జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Sunday, December 26, 2010

సర్కారు ఉందా ? ...... నేతన్నలు, రైతన్నల ఆత్మహత్యలపై చలించరేం ? ......


చేనేత రుణాలను వైఎస్ మాఫీ చేస్తే అమలేదని ప్రశ్న.. ధర్మవరంలో నేత కార్మికుల దీక్షకు సంఘీభావం
ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారమివ్వాలని డిమాండ్
ప్రభుత్వంపై వైఎస్ జగన్ నిప్పులు

పనుల్లేక రాష్ట్రంలో 26 మంది నేతన్నలు మరణించారు
వారి ఆక్రందనలు, ఆకలి కేకలు సర్కారుకు వినపడవా?
రూ.312 కోట్ల నేత రుణాలను వైఎస్ మాఫీ చేస్తే.. ఏదీ అమలు?
చేనేత రంగానికి తక్షణమే రూ.600 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి
ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారమివ్వాలి
50 శాతం రాయితీపై ముడిసరుకులివ్వాలి.. ఉత్పత్తులను ప్రభుత్వమే కొనాలి

‘రాష్ట్రంలో నేతన్నలు, రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేంద్ర ప్రభుత్వంగానీ రాష్ట్ర ప్రభుత్వంగానీ చలించడం లేదు. అసలు ప్రభుత్వం ఉన్నట్టా? లేనట్టా?’ అని యువనేత వైఎస్ జగన్ ఘాటుగా ప్రశ్నించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో 12 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న చేనేత కార్మికులను శనివారం కలుసుకున్న ఆయన వారి ఆందోళనకు సంఘీభావం తెలిపారు. అనంతరం అక్కడవేలాదిగా గుమికూడిన ప్రజానీకాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..  
ప్రభుత్వం మొద్దునిద్రపోతోంది

‘రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత అత్యధిక శాతం మంది ఆధారపడిన రంగం చేనేతే. ముడిసరుకుల ధరలు విపరీతంగా పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగిపోయింది. కానీ.. నేతన్నలు తయారు చేసిన ఉత్పత్తులకు మాత్రం మార్కెట్లో సరైన ధరలు లభించడం లేదు. దీని వల్ల నేతన్నలకు నష్టాలే మిగులుతున్నాయి. చేనేత పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోవడం వల్ల విధిలేని పరిస్థితుల్లో మగ్గాలను చుట్టేశారు. చేయడానికి పనుల్లేక.. పూటగడవని దుస్థితిలో నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే వారం రోజుల్లో ముగ్గురు నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్రంలో 26 మంది అసువులు బాశారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం కళ్లు తెరవడం లేదు. మొద్దునిద్ర పోతోంది.’
రేషం దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి..
‘ఒక్క అనంతపురం జిల్లాలో ఉన్న నేత కార్మికులకే ఏడాదికి 12 లక్షల కేజీల పట్టుదారం(రేషం) అవసరమైతే.. జిల్లాలో కేవలం 2.30 లక్షల కేజీల పట్టుదారం మాత్రమే ఉత్పత్తి అవుతుంది. కర్ణాటక నుంచి 4.50 లక్షల కేజీలు దిగుమతి చేసుకుంటుంటే.. తక్కిన 5.20 లక్షల కేజీల కోసం చైనా వైపు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం మల్బరీ సాగును ప్రోత్సహించి ఉంటే ఈ పరిస్థితి ఏర్పడేకాదు. రేషం కోసం చైనా వైపు చూడాల్సిన పరిస్థితులు ఏర్పడటం వల్లే ముడిసరుకుల ధరలు పెరిగిపోయాయి. రేషం ధరలు ఏడాది క్రితం రూ.1,600 ఉంటే.. ఇప్పుడు రూ.3,400కు పెరిగింది. దాంతో ఉత్పత్తి వ్యయం పెరిగిపోయింది. చీరలను మాత్రం ఆ ధరలకు కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. చేనేత పరిశ్రమ సంక్షోభంలో పడటం వల్ల ధర్మవరంలోనే 60 వేలకుపైగా మగ్గాలు మూతపడ్డాయి. కార్మికులందరూ వీధిన పడ్డారు. తినడానికి అన్నం కూడా లేక నేతన్నలు ఆకలికేకలు, ఆర్తనాదాలు చేస్తోంటే.. అవి ప్రభుత్వానికి విన్పించడం లేదా?’
నాడు ఎన్‌టీఆర్.. ఆ తర్వాత వైఎస్..
‘చేనేత పరిశ్రమను ఒకప్పుడు దివంగత నేత ఎన్.టి.రామారావు ఆదుకుంటే.. ఆ తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేయూతనిచ్చారు. ఎన్‌టీఆర్, వైఎస్సార్ మినహా ఏ ఒక్కరూ నేతన్నలను ఆదుకోలేదు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సీఎంగా పనిచేసిన కాలంలో రాయితీలన్నీ ఎత్తివేసి నేతన్నల నడ్డివిరిచారు. వైఎస్ రాజశేఖరరెడ్డి నేతన్నలకు ఎన్నో రాయితీలు కల్పించి.. ఉత్పత్తి చేసిన వస్తువులను ఆప్కో ద్వారా కొనుగోలు చేయించి, ఆదుకున్నారు. అందువల్లే వైఎస్ పాలనలో చేనేత రంగం మెరుగ్గా ఉండేది. నేతన్నలను ఆదుకోవాలనే లక్ష్యంతో రూ.312 కోట్ల రుణాలను వైఎస్ మాఫీ చేశారు. కానీ.. వైఎస్ నిర్ణయాన్ని ప్రభుత్వం ఇప్పటివరకూ అమలు చేయకపోవడంలో ఆంతర్యమేమిటి? అసలు నేత కార్మికుల రుణాలను మాఫీ చేస్తారో లేదో ఈ ప్రభుత్వం చెప్పాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దునిద్రపోతుండటం వల్లే చేనేత పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయింది.’
ప్రభుత్వమా.. ప్రతిష్టకు పోవద్దు
‘వైఎస్ జగన్ ధర్మవరానికి వచ్చారని.. నేత కార్మికుల ఆందోళనకు సంఘీభావం తెలిపారని.. ఇప్పుడు స్పందిస్తే ఆ క్రెడిట్ జగన్‌కే దక్కుతుందని ప్రభుత్వం ప్రతిష్టకు పోవద్దు. విధిలేని పరిస్థితుల్లో ఆకాశం వైపు చూస్తూ దేవుడా నువ్వే మాకు దిక్కు అని నేతన్నలు కన్నీరు కారుస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా నేత కార్మికుల కన్నీళ్లు తక్షణమే తుడవాలి.’
ఈ డిమాండ్లు తీర్చండి
దీక్ష చేస్తున్న నేత కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న జగన్.. వారి తరఫున ప్రభుత్వం ముందు పెట్టిన డిమాండ్లివీ..
చేనేత రంగానికి తక్షణమే రూ.600 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి.
ప్రతి చేనేత కార్మికుడికీ రూ.లక్ష చొప్పున పావలా వడ్డీకే రుణం ఇప్పించాలి.
ఆత్మహత్యలు చేసుకున్న రైతు, నేతన్నల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించాలి.
50 శాతం రాయితీపై ముడిసరుకులను నేతన్నలకు సరఫరా చేయాలి.
నేతన్నలు ఉత్పత్తి చేసిన ఉత్పత్తులను ప్రభుత్వమే కొనాలి.
పవర్‌లూమ్స్ నియంత్రించడానికి జిల్లాకు ఒక ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని ఏర్పాటుచేయాలి.
అనారోగ్యం కారణంగానే ఎమ్మెల్యే రాలేదు
‘అనారోగ్యంతో ఉన్నానని, కార్యక్రమానికి రాలేనని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నాకు ఫోన్ చేసి చెప్పారు. అందుకే ఆయన ఈ కార్యక్రమానికి రాలేదు’ అని యువనేత జగన్ చెప్పారు. దీక్షకు సంఘీభావం తెలిపే కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి హాజరు కాలేదు. దీంతో ఈ కార్యక్రమాన్ని ధర్మవరం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తాడిమర్రి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇదే సందర్భంలో పలువురు పట్టణ వాసులు ఎమ్మెల్యే గైర్హాజరుపై పలు రకాలుగా చర్చించుకున్నారు. అయితే ఈ విషయంపై జగన్ తన ప్రసంగం పూర్తయ్యాక ప్రత్యేకించి చెప్పడంతో చర్చకు తెరపడింది.
 ప్రతి దారీ.. జనహోరే
పులివెందుల నుంచి ధర్మవరం దాకా జగన్ కోసం బారులు తీరిన జనం..
దీక్షా శిబిరానికి అతికష్టంపై చేరిన యువనేత
నేత కార్మికుల కోసం పోరాడతానని భరోసా
కిక్కిరిసిన ధర్మవరం సెంటర్‌లో ఉద్వేగభరిత ప్రసంగం
 అనంతపురం జిల్లా ధర్మవరంలో 12 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న చేనేత కార్మికులను పరామర్శించడానికి వెళ్లిన యువనేత జగన్‌కు దారిపొడవునా ప్రజలు నీరాజనం పలికారు. శనివారం మధ్యాహ్నం పులివెందుల నుంచి బయల్దేరిన ఆయన ముదిగుబ్బ, బత్తలపల్లి మీదుగా ధర్మవరం చేరుకున్నారు. ఆయన్ను చూడ్డానికి, చేయి కలపడానికి తరలివచ్చినవారితో ధర్మవరం పట్టణ వీధులన్నీ ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయాయి. కళాజ్యోతి సర్కిల్ నుంచిగాంధీ నగర్ వరకు, ఎన్టీఆర్, వైఎస్‌ఆర్ సర్కిల్ నుంచితేరు బజారు వరకు జనమే జనం. రోడ్డుకిరువైపులా ఉన్న మిద్దెలపై కూడా అభిమానులు నిండిపోయారు. వైఎస్‌ఆర్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన దీక్షల శిబిరం వద్దకు వెళ్లి చేనేత కార్మికులకు జగన్ సంఘీభావం తెలిపారు. వారి సమస్యలు, డిమాండ్లు అడిగి తెలుసుకున్నారు. తాను అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. నేతన్నల తరఫున మడమ తిప్పకుండా పోరాడతానని హామీ ఇచ్చారు. అనంతరం వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి చేనేత సమస్యలపై మాట్లాడారు.

యువనేత వైఎస్ జగన్ శనివారం ఉదయం పులివెందుల నుంచి బయల్దేరి ఉదయం 11.20కు అనంతపురంజిల్లా ముదిగుబ్బ మండలం దొరిగల్లుకు చేరుకున్నారు. దొరిగల్లు రోడ్డులో మహిళలు అధిక సంఖ్యలో చేరి.. బాణసంచా కాలుస్తూ వేచిచూశారు. జగ న్ కాన్వాయ్‌ను చూడగానే వారు సైతం ఈలలు, కేకలు వేశారు. కాన్వాయ్ ఆపాల్సిందేనంటూ నినాదాలు చేశారు. వీరి కోరిక మేరకు జగన్ వాహనం నుంచి కిందకు దిగి ‘బాగున్నారా’ అంటూ ఆప్యాయంగా పలుక రించి ముందుకు కదిలారు. ఈ సందర్భంగా ఓ మహిళ యువనేతకు అరటిపండు తినిపించి రాఖీ కట్టారు. మధ్యాహ్నం 12 గంటలకు ముదిగుబ్బకు చేరుకున్నారు. అక్కడ వేలాది జనం జననేతకు ఘనస్వాగతం పలికారు. ముదిగుబ్బ నుంచి బత్తలపల్లి రహదారికి ఇరువైపులా ఉన్న గ్రామాల ప్రజలు రోడ్డుపైకి వచ్చి.. యువనేతను చూడటానికి ఎగబడ్డారు. దాంతో.. బత్తలపల్లికి చేరుకోవడానికి గంట సమయం పట్టింది. మధ్యాహ్నం 1.30కు ధర్మవరం శివారు ప్రాంతాలకు చేరుకున్నారు. అక్కడి నుంచి చేనేత కార్మికుల రిలే నిరాహారదీక్షలు చేస్తున్న ప్రాంతానికి చేరుకునే సరికి 45 నిమిషాలు పట్టింది. రోడ్లన్నీ జనసంద్రాలవడంతో దీక్షల శిబిరం వద్దకు అతికష్టంమీద ఆయన చేరుకున్నారు. ఇక్కడ రికార్డు స్థాయిలో ప్రజలు పోటెత్తడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరిచింది. నేతన్నలను కలిసిన అనంతరంజగన్ బెంగళూరు వెళ్లారు. మార్గమధ్యంలో అభిమానుల కోరిక మేరకు పెనుకొండ, బెహలూల్‌షా దర్గా, సోమందపల్లెలో సైతం వాహనం నుంచి బయటకు వచ్చి అభివాదం చేశారు. బెంగళూరు నుంచి విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు.
లక్ష్య దీక్షలో ప్రముఖంగా ప్రస్తావించిన యువనేత
చేనేత పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోవడంతో మగ్గాలు చుట్టేసిన కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్మవరంలోని వైఎస్‌ఆర్ సర్కిల్‌లో రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారు. ఈ విషయాన్ని రైతులు, నేతన్నలకోసం విజయవాడలో నిర్వహించిన లక్ష్య దీక్ష ప్రారంభ, ముగింపు సభల్లో జగన్ ప్రముఖంగా ప్రస్తావించారు. లక్ష్య దీక్ష పూర్తయిన తర్వాత.. నేతన్నల ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు శనివారం ధర్మవరంలో పర్యటించాలని నిర్ణయించారు. అయితే ప్రభుత్వం పోలీసులపై ఒత్తిడి తెచ్చి శుక్రవారం తెల్లవారుజామునే రిలే నిరాహారదీక్షల శిబిరాన్ని ఎత్తివేయించింది. శుక్రవారం నుంచి నేత కార్మికులు మండుటెండలోనే రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారు.
 

Friday, December 24, 2010

రైతును విస్మరిస్తే.. మూడినట్టే * మూడేళ్లలోపే డిపాజిట్లు గల్లంతవుతాయి: జగన్

* ‘లక్ష్య దీక్ష’ ముగింపు సభలో సర్కారుకు హెచ్చరిక
* సర్కారు ప్యాకేజీ ప్రకటించక ముందు 42 మంది.. ప్రకటించాక 84 మంది రైతులు చనిపోయారు
* అయినా ఈ ప్రభుత్వానికి సిగ్గు రావడం లేదా?
* లక్షల మంది 48 గంటలపాటు దీక్ష చేస్తే స్పందించరా?
* 6 రోజులు దీక్ష చేసినా బాబుకు షుగర్, బీపీ తగ్గలేదంట... దీన్ని బట్టి చూస్తే.. ప్రతిపక్షం, ప్రభుత్వం కుమ్మక్కయ్యాయనిపిస్తోంది
* అన్నదాతలు, నేతన్నల తరఫున ఉద్యమాలు ముమ్మరం చేస్తాం..
.

లక్షల మంది రైతులు, నేతన్నలు తమను ఆదుకోవాలని వేడుకుంటూ 48 గంటలపాటు నిరాహార దీక్ష చేస్తే.. కనీసం స్పందించని రాష్ట్ర ప్రభుత్వంపై యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. వర్షాల దెబ్బకు పంట కోల్పోయి గత పదిహేను రోజుల్లో 126 మంది రైతులు ప్రాణాలు కోల్పోతే.. చీమకుట్టినట్లయినాలేని ఈ సర్కారును ఏమనాలని ప్రశ్నించారు. ‘ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉందని రైతుల సమస్యలపై ఉదాసీనంగా వ్యవహరిస్తే.. మూడేళ్లలోపే మీ డిపాజిట్లు గల్లంతవుతాయి’ అని హెచ్చరించారు.

అన్నదాతలు, నేతన్నల డిమాండ్లు నెరవేర్చడం కోసం వారిపక్షాన మరిన్ని ఉద్యమాలు చేస్తామని ప్రకటించారు. విజయవాడ కృష్ణాతీరంలో యువనేత చేపట్టిన 48 గంటల ‘లక్ష్య దీక్ష’ ముగింపు సందర్భంగా లక్షలాది మంది ప్రజలను ఉద్దేశించి గురువారం జగన్ ప్రసంగించారు. రైతన్నను ఆపద్బాంధవుడిలా ఆదుకున్న దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తి ఏమైందంటూ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. మహానేత బతికున్నట్లయితే ఇలా రైతులు, నేతన్నలు రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చేది కాదన్నారు. రైతులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని, నాడు అన్నదాతల మరణాలను పరిహాసమాడి నేడు వారి కోసం దీక్ష చేస్తున్నానంటున్న చంద్రబాబును దునుమాడుతూ సాగిన యువనేత ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..

కనిపించడం లేదా?: ‘చరణ్‌సింగ్ జన్మదినాన్ని పురస్కరించుకుని డిసెంబరు 23ను ‘రైతు దినం’గా కేంద్రం ప్రకటించిన ఈ రోజున లక్షల మంది రైతులు తమ న్యాయమైన కోర్కెల సాధనకు రోడ్లపైకి వచ్చి దీక్షలు చేయాల్సిరావడమే దురదృష్టం. వరుస తుపానులు, వర్షాలతో చేతికందిన పంట నీటిపాలై, నోటి దగ్గర ముద్ద నేలపాలై.. ఇలా లక్షల మంది 48గంటలపాటు అన్న పానీయాలు మానేసి, చలనక ఎండనకా చేస్తున్న దీక్ష కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనిపించడంలేదా? వినిపించడం లేదా? రైతుల ఆక్రందనపై ఏమాత్రమూ స్పందించకుండా బండరాయిలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది.’

