అదే సమయంలో పార్టీకి నష్టమే
ఆయనను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు: ఏఐసీసీ వర్గాలు

తివాచీలా పరుచుకున్న పచ్చదనం! ఆ మధ్యలో వెలిగిపోతున్న శ్వేత సౌధం! ఇది కడప ఎంపీ వైఎస్ జగన్ నివాసం. తెలుగుదేశం వర్గాలు ఈ భవంతి వివరాలను సేకరించాయి. బెంగళూరు శివారులోని యలహంక రోడ్‌లో ఉన్న ఈ భవంతి విశేషాలు అన్నీ ఇన్నీ కావు. దీని మొత్తం విస్తీర్ణం 31 ఎకరాలు.
జగన్ సోదరి షర్మిల నివాసం కూడా ఇదే ఆవరణలో ఉంటుంది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగానే దీని గృహ ప్రవేశం జరిగింది. వైఎస్‌కు అత్యంత సన్నిహితులు, బంధువులైన సుమారు వందమందికి మాత్రమే అప్పట్లో ఆహ్వానం లభించింది. గృహ ప్రవేశం తర్వాత వైఎస్ మూడు రోజులపాటు అక్కడే బస చేశారు.
ఈ భవనం శత్రు దుర్భేద్యం. దీనికి మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. ఇక్కడ ఒక్కో షిఫ్ట్‌లో 200 మంది చొప్పున, మూడు షిఫ్టుల్లో మొత్తం 600 మంది సెక్యూరిటీ సిబ్బంది పని చేస్తున్నారు. వీరి నివాసాలు కూడా ఇక్కడే. కొత్త వాళ్లను ఆ భవంతి ఛాయలకు కూడా రానివ్వరు. మీడియాకు అస్సలు ప్రవేశం ఉండదు. జగన్ సొంత పత్రిక, చానెల్ ప్రతినిధులను పిలిపించినా... రెండో గేటు వరకే ప్రవేశం ఉంటుంది.
ఇతర ముఖ్యులను కూడా ఆ గేటు వద్ద ఉన్న గదిలోనే జగన్ కలుస్తారు. అత్యంత ముఖ్యులకు మాత్రమే లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది. వైఎస్ సన్నిహిత కుటుంబ సభ్యులను మినహాయిస్తే... ఈ భవంతి లోపలికి వెళ్లి, కళ్లారా చూసిన వారి సంఖ్య చాలా తక్కువ. వైఎస్ మరణం తర్వాత వీరప్ప మొయిలీ ఒకసారి ఈ భవంతిలో, జగన్‌తో భేటీ అయినట్లు తెపలుస్తోంది. అత్యంత ముఖ్యులతో, అత్యంత కీలకమైన అంశాలపై చర్చించేందుకు ఈ భవంతిలో ఒక ప్రత్యేక గది ఉన్నట్లు చెబుతారు.

No comments:
Post a Comment