జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Friday, July 16, 2010

ఓదార్పు వ్యక్తిగతం - జగన్‌పై క్రమశిక్షణ చర్యలు ఉండవని స్పష్టం చేసిన వీరప్ప మొయిలీ - జగన్‌కు రూట్‌ క్లియర్‌

ఓదార్పు వ్యక్తిగతం
Felicitation 
అధిష్ఠానం అభిష్టానికి వ్యతిరేకంగా ఓదార్పు యాత్ర చేస్తున్న కాంగ్రెస్‌ కడప ఎంపీ వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డిపై ఎలాంటి చర్యలు ఉండబోవ ని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. ఓదార్పు యాత్ర చేయడం తోపాటు ముఖ్యమంత్రి కె.రోశయ్య పై జగన్‌ నేరుగా విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్‌పై అధిష్ఠానం వేటు తప్పదని పార్టీ వర్గాలుపేర్కొన్నాయి. కానీ జగన్‌పై అలాంటి చర్యలేమీ ఉండబోవని వీరప్ప మొయిలీ చెప్పారు. చర్యలు అనేవి మీడియా ఊహాజనితం అని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేం దుకు వచ్చిన వీరప్ప మొయిలీతో లేక్‌వ్యూలో కొంత మంది కాంగ్రెస్‌ నేతలతో భేటీ అయ్యారు. భేటీకి ముందు తరువాత ఆయన మీడియా తో మాట్లాడారు.

జగన్‌ ఓదార్పు యాత్ర ఆయన వ్యక్తిగతం అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని బహిరం గంగా జగనే చెప్పారు కదా అని మొయిలీ అన్నారు. ఇక ఈ విషయంలో చెప్పడానికి ఏమీ లేదన్నారు. రోశయ్యపై మీ పార్టీ ఎంపీ జగన్‌ విమర్శలు చేశారు కదా అని ప్రశ్నించగా ఈ విషయంలో సిఎంమే స్పందిస్తారని చెప్పారు. ఆయనపై చేసిన విమర్శలకు తాను స్పందించను అని పేర్కొన్నారు. మొయిలీ వ్యాఖ్యలతో జగన్ వర్గం సంతోషపడుతున్నట్టు తెలుస్తున్నది. 
జగన్‌కు రూట్‌ క్లియర్‌
helecoft(సూర్య ప్రధాన ప్రతినిధి)ఓదార్పు యాత్రకు వెళ్లాలా వద్దా అన్న ఊగిసలాటకు రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవ హారాల ఇన్‌ఛార్జీ వీరప్పమొయిలీ స్వయంగా తెరదించడంతో ఎమ్మెల్యే లు, మంత్రుల్లో ఉత్సాహం పెరిగింది. అటు జగన్‌ కూడా తాజా పరిణా మాలతో హాయిగా ఊపిరిపీల్చుకున్నారు. జగన్‌ యాత్ర వ్యక్తిగతమని, ఆయనపై ఎలాంటి చర్యలూ ఉండవని మొయిలీ చేసిన ప్రకటనతో కాం గ్రెస్‌లో నెలకొన్న అయోమయాన్ని పూర్తి స్థాయిలో తొలగించినట్టయిం ది. జగన్‌ యాత్రను నిలిపివేసి, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కాళ్లకు బలపాలు కట్టుకుని ఢిల్లీ యాత్రలు చేసిన జగన్‌ ప్రత్యర్థులకు మొయిలీ వ్యాఖ్యలు ఖంగుతినిపించాయి.

జగన్‌ యాత్రపై అధిష్ఠానం ఆ గ్రహంగా లేదన్న విషయాన్ని మొయిలీ స్పష్టం చేసిన తర్వాత ఇక అందు లో పాల్గొంటే భయపడవలసిన పనిలేదని ఎమ్మెల్యేలు, మంత్రులు నిర్ణ యానికొచ్చారు. అంతకుముందు రోశయ్య కూడా జగన్‌ యాత్రకు వెళ్ల వద్దని, వెళితే అధిష్ఠానాన్ని ధిక్కరించినట్లేనని ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి చెప్పారు. తాజాగా యాత్రపై మొయిలీ ఇచ్చిన స్పష్టమైన వివరణ నేప థ్యంలో రోశయ్య చెప్పినవి అబద్ధాలేనన్న అనుమానాలు తెరపైకి వస్తు న్నాయి. అదే అంశంపై పార్టీలో చర్చ జరుగుతోంది. అధిష్ఠానం ఆలోచ నలే చెప్పాను తప్ప, మాట మార్చలేదని రోశయ్య మీడియాతో చెప్పిన విషయం తెలిసిందే. దీనితో ఆయన ఓదార్పు యాత్రపై వ్యూహాత్మకంగా ‘అధిష్ఠానం పేరిట సొంత వైఖరి’ అవలంభిస్తున్నారని స్పష్టమవుతోంది.

తాజా పరిణామాల నేపథ్యంలో తూర్పు గోదావరిలో జరుతున్న ఓదార్పు యాత్రకు వెళ్లేందుకు ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు. విజయవాడ ఎమ్మె ల్యే మల్లాది విష్ణు నేతృత్వంలో 30 మంది ఎమ్మెల్యేలు కాకినాడకు బయ లుదేరినట్లు సమాచారం. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు ఆయన వెంట ఉన్న విషయం తెలిసిందే. అదే జిల్లాకు చెందిన మంత్రి పిల్లి సుభాష్‌ చం ద్రబోస్‌ తాను జగన్‌ వెంట కచ్చితంగా ఉంటానని, తన జిల్లాలో జగన్‌ పర్యటిస్తుంటే దూరంగా ఉండటమంటే అంతకుమించిన దారుణం ఉం డదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. జగన్‌ యాత్రను అనుమతించా లని అధిష్ఠానాన్ని అభ్యర్థించిన పొన్నం ప్రభాకర్‌, కోమటిరెడ్డి రాజగోపా లరెడ్డి, లగడపాటి రాజగోపాల్‌, అనంత వెంకట్రామిరెడ్డి, సబ్బంహరి వంటి ఎంపీలు కూడా యాత్రకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మొయి లీ వ్యాఖ్యలు జగన్‌ శిబిరంలో నూతనోత్సాహం నింపాయి.
  

No comments:

Post a Comment