126 మంది రైతుల మృతి: ‘గడిచిన 15 రోజుల్లో 126 మంది రైతులు చనిపోవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. వీరిలో ఎక్కువ శాతం మంది కౌలు రైతులే. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ కేవలం కంటితుడుపు చర్యే. ముఖ్యమంత్రి రైతులకు ప్యాకేజీ ప్రకటించక ముందు 42మంది చనిపోతే.. ప్యాకేజీ ప్రకటించాక 84 మంది ప్రాణాలు విడిచారు. దీన్ని బట్టి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ రైతుల్లో ఏమాత్రమూ విశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని కలిగించలేదన్న అంశం తేటతెల్లమవుతున్నా.. ఈ ప్రభుత్వానికి ఇంకా సిగ్గురావడం లేదా?’

బాబు, ప్రభుత్వం కుమ్మక్కు?: ‘రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు అలసత్వం వహిస్తే నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం ఈ వేళ రైతుల ఆందోళనకు మోకాలడ్డే కుయుక్తులకు పాల్పడుతోంది. లక్షల మంది రైతులు, నేతన్నలు 48 గంటలపాటు దీక్షకు ఉపక్రమిస్తే, దీక్ష మొదలయ్యేరోజు చంద్రబాబు బంద్ పిలుపు ఇచ్చారు. ముగింపురోజు రహదారుల దిగ్బంధం అని పిలుపు ఇచ్చారు. ఆరు రోజుల నిరాహార దీక్ష అనంతరం కూడా చంద్రబాబుకు బీపీ, షుగర్ లెవల్స్ ఏమాత్రం తగ్గలేదట. దీన్నిబట్టి చూస్తే ప్రభుత్వం, చంద్రబాబు కుమ్మక్కయ్యారన్న అనుమానం కలుగుతోంది.’

ఆ అదృష్టం నాకు దక్కింది..
 ‘లక్ష్య దీక్ష’ పూర్తయిన సందర్భంగా యువనేత జగన్‌కు నిమ్మరసమిచ్చి దీక్ష విరమింపజేసే అవకాశం ఓ సాధారణ రైతుకు రావడంతో ఆయన ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. కృష్ణాజిల్లా మొవ్వ మండలం కాళ్లపాలెం గ్రామానికి చెందిన రైతు వీరనాగేశ్వరరావు యువనేతతోపాటే 48 గంటలపాటు అన్నపానీయాలు మాని దీక్ష చేశారు.జగన్‌కు ఆయన నిమ్మరసం తాగించిన అనంతరం ఆయనకు జగన్ స్వయంగా పళ్లరసం తాగించి దీక్ష విరమింపజేశారు.
అనంతరం నాగేశ్వరరావు మైకు పట్టుకుని ఉద్వేగభరితంగా మాట్లాడుతూ.. ‘జగన్‌తో దీక్ష విరమింపజేసే అదృష్టం నాకు దక్కడం ఆనందంగా ఉంది. ఆయనను కలిసి మా బాధలు చెప్పుకుంటే ఏదైనా సాయం అందుతుందని ఆశతో వచ్చాం. మేం జగన్‌కు మద్దతుగా ఉంటాం. రైతులందరూ జగన్ పక్షమే’ అని నినదించారు. తమ కోసం జగన్ నిరాహారదీక్ష చేస్తున్నారని తెలియడంతో మంగళవారం పొద్దున్నే తమ ఊరి నుంచి మొవ్వ చేరుకుని, అక్కడి నుంచి బస్సులో విజయవాడ వచ్చి దీక్షలో పాల్గొన్నానని ఆయన తెలిపారు.
సర్కారు, చంద్రబాబు దొందూ.. దొందే
‘తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు బాబు ఇచ్చిన ఇన్‌పుట్ సబ్సిడీ కేవలం రూ.600. వ్యవసాయమే దండగన్న పెద్ద మనిషి ఆయన. పరిహారం కోసమే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ.. రైతుల మరణాలను పరిహాసం చేసిన వ్యక్తి చంద్రబాబు. ఉచిత కరెంటు ఇస్తామని దివంగత నేత హామీ ఇస్తే.. ఇక ఆ తీగలు బట్టలు ఆరేసుకునేందుకు తప్ప ఎందుకూ పనికిరావని పరాచకాలాడిన పాలకుడు చంద్రబాబు. రైతుల సమస్యల పరిష్కారంలో ఆరోజు చంద్రబాబు.. ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వమూ దొందూ..దొందే.’

ఈ డిమాండ్లేమీ గొంతెమ్మ కోర్కెలు కాదే..
‘ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఏదోమేరకు ప్రభుత్వం చేయూతనివ్వాల్సిన అవసరం ఉందని భావించే రైతుల తరఫున నేను కొన్ని నిర్దిష్టమైన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచాను. ఆ డిమాండ్లేమీ గొంతెమ్మ కోర్కెలు కాదు.. అవి చాలా న్యాయమైనవి. హేతుబద్ధమైనవి. రైతు తిరిగి నిలదొక్కుకోవాలంటే ఆమాత్రమైనా సాయం అందించాలని దీక్షకు ముందు ప్రభుత్వాన్ని చేతులు జోడించి వేడుకున్నాను. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. రుణమాఫీ కింద రూ. 1,800 కోట్లు ఇచ్చేందుకు దివంగత వైఎస్ ఒక్క నిమిషంకూడా ఆలోచించలేదు. రైతులను ఆదుకోవడంలో ఆ మహానేత స్ఫూర్తి ఈ ప్రభుత్వానికి లేదా?’

ఇప్పటికైనా కళ్లు తెరవండి : ‘ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవకపోతే రైతుల పక్షాన మరింత తీవ్రంగా ఉద్యమాలు చేస్తాం. మరింత ఒత్తిడి తెస్తాం. ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ సమయం ఉంది కదా అన్న ఉదాసీనతతో ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోకపోతే.. మూడేళ్లలోపే ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లుతాయి.. డిపాజిట్లు గల్లంతవుతాయి.’

మరణించిన రైతులకు సంతాపం
పంట నష్టాన్ని తట్టుకోలేక ఇటీవల మరణించిన 126 మంది రైతుల ఆత్మ శాంతి కోసంజగన్ పిలుపు మేరకు ప్రాంగణంలోనివారందరూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఆ తర్వాత కృష్ణా జిల్లా మొవ్వ మండలం కోళ్లపాలెంకు చెందిన రైతు కొనకళ్ల వీరనాగేశ్వరరావు ఇచ్చిన నిమ్మరసం తాగి జగన్ దీక్ష విరమించారు. రెండు రోజులుగా తనతోపాటు దీక్ష చేస్తున్న నాగేశ్వరరావుకు కూడా పళ్లరసం ఇచ్చి యువనేత ఆయనతో దీక్ష విరమింపజేశారు.

రైతులను ఆదుకోవడమంటే ఇలాగా?
* వర్షాలతో నష్టపోయిన రైతును ఆదుకుంటామంటూ ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీపై జగన్ తన ప్రసంగంలో మండిపడ్డారు. ప్యాకేజీ ఎంత ఘోరంగా ఉందో వివరిస్తూ.. సర్కారును నిలదీశారు.
* ‘ఇన్‌పుట్ సబ్సిడీని రెట్టింపు చేసి *3600 చెల్లించాలని అడిగితే.. గతంలో ఇస్తున్న రూ. 800పైన కేవలం రూ.600మాత్రమే పెంచడం న్యాయమా? ప్రభుత్వం పెంచిన రూ. 600తో ఒక్క యూరియా బస్తా కూడా రాదే?
* వచ్చే రబీకి విత్తనాలు, ఎరువులు ఉచితంగా ఇవ్వాలని కోరితే, ఉలుకూ పలుకూ లేకుండా ఉంది. తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని అడిగితే... గ్రేడ్లు, శాతాల లెక్కలు చెపుతున్న ప్రభుత్వాన్ని ఏమనాలి? 50 శాతంకన్నా ఎక్కువ తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే.. ఆ రైతు బతుకు ఏం కావాలి? ప్రభుత్వం ఇలా వ్యాపారి పాత్ర పోషిస్తే ఈ కష్టకాలంలో రైతుల గతి ఏం కావాలి?
* అన్నింటికీ మించి కౌలురైతుల దయనీయ పరిస్థితిపై కనీస కనికరం కూడా లేకుండా వ్యవహరిస్తున్నారు. పావలా వడ్డీ రుణాలతో పైసాపైసా పొదుపు చేసుకున్న సొమ్మును పెట్టుబడిగా పెట్టి కౌలుభూములు తీసుకుని వ్యవసాయం చేసేవారిలో ఎక్కువ మంది మహిళలున్నారు. వారందరూ ఈ రోజు పీకలలోతు అప్పుల్లో కూరుకుపోయారు. ఆ అక్కచెళ్లెలను ఆదుకోవాలన్న ఆలోచన చేయని ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి?
* ధర్మవరంలో పదిరోజులుగా నేతన్నలు దీక్షలు చేస్తుంటే.. చీమకుట్టినట్టయినా లేని ఈ ప్రభుత్వానికి పోయేకాలం దాపురించింది. మహానేత ఏర్పరచిన ఈ ప్రభుత్వం ఇంతగా రైతువ్యతిరేకిగా మారిపోయిందని చెప్పేందుకు సిగ్గుగా ఉంది.

వైఎస్ లేకపోవడమే పెద్ద విపత్తు!
  ప్రస్తుతం రాష్ట్ర రైతులకు వరదలకన్నా వైఎస్ లేకపోవడమే పెద్ద విపత్తుగా పరిణమించిందని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహనరెడి ్డ అన్నారు. మహానేత వైఎస్ ఉన్నట్లయితే ఇలాంటి వరదలు ఎన్ని వచ్చినా రైతు గుండె చెదరకుండా.. ఆదుకునేవారని చెప్పారు. ‘లక్ష్య దీక్ష’ముగింపు సమావేశానికి హాజరైన మేకపాటి మాట్లాడుతూ.. ‘విపత్తులు సంభవించినప్పుడే ప్రజలకు బాసటగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై మరింత ఎక్కువగా ఉంది. దురదృష్టవశాత్తు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకోవడంలేదు’ అని పేర్కొన్నారు. రైతుల సమస్యలపై స్పందించడంలో జగన్ తండ్రికి మించిన తనయుడన్న విషయం ఈ దీక్ష ద్వారా రుజువైందన్నారు.

‘2004, 2009 ఎన్నికల్లో వైఎస్ సాధించిన విజయాల కారణంగానే.. ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగిందని అందరూ అంటుంటారు. అయితే. అమెరికాతో అణు ఒప్పందం సందర్భంలో వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకున్నప్పుడు ప్రమాదపుటంచున పడిపోయిన కేంద్రాన్ని ఒడ్డుకు చేర్చడంలో వైఎస్ కృషిని మరచిపోరాదు’ అని అన్నారు. కాంగ్రెస్ నేతలు జగన్‌పై అవాకులు చవాకులు విసరడం మంచిది కాదన్నారు. ‘తొందరపడి ఎగతాళి చేయకండి. సవాళ్లు విసరకండి. భవిష్యత్‌లో జగన్ అవసరం ఢిల్లీకి వస్తుంది’ అని వారినుద్దేశించి ఆయన హెచ్చరిక చేశారు.


ప్రభం‘జనం’

‘లక్ష్య దీక్ష’కు ఆఖరి రోజూ పోటెత్తిన రైతన్నలు, ప్రజలు
 

వరుస వర్షాలతో అతలాకుతలమైన రాష్ట్ర రైతులకు బాసటగా యువనేత జగన్ తలపెట్టిన ‘లక్ష్య దీక్ష’ కార్యక్రమం అన్ని కోణాల్లోనూ సంపూర్ణంగా విజయవంతమైంది. వైఎస్ అకాల మరణం తర్వాత ఏర్పడ్డ ఖాళీని భర్తీచేయగలిగే శక్తి ఒక్క జగన్‌కే ఉందన్న నమ్మకం అటు ప్రజల్లోనూ ఇటు నాయకుల్లోనూ ఈ 48 గంటల దీక్ష కలుగజేసింది. ఆపద సమయంలో రైతుపట్ల ఎంతో ఉదారంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వ నేతలు కేవలం కంటితుడుపు చర్యలకే పరిమితమైతే...వారు మహానేత వైఎస్ రాజకీయ వారసులెలా అవుతారన్న సూటి ప్రశ్న ప్రజల మెదళ్లలో నాటుకుంది.

ఓదార్పు కోసం.. రాజీనామాదాకా..

దివంగత నేత మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర కాంగ్రెస్‌తో క్రమేపీ దూరాన్ని పెంచుతూ వచ్చింది. ఎలాగైనా జగన్‌ను బలహీనపరచాలన్న అధిష్టానం ప్రయత్నాలు చివరకు దివంగత నేత కుటుంబంలో చీలిక తెచ్చేవరకూ వెళ్లాయి. దీంతో పార్టీకీ, ఎంపీ పదవికి రాజీనామా చేసి జగన్ బయటకొచ్చారు. అయితే.. ఎంతటివారైనా పార్టీని వీడితే జీరోలే అవుతారని, జగన్‌కున్న సొంత బలం ఏంటో ఇప్పుడు తెలుస్తుందని.. ఎమ్మెల్యేల బలం లేకనే ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం చేయనని జగన్ అంటున్నారని.. ఇలా ఎన్నో వ్యాఖ్యానాలు, విశ్లేషణలు వెల్లువెత్తాయి. ఇవన్నీ ‘లక్ష్య దీక్ష’తో పటాపంచలైపోయాయి. జనంలో జగన్‌కున్న బలాన్ని, అన్నదాత మదిలో ఇప్పటికీ పదిలంగా ఉన్న మహానేత జ్ఞాపకాలను ఈ దీక్ష ఢంకా భజాయించి చెప్పిందని పలువురు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

జగన్‌పైనే ఆశలు: అకాల వర్షాల ధాటికి అతలాకుతలమైన జిల్లాల్లో పర్యటించిన జగన్‌కు కోటి ఆశలతో రైతన్నలు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. మీ నాన్న బతికుంటే మాకు ఈ ఇబ్బందులు వచ్చేవికావు. నీవైనా మాకో దారి చూపమంటూ... ఆశగా రైతన్నలు చూసిన చూపులు జగన్‌కు దిశానిర్దేశం చేశాయనవచ్చు. ఆయన పర్యటన క్రమంలోనే ఎక్కడికక్కడ ప్రజలు, ద్వితీయశ్రేణి నాయకులు జగన్ బాట పట్టడంతో స్థానిక ఎమ్మెల్యేలకు తమ వైఖరి ఏంటో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పలు నియోజకవర్గాల్లో అప్పటికప్పుడు కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసుకుని వారి అభీష్టానికి అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు కొందరు. ఈ నేపథ్యంలో జగన్ ఇచ్చిన 48గంటల నిరాహార దీక్ష పిలుపునకు రాష్టవ్య్రాప్తంగా అనూహ్య స్పందన వచ్చింది.


బాబు, సర్కారు.. కుమ్మక్కు కుట్ర..:
యువనేత దీక్ష ప్రకటన చేసిన వెంటనే.. క్రెడిట్ ఎక్కడ ఆయనకు పోతుందో అన్న ఆదుర్దాతో చంద్రబాబు హడావుడిగా నిరాహార దీక్షకు పిలుపు ఇచ్చారు. రైతులు వీటిని వేటినీ పట్టించుకోలేదు. రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో దీక్ష తొలిరోజు నలుమూలల నుంచీ దాదాపు రెండు లక్షలకుపైగా రైతులు విజయవాడ కృష్ణాతీరానికి తరలివచ్చారు. ఆ జన ప్రవాహానికి అడ్డుకట్టలు వేసేందుకు అటు ప్రభుత్వమూ, ఇటు చంద్రబాబు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. కృష్ణా తీరానికి చేరుకున్న జనసమూహం ముందు నిల్చొని జగన్ చేసిన ప్రసంగం.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సింహనాదమే అయ్యింది. జగన్ దీక్ష ప్రాధాన్యతను తగ్గించే దిశగా ప్రతిపక్షనేతతో కుమ్మక్కయిన ప్రభుత్వ కుటిల యత్నాలు బట్టబయలయ్యాయి. జగన్ చేపట్టిన లక్ష్య దీక్ష ఏక కాలంలో అటు ప్రభుత్వ డొల్లతాన్ని, ఇటు ప్రతిపక్ష కుటిల నీతినీ ఎండగట్టడమే కాక, ఈ రాష్ట్రంలో రైతుల సమస్యలపై స్పందించే నేత జగన్ ఒక్కడే అన్న భరోసాను అన్నదాతకు ఇచ్చింది.

