జగన్ కథ క్లైమాక్సుకు చేరుతోంది. నిన్నటి వరకూ తనను అణచివేసి, తన దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోన్న కాంగ్రెస్ హైకమాండ్ వైఖరిని ఇన్నాళ్లూ ఓర్పుగా భరించి, ఓదార్పు యాత్రకు వెళ్లిన జగన్.. శనివారం జనం మధ్య తన భవిష్యత్ వ్యూహాన్ని ఆవిష్కరించారు. వీరఘట్టంలో వీరావేశం ప్రదర్శించారు. జనం మద్దతు పుష్కలంగా ఉన్న తాను అధిష్ఠానాన్ని ఇకపై ఏ మాత్రం ఖాతరు చేసేది లేదన్న సంకేతాలు విస్ప ష్టంగా పంపారు.
తనపై కుట్ర జరుగు తోందని చెప్పకనే చెప్పారు. తన యాత్రకు ప్రజాప్రతినిధులను వెళ్లనీయ కుండా ప్రత్యక్షంగా నిలవరించే ప్రయ త్నం చేసిన ముఖ్యమంత్రి రోశయ్య, దానిని ప్రోత్సహించిన పార్టీ అధినేత్రి సోనియా వైఖరిపై పరోక్షంగా ప్రశ్నల వర్షం కురిపించారు. కార్యకర్తలు, జనం దృష్టిలో వారిని దోషులుగా నిలబెట్టడంలో విజయం సాధిం చారు. పనిలో పనిగా..కాంగ్రెస్‌ను రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి కోసం మృతి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకోకుండా అధిష్ఠానం విస్మరించిందని వ్యాఖ్యానించడం ద్వారా కాంగ్రెస్ కార్యకర్తలను, వైఎస్ వర్గీయులను తన వైపు ఆకట్టుకోవడంతో పాటు.. వైఎస్ మృతి తర్వాత కార్యకర్తలను నాయకత్వం పట్టించుకోవడం లేదన్న ప్రచార వ్యూహానికి తెరలేపారు.
ఓదార్పు యాత్ర మూడవ రోజుకు జగన్ మూడ్ పూర్తిగా మారింది.
నిన్నటి వరకూ అధిష్ఠానం వైఖరిపై మౌనం వహించిన ఆయన మూడోరోజున శివమెత్తారు. సోనియా, రోశయ్యపై పరోక్ష వాగ్బాణాలు సంధించారు. తన యాత్రకు ఎమ్మెల్యేలు, మంత్రులను వెళ్లకుండా నిరోధించిన సొంత పార్టీపై కన్నెర్ర చేశారు. ఆగ్రహంతో వ్యాఖ్యలు చేశారు. తన వైపు ప్రజాప్రతినిధులు ఉన్నా, నాయకత్వం వారిని కట్టడి చేస్తోందన్న విమర్శ ద్వారా.. మెజారిటీ ఎమ్మె ల్యేలు తనతోనే ఉన్నా, నాయకత్వ భయంతో వారు మౌనం గా ఉన్నారన్న సంకేతాలు పంపడంలో విజయం సాధించారు.
అసలు తానేం పాపం చేశానని, వైఎస్ కోసం మృతి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలను ఆదుకోవడమే తాను చేసిన తప్పా? వారిని ఎవరూ ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించడం ద్వారా తనపై సానుభూతి పెంచుకునే ప్రయత్నం చేసినట్లు స్పష్టంగా కనిపించింది. అదే సమయంలోతన యాత్రకు ప్రజాప్రతినిధులను రాలేని పరిస్థితులు సృష్టించినప్పటికీ వారి కుటుంబసభ్యులు వస్తున్నారని చెప్పడం ద్వారా.. తాను పార్టీ స్థాపిస్తే.. నేతల కుటుంబాల్లో చీలిక ఖాయమన్న హెచ్చరిక కూడా ధ్వనించింది.
జగన్ తాజా వైఖరి పరిశీలిస్తే.. ఇక ఆయన తిరుగుబాటుకు సిద్ధంగానే ఉన్నారన్న విషయం స్పష్టమవుతోంది. ఇంతవరకూ ఆయన ఎప్పుడూ అధిష్ఠానంపై వ్యాఖ్యలు చేయలేదు. ఒకటి రెండు సందర్భాల్లో మాత్రం రోశయ్యపై వ్యాఖ్యానించారు. కానీ, ఈసారి మాత్రం ఎలాంటి మోహమాటం గానీ, అధిష్ఠానం చర్యలు తీసుకుంటుందేమోనన్న భయం కానీ ఏమాత్రం కనిపించకపోవడం ప్రస్తావనార్హం. తాను అనుకున్నది చేసి తీరతానన్న తెగింపు, తనపై కుట్ర చేసినా ప్రజాబలంతో తిప్పికొడతానన్న మొండి ధైర్యం విస్పష్టంగా కనిపించింది. ఒక్కముక్కలో చెప్పాలంటే.. ‘అధిష్ఠానం ఏం చేసుకుంటుందో చేసుకో’మనే లెక్కలేనితనమే జగన్ వ్యాఖ్యల వెనుక స్పష్టమవుతోంది.
