గుంటూరు ఓదార్పులో వైఎస్ జగన్ ఆవేదన
అన్నదాత అధోగతిలో ఉన్నా.. 10 నెలలుగా రాష్ట్రంలో
వ్యవసాయ మంత్రి లేరు
వ్యవసాయం చేయడం కన్నా ఉరి వేసుకోవడం మేలనే మాట వినిపిస్తోంది
రాష్ట్రంలో రైతన్నల ముఖాల్లో కన్నీళ్లే కనిపిస్తున్నాయని, దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణించిన తర్వాత రాష్ట్రంలో రైతుల గురించి పట్టించుకునే నాథుడు ఒక్కరంటే ఒక్కరూ కనిపించడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాత అధోగతిలో ఉన్నా.. ఈ రాష్ట్రానికి 10 నెలలుగా వ్యవసాయ శాఖ మంత్రి కూడా లేరని ప్రభుత్వంపై మండిపడ్డారు. పండించిన ఏ పంటకూ మార్కెట్లో సరైన ధర దక్కక రైతులు అవస్థలు పడుతున్నారని చెప్పారు.
మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలంలోని దిడుగు గ్రామంలో ఓదార్పు యాత్రను వై.ఎస్.జగన్ పునఃప్రారంభించారు. జిల్లాలో 49వ రోజు ఓదార్పు యాత్రలో భాగంగా ఆయన పెదకూరపాడు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఆరు వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జూపూడి, పెదకూరపాడు సహా పలుచోట్ల ప్రసంగించారు. ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే...
‘‘ఐదు రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో మూడ్రోజులపాటు రైతు దీక్ష చేసి ఇక్కడకు వచ్చాను. రైతన్నల ముఖాన ఈవేళ కన్నీళ్లే కనిపిస్తున్నాయి. వరి వేసుకున్న రైతులను అడిగితే బస్తా రూ.750కు కూడా అమ్మలేని పరిస్థితుల్లో ఉన్నామన్న సమాధానం వచ్చింది.
మిరప రైతులను కలిస్తే.. క్వింటాలుకు రూ.4 వేలు కూడా గిట్టని స్థితిలో ఉన్నామని సమాధానమిచ్చారు. పత్తికి క్వింటాలుకు రూ.3,500 కూడా అందడంలేదు. వ్యవసాయం చేసుకోవడం కంటే ఉరివేసుకోవడం మేలనే మాట వినవస్తోంది. ఇక్కడకు వచ్చే ముందు దారిలో నడిరోడ్డుపై పరిచిన ఉల్లిపాయలను రైతులు నాకు చూపిం చారు. ఎకరాకు రూ.40 వేల నుంచి 50 వేలు ఖర్చుచేశాం. అమ్ముదామంటే కిలోకు రెండు రూపాయలు కూడా సరిగా గిట్టని పరిస్థితులున్నాయని రైతులు చెబుతున్నపుడు బాధనిపించింది.
దివంగత మహానేత, ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డి ఉన్నపుడు ఇవే ఉల్లిపాయలు కిలో రూ.16కు అమ్మిన రోజులు గుర్తుకు వస్తున్నాయని ప్రతి రైతు చెబుతున్నపుడు.. ఆ సువర్ణయుగం అన్నదాతలకు రోజూ గుర్తుకు వస్తూనే ఉంటుంది. జూపూడి గ్రామం వచ్చేముందు కొందరు మిర్చి రైతులు నాతో మాట్లాడారు. మిర్చి పంటను చూపిస్తూ.. మొన్న వర్షమొచ్చింది.. బొబ్బర వైరస్ వచ్చి 20-25 క్వింటాళ్లు పండాల్సిన పంట.. 10 క్వింటాళ్లకు మించి పండే పరిస్థితి కనిపించడం లేదు. మార్కెట్‌కు వెళితే క్వింటాలు రూ.4 వేలకు మించి రాదు.. ఎకరాకు రూ.70 వేలు నష్టం వ చ్చే పరిస్థితులు కనబడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వంక ఆశగా చూస్తున్నా.. పట్టించుకోని పరిస్థితుల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి బతికివుంటే పరిస్థితులు ఈ మాదిరిగా ఉండేవి కావనే మాట ప్రతి రైతు నోటా వినిపిస్తోంది. రాముడి రాజ్యమైతే చూడలేదు గానీ, రాజశేఖరుడి సువర్ణపాలన చూశామని అందరూ గర్వంగా చెబుతున్నారు.