జగన్ వెంట జనం.. జనంతోనే నేతలు


దీక్ష రెండోరోజూ అదే జోరు కొనసాగింది. రెండోరోజు దీక్షలో జగన్ ప్రసంగాలజోలికి వెళ్లకుండా.. దీక్షకు వచ్చిన ప్రతి ఒక్కరినీ వ్యక్తిగతంగా కలుసుకునేందుకే కేటాయించారు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేదాకా ఒక్కొక్కరినీ పలుకరిస్తూ ఉన్నారు. రాత్రి చలిని, పగలు ఎండను లెక్కచేయకుండా ఓపిగ్గా ఒక్కొక్కరిని పలుకరించే తీరు యువనేతను జనాలకు మరింత దగ్గర చేసింది. రెండోరోజు దీక్షకు మరో ప్రత్యేకత కూడా ఉంది. కనీవినీ ఎరుగని రీతిలో దీక్ష శిబిరం వద్ద మహిళలు బారులు తీరారు. ఆ జన ప్రభంజనం రాష్టవ్య్రాప్తంగా పలువురు ఎమ్మెల్యేలనూ దీక్షా శిబిరం వైపు నడిపించింది. పార్టీ క్రమశిక్షణలు, బుజ్జగింపులు ప్రజా ఆకాంక్షల ముందు వెలవెలబోయాయి. ఇద్దరు ఎంపీలు, 32మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు, పలువురు జడ్పీ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు జగన్‌కు సంఘీభావంగా ‘లక్ష్యదీక్ష’ వేదిక నెక్కారు. ఈ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం తనకు లేదని, పార్టీకి రాజీనామా చేసిన రోజు జగన్ ప్రకటించినప్పుడు... కూల్చే ఉద్దేశం లేక కాదు... బలం లేక జగన్ ఆమాట అంటున్నారు... అన్న వారి నోటికి తాళాలు పడ్డాయి.
జగన్ పార్టీ పెట్టక ముందే 32మంది ఎమ్మెల్యేల మద్దతుకు వేదిక అయ్యింది ‘లక్ష్య దీక్ష’.

పోటెత్తిన జనం:
లక్ష్య దీక్ష ముగింపు నేపథ్యంలో రహదారుల దిగ్బంధానికి తెలుగుదేశం పిలుపునిచ్చిన ప్పటికీ.. దీక్షా ప్రాంగణానికి జనం భారీఎత్తున తరలివచ్చారు. ఉదయం 8 గంటల నుంచే ప్రాంగణం వద్దకు వివిధ జిల్లాల నుంచి జనం చేరుకోవడం మొదలైంది. 12 గంటలకు సభ ముగిసే వరకూ వస్తూనే ఉన్నారు. దీంతో కృష్ణా తీరం కిక్కిరిసిపోయింది. ఎండ తీవ్రంగా ఉన్నా లెక్కచేయకుండా మూడు గంటలపాటు నిలబడి ఆసక్తిగా నేతల ప్రసంగాలు విన్నారు. మంద కృష్ణమాదిగ, జూపూడి ప్రభాకర్, కొండా సురేఖ మాట్లాడుతుండగా అరుపులు, ఈలలు, చప్పట్లతో ప్రాంగణాన్ని హోరెత్తించారు. కొండా సురేఖ ఆటోగ్రాఫ్ కోసం జనం ఉత్సాహం చూపారు.

యువనేతను చూసివెళ్లిపోకుండా వేలాదిమంది ఆయనతో చేయి కలపాలని వేదిక ముందు ప్రాంతంలోకి దూసుకొచ్చారు. పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి వారిని ఆ ప్రాంతంలో కూర్చునేలా చేశారు. జగన్ 11.55 గంటలకు తన ప్రసంగాన్ని ప్రారంభించి 12.15 గంటలకు ముగించి, గత 15 రోజుల్లో మరణించిన 126 మంది రైతులకు సంతాపం తెలిపేందుకు రెండు నిమిషాలు మౌనం పాటించాలని కోరారు. అనంతరం సభ ముగిసినట్లు ప్రకటించగానే మహిళలు ఉవ్వెత్తున వేదికపైకి వెళ్లే మార్గంలోకి దూసుకొచ్చారు. రెండురోజులుగా దీక్షలో ఉండి అలసిపోయిన జగన్‌ను అనుయాయులు కిందకు తీసుకెళ్లిపోవడంతో మహిళలు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతలు నచ్చజెప్పి పరిస్థితిని వివరించడంతో వారు శాంతించారు.


ముగిసిన లక్ష్య దీక్ష..


మెతుకు ముట్టకుండా రైతుల కోసం చేసిన జగన్ దీక్షను గురువారం మరో రైతే వచ్చి విరమింపజేశారు. లక్షలాదిగా తరలివచ్చిన రైతన్నలు, చేనేత కార్మికులు, మహిళల జయజయధ్వానాల మధ్య జగన్ తన నిరాహార దీక్షను ముగించారు. దీక్ష మొత్తం మంగళవారం ఉదయం 11.00 గంటల నుంచి గురువారం మధ్యాహ్నం 12.15 గంటల వరకు జరిగింది. దీక్ష ముగింపు సందర్భంగా వైఎస్సార్ ప్రాంగణానికి నేతలు పెద్దఎత్తున తరలివచ్చారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ సహా అనేకమంది నేతలు దీక్షా శిబిరానికి వచ్చి జగన్‌కు మద్దతు ప్రకటించారు. ఎమ్మెల్యేలు పేర్ని వెంకట్రామయ్య(నాని), జోగి రమేష్, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆయనను పరామర్శించి ముగింపు సభలో పాల్గొన్నారు.

Thursday, December 23, 2010

ఈ ప్రభుత్వానికి పోయేకాలం వచ్చింది, భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు * లక్ష్యదీక్ష విర మణలో విరుచుకుపడిన జగన్

రైతు కోసం ఎంతో ఆలోచించి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన వై.ఎస్. రాజశేఖర రెడ్డి స్ఫూర్తి ఏమాత్రం లేని రాష్ట్ర ప్రభుత్వానికి పోయే కాలం వచ్చింది. అవునా కాదా అని వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారిపోయిందని ఆయన చెప్పారు. ఈ ప్రభుత్వంపై ఇలాంటి రైతు ఆందోళనలు ఇంకా ముమ్మరం చేస్తాం అని హెచ్చరించారు.

ఎంతో ఘోర విపత్తు సంభవించి రైతు దిక్కు తోచని స్థితిలో ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతోందని ఆయన విరుచుకుపడ్డారు. రైతు పండించిన ధాన్యం తడిచిపోతే, రంగు మారిపోతే ప్రభుత్వం కాక మరెవరు కొంటారని జగన్ ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో రైతు సోదరుడు ఏ గోదారిలోకి పోవాలి అని అడుగుతున్నా. ఇటువంటి పరిస్థితులలో కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఇక ఎవరు పట్టించుకోవాలి, తినడానికి లేని పరిస్థితిలో ప్రభుత్వం నిద్రపోతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతు సంక్షేమాన్ని విస్మరించడంలో నేటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దొందూ దొందేనని ఆయన విరుచుకుపడ్డారు. ప్రకృతి వైపరీత్యానికి తాళలేక ఆత్మహత్య చేసుకున్న రైతన్నల ఆత్మశాంతికి రెండు నిమిషాలు మౌనం పాటించిన అనంతరం ఒక రైతు ఇచ్చిన నిమ్మరసం త్రాగి జగన్ గురువారం 12 గంటలకు తమ 48 గంటల లక్ష్య దీక్ష విరమించారు.

దీక్ష విరమించే ముందు ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ వై.ఎస్. స్ఫూర్తి ఈ సర్కారుకు ఉందా ?
రైతుల పట్ల అనుసరిస్తున్న ఈ ప్రభుత్వ వైఖరి సరైనదేనా ? అని సభను ఉద్దేశించి ప్రశ్నించారు.

click here 

నేనున్నాననీ...
రెండు రోజులుగా మెతుకు ముట్టని జగన్ రైతుల బాధలు విని చలించిపోయారు. నేనున్నానని ఓదార్చారు. మహిళలు, విద్యార్థినులు అభిమాన నేత ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడ్డారు. బుధవారం కూడా పలువురు నేతలు, వారి కుటుంబ సభ్యులు జగన్‌ను కలిసి సంఘీభావం ప్రకటించారు.

‘ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యాన్ని కోల్పోవద్దు. మీకు అండగా నేను ఉంటాను అంటూ యువనేత వైఎస్ జగన్మోహనరెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న రైతులు, చేనేత కార్మికులను ఆదుకోవాలన్న డిమాండ్‌తో చేపట్టిన 48 గంటల సామూహిక నిరాహార దీక్షలో రెండోరోజు బుధవారం ఆయన రైతుల సమస్యలపై ముఖాముఖి చర్చించారు. దీక్ష ప్రారంభించి 30 గంటలు దాటిపోవడంతో బుధవారం సాయంత్రానికి యువనేత కొంచెం నీరసంగా కనపడ్డారు. అయినా తనను పలకరించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ నమస్కరిస్తూ, కొందరితో కరచాలనం చేస్తూ, వారి బాధలను శ్రద్ధగా వింటూ ఓదార్చారు.

పంట అంతా వర్షార్పణమైందయ్యా..
వరి, పత్తి, మిర్చి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఈ సందర్భంగా రైతులు వివరించారు. వరిసాగు కోసం ఎకరాకు రూ. 15 వేల నుంచి రూ. 25 వేలు ఖర్చు చేస్తే పంట వర్షార్పణమైందని, తడిసి ముద్దయిన పత్తి రంగుమారడంతో కొనే నాథుడే కరువయ్యాడని వాపోయారు. మిర్చిపంట కోలుకోలేని విధంగా దెబ్బతీసిందని గొల్లుమన్నారు. పంట నష్టం నమోదు సక్రమంగా జరగడం లేదని, ఈ విషయమై పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉంటే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదన్న అభిప్రాయాన్ని రైతులు వెలిబుచ్చారు. రైతన్నల దీనగాథలు విన్న యువనేత వారికి ధైర్యం చెప్పారు. నేనున్నానని ఓదార్చారు. మంచికాలం ముందుందని భుజం తట్టారు. ఆయన మాటలు వారిలో వ్యవ‘సాయం’పై కొత్త ఆశలు చిగురింపజేశాయి.

పూజ చేసిన అక్షింతలు తెచ్చి ఆశీర్వదించిన తూర్పు గోదావరి మహిళ

జగన్ ఆత్మీయ స్పర్శ కోసం మహిళలు క్యూ కట్టారు. ఉదయం నుంచి రాత్రి వరకూ దీక్షా శిబిరం వద్ద మహిళలు అధిక సంఖ్యలో కనిపించారు. జగన్‌తో కరచాలనం చేసేందుకు బారులు తీరారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తికి చెందిన ఆదెమ్మ కనకదుర్గ అమ్మవారి వద్ద పూజ చేసిన ఆక్షింతల్ని తెచ్చి జగన్ శిరస్సుపై వేసి అభిమానాన్ని చాటుకుంది.

వైఎస్ ఫొటోను చచ్చేదాకా దాచుకుంటా : మరో మహిళ అంతరంగం

అదే జిల్లాకు చెందిన మరో మహిళ వైఎస్‌ఆర్ ఫొటోను తెచ్చి వెనుక సంతకం చేయమని కోరింది. ఎందుకమ్మా అని జగన్ అడగ్గా, నువ్వు సంతకం చేసిస్తే నాన్న (వైఎస్‌ఆర్) ఫొటోను చచ్చేదాకా దాచుకుంటానని చెమ్మగిల్లిన కళ్లతో చెప్పింది. దీంతో జగన్ సంతకం చేశారు. పాఠశాల, కళాశాల విద్యార్థినులు ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడ్డారు. పోలీసులు బలవంతంగా లాగేస్తున్నప్పటికీ యువనేత సంతకం చేసే వరకూ కదల్లేదు. పసిబిడ్డల్ని జగనన్న ముద్దాడిన తీరు మహిళల్ని ఎంతగానో ఆక ట్టుకుంది.

పెరుగుతున్న సంఘీభావం

బుధవారం కూడా పలువురు నేతలు, వారి కుటుంబ సభ్యులు జగన్‌ను కలిసి సంఘీభావం ప్రకటించారు. శిబిరం వద్దకు రాలేనివారు తమ బంధువులను పంపుతున్నారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తల్లి, భార్య, సోదరులు, ఇతర కుటుంబ సభ్యులు బుధవారం మధ్యాహ్నం దీక్షా శిబిరానికి వెళ్లి జగన్‌కు సంఘీభావం ప్రకటించారు. జిల్లా నుంచి ప్రభుత్వ మాజీ విప్ సామినేని ఉదయభాను, నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప అప్పారావు జగన్‌ను కలిసి మద్దతు ప్రకటించారు. మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యే పేర్ని నాని బ్యానర్లతో వందలాది మంది దీక్షా శిబిరం వద్దకు తరలి వచ్చారు. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి సోదరుడు పద్మనాభరెడ్డి, రాజ్యసభ సభ్యుడు జేడీ శీలం సోదరుడు రవి తదితరులు జగన్‌కు సంఘీభావం ప్రకటించగా పలువురు ఫోన్‌లో జగన్‌ను పరామర్శించారు.

నేడు 9 గంటలకు ముగింపు సభ

జగన్ చేస్తున్న 48 గంటల సామూహిక నిరాహార దీక్ష గురువారం ముగియనుంది. ఉదయం 9 గంటలకు వైఎస్సార్ ప్రాంగణంలో ముగింపు సభను నిర్వహిస్తున్నట్లు ఏపీఐఐసీ మాజీ చైర్మన్ అంబటి రాంబాబు ప్రకటించారు. ఈ సభకు రైతులు, చేనేత కార్మికులు భారీసంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.

Wednesday, December 22, 2010

అకుంఠిత దీక్ష * మెతుకు ముట్టకుండా.. మడమ తిప్పకుండా

* జగన్‌తోపాటే దీక్ష కొనసాగిస్తున్న రైతులు, నేతన్నలు, ప్రజాప్రతినిధులు
* కృష్ణాతీరాన గజగజలాడిస్తున్న చలినీ లెక్కచేయని జనం
* రెండోరోజు అన్నదాతల బాధలు వినడానికే ప్రాధాన్యమిచ్చిన జగన్
* బుధవారమూ జనప్రవాహం.. పోటెత్తిన మహిళలు
* దీక్షకు మద్దతుగా 29 మంది ఎమ్మెల్యేల హాజరు..
* తరలివచ్చిన ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు... రైతన్నలకు భరోసా
* ‘లక్ష్యదీక్ష’ ప్రారంభమై రెండురోజులైనా స్పందించని సర్కారు
* కాంగ్రెస్ నాయకులను బుజ్జగించే యత్నాలకే ప్రాధాన్యం!
* నేడు 9 గంటల నుంచి దీక్ష విరమణ కార్యక్రమం


‘జగనన్న దీక్షకు వస్తుంటే మా మంత్రిగారు వద్దని ఫోన్ చేశారు. సమస్యలన్నీ తీరుస్తానన్నా లెక్కచేయలేదు. దీక్షకాడికి వచ్చి నిన్నటి నుంచీ ఇక్కడే ఉన్నా’..
- రైతు నన్నపనేని ఉల్లయ్య, గుంటూరు జిల్లా చిడుముక్కల వాసి

‘ఆదివారం రాత్రే ఇక్కడికొచ్చాం. మా ఓళ్లంతా తలా కొంత వేసుకుని లారీ మాట్లాడుకున్నాం. అది పట్టకపోతే కొందరు రైలుకొచ్చారు. మా పంటలన్నీ పోయాయి. మా బాధలు వైఎస్ బిడ్డకు చెప్పుకుందామని వచ్చాం’..
-అరవరెడ్డి, ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కొత్తూరు రైతు

‘పొలంలో పనులున్నాయ్.. కోతలు కోయాలి.. ఆ పని తర్వాతైనా చేసుకోవచ్చని మా కోసం కష్టపడుతున్న జగన్ కోసం వచ్చా’...
-మరో రైతు మోహన్‌రెడ్డి
..యువనేత వైఎస్ జగన్ ‘లక్ష్య దీక్ష’ చేస్తున్న వైఎస్‌ఆర్ ప్రాంగణంలో ఏ రైతును కదిలించినా ఇవే మాటలు.. ఇవే అనుభవాలు. నేతలు వద్దన్నా, తమకెన్నో పనులున్నా పక్కనపెట్టి.. తమ కోసం పోరాడుతున్న జగన్ కోసం తరలివచ్చిన అన్నదాతలు, చేనేత కార్మికులు యువనేతతోపాటే మొక్కవోని దీక్ష కొనసాగిస్తున్నారు. 48 గంటలు పూర్తయ్యేదాకా మెతుకు ముట్టబోమంటున్నారు. మంగళవారం నిరాహార దీక్ష మొదలు పెట్టిన జగన్‌తోపాటు రైతన్నలు, నేతన్నలు రాత్రంతా గజగజలాడించే చలిలోనే తమ దీక్షను కొనసాగించారు. అసలే చలికాలం.. దీనికితోడు కృష్ణాతీరం.. చల్లటి గాలులు.. అయినా వారు బెదరలేదు. రెండురోజుల నుంచి అక్కడే తిరుగుతూ, నేతల ప్రసంగాలు వింటూ ఎంతో ఓపిగ్గా టెంట్లలోనే గడుపుతున్నారు.

