొంత యాత్రగా కాకుండా పార్టీ యాత్రగా నిర్వహించుకోవాలని షరతు విధించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ వైఎస్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అక్కడ బాధితులకు పరిహారం చెల్లించాలని సుతిమెత్తగా చురక లంటించింది. దీంతో జగన్‌కు ఆయన అనునూయులు ఇరుకున పడ్డారు.

తన తండ్రి మృతి కారణంగా వీచిన సానుభూతి పవనాలను రాజకీయంగా వినియోగించే అవకాశం చేజారిపోతోందనే ఆందోళన జగన్‌ కూటమిలో మొదలైంది. తమ రాజకీయ భవిష్యత్‌ ప్రశ్నార్ధకంగా మారునున్నదనే మీమాంస ఎమ్మేల్యేలలో మొదలైనట్లు వెల్లడవుతోంది. అధిష్ఠానం సానుభూతితోనే వ్యవహరి స్తోందని, రాజకీయారాహిత్యంతో జగన్‌ కాంగ్రెస్‌ పార్టీలో చిచ్చు పెడుతున్నారనే సంకేతాలను వైఎస్‌ సానుభూతి పరులకు చేర్చేదిశగా అధిష్ఠానం అడుగులు వేస్తోంది. ఒక వైపు బుజ్జగింపు ధోరణిలోనే కొనసాగుతూ వేటు దిశగా ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకే హైకమాండ్‌ బుధవారం రాత్రి ప్రకాశం జిల్లా శాసన సభ్యులను పిలిపించి ఓదార్పు యాత్రకు హాజరు కావద్దని కాంగ్రెస్‌ పార్టీ శాసన సభ్యు లకు హుకుం జారీ చేస్తూనే యాత్రను కొనసాగించవచ్చనే ఆటవిడుపును కొనసాగిస్తోంది.

ఈ ప్రకటన కారణంగా అధిష్ఠానం కాంగ్రెస్‌ శ్రేణులను జగన్‌ ప్రలోభాలనుంచి తప్పించే మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ మేరకు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్‌ పటేల్‌ నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో అవస రమైన సమయంలో జగన్‌పై వేటు వేసినా స్పందన తీవ్రత ను తగ్గించే ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ జగన్‌పై కక్షగట్టి ఏక పక్షంగా వ్యవహరి స్తోందని ప్రజలకు తప్పుడు సమాచారం చేరకుండా వివాదరహితులైన ఎంపీలు, మాగుంట సుబ్బరామి రెడ్డి, మంత్రులు పురంధేశ్వరి, పనబాక లక్ష్మిలను ఎంపిక చేసి వారి ద్వారా జగన్‌ వర్గంతో మంతనాలు సాగిస్తున్నది. జగన్‌ యాత్రను సొంత యాత్రగా కాకుండా ఓదార్పుగా చేయాలని, పార్టీ పరంగా చేయాలని గతంలోనే స్పష్టం చేసినట్లు అధికారికంగా పురంధేశ్వరి ద్వారా మీడియాకు గురువారం ప్రకటించేలా చేసింది. పార్టీ అదేశాల మేరకే పురంధేశ్వరి గురువారం అధినేత్రి సోనియా గాంధీతో భేటీ జరిగిందని పార్టీలో గుసగుసలు వినవస్తున్నాయి.

ధిక్కారం జరగలేదు: జగన్‌ కూటమిలోని ఎంపీలు
జగన్‌ ఏరోజూ పార్టీ అధిష్ఠానం ఆదేశాలను బేఖాతరు చేయలేదు. కాకపోతే కొందరు ఆయనకు వ్యతిరేకంగా హైకంమాండ్‌కు తప్పుడు సమాచారం అందించారు. ఆ విషయం అధిష్ఠానం దృష్టికి వెళ్లిందని, జగన్‌-అధిష్ఠానం మధ్య అగాధాలు తొలిగిపోయాయన్నారు. కేవలం గందరగోళ పరిస్థితిని కల్పించడం కోసమే వదంతులను వ్యాప్తి చేస్తున్నారని కొట్టి పారేశారు.