పనుల కోసం జిల్లాలు దాటి వలసలు...
దారిలో చాలామంది అక్కాచెల్లెళ్లతో మాట్లాడాను. పొలాల్లో పనిచేస్తున్నారు. నన్ను చూసి వారంతా నా దగ్గరకు వచ్చి ఆప్యాయత చూపించారు. వారిలో కర్నూలు నుంచి కూడా వచ్చిన అక్కాచెల్లెళ్లు ఉన్నారు. ‘తల్లీ...అక్కడ పనులు లేవా?...ఇక్కడదాకా వచ్చారు?’ అని అడిగితే.. ‘అక్కడ రోజుకు రూ.70-80 కూడా గిట్టడం లేదు. మిరప తోటలకెళితే రూ.120-130 గిడతాయని వచ్చామన్నా’ అని అన్నారు. అక్కడ్నుంచి వలసలు వచ్చారు. చిన్నపిల్లలను చంకన వేసుకుని పొలాల్లో పనిచేస్తున్న వారిని చూసి బాధనిపించింది.
రెండు నెలల్లో విద్యాసంవత్సరం ముగియనున్న పరిస్థితుల్లో విద్యార్థులకు ఈ ఏడాదికి సంబంధించి రావల్సిన రీయింబర్స్‌మెంట్ బకాయిల గురించి అడిగే నాథుడే కరువయ్యాడు. ఇల్లు కట్టుకోవడం అటుంచి వైఎస్ బతికి ఉన్నప్పుడు కట్టుకున్న ఇళ్లకు డబ్బులు రాని పరిస్థితి. పేదవాడు అనారోగ్యం పాలైనప్పుడు ఆదుకున్న 108 అంబులెన్సులకు ఫోనుచేస్తే అందుబాటులేని దారుణమైన పరిస్థితుల్లో రాష్ట్రాన్ని నడుపుతున్న పెద్దలను చూస్తే బాధనిపిస్తోంది.’’
చనిపోయిన మహానేతకు ఓ న్యాయమట..
బతికున్న బాబుకు ఇంకొక న్యాయమట..
‘ఇవాళ రాష్ట్రంలోనయినా, కేంద్రంలోనయినా సోనియాగాంధీ రాజ్యమేలుతున్నారంటే.. దానికి కారణం వై.ఎస్.రాజశేఖరరెడ్డి. అలాంటి నేత చనిపోయాడని తెలిసీ, తిరిగి రాడని తెలిసీ, బతికి ఉన్నపుడు ఒక మాటా మాట్లాడని ఇదే కాంగ్రెస్ నేతలు.. ఆయన చనిపోయాక అప్రతిష్టపాలు చేయాలని, నైతిక విలువలన్నీ పక్కనపెట్టి చివరకు చంద్రబాబునాయుడుతో కలిశారు. కుళ్లు, కుతంత్రాలు పన్ని కోర్టులకు వెళ్లి.. కేసులు వేసి చనిపోయిన ఆ మహానేతను అప్రతిష్టపాలు చేయాలని అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ.. ప్రజలను, ప్రజా సమస్యలను గాలికొదిలేశారు. విలువలు లేని, విశ్వసనీయత లేని, న్యాయం లేని, ధర్మం లేని రాజకీయాలను వీరు కలసికట్టుగా చేస్తున్నారు. చనిపోయిన మహానేతకు ఒక న్యాయమట.. బతికివున్న చంద్రబాబునాయుడుకు ఇంకొక న్యాయమట! ఇలాంటి అన్యాయమైన వ్యవస్థను చూసి బాధనిపిస్తుంది.’

No comments:
Post a Comment