దీక్ష రెండో రోజు బుధవారం వివిధ జిల్లాల నుంచి వరుసగా వస్తున్న రైతులను వేదికపైకి పిలిచించి వారి కష్టాలను అడిగి తెలుసుకోవడానికే జగన్ ప్రాధాన్యత ఇచ్చారు. వారి బాధలు తెలుసుకుని.. వాటిని పరిష్కరించడమెలా అన్న అంశంపైనే దృష్టి కేంద్రీకరించారు. దీక్షకు మద్దతు పలికేందుకు, జగన్‌ను చూసేందుకు బుధవారం రాష్ట్రం నలుమూలల నుంచీ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు రైళ్లలో, బస్సుల్లో.. ఏ వాహనం అందుబాటులో ఉంటే అందులో విజయవాడకు తండోపతండాలుగా తరలివచ్చారు. వేదిక వద్దకెళ్లి జగన్‌తో చేయి కలిపారు. వీరిలో ఎక్కువ శాతం మంది మహిళలే ఉన్నారు. ఈ తాకిడిని ఊహించలేక మంగళవారం చేతులెత్తేసిన పోలీసులు బుధవారం భద్రతను పెంచారు. పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి అదనపు బలగాలను రప్పించి భారీ స్థాయిలో మోహరించారు. మంగళవారం విజయవాడ పోలీస్ కమిషనరేట్‌లోని అన్ని పోలీస్ స్టేషన్లు, ఏఆర్ సిబ్బంది కలిపి 600 మందితో లక్ష్య దీక్షకు బందోబస్తు ఏర్పాటుచేశారు.

ప్రజాప్రతినిధుల సంఘీభావం: సామూహిక నిరాహార దీక్షకు బుధవారం కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల నుంచి రైతులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరాగా, దీక్షకు బుధవారం 29 మంది ఎమ్మెల్యేలు సంఘీభావం ప్రకటించడంతో కాంగ్రెస్ హైకమాండ్ ఆందోళన చెందినట్లు, ముఖ్యమంత్రే స్వయంగా రంగంలోకి దిగి ఎమ్మెల్యేల బుజ్జగింపు చర్యలకు పూనుకున్నట్లు సమాచారం. అయినా పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. తొలిరోజు జగన్ దీక్షకు సంఘీభావం ప్రకటించిన చాలా మంది ఎమ్మెల్యేలు రెండోరోజుకూడా శిబిరం వద్దనే కనిపించారు. వీరు కాక రెండో రోజు అదనంగా మరో ఆరుగురు ఎమ్మెల్యేలు జగన్ దీక్షకు సంఘీభావం ప్రకటించడం గమనార్హం. పీసీసీ మాజీ కార్యదర్శి కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, కర్నూలు రైతు నాయకుడు పి.మురళీధర్‌రెడ్డి తదితర నాయకులు యువనేతతోపాటే దీక్ష కొనసాగిస్తున్నారు. కాగా వంగపండు ఉష తదితర కళాకారులు ఆలపించిన పాటలు సభికులను ఉత్తేజపరిచాయి.

చలి పులి: వేలాదిమంది రాత్రంతా యువనేతకు సంఘీభావంగా నిరాహారదీక్ష చేస్తూ అక్కడే నిద్రించారు. ఆరుబయలు, పైగా నదీతీరం కావడంతో చల్లగాలి విపరీతంగా ఉంది. రాత్రి అక్కడే పడుకున్నవారు రగ్గులను, కూర్చోవడానికి షామియానాలో వేసిన పట్టాలను కప్పుకున్నారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచే అభిమానులు దీక్షా స్థలానికి తరలిరావడం ప్రారంభమైంది. మచిలీపట్నం నుంచి రెండువేల మంది ఆటోలు, బస్సులలో ప్రదర్శనగా విజయవాడకు వచ్చారు. మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని రాకపోయినా ఆయనే దగ్గరుండి వీరిని పంపించారు.

ఆరుబయటే జగన్ దీక్ష: వేదికపై షామియానా వేయడానికి యువనేత జగన్ అంగీకరించకపోవడంతో ఆరుబయటే ఆయన దీక్ష సాగింది. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోవడంతో రాత్రి వేళలో చలి ఎక్కువగా ఉంది. మంగళవారం రాత్రి 14 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయినా జగన్ వేదికపైనే నిద్రించారు. కాగా గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ముగింపు సభకు వివిధ జిల్లాల నుంచి అభిమానులు పెద్దఎత్తున వస్తున్నట్లు నిర్వాహకులకు సమాచారం అందింది. వరుస వర్షాలతో పండిన పంటంతా నీటిపాలై నిస్సహాయులుగా మిగిలి పోయిన రైతు సమస్యల పరిష్కారానికి నిర్దిష్ట డిమాండ్లతో యువనేత ‘లక్ష్యదీక్ష’ ప్రారంభిస్తే, వాటి పరిష్కారంపై ప్రభుత్వం ఇంతవరకూ పెదవి విప్పలేదు. దీంతో ప్రభుత్వ వైఖరిపై జగన్ తన దీక్ష ముగింపు ప్రసంగంలో ఎలా విరుచుకు పడతారో అన్న ఉత్కంఠ అటు అశేష రైతుల్లోనూ, ఇటు నేతల్లోనూ కనిపిస్తోంది.
వైఎస్ ఉన్నప్పుడే ధీమా..

రెండేళ్ల నుంచి సాగు చాలా కష్టంగా మారిందని, ఎంత చేసినా చివరికి మిగిలేది నష్టమేనని లక్ష్య దీక్షకొచ్చిన పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి పంటలు సాగు చేస్తున్నామని, లోన్లు కూడా సరిగా రావడంలేదని నూజివీడుకు చెందిన శ్రీనివాసరావు ‘న్యూస్‌లైన్’ వద్ద ఆవేదన వ్యక్తంచేశాడు. వైఎస్ ఉన్నప్పుడు ధీమాగా ఉండేవాళ్లమని, ఇప్పుడు అది లేదని వాపోయాడు. ఎంత నష్టమొచ్చినా, కష్టమొచ్చినా పట్టించుకునేవారు కనిపించడంలేదని కృష్ణా జిల్లా కంకిపాడుకుచెందిన వృద్ధ రైతు రావి గోపాలరావు చెప్పుకొచ్చారు. తమ కోసం జగన్ చేసిన డిమాండ్లు అమలుచేస్తే బయటపడతామని, లేకపోతే ఆకలి చావులే గతని రైతులు వాపోతున్నారు. లక్ష్య దీక్షకొచ్చిన వారిలో ఎక్కువ మంది ఇలాంటి రైతులే.


బస్తీమే సవాల్‌ !
Bastime 
వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి జరుపుతున్న లక్ష్య దీక్షతో రైతుల విషయంలో సర్కార్‌ ధోరణి ఏమాత్రం మారకపోయినా, మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నది. తన తండ్రి రాజశేఖరరెడ్డి ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఏ ప్రయత్నమూ చేయబోనని, మాట తప్పనని, మడమ తిప్పనని జగన్‌ చెబుతున్నప్పటికీ ఆయన వర్గం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. జగన్‌ వర్గంలో ప్రముఖులుగా పేరు పొందిన వారు కాంగ్రెస్‌ నాయకత్వానికి సవాళ్ళు విసరటం ప్రారంభమైంది. ఆ సవాళ్ళ తీవ్రత ఏ స్థాయికి చేరిందంటే దమ్ముంటే జగన్‌ దీక్షకు వచ్చి మద్దతు పలికిన వారిపై చర్య తీసుకుని చూడాలనే దాకా వెళ్ళింది. షోకాజులు పంపిస్తే పార్టీకి రాజీనామాలు చేస్తామనే స్థాయికి చేరుకుంది. ఇటు కాంగ్రెస్‌ నాయకత్వం దీనిపై స్పందించక పోయినా, ఒకరిద్దరు మంత్రులు జగన్‌ వర్గం కన్న ముందే సవాళ్ళు విసరటం ప్రారంభించారు. విశాఖలో మంత్రి శంకర్రావు మీడియాతో మాట్లాడుతూ జగన్‌ దీక్షకు వెళ్ళిన ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో నిలిచి గెలవాలని సవాల్‌ చేశారు. వారు అలా చేస్తే తానూ రాజీనామా చేసి ఎన్నికల్లో నిలుస్తానన్నారు. మరో మంత్రి డీఎల్‌ రవీంద్రరెడ్డి మరో మెట్టు ముందుకు పోయి జగన్‌ వర్గీయులు రాజీనామాలు చేసి ఎన్నికల్లో నిలిస్తే డిపాజిట్లు అయినా దక్కవన్నారు.

అనకాపల్లి ఎంపీ సబ్బం హరి సైతం గళం పెంచారు. జగన్‌ విశాఖలో జరిపే ఓదార్పు యాత్రకు తప్పనిసరిగా హాజరవుతానని ఇప్పటికే ప్రకటించిన ఆయన లక్ష్య దీక్షకూ వచ్చారు. అక్కడే మాట్లాడుతూ ఓదార్పు యాత్రకు కానీ, లక్ష్య దీక్షకు కానీ వెళ్ళవద్దని అధిష్ఠానం తనకు చెప్పలేదని, ఒకవేళ ఇదే తప్పని భావించి షోకాజ్‌ నోటీసు ఇస్తే పార్టీకీ, పదవికీ రాజీనామా చేసి జగన్‌తోనే ఉంటానని తేల్చి చెప్పారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఎంపీలు ఎవరినీ కలవాలని పిలిపించలేదని, ఎంపీలే ఆమెను కోరి వెళ్ళారే తప్ప అటువైపు నుంచి ఎలాంటి ఆహ్వానమూ లేదని ఎద్దేవా చేసినట్టు మాట్లాడారు.

వరంగల్‌ జిల్లా పరకాల ఎమ్మెల్యే, కొండా సురేఖ గళం పెంచుతూ పోతున్నారు. మంత్రి శంకర్రావు సవాల్‌పై ఆమె స్పందించకపోయినా జగన్‌ బలం ఏమేర ఉందో చెప్పారు. లక్ష్య దీక్షకు అంతా రాకపోయినా జగన్‌కు 70 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, మరో 50 మంది సిద్ధంగా ఉన్నారని బాంబు పేల్చారు. అంటే శాసనసభలో కాంగ్రెస్‌కు ప్రస్తుతం ఉన్న 155 మందిలో120 మంది తమ పక్షానే ఉన్నారని, అటువైపు ఉన్న వారు కేవలం మంత్రులు మాత్రమే అన్నట్టు మాట్లాడారు. అంటే జగన్‌ ఏ క్షణంలో సర్కార్‌ను కూల్చమని ఆదేశిస్తే తామంతా అందుకు సిద్ధంగా ఉన్నామన్న హెచ్చరికను సురేఖ పరోక్షంగా కాంగ్రెస్‌ నాయకత్వానికి చేశారు.

సవాల్‌కు సై...
శంకర్రావు విసిరిన సవాల్‌ను మాజీ మంత్రి, జగన్‌ వర్గంలో బలమైన నేత బాలినేని శ్రీనివాస రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి స్వీకరించారు. వారిద్దరూ మీడియాతో విడివిడిగా మాట్లాడుతూ మంత్రి సవాల్‌ను స్వీకరించటానికి తాము సిద్ధంగా ఉన్నామని, ముందు శంకర్రావు తన పదవికి రాజీనామా చేసి జనంలోకి వెళ్తే తాము అందుకు సిద్ధమేనని స్పష్టం చేశారు.


దమ్ముంటే చర్య తీసుకోండి...గోనె
లక్ష్య దీక్షకు హాజరైన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని శంకర్రావు చేసిన డిమాండ్‌పై సీనియర్‌ నేత, ఆర్టీసీ మాజీ చైర్మన్‌ గోనె ప్రకాశరావు తీవ్రంగా స్పందించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధినాయకత్వానికి ఏమాత్రం దమ్ము ఉన్నా ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని సవాల్‌ చేశారు. అదే జరిగితే పరిణామాలు ఎలా ఉంటాయో కాలమే తేలుస్తుందన్నట్టుగా గోనె మాట్లాడారు.

హై కమాండ్‌పైనే గురి...
ఎంపీ పదవికి, పార్టీకీ జగన్‌ రాజీనామా చేసినా ఆయన వర్గం మాత్రం అధిష్ఠానాన్ని వదలిపెట్టటం లేదు. తమ లక్ష్య దీక్షకు భయపడినందుకే సోనియా గాంధీ రాష్ట్ర ఎంపీలను పిలిపించుకుని మంతనాలు జరిపారని, జగన్‌ దెబ్బ ఏమిటో ఇప్పటికే అధినాయకత్వానికి తెలిసిపోయినందుకే బెంబేలెత్తుతున్నారని ఎత్తిపొడుపు మాటలు మాట్లాడుతున్నారు. అలా మాట్లాడటం ద్వారా జగన్‌ను ఢీకొనే సత్తా కాంగ్రెస్‌ హై కమాండ్‌కు కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్‌ నాయకత్వానికి కానీ లేదన్న బహిరంగ సవాల్‌ను విసురుతున్నారు. జగన్‌ వర్గీయుల నుంచి ఇంత సూటిగా సవాళ్ళ అస్త్రాలు దూసుకు వస్తున్నా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ మాత్రం మౌనమే మంచిదన్న సూత్రాన్ని పాటిస్తున్నది. బుధవారం మీడియాతో మాట్లాడిన పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ జగన్‌ దీక్షకు వెళ్ళిన ఎమ్మెల్యేల విషయంలో ప్రతినిధులు ఎంత రెట్టించి ప్రశ్నలు వేసినా మౌనాన్నే పాటించారు.

ఈ పరిణామాలు ఎక్కడికో?...
ఉభయ వర్గాల మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధం, సవాళ్ళు ఏ స్థాయికి పోతాయన్నది ఇప్పుడే చెప్పలేకపోయినా, రాజకీయ పరిణామాల గతిలో మార్పులు తెచ్చే సూచనలు మాత్రం కనిపిస్తున్నాయని తటస్థంగా ఉన్న సీనియర్‌ నాయకులు చెబుతున్నారు. ఎవరు ఎలాంటి సవాళ్ళు విసురుకున్నా ప్రస్తుతానికి ప్రభుత్వానికి ఢోకా లేకపోయినా తమ నుంచి ఎప్పటికైనా గండం తప్పదన్న సంకేతాలను జగన్‌ వర్గం ఇవ్వటం ప్రారంభమైనట్టేనని తేలిపోయిందని వారన్నారు.
ఇంతింతై...
జగన్‌కు 29 మంది ఎమ్మెల్యేల మద్దతు

లక్ష్య దీక్షకు మద్దతు అంతకంతకూ పెరుగుతోంది. పిల్ల కాలువలా ప్రారంభమైన జన ప్రవాహం.. కృష్ణమ్మలా హోరెత్తుతోంది. యువనేత జగన్ వెంటే మేమున్నామంటూ.. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పెద్దసంఖ్యలో తమ అభిమాన నేతకు మద్దతు పలుకుతున్నారు. ఒత్తిడులు, ప్రలోభాలను లెక్కచేయకుండా లక్ష్య దీక్ష శిబిరాన్ని సందర్శించి బహిరంగంగా జగన్‌కు అండగా నిలబడుతున్నారు. పార్టీలకతీతంగా ఒక్కటై ముందుకు సాగుతున్నారు. లక్ష్య దీక్ష శిబిరాన్ని రెండవరోజైన బుధవారం పలు పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సందర్శించి జగన్‌కు సంఘీభావం తెలిపారు.తో రెండురోజులుగా జగన్ దీక్షకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యేల సంఖ్య 29కి చేరింది. వీరిలో పీఆర్పీకి చెందిన శోభా నాగిరెడ్డి(ఆళ్లగడ్డ), కాటసాని రామిరెడ్డి(బనగానపల్లె), కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీనివాసులు (రైల్వే కోడూరు), కమలమ్మ(బద్వేలు), అమరనాథ్‌రెడ్డి (రాజంపేట), షాజహాన్ (మదనపల్లి) ఉన్నారు. మంగళవారమే మద్దతు తెలిపిన ఎమ్మెల్యేల్లో... జి.ఆదినారాయణరెడ్డి(జమ్మలమడుగు), ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి (కాకినాడ), జి. శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి), వి. గురనాథరెడ్డి(అనంతపురం), కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి (ధర్మవరం), బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు), పిల్లి సుభాస్‌చంద్రబోస్ (రామచంద్రపురం), కొండా సురే ఖ (పరకాల), జయసుధ (సికింద్రాబాద్), ఆళ్ల నాని (ఏలూరు), డి.బాబూరావు (పాయకరావుపేట), కె.రామచంద్రారెడ్డి (రాయదుర్గం).

మద్దాల రాజేష్ (చింతలపూడి), పి.అంజిబాబు (భీమవరం), పి.బాలరాజు (పోలవరం), రేగ కాంతారావు(పినపాక), ఎం.ప్రసాదరాజు (నరసాపురం), లబ్బి వెంకటస్వామి (నందికొట్కూరు), బాలనాగిరెడ్డి (మంత్రాలయం), మహేశ్వరరెడ్డి (నిర్మల్, పీఆర్పీ), ఎన్. శేషారెడ్డి (అనపర్తి), మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి (ఉదయగిరి), టీడీపీకి చెందిన ఎన్. ప్రసన్నకుమార్‌రెడ్డి (కోవూరు) ఉన్నారు. వీరు కాక ఎమ్మెల్సీలు కొండా మురళి, పుల్లా పద్మావతి, టీజీవీ కృష్ణారెడ్డి, జూపూడి ప్రభాకరరావు కూడా ఉన్నారు.


