అధిష్టానంపైనే యుద్ధం
మింగుడుపడని తాజా పరిణామాలు
బయటకు వస్తున్న మనసులోని మాటలు
ఎమ్మెల్యేల కంటే ప్రజలు పెద్ద మద్దతుదారులన్న జగన్
వారిని కట్టడి చేసినా నష్టమేమి లేదని పరోక్ష హెచ్చరిక
జగన్ నాయకత్వం కావాలన్న మంత్రి బాలనేని

‘ఓదార్పు’ లో ‘ధిక్కారం’
కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఓదా ర్పు క్రమంగా ధిక్కార యాత్రగా మారు తోంది. రాష్ట్ర మంత్రి, వైఎస్ సమీప బంధు వయిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఓదార్పు యాత్ర వేదిక నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఈ రాష్ట్రానికి జగన్ ముఖ్య మంత్రి అయితే తప్ప వైఎస్ ప్రారంభించిన సంక్షేమ పథకాలు కొనసాగవని విస్పష్టంగా ప్రకటించారు. ఇది నేరుగా రోశయ్యపై జగన్ వర్గం ప్రారంభించిన దాడిగానే స్పష్టమవు తోంది.ప్రకాశం జిల్లాలో జరుగుతున్న జగన్ ఓదార్పు యాత్ర ముఖ్యమంత్రి రోశయ్యను ధిక్కరించే వేదికగా మారుతోంది. గనుల శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తాను రోశయ్యను ముఖ్యమంత్రిగా పరిగణించడం లేదని, తనకు కాంగ్రెస్ వల్ల కాకుండా వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లే మంత్రి పదవి వచ్చిందని చెప్పకనే చెప్పడం సంచలనం సృష్టించింది. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం వైఎస్ ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలు అమలుకావన్న పరోక్ష వ్యాఖ్యలు చర్చనీ యాంశంగా మారాయి. ఇవి తిరుగుబాటు దిశగా సాగుతున్న ఆలోచన లుగానే సీని యర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
జగన్‌కు మద్దతుదారుగా ఉన్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఓదార్పు ఇకపై ధిక్కారయాత్రగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జగన్ వెంట ఉన్న వారిపై వేటు వేయడం ద్వారా, జగన్‌ను నిర్వీర్యం చేయాలన్న అధిష్ఠానం ఆలోచనను పసిగట్టిన ఆయన అనుచరులు, దేనికయినా సిద్ధంగా ఉన్నామన్న తెగింపు సంకేతాలు బాలినేని వ్యాఖ్యల బట్టి స్పష్టమ వుతున్నాయి. ‘నా పదవి పోయినా ఫర్వా లేదు. జగన్ మాత్రం సీఎం కావాల’ని బాలి నేని విస్పష్టంగా వ్యాఖ్యానించడం బట్టి.. జగన్ అనుచరులయిన మంత్రులు, ఎమ్మె ల్యేలు ఎంతవరకూ తెగించేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టమవుతోంది. గతంలో మాజీ మంత్రి కొండా సురేఖ వ్యవహారశైలి కూడా ఇలాగే కనిపించింది.
ప్రజలు రోశయ్యను ముఖ్యమంత్రిగా చూడ లేకపోతు న్నారని, తాను ఆయన ముఖం చూడలేకపోతున్నానంటూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఆమె మంత్రివర్గం నుంచి వైదొలగారు. ఇప్పుడు బాలినేని వ్యవహారశైలి అదేవిధంగా ఉన్నప్పటికీ.. తనను ముఖ్యమంత్రే తొలగించాలన్న ధోరణి ఆయన మాటల్లో స్పష్టమవుతోంది. కాంగ్రెస్ నాయకత్వం తమపై ఎందాకా వెళుతుందో చూసే వైఖరిని జగన్ వర్గం ప్రదర్శి స్తోంది. లేకపోతే ఇంకా మంత్రిగా కొనసాగుతున్న బాలినేని, ముఖ్యమంత్రిపై అంతఘాటు వ్యాఖ్యలు చేయలేరని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
కాగా.. తూర్పు గోదావరి జిల్లా యాత్రలో జన సమీరకణకు అంతగా ప్రాధాన్యం ఇవ్వని జగన్ వర్గం, ప్రకాశం జిల్లాలో అడుగుపెట్టగానే తన వ్యూహం పూర్తిగా మార్చుకుంది. భారీ జన సమీకరణపెనేై ప్రధానంగా దృష్టి సారించింది. ద్వితీయ స్థాయి నేతలను సమీకరించి, కింది స్థాయి కార్యకర్తలను రోడ్లపై నింపే వ్యూహానికి తెరలేపారు. వైఎస్ బంధువు వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో, మంత్రి బాలినేని స్వీయ దర్శకత్వంలో తరలింపు వ్యవహారాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు జనసమీకరణ స్పష్టం చేస్తోంది.