జగన్‌ వర్గీయులకు ఉద్వాసన ?
pilli
రాష్ట్ర మంత్రి వర్గంలో జగన్‌కు వీర విధేయులుగా ఉన్న మంత్రు లపై వేటు పడనున్నది. తమ ఆదేశాలను ధిక్క రించి కడప ఎంపి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్రలో అమిత ఉత్సాహంతో పాల్గొనే, పాల్గొం టున్న మంత్రులను కేబినెట్‌ నుంచి తొలగించాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం భావిస్తున్నట్లు ఢిల్లీలోని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌లపై వేటు వేసేందుకు పార్టీ నాయకత్వం ఇప్పటికే రంగం సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా వైఎస్‌కు బంధువు, పార్టీ హైకమాండ్‌ను, ముఖ్యమంత్రి రోశ్యయ్యను సైతం ఖాతరు చేయని బాలినేని మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని దాదాపుగా హైకమాండ్‌ నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇలా చేయడం ద్వారా మరో 19 జిల్లాల్లో జగన్‌ చేపట్టనున్న ఓదార్పు యాత్రలో పాల్గొంటే పరిణామాలు ఎలా ఉంటాయనే సంకేతాన్ని మిగతా మంత్రులకు అందజేయడమే అధిష్ఠానం ఉద్దేశ్యంగా స్పష్టమవుతోంది.

పార్టీ నాయకత్వాన్ని వ్యతిరేకించే రీతిలో జగన్‌ వ్యవహరిస్తున్న తీరు అధిష్ఠానానికి1 అగ్రహం కలిగిస్తోంది. తాము వద్దని వారించినా జగన్‌ మొండి పట్టుతో యాత్రకు వెళ్ళడం, అతని వెంట పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా నడుస్తుండడంతో విధిలేని పరిస్థితుల్లోహైకమాండ్‌ కఠినంగా వ్యవహరించే పరిస్థితి వచ్చిందని పార్టీలో వినిపిస్తోంది.

మరో వైపు అధిష్టానం వైఖరి తెలిసి కూడా పలువురు మంత్రులు జగన్‌ యాత్రలో పాల్గొనడం, ఇటూ పార్టీ నాయకత్వాన్ని, అటూ సిఎం రోశయ్యను ధిక్కరించే విధంగా వ్యవహరిస్తుండడంతో ఇలాంటి వారిని మంత్రివర్గం నుంచి తొలగించక పోతే రానున్న రోజుల్లో పాలనా పరంగా, పార్టీ వ్యవహరాల పరంగా ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందని హైకమాండ్‌ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే జగన్‌ యాత్రలో పాల్గొనే మంత్రులను మంత్రి వర్గం నుంచి తొలగించడమే మార్గమనే నిర్ణయానికి పార్టీ నాయకత్వం వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన జగన్‌ ఓదార్పు యాత్రలో పాల్గొన్నారు. సిఎం, పార్టీ నేతలు కొందరు ఓదార్పు యాత్రకు వెళ్ళొద్దని ఆయన్ని పరోక్షంగా నివారించినా బేఖాతరు చేస్తూ ఆయన జగన్‌ వెంట జిల్లా వ్యాప్తంగా జరిగిన ఓదార్పు యాత్రలో పాల్గొన్నారు.

