జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Sunday, July 11, 2010

తూర్పులో జగన్‌కు 'ఓదార్పు' ఎంపీ, మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేలు ఆయన వెంటే - ‘తూర్పు ’ లో ధిక్కార స్వరం

జగన్‌ ఓదార్పు యాత్ర తూర్పు ప్రజాప్రతినిధులు అధిష్టానం వర్గం పట్ల ధిక్కార స్వరాన్ని వినిపిస్తారనే తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే గాని, మంత్రులు గాని పాల్గొన లేదు. అయితే తూర్పులో మాత్రం ఎక్కువ మంది ఎమ్మె ల్యేలు ఓదార్పునకు సహకరిస్తారనే భావిస్తున్నారు. గత రెండు రోజులుగా పార్టీ అధిష్టానవర్గం ఓదా ర్పులో ఎమ్మెల్యేలు పాల్గొనకుండ కట్టడి చేసే ప్రయ త్నాలు ఫలించే అవకాశాలు లేవు. పాల్గొంటే అంతా పాల్గొందాం, లేకపోతే అంతా తప్పుకుందాం అనే దానిపై జరిగిన చర్చలు సైతం ఫలించలేదు. 
 కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, రాజో లు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌లు యాత్ర ప్రారం భం నుండి ముగింపు రోజు వరకు జగన్‌ వెన్నంటే ఉంటా మని స్పష్టం చేయడంతో ఎమ్మెల్యేలలో ఐకమత్యమనేది లోపించింది. అసలు జిల్లాలో ప్రజాప్రతినిధులంతా స్వర్గీ య వైఎస్‌ గూటిలో పక్షులే. జగన్‌ ఓదార్పు యాత్రలో తాము పాల్గొంటామని, అది తమ బాధ్యతని మంత్రులు ఇప్పటికే స్పష్టం చేశారు. శాసనసభ సమావేశాలు పూర్తి కాగానే యాత్రలో పాల్గొంటానని మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ సుస్పష్టం చేశారు. అన్నమాట మీద ఆయన కట్టుబడి 17న ఓదార్పులో పాల్గొంటానంటున్నారు.
మరో మంత్రి పినిపే విశ్వరూప్‌ అమలాపురం నియోజకవర్గంలో జగన్‌తో జత కలుస్తారంటున్నారు. మరో 6గురు ఎమ్మె ల్యేలు జగన్‌ యాత్రలో పాల్గొంటామంటుంటే, ముగ్గురు ఎమ్మెల్యేలు డోలాయమానంలో ఉన్నారు. ఇక ఎమ్మెల్సీలు అయితే అంటీముట్టన్నట్టే జారుకుంటున్నారు. వైఎస్‌ ఆశ యాలు పునికి పుచ్చుకున్నాననే బాహాటంగా ప్రకటించిన జిల్లా పరిషత్‌ చైర్మన్‌ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అయితే నాడి దొరకని పరిస్థితిలో ఉన్నారు.

తన ముఖ్య అనుచరులు యువజన కాంగ్రెస్‌ అధ్యక్షులు వరుపుల రాజా, మరోనేత సుధీర్‌ రాజులను ఏర్పాట్ల పర్యవేక్షణలో ప్రత్యక్షంగా దింపిన వేణు తాను మాత్రం జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలో తటస్థుడనే రీతిలో ఆయన వ్యవహ రిస్తున్నారు. మొత్తం మీద ఆయన పరిస్థితి పాము చావుకు కర్ర విరగదన్నట్లు ఉంది. మొత్తం మీద తూర్పులో ధిక్కార స్వరం వినిపించక మానదు. అయినప్పటికీ యాత్ర ప్రారంభమైనా అందులో ఏదోవిధంగా ప్రజా ప్రతినిధులు పాల్గొనకుండ చేయాలని అధిష్టానం తమ ప్రయత్నాలు యధావిధిగానే కొనసాగిస్తుంది. మధ్యలో మరెన్ని మా ర్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి.

నల్లమిల్లి శేషారెడ్డి - అనపర్తి ఎమ్మెల్యే :
N.Sesha-Reddy-తన నియోజకవర్గంలో ఓదార్పు యాత్రలో పాల్గొంటానం టున్నారు. అయితే అప్పటికి అసెంబ్లీ సమావేశాలు పూర్తి కావలసి ఉంది.