ప్రకాశం జిల్లాలో జగన్ యాత్ర ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకూ మునుపటి మాదిరిగానే ఎక్కడా సోనియా ప్రస్తావన గానీ, పార్టీ పలుకు గానీ వినిపించకపోవడం ప్రస్తావనార్హం.
పార్టీ పేరు, అధ్యక్షురాలు సోనియాగాంధీ సమర్థతను ప్రస్తావించాలని మొయిలీ విధించిన షరతులు ఓదార్పు యాత్రలో ఎక్కడా కనిపించకపోవడం బట్టి.. పూర్తిగా తెగించడానికే సిద్ధమయినట్లు జగన్ వ్యవహారశైలి చెప్పకనే చెబుతోంది. జగన్ తన యాత్రలో చేస్తున్న ప్రసంగాల్లో తండ్రి వైఎస్ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు, తన గురించి చెప్పుకోవడానికే పరిమితమవుతున్నారు. కాగా జగన్ ఓదార్పు యాత్ర సందర్భంగా ఆయన ఆవిష్కరిస్తున్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు, వాటిని ఏర్పాటుచేసే ద్వితీయ శ్రేణి నేతలకు గిరాకీ పెరిగింది.
విగ్రహంతో పాటు.. అవి ఏర్పాటు చేసే నాయకులకు లక్ష రూపాయల చొప్పున నగదు ఇస్తుండటంతో నేతల మధ్య పోటీ పెరిగింది. ఫలితంగా.. అరి లోమీటరులో రెండేసి విగ్రహాలు వెలుస్తున్న దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. ఇక వీటికి అనుమతుల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. అటు మునిసిపాలిటీలు గానీ, ఇటు పంచాయతీలు గానీ ఎవరూ అభ్యంతరం పెట్ట పోవడంతో విగ్రహాల ఏర్పాటు కోసం నేతల మధ్య పోటీ పెరిగింది.
కడప ఎంపీ వైఎస్ జగన్మోహనరెడ్డి వర్గం అధిష్ఠానంపై ధిక్కార స్వరానికి దిగుతోంది. ప్రకాశం జిల్లా ఓదార్పు యాత్రలో అధిష్ఠానం ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు గైర్హాజరు కావడం ఆ వర్గానికి మింగుడు పడడం లేదు. ద్వితీయ శ్రేణి నేతల ద్వారా ప్రజాప్రతినిధులను కట్టడి చేయాలన్న వ్యూహమూ పూర్తిగా బెడిసికొట్టింది. దీంతో మనసులోని భా వాలను క్రమంగా బయటకు వెల్లడిస్తున్నారు. ప్రకాశం ఓదా ర్పు యాత్రలో భాగంగా ఆదివారం జగన్ మాట్లాడుతూ.. ఎ మ్మెల్యేల కంటే ప్రజలే తనకు అతిపెద్ద మద్దతుదారులని వ్యా ఖ్యానించారు.
"నన్ను మీ సోదరుడిగా, కుమారుడిగా ఆశీర్వదిస్తున్నారు. నాపై ఇంత ప్రేమాభిమానాలు చూపుతున్నారు. ఇదంతా చూసిన తర్వాత కూడా జగన్ ఒంటరి అని ఎవరైనా అనగలరా? మద్దతు అంటే ఒక్క ఎమ్మెల్యేలేనా!?'' అని ప్ర శ్నించారు. తద్వారా, ప్రజాప్రతినిధులను కట్టడి చేసినా తనకు వచ్చే నష్టమేమీ లేదంటూ అధిష్ఠానానికి జగన్ పరోక్ష హెచ్చరికలు చేశారని పార్టీవర్గాలు విశ్లేషిస్తున్నాయి. అదే సమయంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా వైఎస్ ప్రారంభించిన సంక్షేమ పథకాలు అమలు కావాలంటే జగన్ నాయకత్వం కావాలని చెప్పడాన్ని కాంగ్రెస్ నేతలు తప్పుబడుతున్నారు.
అధిష్ఠానం బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి రోశయ్య సమర్థంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయలేకపోతున్నారని చెప్పడమే ఇందులోని మర్మమని వారు వివరించారు. దీనికితోడు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సమర్థుడైన నా యకుడు లేడని వ్యాఖ్యానించడం ద్వారా పార్టీకి జగన్ తప్ప మరో దిక్కు లేదని చెప్పడమేనని విశ్లేషించారు. తన సందేశాన్ని స్వయంగా ముఖ్యమంత్రి రోశయ్యే మంత్రి బాలినేనికి స్పష్టం చేసినా.. ఆయన బేఖాతరు చేయడంపై అధిష్ఠానం ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, మరో వారం రోజుల్లో ఆయనపై వేటు పడే అవకాశం ఉందన్న కథనాలూ వచ్చిన సంగతి తెలిసిందే.