జగన్ తీరు మరింత నిశితంగా విశ్లేషిస్తే భవిష్యత్తులో జరగబోయే ప్రమాదకర పరిణామాలకు ముందు జరిగే రాయబారాలు కూడా పెద్దగా ఫలించే సూచనలు కనిపించడం లేదు. ఇకపై తాను ఎవరికీ లొంగేది లేదని, జరిగే పరిణామాలకు సిద్ధంగానే ఉన్నానన్న సంకేతాలు జగన్ అధిష్ఠానానికి పంపినట్లు కనిపిస్తోంది. ఇక వైఎస్‌కు విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో ప్రవేశిస్తే జగన్ గళంలో మరింత తీవ్రత చోటుచేసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
వారి పిల్లలను, భార్యలను, తమ్ముళ్ళను పంపిస్తున్నారు. చని పోయిన వారి కుటుంబాల గురించి ఎవరైనా, ఎప్పుడైనా పట్టించుకున్నారా? ఇది విని నా గుండె బరువెక్కింది. వైఎస్‌ను ప్రేమించడమే నేరమా?’’ కడప ఎంపి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శనివారం చేసిన సంచలన వ్యాఖ్యలు ఇవి. శ్రీకాకుళం జిల్లాలో మూడో రోజు అయిన శనివారం జగన్ ఓదార్పుయాత్ర విజయవంతంగా జరిగింది. వీరఘట్టంలో తన తండ్రి వై ఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం జగన్ ప్రజలనుద్దేశించి ఉద్వేగంగా ప్రసంగించారు. మొ దటిరోజు ఓదార్పు యాత్రలో మానవీయకోణం జోడించి ప్రజలను ఆకట్టుకోగా, రెండో రోజు రాజ కీయాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసి రాజకీయవర్గాలలో వేడి పుట్టించారు.
ఏకంగా మూడవ రోజు రాష్ట్ర ప్రభుత్వంపై వాగ్బాణాలు సంధించారు. ఒక రకంగా అధిష్టానానికి ధిక్కారస్వరాన్ని వినిపిం చారు. తన మనసులో ఉన్న బాధను, ఆవేదనను కలగలిపి అధిష్టానం పై ప్రశ్నల వర్షం కురిపించారు. జగన్ రెండవ రోజు యాత్ర ముగిం చుకొని పాలకొండలోని జిల్లా పరిషత్ ఛైర్మన్ పాలవలస రాజశేఖరం గృహంలో విశ్రాంతి తీసుకున్నారు. మధ్యా హ్నం 12 గం టలకు తిరిగి మూడోరోజు యాత్రను ప్రారంభించారు. మార్గమధ్యంలో గొయిదీ గ్రామంలో వైఎస్ ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళర్పించారు.
అనంతరం సీతంపేట చేరుకుని వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో తన మనసులో మాట చెప్పడానికి ప్రయత్నించినా మైక్‌లు సరిగ్గా పనిచేయలేదు.భారీ ఎత్తున జనం చేరడంతో వారందరికీ చేతులు జో డించి అభివాదం చేశారు. తిరిగి పాలకొండ చేరుకొని తన తండ్రి వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మధ్యాహ్నం 3 గంటలకు వీరఘట్టం చేరుకొని వైఎస్ ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో అధిష్టానంపై తిరుగుబాటు వ్యాఖ్యలు చేశారు. వీరఘట్టం మండలం, కంబర గ్రామానికి చెందిన అరసాడ శ్రావణ్‌కుమార్ ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
నిద్రాహారాలు పక్కన పెట్టి...!