జడ్‌పి చైర్మన్‌- చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ : యాత్రలో ప్రత్యక్షంగా పాల్గొనా లని ఉన్నప్పటికీ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు కావడంతో ఆయన తటస్థ వైఖరిని అవలంభిస్తున్నారు. అయితే ఆయనకున్న వనరులన్నీ జగన్‌ ఓదార్పు యాత్ర విజయ వంతంలో కీలకం చేస్తున్నారు.
పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌-రాష్ట్ర మంత్రి : ఓదార్పునకు ఆది నుండి సహకారం అందిస్తానని స్పష్టం చేశారు. మధ్యలో అసెంబ్లీ సమావేశాలు మొదలవ్వడంతో కనీ సం తన నియోజకవర్గంలోనైనా యాత్రలో పాల్గొంటామంటున్నారు.యాత్ర విజయవంతం కావా లని మనసా, వాచా కోరుకుంటున్న వ్యక్తి.

పినిపే విశ్వరూప్‌-రాష్టమ్రంత్రి:
viswwa స్వర్గీయ వైఎస్‌కు, జగన్‌కు సైతం సన్నిహితంగా ఉండే మంత్రి విశ్వ రూప్‌ కనీసం నియోజకవర్గం అమ లాపురంలో ఓదార్పులో పాల్గొం టానని పేర్కొంటున్నారు.
రాపాక వరప్రసాద్‌ - రాజోలు ఎమ్మెల్యే : జగన్‌ ఓదార్పు యాత్రకు ఆది నుండి గట్టి మద్దతిస్తున్న ఎమ్మెల్యే రాపాక. అధిష్టానం ఈ వ్యవ హారంలో ఏ నిర్ణయం తీసుకున్నా తాను లెక్కచేయనని, ఓదార్పు యాత్రే తనకు ముఖ్యమని ఆయన స్పష్టం చేస్తున్నారు.

రౌతు సూర్యప్రకాశరావు - రాజమండ్రి ఎమ్మెల్యే :
ruthiనిన్న మొన్నటి వరకు ఓదార్పులో పా ల్గొంటానని స్పష్టం చేసిన రౌతు ప్ర స్తుతం మౌనంలో ఉన్నారు. నిర్ణ యాన్ని ప్రకటించేందుకు వేచి చూచే ధోరణిలో ఉన్నారు.

తోట నరసింహం-జగ్గంపేట ఎమ్మెల్యే : ఆది నుండి జగన్‌ ఓదార్పు యాత్రకు అంత సుముఖత వ్యక్తం చేయడంలేదు. తప్పని సరైతే యాత్రలో పాల్గొనా లని భావించారు. అయితే అసెంబ్లీ సమావేశాలకు ఆయన తప్పుకునేం దుకు, చెప్పుకునేందుకు అవకాశం కలిగించింది.

పొన్నాడ వెంకట సతీష్‌ కుమార్‌-ముమ్మిడివరం ఎమ్మెల్యే : sateeshతన నియోజకవర్గంలో ఓదార్పు యాత్రలో పాల్గొంటానని వైఎస్‌ఆర్‌ విగ్రహాలు ఎక్కువ ప్రారంభమ య్యేలా ఏర్పాటు చేస్తున్నామం టున్నారు.

కె.వి.వి. సత్యనారాయణ రెడ్డి- రంపచోడవరం ఎమ్మెల్యే : ఓదార్పుకు ఇంచుమించుగా ఆయన దూరమన్నట్లే.

ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి- కాకినాడ సిటీ ఎమ్మెల్యే : ఆది నుండి జగన్‌ విధేయుడు. జగన్‌ తోనే మమేకమైన వ్యక్తి ఓదార్పు యాత్రకు జిల్లాలో కర్త, కర్మ, క్రియ అన్నీ ఆయనే. అధిష్టానాన్ని ధిక్కరిం చైనా ఓదార్పు విజయవంతం చేయాలన్నదే ఆయన తపన.

రాజా అశోక్‌బాబు-తుని ఎమ్మెల్యే :
ఓదార్పు యాత్ర తన నియోజకవర్గం నుండే తూర్పు లో మొదలవ్వడం విజయవంత బాధ్య తలు ఆయనే తీసుకున్నారు. తొలు త అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపధ్యంలో డోలాయమానం లో పడ్డప్పటికీ చివరకు ఓదార్పుకే మొగ్గు చూపారు. ఓదార్పు అనంతరం అసెంబ్లీకి వెళతానంటున్నారు.