దీంతో, తనపై వేటు తప్పదన్న అభిప్రాయానికి వచ్చినందునే మంత్రి బాలినేని పైవిధంగా వ్యాఖ్యానించారని అంటున్నారు. ఇక, జగన్ వర్గానికే చెందిన మరో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆదివారం చేసిన వ్యాఖ్యలు అధిష్ఠానాన్ని ధిక్కరించేవిగానే ఉన్నాయంటున్నారు. అధిష్ఠానానికి భయపడి జగన్ వెంట ప్రజాప్రతినిధులు రావడం లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఇందుకు ఉదాహరిస్తున్నారు. వాస్తవానికి, ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్రకు ప్రజాప్రతినిధుల నుంచి ఈస్థాయిలో సహాయ నిరాకరణ ఎదురవుతుందని జగన్ వర్గం ఊహించలేదు.
జిల్లాలో ద్వితీయ శ్రేణి నేతల ద్వారా ఒత్తిడి పెంచితే ఎమ్మెల్యేలు దిగివస్తారని, జగన్ యాత్రలో పాల్గొంటారని ఊహించారు. కానీ, అధిష్ఠానాన్ని తక్కువగా అంచనా వేస్తూ ఈ తరహా వ్యూహాలను అమలు చేసినా ఫలించలేదని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ఒక బలమైన సామాజికవర్గానికి చెందిన నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ జిల్లాలో అధిష్ఠానం మాట జవదాటి ప్రజాప్రతినిధులు పాల్గొంటారేమోనని కొందరు భావించారు. ఈ జిల్లా యాత్రపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులందరూ ఉత్కంఠతో చూశారు. అయితే అధిష్ఠానం గీసిన లక్ష్మణ రేఖను దాటకుండా ప్రజాప్రతినిధులు ఉన్నారు.
దీంతో మిగిలిన జిల్లాల్లోనూ ప్రధానంగా, పొరుగున ఉన్న నెల్లూరు జిల్లాలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు ఒక మార్గదర్శకాన్ని చూపినట్లయిందని పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే ఒరవడి నెల్లూరు జిల్లాలోనూ కొనసాగుతుందని చెబుతున్నాయి. దీనికితోడు, జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొంటున్న వారు ఎవరు? వారు ఎక్కడెక్కడ నుంచి వాహనాలను తరలించారు? వాటిని ఎవరు బుక్ చేశారు? తదితర సమాచారాన్ని ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా అధిష్ఠానం తెప్పించుకుంటోంది. అలాగే, తన మాటను ధిక్కరించే వారిపై చర్యలకు కూడా అధిష్ఠానం రంగం సిద్ధం చేస్తోందని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.
రాష్ట్ర పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న అధిష్ఠానం త్వరలోనే తన నిర్ణయాలకు పదునుపెట్టే అవకాశం ఉందని వివరించాయి. మొత్తానికి అధిష్ఠానానిదే పైచేయిగా కనిపిస్తుండడంతో జగన్ వర్గం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దీనిప్రభావం వారి ప్రకటనల ద్వారా బహిర్గతమవుతోంది. అధిష్ఠానం కూడా ఇదే కోరుకుంటోందని, జగన్ వర్గం అసహనమే ఢిల్లీకి ఆయుధంగా మారుతుందని పార్టీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. మొత్తానికి ప్రకాశం జిల్లా ఓదార్పు యాత్ర నేపథ్యంలో జగన్ బలమేమిటో, అధిష్ఠానం శక్తియుక్తులేమిటో తేటతెల్లమయ్యాయని చెప్పారు.
ఇకముందు అధిష్ఠానం మాటను జవదాటే అవకాశం తగ్గుతుందని, ఇది జగన్ వర్గంలో కలవరం పుట్టిస్తోందని.. ఫలితంగా అధిష్ఠానంపై విమర్శలు గుప్పించడం మొదలైందని వివరించారు. వీటి ఫలితం ఏవిధంగా ఉంటుందో త్వరలోనే అధిష్ఠానం స్పష్టం చేస్తుందని ఆయన తెలిపారు. అధిష్ఠానం కూడా సందర్భోచితంగా వ్యవహరిస్తుందని, మరో వారం రోజుల్లో చోటుచేసుకోనున్న పరిణామాలు ఇందుకు నిదర్శనంగా ఉంటాయని చెప్పారు.

No comments:
Post a Comment