కడప ఎంపి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తలపెట్టిన ఓదార్పు యాత్రలో తన తండ్రి వైఎస్‌ఆర్ వి గ్రహాల ఆవిష్కరణకే ఎక్కువ సమయం తీసుకున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 16 మంది కుటుంబాలను మాత్రమే జగన్ ఓదార్చారు. కుటుంబ సభ్యులతో కేవలం 5 నుండి 10 నిమిషాలు మాత్రమే మాట్లాడారు. అందరినీ బయటకు పంపించి కుటుంబ సభ్యులకు తాను ఇవ్వదల్చుకుంది ఇచ్చి, చెప్పాల్సింది చెప్పి ఓదార్చారు. జిల్లాలో ఓదార్పునకు ఇచ్చిన సమయం కంటే విగ్రహాల ఆవిష్కరణకే ఎక్కువ సమయం కేటాయించారు. ఈ విగ్రహాలు కూడా జిల్లావ్యాప్తంగా ఒకే రకంగా పోలి వున్నాయి. రాయలసీమకు చెందిన ఒక సామాజిక వర్గం కూడబలుక్కొని విగ్రహాలన్నీ ఐదు రోజులకు ముందు ఆ యా గ్రామాలకు తరలించింది.
విగ్రహాలన్నీ ఫైబర్ మెటల్‌తో చేసినవి కావడం విశేషం. దగ్గరుండి గ్రామస్తుల సహకారంతో విగ్రహాల నిర్మాణం పూర్తి చేశారు. అనుకున్న ప్రకారం వారే ఈ రూట్ మ్యాప్‌ను తయారు చేశారు. ఆవిష్కరణ కార్యక్రమం కూడా వాళ్ల కనుసైగల్లోనే జరిగింది.
వైఎస్ జగన్‌తో వచ్చిన మిత్రబృందం వినయ్‌రెడ్డి, బి.శివప్రసాద్‌రెడ్డి, హేమంత్ రెడ్డి, డి.కుమార్‌యాదవ్ మాత్రమే ఈ యాత్రను డిజైన్ చేశారు. వారు చెప్పినట్టుగానే ఓదార్పు యాత్ర నడిచింది. శ్రీకా కుళం డిసిసి భవనంలో విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని రద్దు చేసింది కూడా వీరే.
జగన్ ఎక్కువ సమయం ప్రజలను కలుసుకోడానికే కేటాయించారు. తొలి రోజు ఈ యాత్ర ఇచ్చా పురంలో ఉదయం 11 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 8 గంటలకు టెక్కలిలో ముగిసింది.దాదాపు 22 గంటలపాటు జగన్ నిద్రలేకుండా ఉన్నారు. రెండో రోజు కూడా ఉదయం 11 గంటలకు టెక్కలి నుండి ప్రారంభమైన యాత్ర మరుసటి రోజు ఉదయం 9గంటల వరకు జరిగింది. కేవలం ఒక గంట కాలం మాత్రమే జగన్ విశ్రాంతి తీసుకున్నారు. తిరిగి 11 గంటలకు యాత్ర పాలకొండ నుంచి ప్రారంభమైంది. ఈ రెండురోజులు ఆహారం కూడా లేదు. కేవలం ఓదార్పు చేస్తున్న కుటుంబ సభ్యులిచ్చిన మితాహారం తీసుకున్నారు. ఇలా నిద్రాహారాలు మాని జగన్ మూడు రోజులు పూర్తి చేశారు. రాత్రులు కూడా ఏక కాలంగా యాత్ర నిర్వహించడం, ఇదే మొదటిసారి కావడం గమనార్హం. గతంలో ఏ నాయకుడు కూడా ఇన్ని గంటలు ఏకకాలంగా వాహనాలపై యాత్ర చేసిన సందర్భాలు లేవు. అలాగే వేసిన షర్టు కూడా మార్చకుండా జగన్ యాత్రలో పాల్గొనడం కన్పించింది.
దారిపొడుగునా రోడ్ షో మాదిరిగా జగన్ ఓదార్పు యాత్ర నిర్వహించారు. జగన్‌తో కరచాలం చేసేందుకు పలువురు ఎగబడ్డారు.మూడు రోజుల ఓదార్పు యాత్రలో యువకులు, మహిళలు మాత్రమే అధికంగా పాల్గొన్నారు. కాంగ్రెస్ కేడర్ పూర్తిగా జగన్ యాత్రలో భాగస్వా మ్యమైంది. ఇంచుమించుగా ఓదార్పు యాత్రను అందరూ బలపర్చారు. ముందు రోజు మాజీ ఎమ్మెల్యే లల్లూ (నరేష్‌కుమార్ అగర్వాల్) ఇచ్చాపురంలో జగన్‌కు స్వాగతం పలికి ఓదార్పు యాత్రను విజయవంతం చేశారు. అలాగే ఎంపి కిల్లి కృపారాణి భర్త కిల్లి రామ్మోహనర్‌రావు మూడు రోజులూ జగన్‌తోనే ఉన్నా రు. యువజన కాంగ్రెస్ అధ్యక్షడు మామిడి శ్రీకాంత్ కూడా జగన్‌తో వున్నారు.