balineni1
జగన్‌ వెంటే తాను అని స్పష్టం చేశారు. మరో వైపు వచ్చే నెల3 నుంచి ప్రకాశం జిల్లాలో ప్రారంభం కానున్న జగన్‌ యాత్రలో తాను కచ్చితంగా పాల్గొని తీరుతానని ఓంగోలుకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తాజాగా గురువారం స్పష్టం చేశారు. ఓదార్పు యాత్రకు వెళ్ళవద్దని సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్‌ పటేల్‌ చెప్పమన్నారంటూ ముఖ్యమంత్రి రోశయ్య స్వయంగా బాలినేనికి ఫోన్‌ చేసి చెప్పారు. అయితే తాను జగన్‌తోనే ఉంటానని, వైఎస్‌ కుటుంబంతో తనకు బంధుత్వం ఉందని, మంత్రి పదవులు తమకు శాశ్వతం కాదని, ఎవరూ వచ్చినా, రాక పోయినా తాను మాత్రం ఓదార్పు యాత్రలో పాల్గొంటానని బాలినేని తేల్చి చెప్పారు. బాలినేని వ్యవహారంపై ముఖ్యమంత్రి రోశయ్య, పార్టీ అధిష్ఠానం అగ్రహంతో ఉన్నట్లు సమాచారం. మా మాటను కాదని, ధిక్కరించే ధోరణిని అవలంభిస్తున్న బాలినేని మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయడం తప్ప మరో మార్గం లేదని హైకమాండ్‌ నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.

ఇప్పటికి రెండు విడుతల్లో జగన్‌ ఓదార్పు యాత్ర పశ్చిమగోదావరి, ఖమ్మం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లో పూర్తయింది. 3వ విడతలో ఆయన ప్రకాశం, ఒంగోలు జిల్లాల్లో పర్యటించబోతున్నారు. ఆ తరువాత విడతల వారిగా మిగతా జిల్లాల్లో తన ఓదార్పు యాత్ర ఉంటుందని జగన్‌ ఇది వరకే ప్రకటించారు. ఇంకా 19జిల్లాల్లో జగన్‌ ఓదార్పు యాత్ర పూర్తి కావాల్సి ఉండటంతో జిల్లా మంత్రులు ఎవరూ కూడా ఈ యాత్రలో పాల్గొనకుండా ఉండేందుకు హైకమాండ్‌ అడ్డుకట్ట వేయబోతున్నది. జగన్‌కు వీర విధేయతను ప్రదర్శిస్తున్న బాలినేని, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌లను మంత్రి వర్గం నుంచి తొలగించడం ఖాయమైపోయిందని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. మిగతా మం త్రులు కూడా వైఖరి మార్చుకోక పోతే వారికి కూడా ఇలాంటి గతే పడుతుందని అధిష్ఠానం హెచ్చరించేందుకే బాలినేని, పిల్లిలపై చర్యలు తీసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

Thursday, August 19, 2010

జగన్‌ ఔట్‌ ! * అష్టదిగ్బంధం - పద్మవ్యూహంలో జగన్ ! * పార్టీ సొత్తుగా వైఎస్‌ను చేసే వ్యూహం పదవి కోసం జగన్ పాకులాటను ప్రజల్లోకి తీసుకువెళ్లే యోచన


అధిష్ఠానం పద్మవ్యూహంలో కడప ఎంపీ వైఎస్ జగన్మోహనరెడ్డి చిక్కుకున్నారు.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీ సొత్తుగానే సంకేతాలు పంపింది. ఇప్పటివరకూ జగన్ ఓదార్పు యాత్రకు అధిష్ఠానం పూర్తిగా వ్యతిరేకిస్తూ వస్తోందన్న భావనలో ఉన్న కిందిస్థాయి కార్యకర్తలు, నాయకులకు గురువారం ఢిల్లీ పరిణామాలు కొత్త ఆలోచనకు తెరతీసేలా చేశాయి. అధిష్ఠానం ఓదార్పు యాత్రను పార్టీ కార్యక్రమంలా నిర్వహించాలని.. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం కూడా చెల్లించాలని .. అయితే.. ర్యాలీగా కాకుండా సంప్రదాయ రీతిలో ప్రతి జిల్లాలోనూ ఒకే వేదికను ఏర్పాటు చేసి .. అక్కడ వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి .. బాధిత కుటుంబాలకు సహాయం చేయాలని చేసిన సూచనను జగన్ తిరష్కరించడం ఏమిటన్న కొత్త ప్రశ్నలు పార్టీలో తలెత్తాయి. పార్టీ కార్యక్రమంగా జిల్లా కేంద్రంలో ఓదార్పును చేపడితే.. వైఎస్ పూర్తిగా కాంగ్రెస్‌పార్టీ సొత్తు అవుతారు. ఇదేసమయంలో పూర్తి క్రెడిట్ పార్టీకే దక్కుతుందే తప్ప జగన్‌కు మాత్రం దక్కదు. దీంతో.. జగన్ శిబిరంలో కొత్త కలకలం కూడా మొదలైంది.

