జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Saturday, July 24, 2010

జ‘గనుల’ కు చెక్‌ ! * బయ్యారం గనుల లీజు రద్దు * * * జగన్‌ను వేధిస్తున్నారు


jagan-ysతనను ధిక్కరిస్తున్న ఓదార్పు యాత్రికుడు, కడప ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి పొమ్మనలేక పొగ బ ెట్టేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం రంగం సిద్ధం చేస్తోంది. జగన్‌ను నేరుగా కదిలించకుండా ఆయన చుట్టూ క్లిష్ట పరిస్థితిని సృష్టించడం ద్వారా జగన్‌ శక్తిని నిర్వీర్యం చేసే వ్యూహానికి తెరలేపింది. దీనికి సంబంధించి జగన్‌ విషయంలో అధిష్ఠానం ఆలోచనలపై ఆర్ధిక మూలాలపై దెబ్బతగలబోతోందని  తెలిసిందే.

అందులో భాగంగా, జగన్‌, ఆయన కుటుంబ సభ్యుల వ్యాపారాలపై దృష్టి సారిస్తోంది. జగన్‌ సోదరి భర్తకు చెందినదిగా భావిస్తోన్న రక్షణ స్టీల్స్‌కు సంబం ధించిన బయ్యారం మైనింగు లీజును ఆకస్మికంగా రద్దు చేసి, జగన్‌పై తొలి దెబ్బతీసింది. ఆ కంపెనీతో వైఎస్‌ అల్లుడు అనిల్‌కుమార్‌కు సంబంధం లేదని జగన్‌ వర్గం వాదిస్తున్నప్పటికీ, అది అనిల్‌ బినామీ కంపెనీయేనని ప్రతిపక్షాలు ఇటీవల శాసనసభను స్తంభింపచేసిన విషయం తెలిసిందే.

ఈ విషయంలో అధిష్ఠానం యుద్ధప్రాతిపదికన స్పందించింది. బయ్యారం గనులు లీజు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి, ఊహించని దెబ్బతీసింది. ఇటీ వల జరిగిన మంత్రివర్గ సమావేశంలో బయ్యారం గనులపై విచారణ జరిపిద్దామని రోశయ్య ముందుకు రాగా, జగన్‌ మద్దతుదారులైన మంత్రులు వద్దని అడ్డు కున్నారు. అయితే ప్రణబ్‌ముఖర్జీ అధ్యక్షతన జరిగిన గనుల శాఖ సమావేశంలో హటాత్తుగా బయ్యారం గనుల లీజు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం సంచ లనం సృష్టించింది. స్వయంగా వైఎస్‌కు బంధువయిన గనుల శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి తెలియకుండానే రోశయ్య నేరుగా కేంద్రానికి లేఖ రాయడం, దానికి సంబంధించిన ఫైలు పంపించడం, వెనువెంటనే గనులు రద్దు చేయటం చకచకా జరిగిపోవడం జగన్‌ వర్గాన్ని ఖంగుతినిపించింది.

ఇది ఒకరకంగా జగన్‌ను హెచ్చరించడం గానే పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీని ఎదిరిస్తే జగన్‌, ఆయన కుటుంబ సభ్యులు, అనుచరుల ఆర్థికమూలాలకు ఎసరు తప్పదని అధిష్ఠానం చేసిన హెచ్చరికగానే సీనియర్లు విశ్లేషిస్తున్నారు. ఇవన్నీ జగన్‌ తనంతట తాను బయట కు వెళ్లేందుకేనని స్పష్టమవుతోంది. బయ్యారం గనులకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడే అనుమతి లభించిన విషయం తెలిసిందే. దానిని ఇప్పుడు జగన్‌ అవిధేయత సందర్భంగా అధిష్ఠానం హెచ్చరిక అస్త్రంగా సంధించింది. తనకు ఎవరి మద్దతు లేకపోయినా, జనం మద్దతు ఉందంటూ అధిష్ఠానాన్ని సవాల్‌ చేస్తున్న జగన్‌కు తోడు లేకుండా చేయాలన్నది నాయకత్వం అసలు లక్ష్యంగా కనిపిస్తోంది.

jagan-newsజగన్‌కు అధికార ప్రతినిధిగా వ్యవహరించే పీసీసీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబుపై సస్పెన్షన్‌ వేటు వేయడం ద్వారా, జగన్‌కు మద్దతు పలికే వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందోనని చెప్పకనే చెప్పినట్టయింది. జగన్‌కు చెందిన భారతీ సిమెంట్స్‌పైనా అధిష్ఠానం కన్నేసినట్లు చెబుతున్నారు. ఇక తర్వాత వంతు జగన్‌కు తిరుగులేని మద్దతుదారుగా ఉన్న కర్నాటక బిజెపి మంత్రి గాలి జనార్దన్‌రెడ్డికి చెందిన గనులపైనేనని తెలుస్తోంది. వీటిలో జగన్‌కూ భాగస్వామ్యం ఉందని చాలాకాలం నుంచి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. గనులను జాతీయం చేయడం ద్వారా గాలి ఆర్ధిక వనరులను దెబ్బతీయడమే అధిష్ఠానం లక్ష్యంగా కనిపిస్తోంది. ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా బ్రాహ్మణి స్టీల్‌ను జగన్‌తో ప్రారంభింపచేసి, ప్రత్యర్థుల ముఖాలు మాడిపోయేలా సరైన జవాబు చెబుతానని గాలి ఒక సందర్భంలో బాహాటంగా సవాల్‌ చేశారు. గాలి జనార్దన్‌రె డ్డి గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డికి ఆరు కోట్లువిలువ చేసే అత్యాధునిక బస్సును బహుకరించిన విషయం తెలిసిందే.
బయ్యారం గనుల లీజు రద్దు
BAYYARAMబయ్యారం గనుల లీజు నిలిపివేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. గత అసెంబ్లీ సమావేశాల్లో రెండురోజులపాటు తీవ్ర వాగ్వి వాదానికి కారణమైన బయ్యారం మైనింగ్‌ లీజును రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం తాత్కాలికంగా రద్దుచేసింది. సీఎం రోశయ్య ఇందుకు సంబంధించిన ఫైలుపై సంత కం చేసి ఢిల్లీకి పంపారు. అయితే ఈ గనుల లీజు నిలు పుదల విషయం తనకు తెలియదని గనుల శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ లీజుపై ప్రతి పక్షాల నుంచి నిరసనలు వ్యక్తం కావడంతోపాటు అసెం బ్లీ సమావేశాలను సైతం కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ లీజు వ్యవహారంతో వైఎస్‌ అల్లుడు అనిల్‌కు మార్‌ పేరు అధి ష్టా నం సీరియ స్‌గా తీసు కున్న సంగతి తెలిసిందే.

