సినిమాలో సీతయ్యే కాదు. నిజ జీవితంలో మన జగనయ్య కూడా ఎవరి మాటా వినడని తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసి, తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి రాకుండా చేయాలన్న పట్టుదలతో శనివారం తన ఇడుపులపాయ ఎస్టేట్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఊపిరిపోసిన వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఏకపాత్రాభినయ ప్రదర్శన చూసిన ఆయన సహ చరులు, అనుచరుల నుంచి సరిగ్గా ఇలాంటి వ్యాఖ్యలే వినిపించడం విస్మయం కలిగిస్తోంది. పార్టీ పేరు, జెండా ప్రదర్శన అంతా కుటుంబానికే పరిమితమయింది. జగన్ పోకడ పరిశీలిస్తే.. ఆయన పార్టీపెట్టకముందునుంచే ఒంటెత్తు పోకడ అనుస రిస్తున్నారన్న అభిప్రాయం జగన్ చుట్టూ ఉన్న నేతల్లోనే మొదలు కావడం భవిష్యత్తు పరిణా మాలు ఇంకెలా ఉంటాయన్న అంశంపై అప్పుడే చర్చకు తెరలేచింది.
తన అభిమానులు, సహచ రులు, అనుచరుల సమక్షంలో పార్టీ పేరు ప్రకటిం చిన వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీరు ప్రారంభంలోనే విమర్శల పాలవుతోంది. నిజానికి జగన్ పార్టీ పేరును ఈనెల 20 తర్వాత ప్రకటిస్తారని ఆయన సన్నిహితులుగా ప్రచారంలో ఉన్న వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్‌రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, రవీంద్ర నాధ్‌రెడ్డి, అంబటి రాంబాబు, గట్టు రామచంద్ర రావు వంటి నేతలు పలు సందర్భాల్లో మీడియాకు వెల్లడించారు. అయితే, హటాత్తుగా తూర్పుగోదా వరి జిల్లా జగ్గంపేటలో ఏర్పాటుచేసిన బహిరం గసభ వేదికపై తాను శనివారం వైఎస్‌ఆర్ పార్టీ పేరు ప్రకటించబోతున్నట్లు జగన్ చేసిన ప్రకటన ఆయన చుట్టూ రోజూ ప్రద ణలు చేసేవారిని విస్మయం కలిగించింది.
దీనితో.. జగన్‌కు సలహాదారులుగా ప్రచారంలో ఉన్న వారికి బయట జనంలో ఉన్న ఇమేజ్ పోయింది. చివరకు జగన్ వారికి సైతం తెలియకుండానే నిర్ణయాలు తీసుకుంటారని, ఆయన చుట్టూ ఉన్న వాళ్లంతా డమ్మీలేనన్న ప్రచారం మొదలయింది.పార్టీ పేరు ఎప్పుడు ప్రకటించాలన్న అంశంపై కనీసం తమతో మాటమాత్రం కూడా చర్చించకుండా హటాత్తుగా ఏక పక్ష నిర్ణయం తీసుకోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
జగన్ ఎవరిమాటా వినరని, తనకు తోచిందే చేస్తారని, తనకు అన్నీ తెలుసునని భావిస్తుంటారని, తనకు ఎవరు ఎదురుచెప్పినా సహించే అలవాటు లేదన్న ప్రచారం ఇప్పటికే జగన్ శిబిరంలోను, ఆయన గురించి బాగా తెలిసిన వర్గాల్లోనూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఇలాంటి వ్యాఖ్యల్ని ఇప్పటివరకూ కొట్టిపారేస్తూ వచ్చిన జగన్ సహచరులు.. ఇప్పుడు సరిగ్గా అలాంటి చేదు అనుభవం త మకే ఎదురుకావడంతో బిత్తరపోవలసి వచ్చింది. ఫలితంగా ఇప్పుడే ఇక ఇలా ఉంటే భవిష్యత్తులో ఇంకెన్ని ఏకపక్ష నిర్ణయాలను వినవ లసి వస్తుందోనన్న ఆందోళన జగన్ శిబిరంలో మొదలయింది.
