జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Sunday, November 7, 2010

అటు జల్ తుపాను.. ఇటు జనతుపాను * సహనం నశిస్తే ఉప్పెనే

నెల్లూరు గాంధీ సెంటర్‌లో వైఎస్ విగ్రహావిష్కరణకు హాజరైన ప్రజలు

వైఎస్‌ను అభిమానించే వాళ్లపై సొంత పార్టీలోనే కుట్రలు చేస్తున్నారు
నన్ను ఒంటరిని చేసేందుకు వారిని పార్టీ నుంచి బయటకు పంపే ప్రయత్నాలు చేస్తున్నారు... పార్టీలో నరకం చూపిస్తున్నారు
నా సహనం నశించినపుడు జనం గుండెలు ఒక్కటై ఉప్పెన పుడుతుంది... ఆ ఉప్పెనలో కుట్రదారులంతా కొట్టుకుపోతారు

నెల్లూరు పట్టణంలో లక్షలాది మంది నడుమ ఉద్వేగంగా జగన్ ప్రసంగం
23వ రోజు ఆదివారంతో నెల్లూరు జిల్లాలో ముగిసిన ఓదార్పు యాత్ర
కండరాల నొప్పికి వైద్య పరీక్షల కోసం చెన్నై వెళ్లిన యువనేత

ఓదార్పు యాత్ర
‘నన్ను ఒంటరిని చేసేందుకు.. వైఎస్‌పై ప్రేమ, అభిమానం ఉన్నవాళ్లను, నన్ను నమ్ముకున్న వాళ్లను ఓ పథకం ప్రకారం పార్టీ నుంచి పంపించేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓ పథకం ప్రకారం నరకం చూపిస్తున్నారు. శిశుపాలుని పాపాలు పండినట్టే... వారి పాపాలు పండినపుడు, నా సహనం నశించినపుడు, వైఎస్సార్‌ను అభిమానించే ప్రతి గుండె చప్పుడూ ఒక్కటై ఉప్పెన పుడుతుంది. ఆ ఉప్పెనలో వాళ్లంతా కొట్టుకుపోతారు’ అని యువ ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్వేగంగా మాట్లాడారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఓదార్పు యాత్ర చివరి రోజైన ఆదివారం నెల్లూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్‌లో ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహాన్ని యువనేత ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి తరలివచ్చిన అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు.

‘‘రాష్ర్టంలో కుట్రలు, కుతంత్రాలు రాజ్యమేలుతున్నాయి. మహానేత మరణించి ఏడాది గడిచినప్పటికీ కొందరు ఇంకా ఆయన బతికే ఉన్నారనే భ్రమలోనే ఉండి ఆయనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్షాలను, వాటికి కొమ్ముకాసే ఆ రెండు పత్రికలను పక్కన పెడితే... ఇవాళ సొంత పార్టీలో కూడా కుళ్లు, కుతంత్రాలు రాజ్యమేలుతున్నాయి. సొంత పార్టీ వాళ్లే కుట్రలు పన్నుతున్నారు. కొండా సురేఖ, అంబటి రాంబాబు, శ్రీధర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎల్లసిరి గోపాల్‌రెడ్డి... వీళ్లు చేసిన తప్పేమిటి? వీరంతా పాదయాత్రలో నాన్న అడుగులో అడుగేసిన వాళ్లే.. చేయిచేయి కలిపి నడిచిన వాళ్లే... పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్లే. నన్ను ఒంటరిని చేసేందుకు వైఎస్‌ను అభిమానించే వాళ్లను, నన్ను నమ్ముకున్న వాళ్లను ఓ పథకం ప్రకారం పార్టీ నుంచి బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఇది న్యాయ మా? ఇంత జరుగుతున్నా ఈరోజు మీ ముందు నేను నవ్వుతూ నిలబడగలిగాను అంటే.. మహానేతపై, నాపై మీరు చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత, అనురాగమే కారణమని నేను గర్వంగా చెప్తున్నాను’ అని జగన్ ఉద్వేగంగా మాట్లాడారు. ప్రసంగం ముగియగానే అదే వేదికపై ఆయన వర్షంలో తడుస్తూ ఆకాశంవైపు చూస్తూ రెండు చేతులెత్తి దండం పెట్టారు. జగన్ ప్రసంగించినంత సేపు చినుకులు పడ్డాయి. ఆయన వేదిక మీది నుంచి దిగిన ఐదు నిమిషాల తరువాత వర్షం ఊపందుకుంది.

తెల్లవార్లూ ఓదార్పు...