పైగా .. ఇంతవరకూ దీన్ని పార్టీ కార్యక్రమంగా చేపడితే .. భవిష్యత్‌లో కాంగ్రెస్‌కే లాభమని.. 2014లో మళ్లీ అధికారంలోకి వస్తామని.. కేంద్రంలో రాహుల్ ప్రధాని అవుతారని జగన్ శిబిరం వాదిస్తూ వచ్చింది. గురువారం నాటి పరిణామాలు జగన్ శిబిరాన్ని ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరికిలోను చేశాయి. భవిష్యత్‌లో వైఎస్ అభిమానులపై అధిష్ఠానం కక్ష సాధింపు ధోరణిని ప్రదిర్శిస్తోందని చెప్పేందుకు వీల్లేకుండా పోయింది. పార్టీ పట్ల జగన్ అనుసరిస్తున్న ధిక్కార ధోరణి.. తత్పలితంగా పార్టీలో నెలకొన్న పరిస్థితుల కారణంగా జగన్ వర్గీయులపై అధిష్ఠానం సీరియస్‌గా ఉందని .. మరో వర్గానికి గట్టిగా చెప్పేందుకు వీలు చిక్కింది. ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యేలు ఇప్పటి వరకూ ఓదార్పు యాత్రలో పాల్గొనకపోవడానికి గల కారణాలను గురించి కార్యకర్తలకు ఏమని చెప్పాల్లో తెలియక నిన్నటి వరకూ సతమతమయ్యారు. ఇప్పుడు అధిష్ఠానం ద్వారా వారికి సరైన సమాధానం లభించింది. పార్టీ సూచించిన విధంగా జిల్లా కేంద్రంలో ఓదార్పును నిర్వహిస్తే జగన్ వెంట తాము వెళ్లేందుకు సిద్ధమేనని కార్యకర్తలకు వారు చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. కాగా.. ఇప్పటి వరకూ అధిష్ఠానం ఓదార్పు యాత్రకు ఎందుకో విముఖంగా ఉందని లిఖిత పూర్వకంగా చెప్పిన జగన్.. ఇప్పుడు అధినేత్రి సోనియాగాంధీ మాటలను కొట్టిపారేయలేరు. ఇదే సమయంలో అవునని చెప్పలేదు.