జి.వి. హర్ష కుమార్‌- అమలా పురం ఎం.పి. : స్వర్గీయ వైఎస్‌కే కాదు జగన్‌కు బద్ద విరో ధిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి. ఓదార్పుకు ఆయన సహకారం ఉండదనేది అందరికీ తెలిసిందే.
ఉండవల్లి అరుణ కుమార్‌- రాజమండ్రి ఎం.పి. : స్వర్గీయ వైఎస్‌కు కుడి భుజంగా పేరొందిన ఉండవిల్లి అధిష్టానాన్ని ధిక్కరించి ఏ పనీ చేయరు. దీంతో ఆయన వ్యవహారం తటస్థంగా మారింది.

Pamula-Rajeswariపాముల రాజేశ్వరీ దేవి-పి. గన్నవరం ఎమ్మెల్యే : తన నియో జకవర్గంలో జరిగే ఓదార్పు యాత్ర లో విడిగా పాల్గొంటానని ఆమె స్పష్టం చేస్తున్నారు.

ఎం.ఎం. పళ్లంరాజు-కేంద్ర మంత్రి.. కాకినాడ: అధిష్టానవర్గం ఆదేశాలే సదా శిరోధార్యం అనే మంత్రి పళ్లంరాజు జగన్‌ ఓదార్పు యాత్రను తప్పుపట్టకపోయినా ఆయన సహకారం మాత్రం ఉండదనే చెప్పాలి.

ఎమ్మెల్సీలు గిడుగు రుద్రరాజు, కందుల దుర్గేష్‌ , కెవివి సత్యనారాయణ రాజు, రుద్రరాజు పద్మరాజు, బలసాడి ఇందిరలు జగన్‌ యాత్రకు బలపరుస్తున్నా యాత్రలో మాత్రం పాల్గొనే అవకాశాలు లేవు. రాజ్యసభ సభ్యురాలు టి రత్నాభాయి, మరో ఎంపి కిషోర్‌ చంద్రదేవ్‌ జగన్‌ యాత్రకు సుముఖులు కారు.

ఎమ్మెల్సీ, డీసీసీ అధ్యక్షుడు కూడా...
మంత్రివర్గ సమావేశం తర్వాత ఓదార్పునకు మంత్రులు
తునిలో స్వాగతం పలికేందుకు ఐదుగురు ఎమ్మెల్యేలు
వైఎస్ జగన్‌కు తూర్పు గోదావరి జిల్లాలో 'ఓదార్పు' లభించనుంది. జిల్లాలోని ఇద్దరు మంత్రులు సుభాష్‌చంద్రబోస్, విశ్వరూప్‌లతోపాటు ఆరుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ రుద్రరాజు జగన్‌కు మద్దతుగా ఓదార్పు యాత్రలో పాల్గొననున్నారు. వీరిలో జగన్‌కు సన్నిహితులైన కాకినాడ సిటీ, రాజోలు ఎమ్మెల్యేలు డి.చంద్రశేఖరరెడ్డి, ఆర్.వరప్రసాద్‌లు యాత్ర ప్రారంభం నుంచి చివరి వర కు ఉండాలని నిర్ణయించారు.

జగన్ యాత్రపై చర్చించేందుకు జిల్లా నేతలంతా ఆదివారం సాయంత్రం తునిలో సమావేశమయ్యారు. జగన్ తునిలో అడుగుపెట్టిన వెంటనే ఆయనకు స్వాగతం పలుకుతామని చంద్రశేఖరరెడ్డి, వరప్రసాద్‌లతోపాటు స్థానిక ఎమ్మె ల్యే రాజా అశోక్‌బాబు, అనపర్తి, ముమ్మిడివరం, రాజమండ్రి ఎమ్మెల్యేలు శేషారెడ్డి, పి.సతీష్‌కుమార్, రౌతు సూర్యప్రకాశరావు, ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, డీసీసీ అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ వేణు తదితరులు స్పష్టం చేశారు.

అలాగే, సోమవారం యాత్రలో రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ కూడా పాల్గొంటారు. తన నియోజకవర్గంలో జగన్ పర్యటించినప్పుడు హాజరవుతానంటూ గన్నవరం ఎమ్మెల్యే పి.రాజేశ్వరీదేవి హైదరాబాద్ వచ్చారు. ఇక, హైదరాబాద్‌లోనే ఉ న్నప్పటికీ మంత్రులు సుభాష్ చంద్రబోస్, విశ్వరూ ప్‌లు జిల్లాలో యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 15తో అ సెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. 16న మంత్రివర్గ సమావేశం జరగనుంది.