శిబిరంలోనే సబ్బం..: అనకాపల్లి ఎంపీ సబ్బం హరి మంగళవారం సాయంత్రం నుంచి నిరాహార దీక్షా శిబిరంలోనే ఉన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ర్ట ప్రజలు జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, తాను ఎప్పటికీ జగన్ పక్షమేనని స్పష్టం చేశారు.

రెండవ రోజు శిబిరంలో ప్రముఖులు..: సినీ నటులు రోజా, రాజశేఖర్ దంపతులు రెండవ రోజు కూడా దీక్షా శిబిరాన్ని సందర్శించి జగన్‌కు మద్దతు పలికారు. నంద్యాల మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి తన భార్య శోభతో కలిసి శిబిరాన్ని సందర్శించారు. అమలాపురం మాజీ ఎంపీ ఏజేవీ బుచ్చి మహేశ్వరరావు దీక్షా శిబిరానికి వచ్చి యువనేతకు మద్దతు తెలిపారు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు, ఆయన భార్య విజయలక్ష్మి కూడా జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు.


మద్దతు పలికిన మాజీలు..: మాజీ మంత్రులు ముద్రగడ పద్మనాభం, ముక్కు కాశిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, బాజిరెడ్డి గోవర్ధన్, రామకృష్ణారెడ్డి, నెలవల సుబ్రమణ్యం, కుర్రి పున్నారెడ్డి, చల్లా వెంకటకృష్ణారెడ్డి, జంగా కృష్ణమూర్తి, మేకా ప్రతాప్ అప్పారావు, జంకే వెంకటరెడ్డి, జలీల్‌ఖాన్, మర్రెడ్డి రామకృష్ణారెడ్డి, జేష్ఠ రమేష్‌బాబు, చిర్ల జగ్గిరెడ్డి శిబిరాన్ని సందర్శించి జగన్‌కు మద్దతు పలికారు. ఉరవకొండ ఇన్‌చార్జి విశేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్ కూడా జగన్‌కు మద్దతు తెలిపిన వారిలో ఉన్నారు. గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు చిట్టా విజయభాస్కర్ రెడ్డి, నాగార్జునసాగర్ కుడి కాలువ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గడిపూడి నరసింహారావు, ఎస్సీ-ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ మేరుగ నాగార్జున, సినీ నటుడు విజయచందర్, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, అంబటి రాంబాబు, లేళ్ళ అప్పిరెడ్డి, గట్టు రామచంద్రరావు, పీఎన్‌వీ ప్రసాద్, గోనె ప్రకాశ్‌రావు, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, తాడి శకుంతల, బత్తుల బ్రహ్మానందరెడ్డి, వై. భద్రారెడ్డి, చింతకుంట రంగారెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఏపీ స్టేట్ వైఎస్సార్ సాధన సమితి అధ్యక్షుడు చేవూరి శ్రీధర్‌రెడ్డి, తెలంగాణ వైఎస్సార్ అభిమాన సంఘం నాయకుడు డాక్టర్ ప్రకాష్ వంజరి, పశ్చిమ గోదావరి డీసీసీ మాజీ అధ్యక్షుడు మోషేన్ రాజు, జిల్లా పరిషత్ చైర్మన్ సోదరుడు మేకా రామకృష్ణ, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ కన్వీనర్ మోహన్‌కుమార్, రాజమండ్రి మునిసిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ చోడిశెట్టి రాఘవబాబు, ఐడీసీఎస్‌ఆర్ అధ్యక్షుడు పెరికే వరప్రసాద్‌రావు, శిల్పా చక్రపాణి రెడ్డి, కృష్ణాజిల్లా కృత్తివెన్ను ఎంపీపీ మైలా రత్నకుమారి రెండోరోజు దీక్షా శిబిరంలో పాల్గొన్నారు.

సంఘీభావం తెలిపిన ప్రముఖులు ..: నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి తనయుడు మేకపాటి గౌతంరెడ్డి తన బంధువులు, మిత్రులతో దీక్షా శిబిరాన్ని సందర్శించి జగన్‌కు సంఘీభావం తెలిపారు. సహకార మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి మేనల్లుడు కె. వినయ్‌రెడ్డి శిబిరం ప్రారంభం నుంచి జగన్ వెన్నంటే ఉన్నారు.

జగన్‌ను ఆశీర్వదించిన నేదురుమల్లి పద్మనాభరెడ్డి..: మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి సోదరుడు నేదురుమల్లి పద్మనాభరెడ్డి లక్ష్యదీక్ష శిబిరాన్ని సందర్శించి జగన్‌కు మద్దతు పలికారు. జగన్ భవిష్యత్తు బావుండాలనే ఆకాంక్షను వ్యక్తంచేశారు. రాంకీ గ్రూపు డెరైక్టర్ ఆళ్ల రామకృష్ణారెడ్డి రెండవ రోజు దీక్షా శిబిరాన్ని సందర్శించి జగన్‌ను కలిసి కొద్దిసేపు ఏకాంతంగా మాట్లాడారు. రాజ్యసభ సభ్యుడు జేడీ శీలం సోదరుడు కాకుమాను జెడ్పీటీసీ జేడీ రవి లక్ష్య దీక్ష శిబిరానికి వచ్చి యువనేతకు మద్దతు తెలిపారు.

ఫోన్‌లో ప్రముఖుల మద్దతు..: దీక్ష చేస్తున్న జగన్‌ను కలిసి పలువురు ప్రత్యక్షంగా సంఘీభావం తెలుపుతుంటే, ఇక్కడికి రాలేనివారు ఫోన్లలో మద్దతు ప్రకటిస్తున్నారు. ప్రముఖ సినీనటి, రాంపూర్ (ఉత్తరప్రదేశ్) ఎంపీ జయప్రద, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఫోన్‌చేసి జగన్‌కు సంఘీభావం ప్రకటించారు. 

 దిక్కుతోచడం లేదన్నా..!
* బాధల్ని పంచుకున్న రైతాంగం
* ఓదార్చిన జగన్.. అన్నదాతలకు భరోసా


పంట మొత్తం నీటి పాలైందన్నా.. అప్పుల పాలైపోయాం.. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు.. మీకాడ మా బాధలు చెప్పుకు పోదామని వచ్చినాం.. అంటూ అన్నదాతలు గోడు వెళ్లబోసుకున్నారు. యువనేత జగన్ చేపట్టిన లక్ష్య దీక్షకు మద్దతు పలకడానికి వివిధ జిల్లాల నుంచి వేలాది మంది రైతులు విజయవాడ ‘వైఎస్సార్ దీక్షా ప్రాంగణా’నికి తరలివస్తున్నారు. జగన్‌ను కలసి తమ బాధలు చెప్పుకుంటున్నారు. అధైర్యపడొద్దని యువనేత ఇచ్చే ఓదార్పు రైతుల్లో కొత్త ఆశలు నింపుతోంది. వైఎస్‌ఆర్ ఉన్నప్పుడు వ్యవ‘సాయం’ ఎంతో బాగుండేదని రైతులు చెబుతున్నారు. నువ్వు సీఎం అయితేనే మా బాధలు తీరతాయన్నా అని తమ మనసులోని ఆకాంక్షను వెలిబుచ్చుతున్నారు. జగన్‌ను కలిసి స్వయంగా తమ బాధలు చెప్పుకొనే అవకాశం దక్కడంతో రైతాం గం ఉబ్బితబ్బిబ్బయింది. తాము ఎలా నష్టపోయామో రైతులు వేది కపై నుంచి మైక్‌లో వివరించారు. బుధవారం పలువురు రైతులతో జగన్ సంభాషణ సాగిందిలా..

ప్రకాశం జిల్లా త్రిపురాంతపూర్ మండలం వెల్లంపల్లికి చెందిన కందుల చిన్నపరెడ్డితో..
ఎన్ని ఎకరాలు సాగుచేశావన్నా?
ఎనిమిది ఎకరాల్లో వరి, మినుము సాగుచేశా..
ఎంత నష్టం జరిగింది?
మూడొంతులు పంట పోయింది..
నష్టపరిహారం వచ్చిందా?
లేదన్నా, రెండేళ్లుగా అధికారులు పంటల నష్టాన్ని నమోదు చేయడంలేదు. జేసీ, వ్యవసాయశాఖ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. తప్పుడు లెక్కలు రాస్తున్నారు.
మీది ఏ నియోజకవర్గం?
ఎరగ్రొండపాలెం
ఆందోళనచెందకన్నా..
మాట్లాడదాం...
ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పచ్చాల వెంకటాపురానికి చెందిన ఇండేల నాగిరెడ్డితో..
ఎంత భూమి ఉందన్నా?
నాకేంలేదన్నా.. ఏడు ఎకరాలు కౌలుకు తీసుకున్నా.. ఐదెకరాల్లో పత్తి, రెండు ఎకరాల్లో వరి సాగుచేసినా..
కౌలు ఎంత కట్టాలి? పెట్టుబడి ఎంత ?
ఎకరాకు పది బస్తాల ధాన్యం ఇవ్వాలి. పత్తికి రూ.4 వేలు చెల్లించాలి.. లక్షకు పైనే ఖర్చులయ్యాయి..
ధర ఎలా ఉంది?
పత్తి క్వింటా రూ.1,500 ఇస్తామంటున్నారు. 30 శాతం ధాన్యం తడిసింది. కొనుగోలుకు వ్యాపారులు మందుకురావడం లేదన్నా.
మరి ఇప్పుడు ఏమిటి పరిస్థితి?
కౌలు కట్టే పరిస్థితి కూడా లేదన్నా. ఏం చేయాలో తెలియడం లేదు.
నాఫోన్ నంబర్ తీసుకో.. హైదరాబాద్‌రా మాట్లాడదాం..

గుంటూరు జిల్లా కొత్తరెడ్డిపాలేనికి చెందిన భవనం శ్రీనివాస్‌తో..
ఎలా ఉన్నావన్నా? ఏం పంట సాగు చేశావు?
పంటలు మొత్తం నేల పాలయ్యాయన్నా. 9 ఎకరాలు కౌలు తీసుకొని పత్తి సాగుచేసినా అన్నా.
పరిస్థితి ఏమిటి? క్వింటాకు ఎంత ఇస్తున్నారు?
15 క్వింటాళ్లు రావాల్సి ఉండగా 4 క్వింటాళ్లే వచ్చిందన్నా. రంగుమారడంతో ధర పలకడం లేదు. క్వింటాల్‌కు రూ.1,200 నుంచి రూ.1,500 ఇస్తామంటుండ్రన్నా.
మద్దతు ధర ఎంత రావాలి?
రూ.3,500 నుంచి రూ.4 వేలు రావాలి.
ఎంత నష్టం వచ్చింది?
రూ.20 వేలు కౌలు కట్టాలి. రూ.40 వేల వరకూ పెట్టుబడులయ్యాయి. మొత్తం మీద రూ. 2 లక్షల వరకూ నష్టం వచ్చిందన్నా.

తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన కర్రి వెంకటరెడ్డితో..
ఎన్ని ఎకరాల్లో పంట సాగుచేశావన్నా?
నాలుగు ఎకరాల్లో వరి పైరు సాగు చేశా..
దిగుబడి ఎంత వచ్చింది?
అన్నీ బాగుంటే ఎకరాకు 30 బస్తాలు పండాలి. పది బస్తాలు కూడా వచ్చే పరిస్థితి లేదన్నా..
ఎకరానికి ఎంత ఖర్చు చేశావన్నా?
రూ.15 వేలు పైనే ఖర్చులయ్యాయన్నా. అప్పుల పాలైపోయాం. ఇదిగో చూడన్నా అంటూ తడిసి రంగుమారిన వరికంకుల్ని చూపాడు.
అయ్యో..

వరంగల్ జిల్లా మనుగొండకు చెందిన మర్రి కుమరయ్యతో..
ఏం పంట వేశావన్నా?
ఆరు ఎకరాల్లో పత్తి సాగుచేశా.
ధర ఎలా ఉంది?
రేటు రావడం లేదయ్యా. క్వింటా రూ.4 వేలు పలకాల్సిన పత్తికి రూ.1,200 నుంచి రూ.1,500 ఇస్తున్నారు.
నీ పరిస్థితి ఏమిటి?
కిస్తీలు (అప్పు) కట్టలేకపోతున్నా. నాన్నగారి(వైఎస్‌ఆర్) దయవల్ల రాజీవ్ ఆరోగ్యశ్రీలో గుండె ఆపరేషన్ చేయించుకున్నా.
మాట్లాడదాం.. బాధపడకు..

దీక్షకు పోటెత్తిన మహిళలు
యువనేత జగన్ లక్ష్య దీక్ష శిబిరానికి రెండోరోజైన బుధవారం మహిళలు పోటెత్తారు. ప్రభుత్వ ఉద్యోగులు సైతం పెద్దసంఖ్యలో తరలివచ్చారు. జగన్ దీక్ష విజయవంతం కావాలంటూ వారంతా ఆశీర్వదించారు. మొదటి రోజు రెండు లక్షల మందికి పైగా ప్రజలు శిబిరానికి తరలిరావడంతో వారిని నియంత్రించడం పోలీసులకు సాధ్యం కాలేదు. అనేకసార్లు శిబిరం వద్ద లాఠీలతో అభిమానులను అదుపు చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితులను గమనించిన మహిళలు, ఉద్యోగులు మొదటి రోజున శిబిరం వద్దకు రావడానికి ధైర్యం చేయలేకపోయారు. ముఖ్యంగా మహిళలు ఇళ్లకే పరిమితమై టీవీల్లోనే యువనేత కార్యక్రమాన్ని చూశారు. అయితే, మొదటి రోజు అనుభవంతో పోలీసు ఉన్నతాధికారులు పొరుగు జిల్లాల నుంచి సిబ్బందిని రప్పించి తోపులాటలు జరగకుండా గట్టి చర్యలు చేపట్టారు. వైఎస్సార్ ప్రాంగణంలో మెరుగుపడిన పరిస్థితిని టీవీల్లో చూసిన మహిళలు రెండోరోజు లక్ష్య దీక్ష కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చారు.

మీడియా సెంటర్ సమీపంలో ఒక బ్లాక్‌ను ప్రత్యేకంగా మహిళలకు కేటాయించారు. ఈ బ్లాక్‌లోని మహిళలు విడతలవారీగా జగన్‌ను కలిసే అవకాశం కల్పించారు. నిత్యావసర వస్తువుల ధరలు, వంట గ్యాస్, కిరోసిన్ ధరలు ఆకాశాన్ని తాకాయని, చాలీచాలని ఆదాయంతో జీవనం సాగించడం కష్టంగా ఉంటోందని డ్వాక్రా గ్రూపు మహిళలు జగన్ వద్ద వాపోయారు. అనేక మంది యువతులు జగన్ ఆటోగ్రాఫ్ కోసం పోటీపడ్డారు. ‘అన్నా, నీ ఆటోగ్రాఫ్ ఇవ్వన్నా, నేను బతికున్నంత కాలం జాగ్రత్తగా దాచుకుంటా’నని అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి వచ్చిన రాధిక అనే యువతి కోరింది. కొందరు మహిళలు తమ ఇంట్లో పూజ చేసిన అక్షింతలను ఆయన శిరస్సుపై వేసి ఆశీర్వదించారు. వేదిక వద్దకు చేరుకుంటున్న తల్లులు తమ పిల్లలకు ‘అడిగో జగనన్న’ అంటూ చూపించడం కనిపించింది. చిన్నారులను జగన్ ఆప్యాయంగా పలకరిస్తూ, ముద్దాడడంతో తల్లుల ఆనందం అవధులు దాటింది. మరోవైపు వైఎస్సార్ పాలనలో పరిష్కారమైన అనేక సమస్యలను ప్రభుత్వ ఉద్యోగులు ఈ సందర్భంగా జగన్ వద్ద ప్రస్తావించారు. ‘మీ తండ్రి ఉద్యోగులను కన్నబిడ్డల వలే చూసుకున్నారు. ఇప్పుడు మిమ్మల్ని మేము మా సొంత బిడ్డ వలే చూసుకుంటా’మని చెప్పారు. గతంలో తామంతా వేతనాలపై 15 శాతం అదనంగా ఆశిస్తే, వైఎస్సార్ 23 శాతం వరకు పెంచి తమ అభిమానాన్ని పొందారని పేర్కొన్నారు.


పలుచోట్ల సంఘీభావ దీక్షలు: యువనేత చేస్తున్న నిరాహార దీక్షకు మద్దతుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు విదేశాలలోని తెలుగువారు సంఘీభావదీక్షలు చేస్తున్నారు. అబుదాబీ, సౌదీ అరేబియా, అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఈ దీక్షలు కొనసాగుతున్నాయి.