జిల్లా కేంద్రంలో పార్టీ పరంగా ఓదార్పు చేసుకోవాలని .. ఇందుకు సహాయం కూడా చేస్తామని కుటుంబ సభ్యులతో కలని తాను అధినేత్రి సోనియాగాంధీని కలిసినప్పుడు సూచించారని చెబితే.. ఇంతకాలం ఆ విషయాన్ని ఎందుకు బహిర్గత పరచలేదన్న ప్రశ్న వైరివర్గీయుల నుంచే కాకుండా స్వీయవర్గం నుంచి కూడా వచ్చే వీలుంది. అదేవిధంగా అధిష్ఠానం ఆ విధంగా చెప్పలేదంటే.. సోనియాగాంధీని తప్పుపట్టినట్లుగా అవుతుంది. దీంతో .. ఏమి మాట్లాడాలో దిక్కుతోచని పరిస్థితిలో జగన్ వర్గం పడిపోయింది. అధిష్ఠాన పద్మవ్యూహంలో జగన్ చిక్కుకోవడంతో.. ఆయన శిబిరంలో ఒక్కసారిగా ఆందోళన కన్పిస్తోంది. ఇప్పుడు జగన్ ముందున్నవి రెండే రెండు దారులని.. ఒకటి అధిష్ఠానం సూచించిన విధంగా విధేయతను చూపుతూ జిల్లా కేంద్రాల్లో ఒక్కరోజు ఓదార్పు కార్యక్రమాన్ని చేపట్టడం.. లేదా అధిష్ఠానాన్ని ధిక్కరించి పార్టీనుంచి బయటకు వెళ్లడమేనని కాంగ్రెస్‌నేతలు అంటున్నారు. మొత్తానికి ఓదార్పు ప్రకాశం జిల్లా శాసనసభ్యుల సందేహానికి అధిష్ఠానం సరైన సమాధానమే చెప్పిందని పార్టీ నేతలంటున్నారు.
జగన్‌ ఔట్‌ !
jaganఅత్యంత క్లిష్ట సమయంలో కాంగ్రెస్‌ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన దివంగత వైఎస్‌ కుటుంబ పెద్దగా భావిస్తోన్న ఎంపి జగన్మోహన్‌రెడ్డి కథ ఇక కంచికి చేర నుంది. అధిష్ఠానం-జగన్‌ మధ్య ఏడాది నుంచి జరుగుతున్న దోబూచులాటకు ఎట్టకే లకూ అధికారికంగానే తెరపడింది. జగన్‌ వ్యవహారాన్ని తేల్చేందుకు స్వయంగా పార్టీ అధినేత్రి సోనియాగాంధీనే రంగంలోకి దిగారు. సెప్టెంబర్‌ 3 నుంచి జరపతలపెట్టిన జగన్‌ ఓదార్పు యాత్ర పార్టీకి వ్యతిరేకమని ఆమె విస్పష్టంగా ప్రకటించి, జగన్‌ను ఏకాకిని చేసే వ్యూహానికి తెరలేపారు. ఇటు.. ముఖ్యమంత్రి రోశయ్య కూడా ఢిల్లీ సందే శాన్ని సహచర మంత్రులు, ఎమ్మెల్యేలకు వినిపించి, హెచ్చరికలు జారీ చేస్తుండటంతో కాంగ్రెస్‌లో ఇక జగన్‌ భవితవ్యమేమిటన్న ప్రశ్న సర్వత్రా చర్చనీయాంశమయింది.

ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్‌లో గంద రగోళం సృష్టిస్తున్న జగన్‌ వ్యవహార శైలిని నిశితంగా గమనిస్తూ వస్తోన్న పార్టీ అధినేత్రి సోనియాగాంధీ.. రాష్ట్ర కాంగ్రెస్‌లో జగన్‌ పాత్ర, ప్రాధాన్యానికి తెరదించకపోతే పార్టీ మొత్తం పక్కదారిపడుతుందని గ్రహించారు. ఆమె గత రెండు రోజుల నుంచి రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై సీరియస్‌గా దృష్టి సారిం చారు. పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో జగన్‌ తనకు ఎదురుపడి నమస్కారం పెట్టినా దాన్ని పట్టించుకోకుండా వెళ్లిపోయిన వైనం.. ఆయనపై అధిష్ఠానం ఎంత ఆగ్రహంతో ఉందో చెప్పకనే చెప్పినట్టయింది.