జగన్ ఇప్పటివరకూ కేవలం ఒక్కసారి మాత్రమే మీడియా ముందుకొచ్చారు. వైఎస్ మృతి చెందిన తర్వాత క్యాంపు కార్యాలయంలో ఉన్నప్పుడు మాత్రమే రాష్ట్రానికి చెందిన మీడియా ప్రతినిధులతో భేటీ అయ్యారు. మళ్లీ ఆ తర్వాత ఇప్పటివరకూ మీడియా ముందుకు రాలేదు. ఎంపీగా కూడా ఉన్న జగన్ ప్రాతినిధ్యం వహిస్తోన్న కడప జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉందని చెబుతున్నారు. అక్కడ కూడా ఆయన సొంత మీడియా వారికే అందుబాటులో ఉంటారని, మిగిలిన మీడియాతో మాట్లాడరని చెబుతున్నారు.
కేవలం ఒక ముఖ్యమంత్రి కుమారుడుగా అయితే, ఆయనకు మీడియా అంత ప్రాముఖ్యం ఇచ్చేది కాదు. జగన్ ఎంపీ కూడా అయినందునే ఆయన మీడియాతో భేటీకి వెనుకంజ వేయడంపై చర్చ జరుగుతోంది. సాధారణ ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీల నేతలు జిల్లాలకు వెళితే ముందు మీడియాతో మాట్లాడే సంప్రదాయం ఉంది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావాలని పోరాడుతున్న వ్యక్తి, అందులోనూ జనంలో ఇమేజ్ ఉన్న ఎంపీ మీడియాకు దూరంగా ఉండటం ఆశ్చర్యంగా ఉందంటున్నారు. బహుశా మీడియాలో తనను వ్యతిరేకించే వారి సంఖ్య ఎక్కువగా ఉన్న భయంతోనే ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సాధారణంగా ఇలాంటి పర్యటనలు చేసే ముందు ఆయన తండ్రి వైఎస్ వైఖరి పూర్తి భిన్నంగా ఉండేది. తన పర్యటన లక్ష్యాన్ని వివరించేందుకు వైఎస్ ఏమాత్రం భయపడేవారు కాదు. పైగా వాటికి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా మీడియా ప్రతినిధులను తీసుకువెళ్లేవారు. అదేవిధంగా, విలేకరుల సమావేశాల్లో వేసే ప్రశ్నలకూ వెనుకంజ వేసేవారు కాదు. ఆయన హయాంలో ‘ఎంపిక చేసుకున్న ఆస్థాన విలేకరులు’న్నప్పటికీ.. జగన్ కనీసం ఆ పద్ధతీ పాటించకపోవడం ప్రస్తావనార్హం. ఆయన ఎక్కడకు వెళ్లినా తన సొంత చానెల్ ప్రతినిధులనే పరిమితం చేస్తున్నారు. హైదరాబాద్‌కు సంబంధించినంత వరకూ జగన్ వ్యవహారాన్ని పీసీసీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు పర్యవేక్షిస్తున్నారు. ఆయనొక్కరే మీడియాకు అందుబాటులో ఉంటున్నారు.
ఓదార్పు యాత్ర ప్రారంభించి మూడురోజులవుతున్నా ఎక్కడా ఆయన మీడియాతో మాట్లాడకపోవడం గమనార్హం. అంతకుముందు ఏలూరు నుంచి యాత్ర ప్రారంభించిన సమయంలోనూ మీడియాతో మాట్లాడలేదు. ఈ ధోరణి పరిశీలిస్తే.. జగన్‌కు మీడియా ఫోబియా ఉందేమోనన్న అను మానాలతో పాటు.. మిగిలిన మీడియా సంస్థలపై చిన్నచూపు ఉందేమోనన్న అనుమానా లకు తావిస్తోందని పార్టీ వర్గాలు వ్యాఖ్యా నిస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి సీనియర్లు, సహచర ఎంపీలు, రోశయ్యకు మద్దతుదారులయిన ఎమ్మెల్యేలు తనపై చేస్తున్న విమర్శలకు సైతం జగన్ ఎక్కడా జవాబు ఇవ్వకపోవడం ప్రస్తావనార్హం.