జగన్‌కు జనంలో బలం ఉందని, ఆయన పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్,తెలుగుదేశం పార్టీల నుంచి తామరతంపరగా నేతలు వస్తారన్న అంచనాతో చాలామంది కాంగ్రెస్ పెద్ద నేతలు ఆ పార్టీని వీడి జగన్ గూటికి చేరారు. మరికొందరు జగన్ పార్టీ పెట్టిన తర్వాత అందులో చేరదామన్న యోచనలో ఉన్నారు. ఇప్పుడు జగన్ మాత్రం తమతో మాట మాత్రం కూడా చర్చించకుండా, పార్టీ ప్రకటన తేదీని హటాత్తుగా ప్రకటించడంపై వారిలో భవిష్యత్తుకు సంబంధించిన బెంగ అప్పుడే మొదలవడం ప్రస్తావనార్హం. ఇది జగన్ పెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ భవిష్యత్తుకు ఒక ప్రమాద సంకేతంలా కనిపిస్తోంది.
తాజా పరిణామాల నేపథ్యంలో జగన్ తీసుకున్న ఒంటెత్తు నిర్ణయాలు పరిశీలిస్తే... ఆయన తన సహచరులను ఏ మాత్రం విశ్వాసంలోకి తీసుకోవడం లేదన్న వాస్తవం వెల్లడవుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తన సహచరులను జగన్ నమ్మడం లేదన్న సంకేతాలు ఇడుపుల పాయ వ్యవహారం స్పష్టం చేస్తోందంటున్నారు. ‘నాయకుడనేవాడు అందరినీ విశ్వాసంలోకి తీసుకోవాలి. కానీ సొంతంగా నిర్ణయాలు తీసు కుని దానిని ప్రకటించడం ఏకపక్షమవుతుంది. దానివల్ల తమ నాయకుడు ఎవరినీ నమ్మరన్న సంకేతాలు వెళతాయి.
అది భవిష్యత్తులో మాకు మాత్రమే కాదు. వ్యక్తిగతంగా జగన్‌కూ నష్టమే. భవిష్యత్తులో పార్టీ టికెట్లు, ఇతర నిర్ణయాలు కూడా తమను సంప్రదించకుండా జగన్ ఒక్కరే తీసుకుంటారన్న అభిప్రాయం బలపడుతుంది. దీనివల్ల ఇతర పార్టీల నేతలు మా పార్టీలో చేరడానికి వెనుకంజ వేస్తార’ని జగన్‌కు సన్ని హితంగా వ్యవహరించే ఓ నేత వ్యాఖ్యానించారు. ఈ విషయంలో చంద్రబాబునాయుడు విధానాన్ని గుర్తు చేస్తున్నారు. ఒక అంశంపై చంద్రబాబు నాయుడు అనేక స్థాయుల్లో చర్చిస్తారని, చివరకు తాను అనుకున్నది చేసినప్పటికీ, దానిని మిగిలిన వారితో చర్చించే అలవాటు ఆయనకు ఉందని వివరిస్తున్నారు. దానివల్ల మిగిలిన నేతల్లో తమ నేత అందరితోనూ చర్చించి నిర్ణయం తీసుకుం టారన్న సానుకూల వాతావరణం ఏర్పడుతుం దంటున్నారు.
జగన్ చెబుతున్నట్లు.. ఎన్నికల కోడ్ నిబంధనలు అడ్డువస్తున్నందుకే హడావిడిగా పార్టీ పేరు ప్రకటించినప్పటికీ.. జగ్గంపేటలో కాకుండా ముందే తమతో చర్చించి ప్రకటించి ఉంటే బాగుండేదని చెబుతున్నారు. దానివల్ల తాము కూడా సంతోషించేవాళ్లమని, తమ నేత తమను సంప్రదించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటారని భావించేవాళ్లమని వివరిస్తున్నారు.ఇప్పటికే జగన్ వ్యవహారశైలి తెలిసిన వారు.. ఆయన ఎవరిమాట వినడని, తనకు ఎదురుచెబితే సహించరని, ఆవేశపరుడని, తాను చెప్పిందే వినాలన్న ధోరణితో ఉంటారన్న ప్రచారాన్ని ఏకపక్షంగా చేసిన పార్టీ ప్రకటన వ్యవహారం నిజం చేసినట్టయిందని ఆయన సన్నిహితులు వాపోతున్నారు.