జగన్‌ ఓదార్పు యాత్ర, సమాంతర పార్టీ కార్యకలాపాలు, రోశయ్యను ఇబ్బంది పెడుతున్న తీరును గమనిస్తున్న సోనియా వాటిలో నేరుగా జోక్యం చేసుకోకుండా రాష్ట్ర పార్టీ ఇన్చార్జి వీరప్ప మొయిలీకి, తన రాజకీయకార్యదర్శి అహ్మద్‌ పటేల్‌కూ అప్పగించారు. వీరిలో పటేల్‌ ఒక్కరే జగన్‌ పట్ల వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉండగా, మొయిలీ మాత్రం కేవీపీ ఒత్తిళ్లతో జగన్‌ శిబిరంవైపు మొగ్గు చూపిస్తున్నారు. సీనియర్లు కూడా మొయిలీ కేవలం జగన్‌ వైపే మొగ్గు చూపిస్తున్నారని, మొయిలీ- కేవీపీ కలసి జగన్‌ వర్గ ప్రయోజనాలను రక్షిస్తూ వస్తున్నా రన్న ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఓదార్పు యాత్రకు దాదాపు 30 మంది పార్టీ ఎమ్మెల్యేలు హాజరయిన వైనంతో సోనియా గాంధీ రాష్ట్రంపై దృష్టి సారించవలసి వచ్చింది. అప్పుడు పటేల్‌, రోశయ్య ద్వారా ఎమ్మెల్యేలకు నచ్చ చెప్పే బాధ్యత అప్పగించారు. యాత్రకు వెళ్లవద్దంటూ రోశయ్య ఎమ్మె ల్యేలకు స్వయంగా ఫోన్లు చేసినప్పటికీ, వారు ఆయన మాటను బేఖాతరు చేసి జగన్‌తో కలసి వెళ్లారు.

sonia1 దీనితో ఇక రోశయ్య వల్ల కాదని గ్రహించిన సోనియా తానే స్వయంగా రంగంలో దిగారు. అంతకంటే ముందు.. రాహుల్‌ సన్నిహితుడైన ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ తనయుడు జగన్‌తో రాయబారం నడిపారు. రాహుల్‌ కూడా జగన్‌ వ్యవహార శైలిని పరిశీలిస్తున్నారు. తాజాగా.. గత రెండు రోజుల నుంచి జగన్‌ కార్యకలాపాలు, ప్రధానంగా ఓదార్పు యాత్రపై సోనియా సీరియస్‌గా దృష్టి సారించారు. జగన్‌తో షీలా దీక్షిత్‌ తనయుడు నెరపిన రాయబారం విఫలం కావడం, ఎవరు చెప్పినా యాత్రకు వెళ్లేది ఖాయమని జగన్‌ కూడా స్పష్టం చేయడంతో సోనియా ఇక ఆయన ప్రాధాన్యం తగ్గించే ఎత్తుగడకు శ్రీకారం చుట్టారు. జగన్‌ యాత్రకు పార్టీ అనుమతి లేదని స్వయంగా చెప్పడం ద్వారా జగన్‌ వెంట ఎవరూ వెళ్లకుం డా నివారించే ప్రయత్నాలు ప్రారంభిం చారు. గతంలో ఎప్పుడూ సోనియా ఈవిధంగా ఒక రాష్ట్ర పార్టీ వ్యవహారా లపై దృష్టి సారించిన దాఖలాలు లేవు.