తనపై కుట్ర జరుగు తోందని చెప్పకనే చెప్పారు. తన యాత్రకు ప్రజాప్రతినిధులను వెళ్లనీయ కుండా ప్రత్యక్షంగా నిలవరించే ప్రయ త్నం చేసిన ముఖ్యమంత్రి రోశయ్య, దానిని ప్రోత్సహించిన పార్టీ అధినేత్రి సోనియా వైఖరిపై పరోక్షంగా ప్రశ్నల వర్షం కురిపించారు. కార్యకర్తలు, జనం దృష్టిలో వారిని దోషులుగా నిలబెట్టడంలో విజయం సాధిం చారు. పనిలో పనిగా..కాంగ్రెస్‌ను రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి కోసం మృతి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకోకుండా అధిష్ఠానం విస్మరించిందని వ్యాఖ్యానించడం ద్వారా కాంగ్రెస్ కార్యకర్తలను, వైఎస్ వర్గీయులను తన వైపు ఆకట్టుకోవడంతో పాటు.. వైఎస్ మృతి తర్వాత కార్యకర్తలను నాయకత్వం పట్టించుకోవడం లేదన్న ప్రచార వ్యూహానికి తెరలేపారు.
ఓదార్పు యాత్ర మూడవ రోజుకు జగన్ మూడ్ పూర్తిగా మారింది.
నిన్నటి వరకూ అధిష్ఠానం వైఖరిపై మౌనం వహించిన ఆయన మూడోరోజున శివమెత్తారు. సోనియా, రోశయ్యపై పరోక్ష వాగ్బాణాలు సంధించారు. తన యాత్రకు ఎమ్మెల్యేలు, మంత్రులను వెళ్లకుండా నిరోధించిన సొంత పార్టీపై కన్నెర్ర చేశారు. ఆగ్రహంతో వ్యాఖ్యలు చేశారు. తన వైపు ప్రజాప్రతినిధులు ఉన్నా, నాయకత్వం వారిని కట్టడి చేస్తోందన్న విమర్శ ద్వారా.. మెజారిటీ ఎమ్మె ల్యేలు తనతోనే ఉన్నా, నాయకత్వ భయంతో వారు మౌనం గా ఉన్నారన్న సంకేతాలు పంపడంలో విజయం సాధించారు.
అసలు తానేం పాపం చేశానని, వైఎస్ కోసం మృతి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలను ఆదుకోవడమే తాను చేసిన తప్పా? వారిని ఎవరూ ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించడం ద్వారా తనపై సానుభూతి పెంచుకునే ప్రయత్నం చేసినట్లు స్పష్టంగా కనిపించింది. అదే సమయంలోతన యాత్రకు ప్రజాప్రతినిధులను రాలేని పరిస్థితులు సృష్టించినప్పటికీ వారి కుటుంబసభ్యులు వస్తున్నారని చెప్పడం ద్వారా.. తాను పార్టీ స్థాపిస్తే.. నేతల కుటుంబాల్లో చీలిక ఖాయమన్న హెచ్చరిక కూడా ధ్వనించింది.
జగన్ తాజా వైఖరి పరిశీలిస్తే.. ఇక ఆయన తిరుగుబాటుకు సిద్ధంగానే ఉన్నారన్న విషయం స్పష్టమవుతోంది. ఇంతవరకూ ఆయన ఎప్పుడూ అధిష్ఠానంపై వ్యాఖ్యలు చేయలేదు. ఒకటి రెండు సందర్భాల్లో మాత్రం రోశయ్యపై వ్యాఖ్యానించారు. కానీ, ఈసారి మాత్రం ఎలాంటి మోహమాటం గానీ, అధిష్ఠానం చర్యలు తీసుకుంటుందేమోనన్న భయం కానీ ఏమాత్రం కనిపించకపోవడం ప్రస్తావనార్హం. తాను అనుకున్నది చేసి తీరతానన్న తెగింపు, తనపై కుట్ర చేసినా ప్రజాబలంతో తిప్పికొడతానన్న మొండి ధైర్యం విస్పష్టంగా కనిపించింది. ఒక్కముక్కలో చెప్పాలంటే.. ‘అధిష్ఠానం ఏం చేసుకుంటుందో చేసుకో’మనే లెక్కలేనితనమే జగన్ వ్యాఖ్యల వెనుక స్పష్టమవుతోంది.
జగన్ తీరు మరింత నిశితంగా విశ్లేషిస్తే భవిష్యత్తులో జరగబోయే ప్రమాదకర పరిణామాలకు ముందు జరిగే రాయబారాలు కూడా పెద్దగా ఫలించే సూచనలు కనిపించడం లేదు. ఇకపై తాను ఎవరికీ లొంగేది లేదని, జరిగే పరిణామాలకు సిద్ధంగానే ఉన్నానన్న సంకేతాలు జగన్ అధిష్ఠానానికి పంపినట్లు కనిపిస్తోంది. ఇక వైఎస్‌కు విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో ప్రవేశిస్తే జగన్ గళంలో మరింత తీవ్రత చోటుచేసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
నేనేం పాపం చేశాను ?