యాత్ర 22వ రోజు శనివారం రాత్రి ఒంటి గంటకు గూడూరు మండలం నెలటూరులో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించిన జగన్.. తెల్లవారు జామున రెండు గంటలకు డీసీసీ అధ్యక్షుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి ఇంట్లో భోజనం చేశారు. అక్కడి నుంచి వేకువ జాము న 3.10 గంటలకు ఆదిశంకర కళాశాల సెంటర్‌కు చేరుకొని విగ్రహం ఆవిష్కరించారు. నాలుగు గంటలకు నెల్లూరులో కాంగ్రెస్ నేత మనోహర్‌రెడ్డి ఇంట్లో బస చేశారు. ఆదివారం ఉదయం 9.30 గంటలకు 23వ రోజు ఓదార్పు యాత్ర ప్రారంభించారు. నెల్లూరు పట్టణంలోని డైకాస్‌రోడ్డు చేపల మార్కెట్, మూలపేట సెంటర్, సీవీఎస్ పాఠశాల సెంటర్లో ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు. అక్కడి నుంచి పొదలకూరు రోడ్డులోని నీలగిరి సంఘం చేరుకుని మహబూబ్ బాషా కుటుంబాన్ని ఓదార్చారు. తర్వాత గాంధీబొమ్మ సెంటర్‌లో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరిం చి ప్రసంగించారు. అక్కడి నుంచి స్థానిక కాంగ్రెస్ నాయకుడు అనిల్‌కుమార్ యాదవ్ ఇంటికెళ్లి తేనీటి విందు తీసుకున్నారు. సాయంత్రం 5 గంటలకు తిక్కవరపుపాడు చేరుకుని వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. దీంతో జిల్లాలో యాత్ర ముగిసింది.

అటు జల్ తుపాను.. ఇటు జనతుపాను

ఓదార్పు యాత్ర సందర్భంగా ఆదివారం నెల్లూరు పట్టణం జనమయమైంది. పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్‌లో వైఎస్‌విగ్రహావిష్కరణకు జనం భారీ ఎత్తున తరలివచ్చారు. జల్ తుపాను నెల్లూరు, పుదుచ్చేరి మధ్య తీరం దాటి విరుచుకుపడబోతోందని ఓ వైపు వాతావరణ శాఖ హెచ్చరికలు చేసినప్పటికీ.. అభిమానులు లెక్కచేయలేదు. ఉదయం 9 గంటల నుంచే కనకమహల్ సెంటర్... ఏసీ సెంటర్... వీఆర్‌సీ సెంటర్లు లక్షలాది మందితో కిక్కిరిసిపోవడం మొదలైంది. ఓ వైపు తుంపర్లు తుంపర్లుగా జల్లు కురిసినప్పటికీ జనం జగన్ కోసం ఓపిగ్గా వేచి ఉన్నారు. అయితే ఈ సెంటర్లు పూర్తిగా నిండి స్థలం సరిపోకపోవడంతో అభిమానులు భవనాలు ఎక్కారు. అదికూడా చాలకపోవడంతోసాయిబాబా గుడి వీధిలోకి కూడా జనం మళ్లారు. విగ్రహావిష్కరణకు తరలివచ్చిన అశేష జన ప్రవాహాన్ని చూసి రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యపోయారు. 11 గంటలకు ఇక్కడ విగ్రహాన్ని ఆవిష్కరించి జగన్ మాట్లాడారు. స్వల్పంగా కురిసిన జల్లుల్లో తడుస్తూ జనం యువనేత ప్రసంగాన్ని విన్నారు. జగన్‌కు ఆయన సెక్యూరిటీ సిబ్బంది గొడుగు పట్టే ప్రయత్నం చేయగా ఆయన వద్దన్నారు. ఉద్వేగంగా మాట్లాడిన జగన్ ప్రసంగానికి అభిమానుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. రెట్టించిన ఉత్సాహంతో వారు జై జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ప్రసంగంలో వైఎస్సార్ పేరెత్తిన ప్రతిసారీ ప్రజలు చేతులు పెకైత్తి వైఎస్సార్ జిందాబాద్.. అంటూ మిన్నంటేలా నినదించారు.
వైఎస్సార్ మళ్లీ ఉదయించారు: సురేఖ

దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి.. తన తనయుడు జగన్ రూపంలో మళ్లీ ఉదయించారని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఆదివారం నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్‌వద్ద జరిగిన వైఎస్ విగ్రహావిష్కరణకు హాజరైన అశేష జనప్రవాహాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ‘వైఎస్ పేద ప్రజల మనిషిగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. ఆ పథకాలన్నీ కొనసాగాలంటే జగనే సీఎం కావాలి. జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి జల్ తుఫానే నిలిచిపోయింది. పార్టీ సర్వనాశనమైనా..జగన్ ఎదగకూడదనే దురుద్దేశంతో పలువురు కాంగ్రెస్ నాయకులు కుట్ర చేస్తున్నారు. జగన్ గురించి అధిష్టానానికి తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారు. ప్రజలకు డబ్బులిచ్చి ఓదార్పుకు రప్పిస్తున్నారని కొంత మంది విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది. వి.హనుమంతరావు ఎంత డబ్చిచ్చయినా ఇంత జనాభిమానాన్ని పొందగలరా?’’ అని ఆమె ప్రశ్నించారు.