Tuesday, December 21, 2010

ఈ రాష్ట్రంలో ఉన్నందుకు సిగ్గు సిగ్గు




ఈ ప్రభుత్వం బండరాయి
రైతు ఘోష ఢిల్లీకి వినబడాలి
స్పందించకపోతే ఉద్యమం
మాజీ ఎంపీ జగన్ ప్రకటన
48 గంటల లక్ష్య దీక్ష మొదలు
విజయవాడలో భారీ సభ
దీక్షలో కనిపించని రైతులు
కాబోయే సీఎం జగన్: వక్తలు
జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 23 మంది ఎమ్మెల్యేలు
కాంగ్రెస్ నేతల్లో కలకలం
కృష్ణా ఎమ్మెల్యేలు దూరం
ఛాయలకు రాని నగర నాయకత్వం 
రైతులను ఆదుకోలేని ప్రభుత్వం ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్నందుకు సిగ్గుతో తలదించుకుంటున్నానని కడప మాజీ ఎంపీ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికలు ఇంకా మూడేళ్లు ఉన్నాయి కదా అని భావిస్తే, ఆ మూడేళ్లు కళ్లు మూసుకుని తెరిచేలోగా ముగుస్తాయని, అప్పుడు ఈ ప్రభుత్వానికి కనీసం డిపాజిట్లు కూడా రావని హెచ్చరించారు. రైతు సమస్యల పరిష్కారం కోరుతూ 48 గంటల పాటు విజయవాడ కృష్ణా నదీ తీరాన జగన్ మంగళవారం నిరాహారదీక్షకు కూర్చున్నారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సామూహిక దీక్షకు హాజరైన రైతు ఘోష.. ఢిల్లీలోని పెద్దలకు వినబడితే అప్పుడైనా వారికి కనువిప్పు కలుగుతుందేమోనని వ్యాఖ్యానించారు. రైతు సమస్యలపై స్పందించని సర్కారును ఆయన బండరాయితో పోల్చారు. రంగుమారిన ధాన్యాన్ని శాతాలతో నిమిత్తం లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం స్పందించని పక్షంలో ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తానని జగన్ వెల్లడించారు. రైతు సమస్యలపై ఏర్పాటు చేసిన ఈ దీక్షకు భారీగా రైతులు వస్తారని తొలుత ప్రకటించినప్పటికీ.. అసలు రైతులే కనిపించకపోవడం గమనార్హం. జగన్ అభిమానులు మాత్రం పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారు. మరోవైపు 23 మంది ఎమ్మెల్యేలు జగన్‌కు మద్దతు పలుకుతూ దీక్షలకు హాజరు కావడం కాంగ్రెస్‌లో సంచలనం రేపింది.


రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు ప్యాకేజీపై నేరుగా యుద్ధం ప్రకటించిన జగన్ దీక్షలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొనడం పట్ల మంగళవారం పార్టీ నేతల మధ్య విస్తృత చర్చ జరిగింది. దీక్షకు హాజరైన వారిపట్ల కఠినంగా వ్యవహరించాలన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తుంటే.. ఇప్పుడే క్రమశిక్షణా చర్యల అవసరం లేదని కొందరంటున్నారు.

దీక్షకు వారు హాజరు కావడం వెనుక గల కారణాలపై నేతలు ఆరా తీస్తున్నారు. జగన్ దీక్షకు హాజరైన ప్రజా ప్రతినిధుల్లో అధికులకు... జగన్ దీక్షకు హాజరు కాకుంటే నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని తమ పార్టీలో చేర్చుకుని, వచ్చే ఎన్నికల్లో ఓటమి రుచి చూపిస్తామంటూ బెదిరింపులు వస్తున్నందునే ఆందోళనకు గురై దీక్షలో పాల్గొన్నారని పార్టీ నేతలు వివరిస్తున్నారు.


శాసనసభ్యుల పరేడ్‌తో ప్రభుత్వంపై మానసిక యుద్ధం చేయాలన్న జగన్ వ్యూహానికి.. ప్రజా బలమే ప్రతివ్యూహమని.. దీనితోనే సమాధానం చెప్పాలని రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ప్రజల్లో ప్రభుత్వ పాలనపై విశ్వాసాన్ని పెంచుకోవచ్చని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి భావిస్తున్నారు.

అందుకే రాష్ట్ర నాయకత్వం జగన్ దీక్షలను అసలు గుర్తించడం లేదని తేల్చేసింది. కాగా.. రైతు సమస్యలపై ఏర్పాటు చేసిన లక్ష్య దీక్ష.. రాజకీయ లక్ష్య దీక్షగానే సాగిందనే విమర్శలు వినిపించాయి. దీక్ష వేదికపై మాట్లాడిన పలువురు నేతలు, ఎమ్మెల్యేలు జగన్‌ను పొగడ్తల్లో ముంచెత్తడానికి, భావి సీఎంగా స్తుతించడానికి పోటీలు పడ్డారు.

జగన్ ఉపన్యాసం కూడా ఎన్నికలు.. డిపాజిట్లు అంటూ సాగింది. ఇదిలా ఉండగా.. దీక్ష జరుగుతున్న జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఒక్కరూ సభా స్థలి ఛాయలకు కూడా రాకపోవడం ఆశ్చర్యకరమైతే... నగర కాంగ్రెస్ ముఖ్య నాయకత్వం దీక్షకు దూరంగా ఉండటం కొసమెరుపు!!

ఢిల్లీ దిగిరావాలి... రైతన్నని ఆదుకోవాలి
jagans 
‘కల్లాల్లోకి వెళ్లి రైతులు కన్నీళ్లు పెడుతున్నారు... చేనేత కార్మికులు దీన స్థితిలో దిక్కుతోచక చూస్తున్నారు. చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో, రైతులు ముఖ్యంగా కౌలు రైతుల సమస్యలపై ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా బండగా మారినందుకు సిగ్గుగా ఉందని’ దివంగత ముఖ్యమంత్రి వై.యస్‌. రాజశేఖరరెడ్డి కుమారుడు, కడప లోక్‌సభ మాజీ సభ్యుడు వై.యస్‌.జగన్మోహనరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై ఇక్కడ చేసే నినాదం కేంద్రాన్ని మేలు కొలిపి రాష్ర్ట ప్రభుత్వాన్ని కదిలి స్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కృషితో ఏర్పడిన ప్రభుత్వానికి ఆయన స్ఫూర్తి కొరవడిందని విమర్శించారు.

కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలపై ఏకకాలంలో విమర్శనాస్త్రాలు సంధించి రైతు పక్షాన వై.యస్‌. తర్వాత తానేనని చెప్పకనే చెప్పుకు న్నారు. రైతులు, చేనేత కార్మికులు ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ జగన్‌ 48గంటల పాటు చేపట్టిన లక్ష్యదీక్ష మంగళవారం ఉదయం సీతమ్మవారి పాదాల దిగువన కృష్ణానది ఒడ్డున ప్రారంభమైంది. నిర్ధేశిత సమయానికంటే రెండు గంటలు ఆల స్యంగా ప్రారంభమైన ఈ కార్యక్రమానికి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వేలాది మంది హాజరయ్యారు. వీరిని ఉద్దేశించి జగన్‌ మాట్లా డుతూ రైతాంగం నేడు ప్రత్యేక పరిస్థితుల మధ్య బతుకుతున్నట్టు చెప్పారు. ఏడాది కాలంగా రైతులు దెబ్బ మీద దెబ్బ తింటున్నట్టు తెలిపారు. ప్రత్యేక పరిస్థితుల్లో ప్రభుత్వం పట్టించుకోకుంటే ఇంక ఎప్పుడు పట్టించుకుంటారని, ఎంతమంది రైతులు చావాలని ఆయన ప్రశ్నించారు.

rojaa 

దివంగత వై.యస్‌. స్ఫూర్తి అంతో ఇంతో ఉందనుకుంటున్న ప్రభుత్వానికి అది ఏమైందని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. గతంలో వై. యస్‌. ప్రతిపక్ష నేతగా ఉచిత విద్యుత్‌ వాగ్దానం చేస్తే కొందరు తీగలపై దుస్తులు ఆరేసుకోవాలని ఎగతాళి చేశారని ఆయన చెప్పారు. తాను అధికా రంలోకి రాగానే కష్టమైనా, నష్టమైనా ఉచిత విద్యుత్‌ ఫైలుపై సంతకం చేసి వై.యస్‌.ఆర్‌ ఆదుకు న్నట్టు తెలిపారు. ఇబ్బం దుల్లోని రైతులను ఆదుకు నేందుకు ఎకరాకు రు.5వేల చొప్పున, 1800 కోట్లకు సంబంధించిన ఫైలుపై నిమిషం కూడా ఆలోచించకుండా వైయస్‌ సంతకం చేశారని చెప్పారు. రైతుల పక్షాన నిలబడని ప్రభుత్వానికి పోయే కాలం వచ్చినట్టేనని గుర్తుంచుకోవాలని ఆయన పేర్కొన్నారు.

ఇన్‌పుట్‌ సబ్సిడీ రెట్టింపు చేయాలని అడిగితే ఆరొందలు మాత్రమే పెంచుతామంటున్నారని, రూ.600లతో బస్తా యూరియా కూడా రాదనే విషయం ప్రభు త్వం గుర్తించుకోవాలని ఆయన చెప్పారు. తడిసిన, రంగు మారిన, మొలకెత్తిన ధాన్యం కొనుగోలు చేయమంటే ప్రభుత్వం కనీస మద్దతు ధరకు 10 శాతం మాత్రమే కొంటామని చెప్పడం సిగ్గుచ ేటన్నారు. 10 శాతం పోను మిగిలినది 50శాతం నిబంధనల మేరకు కొంటే రైతుకు ఒరిగేదేమీ లేదన్నారు. కర్నాటకలో రైతులకు బోనస్‌ ఇస్తారని, ఇక్కడి పరిస్థితి చూస్తే రాష్ట్రానికి చెందిన వాడిగా సిగ్గు పడుతున్నానని ఆయన తెలిపారు.

dhrana 

ఈ రాష్ట్రాన్ని మిగిలిన రాష్ట్రాల కంటే గొప్పగా చేయా లంటే రబీలో రైతులకు ఎరువులు, విత్తనాలు ఉచితంగా అందజేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. గతంలో వై.యస్‌.రాజశేఖర రెడ్డి మాదిరి గానే ఎకరాకు రు.5వేలు వెంటనే ఇవ్వాలన్నారు. కౌలు రైతుల బాధలు వింటుంటే గుండె తరుక్కు పోతుందని చెపుతూ ఇప్పటి వరకు కౌలు రైతులకు సంబంధించి ప్రభుత్వం ఆలోచన కూడా చేయ కపోవడం శోచనీయమన్నారు. వీరికి తగిన న్యా యం చేయాలని జగన్‌ డిమాండ్‌ చేశారు. చేనేత రై తులు పూర్తి కష్టాల్లో కూరుకుపోయారని ఆయన చెెప్పారు. చేనేత కార్మికుల కష్టాలు తీర్చేం దుకు నా డు వై.యస్‌.రాజశేఖర రెడ్డి బడ్జెట్‌లో చీ.312 కేటా యిస్తే, నేడు ప్రభుత్వం రు.38కోట్లు ఇచ్చి చేతులు దులుపుకోవడం సిగ్గుగా ఉందన్నారు. గతంలో చేనే త కార్మికులకు వై.యస్‌. పావలా వడ్డీకే రుణాలు ఇస్తే, నేడు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.

ఎన్నికలకు మరో మూడేళ్లు వ్యవధి ఉందనుకుంటే పొరపాటని, మూడేళ్లు కళ్లు తెరచి మూసేలోగా పూర్తవుతాయని అన్నారు. ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావనే విష యాన్ని కాంగ్రెస్‌ పార్టీ గుర్తుంచుకోవాలని ఆయన చెప్పారు. మనం చేపట్టిన 48 గంటల నిరాహార దీక్ష ధ్వని ఢిల్లీదాకా వినిపించాలని, అక్కడి నుంచి ఫోన్‌ వస్తే ఇక్కడేమైనా కదు లుతారేమోనని ఆయన అన్నారు. రైతులకు, చేనేత కార్మికులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని ఈ సందర్భంగా జగన్‌ డిమాండ్‌ చేశారు. 


ఇంకెందరు చనిపోవాలి?

‘లక్ష్య దీక్ష’లో సర్కారుపై వైఎస్ జగన్ ధ్వజం
 
* సర్కారు బండరాయిలా మారిపోయింది* అన్నదాతల ఆకలి కేకలు పట్టవా?* ఈ ప్రభుత్వానికి వైఎస్ స్ఫూర్తి కొరవడింది?* ఈ రోజు ఎక్కడ చూసినా రైతు కంట కన్నీరే కనిపిస్తోంది* ప్రభుత్వానికి మాత్రం ఆ కన్నీళ్లు కనిపించడం లేదు* సర్కారుకు, వ్యాపారులకు తేడా లేకుండాపోయింది* పూర్తి పంటను కొనాలి.. మద్దతు ధర పూర్తిగా ఇవ్వాలి* రైతు గుండె చప్పుడు కేంద్రానికి వినపడాలి.. అక్కడి నుంచి ఫోన్లు వస్తే అయినా వీరు కదులుతారని ఆశిద్దాం

రైతు సోదరుల ఆకలి కేకలను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం బండరాయిలా మారిపోయిందని యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం స్పందించాలంటే ఇంకా ఎంతమంది రైతులు చనిపోవాలని ఆయన ప్రశ్నించారు. ‘రైతుల గుండె చప్పుడు కేంద్రానికి వినపడాలి. అక్కడి నుంచి ఫోన్లు వస్తే అయినా వీరు కదులుతారని ఆశిద్దాం’ అని అన్నారు. రైతులు, కౌలు రైతులు, చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరుతూ జగన్ చేపట్టిన 48 గంటల సామూహిక నిరాహార దీక్ష.. విజయవాడ కృష్ణానదీ తీరంలో సీతమ్మవారి పాదాల వద్ద మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. యువనేత ఉదయం నంద్యాల నుంచి ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ చేరుకున్నారు. కనకదుర్గ గుడిలో పూజలు చేసి, వన్‌టౌన్‌లోని హజరత్ సయ్యద్ గాలిబ్ దర్గాలో ప్రార్థనలు నిర్వహించిన అనంతరం వైఎస్‌ఆర్ దీక్షా ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడ మౌనముద్రలో ఉన్న వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి ‘లక్ష్య దీక్ష’ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా యువనేత ప్రసంగం ఆయన మాటల్లోనే..

ఇది వైఎస్ స్థాపించిన ప్రభుత్వం కాదా?
‘ఈ ఏడాది కాలంలో మూడుసార్లు వచ్చిన తుపాన్లతో దెబ్బమీద దెబ్బ పడుతూ ఉంటే రైతు సోదరులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో అయినా ప్రభుత్వం స్పందించకపోతే మరింకెప్పుడు స్పందిస్తుంది? ఇంకా ఎంతమంది రైతులు చనిపోవాలి? దివంగత ముఖ్యమంత్రి వైఎస్ స్థాపించిన ప్రభుత్వం కాదా ఇది? నాడు రైతులపై చూపిన ఔదార్యం నేడు ఏమైంది? ఇంకా వైఎస్‌పై ప్రేమ, వాత్సల్యం ప్రభుత్వానికి ఉన్నాయనుకున్నాను. ఒక మాట ఇస్తే కష్టమైనా, నష్టమైనా మాటపై ఎలా నిలబడాలనే విషయం వైఎస్ దగ్గర నేర్చుకోవాలి.’

రైతు పక్షాన లేకుంటే పోయేకాలమే
‘ఎంతకాలం బతికామన్నది ముఖ్యం కాదని, బతికినంత కాలం ఎలా బతికామన్నది ముఖ్యమని వైఎస్ చెప్పేవారు. 2004 ఎన్నికల సందర్భంగా రైతులకు ఉచిత కరెంట్ ఇస్తామని వాగ్దానం చేశారు. ఉచిత కరెంట్ ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనని నాటి పాలకపక్షమైన టీడీపీ ఎద్దేవా చేసింది. వైఎస్ మాట ఇచ్చారు కాబట్టి అధికారంలోకి రాగానే ఎంత కష్టమైనా, నష్టమైనా ఉచిత విద్యుత్‌కు సంబంధించిన ఫైలుపైనే తొలిసారిగా సంతకం పెట్టారు. వరదల వల్ల పంట దెబ్బతింటే రైతులకు రుణమాఫీ కోసం రూ. 1,800 కోట్లు ఖర్చయినా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ ఫైల్‌పై సంతకం చేశారు. రైతుల పక్షాన నిలబడకపోతే ఏ ప్రభుత్వానికైనా పోయే కాలం వచ్చినట్లే.’

రైతు ముఖాన కన్నీళ్లే కనబడుతున్నాయి
‘ఏనాడైతే రైతు కంట కన్నీరు వస్తుందో ఆనాడు రాష్ట్రం అధోగతి పాలవుతుంది. ఈ రోజు పొలాలకు పోయి చూస్తే రైతు ముఖాన కన్నీళ్లు తప్ప మరోటి కనపడడం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం అవి కనపడడం లేదు. ఇక్కడ ప్రభుత్వం తరపున ఇంటెలిజెన్స్ వారు ఉంటారు... రైతు గుండె చప్పుడు వారికి వినపడితే అదే పదివేలు.’