‘‘ నేను విన్నాను... దివంగత ప్రియతమ నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జ యంతికి ఏ ఒక్క ఎమ్మెల్యేలను పోకుండా చేశారంటా ! ఎమ్మెల్యేలను, మంత్రులను కట్టడి చేసే కార్య క్రమం చేశారు. ఈ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు నరక యాతన అనుభవిస్తున్నారు. మ నసంతా దివంగత రాజశేఖర్‌రెడ్డి వైపు ఉన్నా, ఓదార్పు యాత్రకు రావాలనుకున్నా, తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యేలను సైతం రాకుండా చేశారు. ఇది న్యాయమేనా అని అడుగుతున్నాను. ఇది విన్నప్పు డు నాకు ఒక్కటే ఒక్కటి అనిపిస్తోంది. నేను ఏం పాపం చేశానని మంత్రులు, ఎమ్మెల్యేలు రావాలని ఉన్నా రాలేని పరిస్థితులు కల్పించారు.వారి పిల్లలను, భార్యలను, తమ్ముళ్ళను పంపిస్తున్నారు. చని పోయిన వారి కుటుంబాల గురించి ఎవరైనా, ఎప్పుడైనా పట్టించుకున్నారా? ఇది విని నా గుండె బరువెక్కింది. వైఎస్‌ను ప్రేమించడమే నేరమా?’’ కడప ఎంపి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శనివారం చేసిన సంచలన వ్యాఖ్యలు ఇవి. శ్రీకాకుళం జిల్లాలో మూడో రోజు అయిన శనివారం జగన్ ఓదార్పుయాత్ర విజయవంతంగా జరిగింది. వీరఘట్టంలో తన తండ్రి వై ఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం జగన్ ప్రజలనుద్దేశించి ఉద్వేగంగా ప్రసంగించారు. మొ దటిరోజు ఓదార్పు యాత్రలో మానవీయకోణం జోడించి ప్రజలను ఆకట్టుకోగా, రెండో రోజు రాజ కీయాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసి రాజకీయవర్గాలలో వేడి పుట్టించారు.
ఏకంగా మూడవ రోజు రాష్ట్ర ప్రభుత్వంపై వాగ్బాణాలు సంధించారు. ఒక రకంగా అధిష్టానానికి ధిక్కారస్వరాన్ని వినిపిం చారు. తన మనసులో ఉన్న బాధను, ఆవేదనను కలగలిపి అధిష్టానం పై ప్రశ్నల వర్షం కురిపించారు. జగన్ రెండవ రోజు యాత్ర ముగిం చుకొని పాలకొండలోని జిల్లా పరిషత్ ఛైర్మన్ పాలవలస రాజశేఖరం గృహంలో విశ్రాంతి తీసుకున్నారు. మధ్యా హ్నం 12 గం టలకు తిరిగి మూడోరోజు యాత్రను ప్రారంభించారు. మార్గమధ్యంలో గొయిదీ గ్రామంలో వైఎస్ ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళర్పించారు.
అనంతరం సీతంపేట చేరుకుని వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో తన మనసులో మాట చెప్పడానికి ప్రయత్నించినా మైక్‌లు సరిగ్గా పనిచేయలేదు.భారీ ఎత్తున జనం చేరడంతో వారందరికీ చేతులు జో డించి అభివాదం చేశారు. తిరిగి పాలకొండ చేరుకొని తన తండ్రి వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మధ్యాహ్నం 3 గంటలకు వీరఘట్టం చేరుకొని వైఎస్ ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో అధిష్టానంపై తిరుగుబాటు వ్యాఖ్యలు చేశారు. వీరఘట్టం మండలం, కంబర గ్రామానికి చెందిన అరసాడ శ్రావణ్‌కుమార్ ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
నిద్రాహారాలు పక్కన పెట్టి...!
కడప ఎంపి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తలపెట్టిన ఓదార్పు యాత్రలో తన తండ్రి వైఎస్‌ఆర్ వి గ్రహాల ఆవిష్కరణకే ఎక్కువ సమయం తీసుకున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 16 మంది కుటుంబాలను మాత్రమే జగన్ ఓదార్చారు. కుటుంబ సభ్యులతో కేవలం 5 నుండి 10 నిమిషాలు మాత్రమే మాట్లాడారు. అందరినీ బయటకు పంపించి కుటుంబ సభ్యులకు తాను ఇవ్వదల్చుకుంది ఇచ్చి, చెప్పాల్సింది చెప్పి ఓదార్చారు. జిల్లాలో ఓదార్పునకు ఇచ్చిన సమయం కంటే విగ్రహాల ఆవిష్కరణకే ఎక్కువ సమయం కేటాయించారు. ఈ విగ్రహాలు కూడా జిల్లావ్యాప్తంగా ఒకే రకంగా పోలి వున్నాయి. రాయలసీమకు చెందిన ఒక సామాజిక వర్గం కూడబలుక్కొని విగ్రహాలన్నీ ఐదు రోజులకు ముందు ఆ యా గ్రామాలకు తరలించింది.