ఆదివారం నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్‌వద్ద జరిగిన వైఎస్ విగ్రహావిష్కరణ సభలో జగన్ ప్రసంగానికి ముందు నల్లప రెడ్డి, లక్ష్మీ పార్వతి, రోజా తదితరులు ప్రసంగించారు. వారేమన్నారంటే...

పార్టీలకతీతంగా జగన్‌కు మద్దతు: లక్ష్మీపార్వతి

పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ ఓదార్పు యాత్ర చేపట్టిన జగన్‌కు మద్దతు తెలుపుతున్నారని ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. ‘‘ప్రతీ ఒక్కరి మనస్సులో వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచారు. నందమూరి తారకరామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డి, తర్వాత తెలుగు జాతి గౌరవాన్ని నిలపగలిగిన వ్యక్తి జగన్. మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, బావకు వత్తాసు పలికిన ఎన్టీఆర్ తనయుల కంటే, తండ్రి కోసం మరణించిన కుటుంబాలను ఓదార్చుతున్న జగన్ ఎంతో గొప్ప వ్యక్తి. చరిత్రలో తండ్రికిచ్చిన మాటకోసం కట్టుబడిన వ్యక్తిగా శ్రీరామచంద్రుని చూశాం. మళ్లీ ఇప్పుడు తండ్రి ఆశయాలకోసం జనంలోకి వచ్చిన జగన్‌ను చూస్తున్నాం. ఎన్టీఆర్ తొలుత రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో ఎలాంటి ప్రభంజనం ఉందో ఇప్పుడు జగన్‌కు అంతకంటే ఆదరణ లభిస్తోంది. ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత వైస్‌కే దక్కింది’’ అని ఆమె అన్నారు.

నెల్లూరు అదుర్స్: నల్లపరెడ్డి

జగన్‌కు సింహపురి ప్రజలు బ్రహ్మరథం పట్టారని, నెల్లూరు అదుర్స్ అని కోవూరు శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. ‘జగన్.. సింహం కడుపున పుట్టిన సింహం. జగన్ ఒక హీరో.. రాష్ట్రానికి వైఎస్సార్ ఇచ్చిన కోహినూర్ వజ్రం’ అన్నారు.

ప్రతి గుండెలో వైఎస్: మారెప్ప

‘‘ప్రతి గుండెలోనూ వైఎస్సార్ చిరస్థాయిగా ఉన్నందు వల్లే ఓదార్పు యాత్రకు ఇంతటి అనూహ్య ఆదరణ’’ అని మారెప్ప చెప్పారు.

అభిమన్యుడు కాదు.. అర్జునుడు: రోజా

యువనేత వైఎస్ జగన్ అభిమన్యుడు కాదని, అర్జునుడని సినీనటి రోజా అన్నారు. ‘‘పద్మవ్యూహంలో జగన్ చిక్కుకున్నారని, ఇక బయటపడలేరని కొందరు నాయకులు భావించారు. వారి అంచనాలు తలకిందులయ్యాయి. పద్మవ్యూహాన్ని ఛేదించుకుని విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. ఓదార్పుయాత్రకు వస్తున్న స్పందన చూసి కొందరు ఓర్వలేకపోతున్నారు. యాత్రతో కాంగ్రెస్‌కు చెడ్డపేరు వస్తుందని అసత్య ప్రచారం చేశారు. సచిన్ సెంచరీ కొడితే భారత జట్టుకు ఎంత ప్రయోజనమో, జగన్ ఓదార్పుయాత్రతో కాంగ్రెస్‌కు అంతే మేలు జరుగుతోంది. వైఎస్సార్ లేకపోయినా జగన్ ఉన్నారనే నమ్మకం ప్రజల్లో ఉంది.

సాధారణంగా తండ్రి ఆస్తులకు వారసులు ఉంటారు... ఆశయ సాధనకు వారసులు కొందరే ఉంటారు. చరిత్రలో ఏ నాయకుడూ చేయని విధంగా తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను జగన్ పరామర్శిస్తున్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎదుర్కొని ధృడ చిత్తంతో ముందుకు సాగుతున్నారు’’ అని రోజా కొనియాడారు.

రాత్రి, పగలు వేచిచూశారు: రెహమాన్: హిందూ, ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి రెండు కళ్లులాంటివారని టీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్సీ రెహమాన్ అన్నారు. ‘‘వారందరూ జగన్‌నేసీఎంగా కోరుకుంటున్నారు. ముస్లింలకు 4శాతం రిజర్వేషన్‌లు కల్పించిన ఘనత వైఎస్‌కే దక్కుతుంది. ఆయన తనయుడు జగన్ రాకకోసం పగలు, రాత్రులు తేడా లేకుండా ప్రజలు ఎదురుచూశారు’’ అని చెప్పారు.
,,


No comments:

Post a Comment