సాయమంటే ఇదా?
‘ప్రసుతం ఇస్తున్న ఇన్‌పుట్ సబ్సిడీని రూ.1,800 నుంచి రూ. 3,600 పెంచాలని డిమాండ్ చేస్తే కేవలం రూ. 600 పెంచి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంది. పెంచిన మొత్తం ఒక యూరియా బస్తాకు కూడా సరిపోదు. ఈ విషయం ప్రభుత్వానికి ఎందుకు అర్థం కావడం లేదు. తడిసిన, రంగుమారిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరగా, పది శాతం మాత్రమే కనీస మద్దతు ధరకు కొనడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. పంట చేతికి రాక నష్టపోయిన రైతన్న వద్ద 50 శాతం ధాన్యం మాత్రమే కొంటాననడం ఎంతవరకూ సమంజసం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాపారులకు తేడా కనపడడం లేదు. పూర్తి పంటను కొనాలి. పూర్తి కనీస మద్దతు ధర ఇవ్వాలి. 50 శాతం ధాన్యం మాత్రమే కొంటే బస్తాకు ఐదారు వందల రూపాయలు మించి రావు. కనీసం బస్తాకు రూ. వెయ్యి అయినా ఇవ్వాలి.’

సిగ్గుపడుతున్నాను
‘ఇలాంటి ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో ఉన్నందుకు నేను సిగ్గుపడుతున్నాను. కర్ణాటకలో రైతులకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్ కూడా ఇస్తున్నారు. వైఎస్ స్ఫూర్తితో ఎన్నికైన ప్రభుత్వం కాబట్టి మిగిలిన ప్రభుత్వాలకన్నా ఎక్కువ ధర ఇవ్వాలి. రైతులకు రబీలో విత్తనాలు, ఎరువులు ఉచితంగా ఇవ్వాలి. ప్రతి రైతు సోదరుడికీ ఎకరాకు రూ. ఐదు వేలు అందాల్సిందే. కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. డ్వాక్రా మహిళలు పావలా వడ్డీతో తీసుకున్న డబ్బులకు మరికొంత వడ్డీకి తీసుకువచ్చి పంటపై పెట్టుబడి పెట్టారు. వారికి బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వడం లేదు. కౌలు రైతుల గురించి ఇప్పటికైనా ఆలోచించకపోతే మరెప్పుడు ఆలోచిస్తారు.’

నిర్లక్ష్యం చేస్తే డిపాజిట్లు కూడా రావు
‘నూలురేట్లు పెరిగాయని ధర్మవరంలో చేనేత కార్మికులు పది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. గత ఏడాది తొమ్మిది వందలు ఉన్న నూలు ధర ఆరుసార్లు పెరిగి రూ.1,800 అయితే ఈ ప్రభుత్వం నిద్రపోతోందా? వైఎస్ బతికి ఉన్నపుప్పడు చేనేత కార్మికులకు అప్పు మాఫీ చేసేందుకు బడ్జెట్‌లో రూ. 312 కోట్లు కేటాయించారు. ఈ ప్రభుత్వం కేవలం రూ. 38 కోట్లు మాత్రమే కేటాయించడం సిగ్గుగా ఉంది. చేనేత కార్మికులకు పావలావడ్డీకి రుణాలు ఇవ్వడం లేదని ప్రకటించిందని, ఈ ప్రభుత్వం బండరాయిగా మారిందని చెప్పడానికి సిగ్గుగా ఉంది. లక్షల మంది రైతన్నలు ఇక్కడ చేరి తమ ఆకలి కేకలు వినాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చేతులు జోడించి ప్రార్థిస్తున్నా. ఇంకా మూడేళ్ల సమయం ఉంది కదా.. అని ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావు.’

కేంద్రం దిగిరావాలి
రైతన్న, నేతన్నల సమస్యల పరిష్కారం కోసం యువనేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన లక్ష్యదీక్షలో ప్రతిధ్వనించే నినాదం కేంద్ర ప్రభుత్వంలో వణుకు పుట్టించాలని, కేంద్రం దిగిరావాలని మాజీ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. కృష్ణానదీ తీరంలోని వైఎస్సార్ ప్రాంగణంలో మంగళవారం లక్ష్యదీక్షకు హాజరైన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈ దీక్షను విఫలం చేసేందుకు చాలా శక్తులు పని చేస్తున్నాయని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ‘జగన్ ప్రభంజనాన్ని వేయి కళ్లు పరిశీలిస్తున్నాయి, భవిష్యత్ కార్యాచరణ ఏమిటని నిఘా నేత్రాలు వెంటాడుతున్నాయి, ఎన్ని ఇబ్బందులు, ఆటంకాలెదురైనా సత్తా చూపించి జగన్‌కు అండగా ఉండాలి’ అని అన్నారు. వైఎస్ చనిపోయినప్పటి నుంచి రాష్ట్రం సమస్యల సుడిగుండంలో చిక్కుకుందని, అధికారాన్ని కాపాడుకుంటూ కాంగ్రెస్ నేతలు కాలం వెళ్లదీస్తున్నారని చెప్పారు. ‘జగన్ చేపట్టిన 48 గంటల దీక్షతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగిరావాలి. అన్ని దారులూ బెజ వాడ చేరుకోవడం దేశమంతా చర్చనీయాంశమైంది. చివరకు కాంగ్రెస్ ప్లీనరీలో కూడా అభద్రతాభావం నెలకొంది. అన్ని పార్టీలనూ జగన్ ఫోబియా పీడిస్తోంది’ అని తెలిపారు. తొమ్మిదేళ్ల పాలనలో రైతులను పట్టించుకోని చంద్రబాబు నేడు దీక్ష చేస్తుంటే ఒక్క రైతు కూడా రాలేదని.. టీడీపీ శ్రేణులు తరలించిన కార్యకర్తలే దీక్షలో పాల్గొన్నారని ఎద్దేవా చేశారు. రైతులంటే ఎవరికి నిజమైన ప్రేమ ఉందో, ఎవరిది కపట ప్రేమో ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు. ‘జోహార్ వైఎస్సార్.. జై జగన్..’ అంటూ ఆమె చేసిన నినాదాలకు.. అభిమానులూ గళం కలపడంతో వైఎస్సార్ ప్రాంగణం మార్మోగింది.

కాంగ్రెస్‌కు పోయేకాలం దగ్గరైంది

కాంగ్రెస్ ప్రభుత్వానికి పోయే కాలం దగ్గర పడింది. రైతాంగం స్వచ్ఛం దంగా తరలివస్తున్నా మంత్రులు డీఎల్ రవీంద్రారెడ్డి, శంకర్రావు అవాకులు చవాకులు పేలుతున్నారు. డబ్బులిచ్చి జనాన్ని సభకు తరలించారని, వచ్చిన వాళ్లు రైతులే కాదని అంటున్న మంత్రులు.. దమ్ము, ధైర్యం ఉంటే ఇక్కడకు వచ్చి మాట్లాడాలి.

-రాజశేఖర్, సినీ హీరో

ఆశయాలు అమలు చేయమనడమే నేరమా?

పుట్టినరోజు వేడుకలు చేసుకోవాల్సిన రోజున జగన్.. రైతు, చేనేత కార్మికుల సమస్యలపై దీక్షలో కూర్చున్నారు. వైఎస్ పథకాలను, ఆశయాలను అమలు చేయాలని కోరడమే జగన్ చేసిన నేరమా?
-జీవిత, సినీ నటి

మాజీ మంత్రి కొండా సురేఖ, యన్‌టిఆర్‌ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి, సినీనటి రోజా తమ ప్రసంగాల్లో రైతు లను ఆదుకోవాలన్నారు. టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూ మన కరుణాకర రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్య క్రమంలో జగన్‌ సన్నిహితులు అంబటి రాంబాబు, వై.యస్‌. తోడల్లుడు వై.వి.సుబ్బారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, మాజీమంత్రులు, సినీరంగ ప్రముఖు లు పాల్గొని జగన్‌కు మద్దతుగా నిలిచారు. 
యువనేత వెంటే మేమూ..

జగన్‌కు ఒక ఎంపీ, 23 మంది ఎమ్మెల్యేల మద్దతు

మద్దతు తెలిపిన ఎమ్మెల్యేల్లో ఇద్దరు టీడీపీ, ఒకరు పీఆర్పీకి చెందినవారు
దీక్షలో పాల్గొన్న ముగ్గురు ఎమ్మెల్సీలు
అనేక మంది మాజీ మంత్రులు,
ప్రముఖ నేతల మద్దతూ యువనేతకే



యువనేత జగన్ లక్ష్య దీక్షకు అభిమాన జనంతోపాటు ప్రజా నేతలూ పెద్దఎత్తున తరలివచ్చారు. 23 మంది ఎమ్మెల్యేలు, అనకాపల్లి ఎంపీ సబ్బం హరి వేదికపై జగన్ వద్దకొచ్చి మద్దతు ప్రకటించారు. ఎమ్మెల్యేల్లో 20 మంది కాంగ్రెస్‌కు చెందిన వారు కాగా, ఇద్దరు టీడీపీ, ఒకరు పీఆర్పీ వారు కావడం గమనార్హం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు), కొండా సురేఖ (పరకాల), పిల్లి సుభాష్‌చంద్రబోస్ (రామచంద్రపురం), శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి), మేకపాటి చంద్రశేఖరరెడ్డి (ఉదయగిరి), నల్లమిల్లి శేషారెడ్డి (అనపర్తి), ఆళ్ల నాని (ఏలూరు), జయసుధ (సికింద్రాబాద్), డి.బాబూరావు (పాయకరావుపేట), గుర్నాథరెడ్డి (అనంతపురం), కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి (ధర్మవరం), కాపు రామచంద్రారెడ్డి (రాయదుర్గం), ఆదినారాయణరెడ్డి (జమ్మలమడుగు), మద్దాల రాజేష్ (చింతలపూడి), టి.బాలరాజు (పోలవరం), ఎం.ప్రసాదరాజు (నరసాపురం), పి.అంజిబాబు (భీమవరం), ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి (కాకినాడ టౌన్), రేగ కాంతారావు (పినపాక), లబ్బి వెంకటస్వామి (నందికొట్కూరు), టీడీపీ ఎమ్మెల్యేలు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి (కోవూరు), బాలనాగిరెడ్డి (మంత్రాలయం), పీఆర్పీకి చెందిన మహేశ్వర్‌రెడ్డి (నిర్మల్) ఉన్నారు. ఎమ్మెల్సీలు పుల్లా పద్మావతి, టీవీజీవీ కృష్ణారెడ్డి, జూపూడిప్రభాకర్ దీక్షలో పాల్గొన్నారు.

మరెందరో మాజీలు


మాజీ మంత్రులు అనేక మంది జగన్‌కు మద్దతు తెలిపారు. వీరిలో జంగా కృష్ణమూర్తి, చల్లా వెంకటకృష్ణారెడ్డి, కొణతాల రామకృష్ణ, మూలింటి మారెప్ప, జలీల్‌ఖాన్, మాజీ ఎమ్మెల్యేలు రావి వెంకటరమణ, వరుపుల సుబ్బారావు, ముద్రగడ పద్మనాభం, కొర్రి పున్నారెడ్డి, మాకినేని పెదరత్తయ్య, గండి బాబ్జి, సామినేని ఉదయభాను, భూమా నాగిరెడ్డి, మేకా ప్రతాప్ అప్పారావు, మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్ తదితరులు దీక్షా శిబిరానికి వచ్చారు.

లక్ష్య దీక్షలో ప్రముఖులు: టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ అంబటి రాంబాబు, వైవీ సుబ్బారెడ్డి, హాస్య నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సినీ నటి రోజా, సినీ హీరో రాజశేఖర్, జీవిత, గోనె ప్రకాశరావు, నందమూరి లక్ష్మీపార్వతి, శాప్ మాజీ చైర్మన్ పీఎన్‌వీ ప్రసాద్, తాడి శకుంతల, ఆళ్ల దశరథరామిరెడ్డి, చిక్కా విజయభాస్కరరెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ మేరుగ నాగార్జున, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సినీ నటుడు విజయచందర్, అదిలాబాద్‌కి చెందిన జానకీప్రసాద్, నెల్లూరు జిల్లా నేత కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, జొన్నా సూర్యనారాయణ, ఏవీ సూర్యనారాయణ, జక్కంపూడి విజయలక్ష్మి, లేళ్ల అప్పిరెడ్డి, గౌతంరెడ్డి, వైవీ భద్రారెడ్డి, కృష్ణప్రసాద్, కూచిపూడి సాంబశివరావు తదితరులు వేదికపై ఉన్నారు.

పంట దెబ్బతిని కడుపు మండిన లక్షలాది మంది రైతన్నల పదఘట్టనలతో విజయవాడ దద్దరిల్లింది.. తాము ఓటేస్తే గెలిచి తమను పట్టించుకోని సర్కారు తీరుపై నిరసన నినాదం రణన్నినాదంలా మార్మోగింది.. తమ తరఫున పోరాడుతున్న యువనేత జగన్‌మోహన్‌రెడ్డికి తోడుగా వచ్చిన అన్నదాతలు, చేనేత కార్మికులతో మంగళవారం బెజవాడ స్తంభించిపోయింది.. లక్ష మందితో సామూహిక నిరాహార దీక్ష చేస్తానని యువనేత ప్రకటిస్తే... తొలిరోజే రెండు లక్షలకుపైగా తరలివచ్చిన జనంతో ‘లక్ష్య దీక్ష’ ప్రాంగణం హోరెత్తిపోయింది.. కృష్ణా తీరాన ఏర్పాటు చేసిన ‘వైఎస్సార్ దీక్షా ప్రాంగణం’ జనప్రవాహంతో పోటెత్తింది. వెల్లువెత్తిన లక్షలాది మంది జనం నడుమ, కృష్ణమ్మ సాక్షిగా, సీతమ్మ పాదాల వద్ద యువనేత వైఎస్ జగన్ ఉదయం ‘లక్ష్య దీక్ష’ ప్రారంభించారు. కృష్ణా ప్రవాహంలా తరలి వచ్చిన రైతులు, చేనేత కార్మికులు ఆయనతోపాటు 48 గంటల నిరాహార దీక్షలో కూర్చున్నారు. మెతుకు ముట్టబోమని, మడమ తిప్పబోమని తేల్చి చెప్పారు.

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆశీస్సులు, దర్గాలో దీవెనలు అందుకున్న జగన్ మంగళవారం ఉదయం 11.00 గంటలకు నిరాహార దీక్ష చేపట్టారు. సోమవారం కడప, కర్నూలు జిల్లాల్లో అలుపెరగకుండా పర్యటించి, రాత్రంతా రైల్లో ప్రయాణించి వచ్చిన ఆయన కొద్దిసేపైనా విశ్రాంతి తీసుకోకుండానే నిరాహార దీక్ష మొదలు పెట్టారు. యువనేత వైఎస్సార్ ప్రాంగణానికి చేరుకునే సమయానికే ఇసుక తిన్నెల ప్రాంతం జనంతో కిక్కిరిసిపోయింది. వందలాది మంది నేతలు, అభిమానులు స్వాగతం పలుకుతుండగా జగన్ వేదికపైకి వచ్చి, వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి దీక్షలో కూర్చున్నారు.


ఆయనతోపాటు మాజీ మంత్రులు కొండా సురేఖ, బాలినేని శ్రీనివాసరెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకర్, పుల్లా పద్మావతి, వందలాది మంది నేతలు దీక్ష చేపట్టారు. ఎమ్మెల్యేలు, పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు వైఎస్సార్ ప్రాంగణానికి వచ్చి జగన్‌కు మద్దతునిచ్చారు. నందమూరి లక్ష్మీపార్వతి, రోజా, రాజశేఖర్-జీవిత దంపతులు, రాజా, విజయచందర్ తదితరులు దీక్షా శిబిరానికి వచ్చారు. వేదికపై నేతల ప్రసంగాలు సాయంత్రం వరకూ సాగాయి. సాయంత్రం 4.30 గంటలకు జగన్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతున్నంత సేపూ అభిమానులు కృష్ణా తీరాన్ని హోరెత్తించారు. అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి జగన్ చేసిన ప్రసంగం పదునైన పదాలతో కొత్తపుంతలు తొక్కింది.


బెజవాడ హౌస్‌ఫుల్
* కిక్కిరిసిన రహదారులు * నగరం అంతటా దీక్ష ప్రభావం


జగన్ చేస్తున్న లక్ష్య దీక్షకు జనం పోటెత్తడంతో విజయవాడ కిటకిటలాడింది. సోమవారం సాయంత్రం నుంచి మొదలైన జనప్రవాహం మంగళవారానికి మరింత ఉద్ధృతమైంది. దీంతో దసరా ఉత్సవాలు, భవానీ దీక్షల విరమణ సమయంలో ఇంద్రకీలాద్రి పరిసరాల్లో ఉండే వాతావరణం కనిపించింది. సీతమ్మవారి పాదాల ఇసుక తిన్నెలు, కృష్ణలంక హైవే సహా నగరమంతటా జగన్ దీక్ష ప్రభావం కనిపించింది. లాడ్జీలు, హోటళ్లు, మార్కెట్లు, రోడ్లు.. ఎక్కడ చూసినా జనమే కనిపించారు. దీక్షకు తరలివచ్చిన వారిలో కొందరు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకుని మళ్లీ దీక్షాస్థలికి వచ్చారు. దీంతో దుర్గ గుడిలోనూ సందడి నెలకొంది. వివిధ జిల్లాల నుంచి అనేకమంది సొంత వాహనాల్లో తరలివచ్చారు.