జగన్‌ వ్యవహారం లో మొయిలీ ద్వారా కథ నడిపిస్తూ వచ్చిన ఆమె.. గత రెండురోజుల నుంచి హటాత్తుగా తానే రంగంలోకి దిగి, పార్లమెంటు సభ్యులు, కేంద్రమంత్రు లతో మంతనాలు సాగించడం చర్చనీయాంశమయింది. జగన్‌ యాత్రకు అధ్యక్షురాలి అనుమతి లేదని అహ్మద్‌ పటేల్‌ పార్టీ ఎంపీలందరికీ విస్పష్టంగా చెప్పారు. అదే విషయాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలకు చెప్పి, వారిని యాత్రకు వెళ్ల కుండా అడ్డుకోవాలని సూచిం చారు. ఇది సోనియా గాంధీ మాట అని స్పష్టం చేశారు. అయితే, వాటిని విశ్వసించని కేంద్ర మంత్రులు పనబాక లక్ష్మి, పురంధీశ్వరి, మాగుంట శ్రీనివాసరెడ్డి వంటి ప్రముఖులు సోనియాను కలిశారు. యాత్రకు వెళ్లవద్దని ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు చెప్పాలని తాను అహ్మద్‌పటేల్‌ను ఆదేశిం చానని సోనియా స్పష్టం చేయడంతో జగన్‌ యాత్రకు అధి ష్ఠానం అనుమతికి సంబంధించి ఇప్పటివరకూ ఉన్న దోబూచులాటకు తెరపడి, జగన్‌ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇటు రాష్ట్ర స్థాయిలో కూడా సోనియా ఆదేశాలు వెంటనే అమలులోకి వచ్చాయి.

ముఖ్యమంత్రి రోశయ్య ఈ విషయంలో చొరవ తీసుకున్నారు. ప్రకాశం జిల్లాలో జగన్‌ యాత్రను పర్యవేక్షిస్తున్న మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డికి రోశయ్య స్వయంగా ఫోన్‌ చేసి, అధిష్ఠానం ఆదేశాల మేరకు యాత్రకు వెళ్లి, ఇబ్బందుల్లో పడవద్దని హెచ్చరిం చారు. పరోక్షంగా యాత్రకు వెళితే మంత్రి పదవి పోతుం దని చెప్పకనే చెప్పారు. అయితే, తాను యాత్రకు వెళ్లేది ఖాయమని బాలినేని కూడా జగన్‌ మాదిరిగానే ఖరాఖం డిగా చెప్పారు. సోనియా-పటేల్‌తో సమావేశ మయిన ప్రకాశం జిల్లా పార్టీ ఎమ్మెల్యేలపై భేటీ ప్రభావం బాగానే పడినట్లు కనిపిస్తోంది. జగన్‌ యాత్రకు వెళితే వచ్చే ఎన్నికల్లో తిరిగి టికెట్లు కూడా ఇచ్చేది లేదని స్పష్టం చేయ డంతో అంతా ఒక్కసారి ఆత్మరక్షణలో పడిపోవలసి వచ్చిం ది.

తాజా పరిణామాల నేపథ్యంలో.. ప్రకాశం జిల్లా కు చెందిన ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డి మినహా.. కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, ఎమ్మెల్యేలు దగ్గుబాటి వెంక టేశ్వరరావు, ఆమంచి కృష్ణమోహన్‌, గొట్టిపాటి రవి, ఉగ్ర నరసింహా రెడ్డి, జివి శేషు, సురేష్‌ , మహీధర్‌రెడ్డి దూరంగా ఉండనున్నారు. తూర్పు గోదావరి జిల్లా మాదిరి గానే ఎమ్మెల్యేలను వెంటేసుకుని యాత్ర సాగించాలన్న జగన్‌ వ్యూహానికి బ్రేక్‌ పడినట్టయింది. యాత్రకు అధిష్ఠానం ఆశీస్సులు లేవని స్వయంగా సొనియా, అహ్మద్‌ స్పష్టం చేయడంతో ద్వితీయ శ్రేణి నేతలు సైతం యాత్రకు దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫలి తంగా.. ఇప్పటివరకూ ద్వితీయ శ్రేణి నేతలను తన వెంట తెచ్చుకోవడం ద్వారా ఎమ్మెల్యేలను యాత్రకు వచ్చే పరిస్థితి సృష్టించిన జగన్‌ వ్యూహం ప్రకాశం జిల్లాలో బెడిసికొట్టినట్టయింది. జగన్‌ యాత్రకు తన అనుమతి లేదని స్పష్టం చేయడం ద్వారా.. జగన్‌కు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యం లేదని నాయకత్వం చెప్పినట్టయింది.