విగ్రహాలన్నీ ఫైబర్ మెటల్‌తో చేసినవి కావడం విశేషం. దగ్గరుండి గ్రామస్తుల సహకారంతో విగ్రహాల నిర్మాణం పూర్తి చేశారు. అనుకున్న ప్రకారం వారే ఈ రూట్ మ్యాప్‌ను తయారు చేశారు. ఆవిష్కరణ కార్యక్రమం కూడా వాళ్ల కనుసైగల్లోనే జరిగింది.
వైఎస్ జగన్‌తో వచ్చిన మిత్రబృందం వినయ్‌రెడ్డి, బి.శివప్రసాద్‌రెడ్డి, హేమంత్ రెడ్డి, డి.కుమార్‌యాదవ్ మాత్రమే ఈ యాత్రను డిజైన్ చేశారు. వారు చెప్పినట్టుగానే ఓదార్పు యాత్ర నడిచింది. శ్రీకా కుళం డిసిసి భవనంలో విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని రద్దు చేసింది కూడా వీరే.
జగన్ ఎక్కువ సమయం ప్రజలను కలుసుకోడానికే కేటాయించారు. తొలి రోజు ఈ యాత్ర ఇచ్చా పురంలో ఉదయం 11 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 8 గంటలకు టెక్కలిలో ముగిసింది.దాదాపు 22 గంటలపాటు జగన్ నిద్రలేకుండా ఉన్నారు. రెండో రోజు కూడా ఉదయం 11 గంటలకు టెక్కలి నుండి ప్రారంభమైన యాత్ర మరుసటి రోజు ఉదయం 9గంటల వరకు జరిగింది. కేవలం ఒక గంట కాలం మాత్రమే జగన్ విశ్రాంతి తీసుకున్నారు. తిరిగి 11 గంటలకు యాత్ర పాలకొండ నుంచి ప్రారంభమైంది. ఈ రెండురోజులు ఆహారం కూడా లేదు. కేవలం ఓదార్పు చేస్తున్న కుటుంబ సభ్యులిచ్చిన మితాహారం తీసుకున్నారు. ఇలా నిద్రాహారాలు మాని జగన్ మూడు రోజులు పూర్తి చేశారు. రాత్రులు కూడా ఏక కాలంగా యాత్ర నిర్వహించడం, ఇదే మొదటిసారి కావడం గమనార్హం. గతంలో ఏ నాయకుడు కూడా ఇన్ని గంటలు ఏకకాలంగా వాహనాలపై యాత్ర చేసిన సందర్భాలు లేవు. అలాగే వేసిన షర్టు కూడా మార్చకుండా జగన్ యాత్రలో పాల్గొనడం కన్పించింది.
దారిపొడుగునా రోడ్ షో మాదిరిగా జగన్ ఓదార్పు యాత్ర నిర్వహించారు. జగన్‌తో కరచాలం చేసేందుకు పలువురు ఎగబడ్డారు.మూడు రోజుల ఓదార్పు యాత్రలో యువకులు, మహిళలు మాత్రమే అధికంగా పాల్గొన్నారు. కాంగ్రెస్ కేడర్ పూర్తిగా జగన్ యాత్రలో భాగస్వా మ్యమైంది. ఇంచుమించుగా ఓదార్పు యాత్రను అందరూ బలపర్చారు. ముందు రోజు మాజీ ఎమ్మెల్యే లల్లూ (నరేష్‌కుమార్ అగర్వాల్) ఇచ్చాపురంలో జగన్‌కు స్వాగతం పలికి ఓదార్పు యాత్రను విజయవంతం చేశారు. అలాగే ఎంపి కిల్లి కృపారాణి భర్త కిల్లి రామ్మోహనర్‌రావు మూడు రోజులూ జగన్‌తోనే ఉన్నా రు. యువజన కాంగ్రెస్ అధ్యక్షడు మామిడి శ్రీకాంత్ కూడా జగన్‌తో వున్నారు.
మీడియాకు జగన్ దూరం !