పోలీస్ కంట్రోల్‌రూమ్ వద్ద ఎన్నడూ లేని స్థాయిలో వాహనాల రద్దీ పెరిగిపోయింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన లారీలు, కార్లతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. వాహనాలను పార్క్ చేసుకునేందుకు అనువైన ప్రాంతాలు తక్కువగా ఉన్నందున వాహనాలను పోలీసులు నగర శివార్లలోనే నిలిపివేశారు. వేలాది మంది నడుచుకుంటూనే దీక్షా ప్రాంగణానికి వచ్చారు. దీంతో ఇబ్రహీంపట్నం నుంచి విజయవాడ కనకదుర్గ వారధి వరకూ తొమ్మిదో నెంబరు జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, వన్‌టౌన్, రింగ్‌రోడ్డు, సింగ్‌నగర్, సత్యనారాయణపురం తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ బ్లాక్ అయ్యాయి. రైళ్ల ద్వారా కూడా జనం పెద్దఎత్తున రావడంతో స్టేషన్ కిటకిటలాడింది.

ట్రాఫిక్ మళ్లింపు..
విజయవాడలో రోడ్లన్నీ జనసంద్రంగా మారడంతో పోలీసులు నగరంలోని సిటీ బస్సులను అప్పటికప్పుడు వేరే రూట్ల గుండా మళ్లించారు. బందరు, ఏలూరు రోడ్ల నుంచి బస్టాంట్ సిటీ టెర్మినల్‌కు వెళ్లే వాహనాలను అటువైపు వెళ్లనీయకుండా కాళేశ్వరరావు మార్కెట్‌వైపునకు మళ్లించారు. ట్రాఫిక్‌ను అదుపుచేసేందుకు, జనాన్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

అందరిలోనూ ఇదే చర్చ..
ప్రభుత్వోద్యోగులు, వ్యాపారులు, సాధారణ జనంతోపాటు బందోబస్తు డ్యూటీ చేస్తున్న పోలీసులు సైతం... దీక్షకు వస్తున్న జనం, జగన్ గురించే చర్చించుకోవడం కనిపించింది. పోలీసులు... ఎంత మంది జనం వచ్చారు, ఏ జిల్లాల నుంచి వచ్చారు, ఎలా వచ్చారు వంటి వివరాలను పదేపదే అడిగి తెలుసుకున్నారు. ఇంటెలిజెన్స్ అధికారులు, సిబ్బంది సమాచారం కోసం ఉరుకులు పరుగులు పెట్టారు. ప్రతి నిమిషానికీ ఇక్కడి పరిస్థితి ఉన్నతాధికారులకు చేరవేశారు. లక్ష్య దీక్ష ప్రభావం ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సంస్థలపైనా తీవ్రంగా కనిపించింది.

జగన్ దీక్షకు జయప్రద మద్దతు

యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న లక్ష్యదీక్షకు ఎంపీ, సినీనటి జయప్రద మద్దతు తెలిపారు. రైతులు, చేనేత కార్మికుల సమస్యలపై నిరాహారదీక్ష చేస్తున్న జగన్‌తో ఆమె ఫోన్‌లో మాట్లాడినట్లు ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు తెలిపారు.

నేడు విజయవాడకు మంద కృష్ణ

ఎమ్మార్పీస్ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ బుధవారం యువనేత జగన్‌ను కలిసి, దీక్షకు మద్దతు ప్రకటించనున్నారు. దీక్షలో కూడా పాల్గొననున్నారు. ఈ మేరకు ఎమ్మార్పీస్ జిల్లా అధ్యక్షుడు మానికొండ శ్రీధర్ మీడియాకు తెలిపారు. దీక్షకు మద్దతుగా నిలవాలని ఎమ్మార్పీస్ కార్యకర్తలను ఆయన కోరారు.

చీమల బారుల్లా.. తరలి వచ్చి..
దీక్షలో పాల్గొనేందుకు, మద్దతు తెలిపేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి అభిమానులు, నాయకులు తండోపతండాలుగా కృష్ణాతీరానికి చేరుకున్నారు. ఉదయం 9 గంటలకే వైఎస్సార్ ప్రాంగణం సగానికి పైగా నిండిపోయింది. సాయంత్రమయ్యేసరికి జనం చీమలబారుల్లా ఉవ్వెత్తున ఇసుక తిన్నెలకు చేరుకున్నారు. పాదయాత్రలు, ప్రదర్శనలుగా తరలివస్తున్న వారితో కృష్ణలంక హైవే, కెనాల్ రోడ్డు, కాళేశ్వరరావు మార్కెట్, కంట్రోల్‌రూమ్ తదితర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. అంత రద్దీలోనూ యువనేతను చూసేందుకు పసి పిల్లలను చంకన వేసుకుని కొందరు కుటుంబ సమేతంగా ఆ ప్రాంతానికి రావడం విశేషం.

జగన్‌ను చూడాలి.. చేయి కలపాలి..
ఓ సమయంలో జగన్ చూసేందుకు అభిమానులంతా వేదిక వద్దకు దూసుకొచ్చేశారు. బ్యారికేడ్లు దాటుకుని లోనికి ప్రవేశించారు. ఓ గంటసేపు అతికష్టం మీద వారిని ఆపగలిగిన పోలీసులు ఆ తర్వాత చేతులెత్తేశారు. దీంతో వేదిక చుట్టూ వేలాది మంది జనం చేరిపోయారు. వారంతా యువనేతను పలుకరించేందుకు, చేయి కలిపేందుకు ప్రయత్నించారు. దీంతో చేసేదిలేక చాలామందిని వేదికకు అనుబంధంగా వేసిన మార్గంలోకి అనుమతించి యువనేత వద్దకు పంపారు. మరోవైపు వెనుక మార్గం నుంచి అనేక మంది వేదిక పైకి ఎక్కేశారు. పలుమార్లు నేతలతోపాటు జగన్ వారిని వారించినా ఫలితం లేకపోవడంతో పలుమార్లు పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ గందరగోళంలో బ్యారికేడ్లు, లైట్లు వంగిపోయాయి. మంగళవారం రాత్రి వరకూ వాహనాలు అసంఖ్యాకంగా నగరంలోకి వస్తూనే ఉండడంతో కృష్ణాతీరం జగన్నినాదంతో మార్మోగింది.

ప్రజాప్రతినిధుల మద్దతు
ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు కూడా అధిక సంఖ్యలో తరలివచ్చారు. 23 మంది ఎమ్మెల్యేలు విజయవాడ వచ్చి జగన్‌కు మద్దతు పలికారు. వీరిలో కొందరు జగన్‌ను ప్రభుత్వ అతిథి గృహంలో కలిశారు. మరి కొందరు ఆయనతో దీక్షలో పాల్గొన్నారు. వీరితోపాటు ఇతర జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో వచ్చారు.

పార్టీలకూ.. ప్రాంతాలకూ అతీతంగా..
రైతులకోసం జగన్ ఇచ్చిన 48 గంటల దీక్ష పిలుపుకు రాష్టవ్య్రాప్తంగా లభించిన స్పందన పార్టీలకూ.. ప్రాంతాలకూ అతీతంగా ఉంది. ప్రస్తుతానికి ఏపార్టీకీ చెందని జగన్ ఇచ్చిన పిలుపునకు స్పందనగా కాంగ్రెస్, పీఆర్‌పీ, తెలుగుదేశం పార్టీ నేతలు పలువురు సంఘీభావం ప్రకటించారు. మరో పదిరోజుల్లో తెలంగాణ అంశంపై శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చే సమయంలో కూడా ప్రాంతాలకు అతీతంగా నల్గొండ, వరంగల్, ఖమ్మం తదితర జిల్లాలనుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడం విశేషమే అన్న వ్యాఖ్యానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

ఒకే ఒక్కడు: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ విడుదల చేసిన బహిరంగ లేఖలో జగన్ ఒక మాటన్నారు.‘ నన్ను ఒంటరిని చేసి పార్టీనుంచి పంపేయాలని మీరు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. అందుకోసం నా కుటుంబాన్ని చీల్చడానికి కూడా మీరు వెనకాడలేదు. మీరు నన్ను ఒంటరిని చేసి పంపాల్సిన అవసరం లేదు. నేనే ఒక్కడిగానే వెళ్లిపోతున్నాను’ అని నవంబర్ 29న లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు జగన్ ఒంటరి కాదు.. లక్షలాది ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలించే ఒకే ఒక్క నాయకుడన్న వాస్తవం ‘సీతమ్మ పాదాల’ సాక్షిగా కృష్ణా నదీతీరంలో ఆవిష్కృతమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మాకోసం దీక్ష చేస్తున్నారు

దీక్షకు ముఖ్యంగా భారీ వర్షాలకు పంట పొలాలు దెబ్బతిన్న ప్రాంతాల రైతులు, కౌలు రైతులు, చేనేత కార్మికులు అధిక సంఖ్యలో వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ప్యాకేజీలో కౌలు రైతుల ప్రస్తావన లేకపోవడంతో ఆ వర్గానికి చెందిన రైతులు, వరి సాగుతో కుదేలైన ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులు ఈ దీక్షకు హాజరయ్యారు. వీరితోపాటు చేనేత కార్మికుల సమస్యలపై జగన్ సమరభేరి మోగించడంతో ఆ వర్గం కార్మికులు, రాష్ట్ర నాయకులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వచ్చిన రైతులు మంగళవారం రాత్రికి తిరుగుప్రయాణమయ్యారు. దూర ప్రాంతాలకు చెందిన వారంతా రెండు రోజులపాటు శిబిరంలో కొనసాగేందుకు అవసరమైన సరంజామాతో తరలివచ్చారు. కృష్ణానది ఇసుక తిన్నెలపై జగన్‌తోపాటు శిబిరంలో రెండు రోజులు గడుపుతామని దూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు పేర్కొన్నారు. ‘మా కోసం జగన్ రెండు రోజులు చలిలోనూ, ఎండలోనూ దీక్ష చేస్తున్నాడు. అతనితోపాటు నేనూ దీక్షలో కొనసాగుతా’ అని తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన దిగవల్లి రాంబాబు పేర్కొన్నాడు.

‘ఖరీఫ్ సాగులో ఖర్చులు కూడా రాని దుస్థితిలో ఉన్న మాకు ప్రభుత్వం రబీలో విత్తనాలు, ఎరువులు ఉచితంగా ఇవ్వాలని జగనన్న ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చాడు. అవేమీ పట్టించుకోకుండా ఇన్‌పుట్ సబ్సిడీని అరకొరగా ప్రకటించి ప్రభుత్వం చేతులు దులుపుకుంది’ అని పశ్చిమ గోదావరి జిల్లా యండగండి గ్రామానికి చెందిన కలిదిండి రామరాజు పేర్కొన్నాడు. ‘మా కోసం ఆయనంత కష్టపడుతుంటే మేమెలా హోటల్‌లో బస చేస్తామండీ’ అంటూ ఖమ్మం జిల్లా మధిర నుంచి వచ్చిన కర్నాటి వేణుగోపాల్ అనే యువకుడు ప్రశ్నించాడు. ‘నూలు రేట్ల పెరుగుదల, పవర్‌లూమ్ పోటీ కారణంగా చితికిపోతున్న మా కుటుంబాల కోసం ప్రభుత్వంపై జగన్ పోరాటం చేస్తున్నాడు. మా బతుకుల బాగుకోసం జగన్ పార్టీలో చేరి క్రియాశీలక బాధ్యతలు నిర్వహిస్తా’ అని కృష్ణాజిల్లా గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామానికి చెందిన రవీంద్ర పేర్కొన్నాడు.

రైతు గుండె చప్పుడు వినిపించడానికే ఈ లక్ష్య దీక్ష రైతుకు న్యాయం చే యకపోతే డిపాజిట్లు కూడ రావు ఇంకా ఎంతమంది చనిపోవాలి ? : నిప్పులు చెరిగిన జగన్

రైతు గుండె చప్పుడు వినిపించడానికే ఈ లక్ష్య దీక్ష ఏర్పాటు చేసినట్టు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంగళవారంనాడు ఇక్కడ ప్రకటించారు. కృష్ణమ్మ నదీ తీరాన చేరిన ఈ రైతు స్పందన చూసైనా ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో రైతాంగం మీద దెబ్బ మీద దెబ్బ పడుతోంది, అయినా ప్రభుత్వానికి చీమైనా కుట్టినట్టు లేదని ఆయన అన్నారు. ఇంకా ఎంత మంది రైతులు చనిపోవాలి? అని జగన్ ప్రశ్నించారు. మాట ఇస్తే ఆ మాట మీదే నిలబడాలి, ఎన్నాళ్లు బతికామని కాదు, ఎలా బతికామనేదే ముఖ్యం అనేవారు దివంగత నేత వై.ఎస్. అని ఆయన గుర్తు చేసుకున్నారు. చెప్పిన మాట మీదే నిలబడాలి, మడమ తిప్పకుండా మాట నిలబెట్టుకోవాలని చెప్పేవారని ఆయన గుర్తు చేసుకున్నారు.

లక్ష్యదీక్ష ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ ప్రతి రైతు సోదరునికీ కూడా ఉచితంగా కరెంటు ఇవ్వాలని వై.ఎస్. ఆకాంక్షించారని, ఆరోజున పాలకపక్షమైన తెలుగుదేశం పార్టీ కరెంటు తీగలమీద బట్టలు ఆరేసుకోవాలని అనినప్పటికీ, మాట ఇచ్చాం కాబట్టి కష్టమైనా నష్టమైనా కరెంటు ఇవ్వాల్సిందేనని వై.ఎస్. ఉచిత కరెంటు ఇచ్చారని, 1800 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందంటే, ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ ఫైలుపై వై.ఎస్. సంతకం చేశారని, ఆయన గుర్తు చేసుకున్నారు.

ఏ ప్రభుత్వమైనా రైతుల పక్షపాతిగా నిలబడకపోతే, ఆ ప్రభుత్వానికి పోయేకాలం వచ్చిందని చెబుతున్నాను నేను. ఏనాడైతే రైతు కన్నీటిని చూస్తామో ఆనాడు రాష్ట్రానికి అధోగతి పడుతుంది, అది అరిష్టం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రైతు కన్నీరు కనిపించడం లేదా అని అడుగుతున్నాను. కేవలం 600 మాత్రమే ఇస్తామంటున్నారు. అది ఏ మూలకు అని అడుగుతున్నాను నేను. ప్రతి రైతు సోదరునికి కూడా న్యాయం చేయాలంటున్నాను, ఈ రైతు గుండె చప్పుడు వారికి వినపడితే అదే పదివేలు.

ఇన్‌పుట్ సబ్సిడీని రెట్టింపు చేయమని అడిగితే, 1800 సరిపోదు, 3600 కావాలని చెబితే కేవలం 600 మాత్రమే పెంచారు. ఆ 600 రూపాయలు యూరియా ఒక బస్తాకు కూడా సరిపోదు. ఈ విషయం ప్రభుత్వానికి కనిపించడం లేదా అని అడుగుతున్నాను. రంగు మారిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెబితే, ఆ మొలకెత్తిన ధాన్యాన్ని కొనమని చెబితే, ఈ రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం మాత్రమే కొంటానని అంటున్నది. నష్టపోయిన ప్రతి రైతుకూ సాయం చేయాలని కోరుతున్నాను, పూర్తిగా కొన వలసిందేనని అడుగుతున్నాను నేను. కనీస మద్దతు ధర ఇచ్చి కొనవలసిందని అడుగుతున్నాను నేను. రైతుకు కనీసం వెయ్యి రూపాయలు ఇవ్వాలి. పక్క రాష్ట్రం కర్నాటకను చూస్తే, ఈ రాష్ట్రంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను. మిగిలిన రాష్ట్రాలకంటె బాగా చేయాలని కోరుతున్నాను. వచ్చే రబీకి ఉచితంగా విత్తనాలు ఇస్తేనే రైతు సంక్షేమం సాధ్యమవుతుందని చెబుతున్నాను అని జగన్ అన్నారు.

దివంగత వై,ఎస్. బాటలోనే నడుస్తామని చెబుతున్న ఈ ప్రభుత్వం కొంచమైనా రైతు శ్రేయస్సుకోసం కృషి చేస్తుందనుకున్నా. ఏమీ చేయడం లేదు. మహానేత బాటలోనే నడుస్తానన్న ఈ ప్రభుత్వం రైతులపై ప్రేమ చూపిస్తుందనే అనుకున్నాను. కాని ఆయన ఆశయాలను ఈ ప్రభుత్వం మరిచిపోయింది. ఆ మహనీయుని ఆశయాలు ఏమయ్యాయని అడుగుతున్నాను. ఎన్నికలు ఇంకా మూడేళ్లు ఉందని ఈ ప్రభుత్వం అనుకుంటున్నట్టుంది. రైతుకోసం ఏమీ చేయకపోతే, పావలా వడ్డీ ఇవ్వకపోతే, చేనేత కార్మికులను ఆదుకోకపోతే, వచ్చే ఎన్నికల్లో ఆ మూడేళ్ల తర్వాత కనీసం డిపాజిట్లు కూడా రావని ఆయన పునరుద్ఘాటించారు. రైతుల వేదన చూస్తే గుండె తరుక్కుపోతున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

click here