అనంతరం 17నుంచి మంత్రులు బోస్, విశ్వరూప్‌లు జగన్ యాత్రలో పాల్గొననున్నారు. తాము మంత్రులుగా ఉ న్నందున బహిరంగంగా మాట్లాడలేమని విశ్వరూప్  స్పష్టం చేశారు. ఇక, మంత్రి బోస్ ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రపురం పరిధిలోని కాంగ్రెస్ నేతలు ఆదివారం సమావేశమయ్యారు. తామంతా బోస్ వెంటే జగన్ యాత్రలో పా ల్గొంటామని ప్రకటించారు. జగ్గంపేట ఎమ్మెల్యే నరసింహం పార్టీ నిర్ణయం మేరకు యాత్రకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యేలు మాత్రం యాత్రలో చురుకుగా పాల్గొనాలని నిర్ణయించారు.

75 కుటుంబాలకు...
జగన్ ఓదార్పు యాత్ర సోమవారం నుంచి తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభం కానుంది. జిల్లాలో సుమారు పది రోజులపా టు 75 బాధిత కుటుంబాలను ఓదార్చనున్నారు. అనేకచోట్ల వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 4 రోజుల యా త్రను ముగించుకున్న ఆయన, ఆదివారం అర్ధరాత్రి అన్నవరం చేరుకున్నారు. సోమవారం ఉదయం తొండంగి మండలంలో తన యాత్రను ప్రారంభిస్తారు. తొలిరోజు తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగనుంది. ఈ మేరకు తుని ఎమ్మెల్యే అశోక్‌బాబు, ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు విస్తృత ఏర్పాట్లు చేశారు.

‘గోదారి’ స్వాగతం
jagan-sirమేజర్‌న్యూస్‌ ప్రతినిధి, కాకినాడ: జగన్‌ ఓదార్పు యాత్ర శ్రీకాకుళం జిల్లాను మరిపించే రీతిలో తూర్పు గోదావరి జిల్లాలో జన నీరాజనం అందించేలా సన్నా హాలు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ జగన్‌ను చూసేం దుకు జనం ఇబ్బడిముబ్బడిగా తరలివస్తున్నారని ప్రచా రం ఉండడంతో జిల్లాలో మరింత ప్రతిష్టాత్మకంగా ఈ ఓదార్పు యాత్ర సాగాలనేది ఆయన వర్గీయుల వాంఛ. దీంతో గత నాలుగు రోజులుగా అన్ని ఏర్పాట్లలో జగన్‌ వర్గీయులు తలమునకలై ఉన్నారు. మరోపక్క రాయలసీమ నుండి స్వర్గీయ వైఎస్‌తో అనుబంధాలు పెంచుకున్న నేతలు తూర్పులో తమకు సమర శంఖారావం పూరిం చేలా యాత్ర సాగాలని పట్టుదలతో ఉన్నారు. ఆ విధమైన ఏర్పాట్లలో ఉన్నారు.

మొత్తం ఈ ఏర్పా ట్లన్నింటికీ కేంద్ర బిందువుగా జిల్లాలో అత్యంత ఆప్తుడుగా ఉన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్రశేఖరరెడ్డి ఓదార్పు యాత్రను పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు సన్నద్ధమ య్యారు. అయితే ఈ యాత్ర పెద్దరికాన్ని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం భుజ స్కంధాలపై అంతా కలిపి ఉంచారు. ఏ పనైనా చిత్తశుద్ధితో నిర్వహించే ముద్రగడ తనకు అప్పగించిన బాధ్యతలకు న్యాయం చేకూర్చే రీతిలో తలమునకలయ్యారు. నిన్న మొన్నటి వరకు జిల్లా అంతా జగన్‌ వెనుకనే ఉంది. అయితే అధిష్టానం యాత్రకు ఆమోదంలేదని తేలడంతో భిన్న స్వరాలు మొదలయ్యాయి.