తన యాత్రతో అటు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠా నం, ఇటు ముఖ్యమంత్రి రోశయ్యకూ కలవరం కలిగిస్తోన్న వైఎస్ జగన్ మీడియాకు ఎందుకు దూరంగా ఉంటున్నారన్న ప్రశ్నలు వినిపిస్తు న్నాయి. అన్ని విషయాల్లోనూ తండ్రిని అనుసరిస్తోన్న జగన్, మీడియాతో భేటీ విషయంలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించడం చర్చనీయాంశమయింది. కావాలనే వ్యూహాత్మకంగా ఆయన మీడియాను దూరంగా ఉంచుతున్నారని, ఆ మేరకు ఆయన సన్నిహిత సహచరుడొకరు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
జగన్ ఇప్పటివరకూ కేవలం ఒక్కసారి మాత్రమే మీడియా ముందుకొచ్చారు. వైఎస్ మృతి చెందిన తర్వాత క్యాంపు కార్యాలయంలో ఉన్నప్పుడు మాత్రమే రాష్ట్రానికి చెందిన మీడియా ప్రతినిధులతో భేటీ అయ్యారు. మళ్లీ ఆ తర్వాత ఇప్పటివరకూ మీడియా ముందుకు రాలేదు. ఎంపీగా కూడా ఉన్న జగన్ ప్రాతినిధ్యం వహిస్తోన్న కడప జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉందని చెబుతున్నారు. అక్కడ కూడా ఆయన సొంత మీడియా వారికే అందుబాటులో ఉంటారని, మిగిలిన మీడియాతో మాట్లాడరని చెబుతున్నారు.
కేవలం ఒక ముఖ్యమంత్రి కుమారుడుగా అయితే, ఆయనకు మీడియా అంత ప్రాముఖ్యం ఇచ్చేది కాదు. జగన్ ఎంపీ కూడా అయినందునే ఆయన మీడియాతో భేటీకి వెనుకంజ వేయడంపై చర్చ జరుగుతోంది. సాధారణ ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీల నేతలు జిల్లాలకు వెళితే ముందు మీడియాతో మాట్లాడే సంప్రదాయం ఉంది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావాలని పోరాడుతున్న వ్యక్తి, అందులోనూ జనంలో ఇమేజ్ ఉన్న ఎంపీ మీడియాకు దూరంగా ఉండటం ఆశ్చర్యంగా ఉందంటున్నారు. బహుశా మీడియాలో తనను వ్యతిరేకించే వారి సంఖ్య ఎక్కువగా ఉన్న భయంతోనే ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సాధారణంగా ఇలాంటి పర్యటనలు చేసే ముందు ఆయన తండ్రి వైఎస్ వైఖరి పూర్తి భిన్నంగా ఉండేది. తన పర్యటన లక్ష్యాన్ని వివరించేందుకు వైఎస్ ఏమాత్రం భయపడేవారు కాదు. పైగా వాటికి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా మీడియా ప్రతినిధులను తీసుకువెళ్లేవారు. అదేవిధంగా, విలేకరుల సమావేశాల్లో వేసే ప్రశ్నలకూ వెనుకంజ వేసేవారు కాదు. ఆయన హయాంలో ‘ఎంపిక చేసుకున్న ఆస్థాన విలేకరులు’న్నప్పటికీ.. జగన్ కనీసం ఆ పద్ధతీ పాటించకపోవడం ప్రస్తావనార్హం. ఆయన ఎక్కడకు వెళ్లినా తన సొంత చానెల్ ప్రతినిధులనే పరిమితం చేస్తున్నారు. హైదరాబాద్‌కు సంబంధించినంత వరకూ జగన్ వ్యవహారాన్ని పీసీసీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు పర్యవేక్షిస్తున్నారు. ఆయనొక్కరే మీడియాకు అందుబాటులో ఉంటున్నారు.
ఓదార్పు యాత్ర ప్రారంభించి మూడురోజులవుతున్నా ఎక్కడా ఆయన మీడియాతో మాట్లాడకపోవడం గమనార్హం. అంతకుముందు ఏలూరు నుంచి యాత్ర ప్రారంభించిన సమయంలోనూ మీడియాతో మాట్లాడలేదు. ఈ ధోరణి పరిశీలిస్తే.. జగన్‌కు మీడియా ఫోబియా ఉందేమోనన్న అను మానాలతో పాటు.. మిగిలిన మీడియా సంస్థలపై చిన్నచూపు ఉందేమోనన్న అనుమానా లకు తావిస్తోందని పార్టీ వర్గాలు వ్యాఖ్యా నిస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి సీనియర్లు, సహచర ఎంపీలు, రోశయ్యకు మద్దతుదారులయిన ఎమ్మెల్యేలు తనపై చేస్తున్న విమర్శలకు సైతం జగన్ ఎక్కడా జవాబు ఇవ్వకపోవడం ప్రస్తావనార్హం.
No comments:
Post a Comment