జగన్‌ను వేధిస్తున్నారు
ys-jagg
రామ రాజ్య పాలన గురించి కథలు కథలుగా వింటుంటాం. ఆ కథలు నిజమయ్యాయి స్వర్గీయ వైఎస్‌.రాజశేఖరరెడ్డి పాలనలో. ఆ మాటలు అన్నది ఎవరో కాదు ఆయన తన యుడే జగన్‌. సీఎంగా ఆంధ్రులకు స్వర్ణయు గాన్ని అందించిన ఆ మహానుభావుడు చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలే ఎక్కడికక్కడ తన ఈ ఓదార్పుయాత్ర లో జనం ఈ వర్షంలో కూడా తడిసి ముద్దై వస్తున్నారంటున్నారు జగన్‌. ఇదంతా ఆయ నపై ఉన్న అభిమాన జనమే. ఓదార్పు యాత్ర 12వ రోజు రాజోలు ప్రాంతంలో పలు కూడళ్లల్లో, గ్రామాల్లో ఆయన పర్యటిస్తూ పదేపదే స్వర్గీయ వైఎస్‌ఆర్‌.ను గుర్తుచేసుకు న్నారు.

ఇంత పెద్దకుటుంబాన్ని నాన్న తనకు అందించారని, తాను ఒంటరిని కాదని పదే పదే ఆయన గుర్తు చేస్తూ ప్రజా ఓదార్పును ఆయన పొందగలిగారు. శుక్రవారం ఓదార్పుకు వెళ్లే ముందు ఆయనకు సైతం ఓదార్పు, ఊరడింపులు లభించాయి. మాజీ మంత్రి చేగొండి హరిరామజో గయ్య ఆయన విడిది చేసిన దిండి రిసార్ట్స్‌కు వచ్చి ఓదార్పుకు తన మద్దతునిచ్చారు. మరొకరు పుదు చ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు వచ్చి స్వర్గీయ వైఎస్‌.తో తనకున్న బంధాన్ని గుర్తుచేసుకుంటూ జగన్‌కు తన అండదండలను అందించారు. అదే విధంగా సుధీర్ఘ ఓదార్పు యాత్రలో జగన్‌ రోజుకు రెండుమూడు గంటలకన్నా ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం లేదు. దీంతో ఆయన అలసి పోతు న్నారు. చివరకు అనారోగ్యాన్ని సైతం ఆయన లెక్క చేయడం లేదు. దీంతో తనయుడిని చూసి తల్లి డిల్లుతున్న ఆ తల్లి హృదయం కొడుకును చూసేం దుకు తరలి వస్తున్నది.

తల్లి విజయలక్ష్మి శుక్రవా రం రాత్రి దిండి రిసార్ట్స్‌కు వచ్చి తనయుడు జగన్‌కు ఊరడింపు కలిగించనుంది. నాలుగు రోజుల క్రితం జగన్‌ శ్రీమతి భారతి వచ్చి కలిసి వెళ్లారు. అంతకు ముందు వచ్చిన ఎమ్మెల్సీ వివేకానందరెడ్డి కూడా వచ్చి ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకుని మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జగన్‌కు సూచించి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఒక్కసారి కొడుకును చూడాలన్న తపనతో తల్లి విజయలక్ష్మి వస్తున్నట్లు తెలు స్తోంది.

ఓదార్పు యాత్రకు బయలుదేరే ముందే మాజీ ఎంపి హరిరామ జోగయ్య వచ్చి వైఎస్‌ఆర్‌ మృతితో ఆకస్మిక మరణాలకు గురైన వారిని ఓదార్చాలనే జగన్‌ నిర్ణయం ఆయన వ్యక్తిగతమన్నారు. జగన్‌ లేని కాంగ్రెస్‌ను ఊహించడం కష్టమని, ఆ ప్రభావం భవిష్యత్‌లో కాంగ్రెస్‌పై తప్పక పడుతుందని జోగయ్య జోస్యం చెప్పారు. వైఎస్‌ బతికి ఉన్నప్పుడు ఆయనపై కక్ష పెంచుకున్న వారు ఇప్పుడు జగన్‌పై కక్ష సాధిస్తున్నారని, ఓదార్పులో ఉన్న జగన్‌కు ఓదార్పును ఇచ్చేందుకు వచ్చిన పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు పేర్కొన్నారు. జగన్‌ను వేధిస్తు న్నారని ఆరోపించారు. వైఎస్‌ఆర్‌తో తన బంధం విడదీయరానిదని ఆయన పేర్కొంటూ కోనసీమ ఓదార్పు యాత్ర అనంతరం జగన్‌ యానాం కూడా వచ్చి వెళ్లాలని మంత్రి కోరడం విశేషం.

No comments:

Post a Comment