మంత్రులను, ఎమ్మెల్యేలను ఈ ఓదార్పుకు దూరంచేయాలనే తలంపుతోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారనే ప్రచారాలు సైతం జగన్‌ వర్గీయులు ప్రచారం చేయడంలో కృతుకుత్యులయ్యా రు. ఇదో రకంగా జనంలో జగన్‌పై అభిమానాన్ని పెంచే విధంగా తయారైంది. జనం ఎటూ వస్తారు. జగన్‌ యాత్రలో ఏదో ఒక చోట కలిసి మద్ధతిచ్చి వెళ్ళే విధంగా కొంతమంది ప్రజా ప్రతినిధులు తీసుకుంటున్న నిర్ణయా లను తప్పుపట్టే విధంగా అనుచరులు తయారవడంతో అటోఇటో తేల్చుకోవాలని ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెరిగింది. దీంతో ఇంచుమించుగా కాంగ్రెస్‌ శ్రేణులంతా జగన్‌ను బలపరచే విధంగా రంగం సిద్ధమైంది.

మొత్తం మీద శ్రీకాకుళం ఓదార్పు కన్నా తూర్పులో జరిగే ఓదార్పు యాత్ర అధిష్టానానికి సవాలు చేసేది ఉండాలనేది జగన్‌ వర్గీయుల వ్యూహం. తొలి మూడు రోజులు జగన్‌ యాత్ర మెట్ట ప్రాంతంలో సాగుతుంది. ముద్రగడ వంటి మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న నేత జగన్‌ యాత్రకు సారధ్యం వహిస్తున్న నేపధ్యంలో ఆ ప్రాంతంలో జనానికి కొదవుండదనే వాదనలున్నాయి. దీనికి తోడు ఆర్ధిక, అంగ బలాలు తోడవడంతో ఇక జనం మధ్య జగన్‌ అనే రీతిలో యాత్ర కొనసాగడం ఖాయం. అన్నవరం సత్యదేవుని సన్నిధి నుండి బయలుదేరుతున్న జగన్‌ తుని నియోజకవర్గం తొండంగి మండలం ఒంటిమామిడి నుండి ఓదార్పు యాత్రను సోమవారం మొదలుపెట్ట నున్నారు. జిల్లాలో 365 గ్రామాలు వారం రోజుల పాటు 1100 కిలోమీటర్లకు పైగా సాగే ఈ ఓదార్పు యాత్రలో 75 మంది బాధిత కుటుంబాలకు ఓదార్పు లభించ నుంది. పనిలో పనిగా జిల్లాలో ఆ రూట్‌లలో అప్పటి కప్పుడు నిర్మించిన 150కి పైగా వైఎస్‌ శిలా విగ్రహాలు ఆవిష్కరణలు అవుతున్నాయి. ఇదీ కార్య క్రమం.

ఇంత భారీ ఎత్తు కార్యక్రమం జగన్‌ వర్గీయులకు మరింత కలిసి వస్తే వారం రోజులు పది రోజులు సాగినా ఆశ్చర్యపో నక్కర్లేదు. ఎక్కడికక్కడ ప్రసంగాలతో జన కూడలిలు జగన్‌కు నీరాజనాలు పట్టడం ఖాయమంటున్నారు. జిల్లాలో 19 నియోజక వర్గాల్లో 11 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఎమ్మె ల్యేలు ఉన్నారు. ఇద్దరు మంత్రులతోపాటు ఆరుగురు ఎమ్మెల్యేలు ఓదార్పులో పాల్గొం టున్నారు. అందులో ఇద్దరు ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, రాపాక వర ప్రసాద్‌లు తుని నుండి ముగింపు కాకినాడ వరకు ఓదార్పులో పాల్గొంటామని స్పష్టం చేస్తున్నారు.

జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు పార్టీ పరంగా తన హావభావాలను బహిర్గతం చేయకపోయినా ఆయనకు అటూఇటూగా ఉండే జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు వరుపుల రాజా, సుధీర్‌రాజులు గత 10 రోజులుగా ద్వారంపూడితో కలిసి ఓదార్పు విజయానికి వ్యూహాల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలో ద్వితీయ శ్రేణి నాయకులు వారి వారి పరిధిలోని ఎమ్మెల్యేలకు మించి ఈ ఏర్పాట్లలో నిమగ్నమవ్వడం విశేషం. దీంతో ఎమ్మెల్యేలు సైతం విధిగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనే పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద అధిష్టానాన్ని ధిక్కరించి తూర్పులో ఎమ్మెల్యేలు జగన్‌తో మమేకమవ్వడం ఎటువంటి పరిణామాలు ఏర్పడతాయో అన్నదే ప్రశ్న. అధిష్టానం ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకుంటే జగన్‌ తూర్పు నుండే తన తిరుగుబాటు జెండాను ఎగురవేస్తారని ప్రచారాలు సైతం ముమ్మరమయ్యాయి.

No comments:

Post a Comment