రోశయ్యపై ఫైర్ - యాత్రపై ఆయనకు ఎందకింత బాధ?
ఓదార్చడానిక వస్తే.. సీఎం పదవి కోపం పచ్చనంటున్నారు
యాత్రను ఎందుకు రాజకీయం చేస్తున్నారు?
మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వస్తే బాగుండేది
నాన్న మరణం తర్వాత.. సంక్షేమ పథకాల జోరు తగ్గింది
రాజకీయాల్లో పట్టించుకోకపోవడం అన్యాయం కాదా?
'ఓదార్పు'లో నిప్పులు కక్కిన వైఎస్ జగన్
శ్రీకాకుళం జిల్లాలో ముగిసిన పర్యటన
"ఓదార్పు యాత్రపై రోశయ్యకు ఎందుకింత బాధ? రోశయ్య రాజకీయాలు సిగ్గు తెప్పిస్తున్నాయి. ఎమ్మెల్యేల మనసులు నాతోనే ఉన్నాయి.. నేను ఓదార్చడం కోసమే వచ్చాను. సీఎం పదవి కోసం వచ్చానని రోశయ్యగారు ప్రచారం చేస్తున్నారు. ఆ వార్తలు బాధ కలిగిస్తున్నాయి. రోశయ్య ఎందుకింత భయపడుతున్నారు? ఓదార్పు యాత్రను ఎందుకింత రాజకీయం చేస్తున్నారో అర్థం కావడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఉంటే బాగుండేది. నాకు ఎమ్మెల్యేలు, మంత్రులు అక్కర్లేదు. నా యాత్ర కొనసాగుతుంది'' శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహనరెడ్డి చేసిన వ్యాఖ్యలివి.మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వస్తే బాగుండేది
నాన్న మరణం తర్వాత.. సంక్షేమ పథకాల జోరు తగ్గింది
రాజకీయాల్లో పట్టించుకోకపోవడం అన్యాయం కాదా?
'ఓదార్పు'లో నిప్పులు కక్కిన వైఎస్ జగన్
శ్రీకాకుళం జిల్లాలో ముగిసిన పర్యటన
"మహానేత మరణంతో పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాలను పరామర్శించడానికి వస్తే సీఎం సీటు కోసం పోటీ పడుతున్నానంటూ రోశయ్య చెప్పినట్టు పత్రికల్లో చదివా. ఇలాంటి కుటిల రాజకీయాలు చూసి సిగ్గుతో తలదించుకుంటున్నా'' అని జగన్‌మోహనరెడ్డి విమర్శించారు. రణస్థలంలో ఓదార్పు యాత్రలో మాట్లాడుతూ.. ఈ జిల్లాలో జరిగిన ఓదార్పు యాత్రకు మంత్రులు, ఎమ్మెల్యేలు రాకపోయినంత మాత్రాన సమస్య ఏమీ లేదన్నారు.
వారు ఓదార్పునకు దూరంగా ఉన్నా.. వారి మనసులు మాత్రం తన పక్కనే ఉన్నాయన్నారు. తన తండ్రి కోసం చనిపోయిన వారిని ఓదార్చడానికి వస్తే ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్నానని ప్రచారం చేస్తారా? అని ప్రశ్నించారు. ఇలాంటి సిగ్గుమాలిన రాజకీయ వ్యవస్థ ఈ రాష్ట్రంలో నడుస్తోందన్నారు. ఈ ఓదార్పు యాత్రకు తనతో వస్తే రోశయ్యకు నష్టమేంటని, ఆయన ముఖ్యమంత్రి స్థానం పోతుందని భయడటం ఎందుకన్నారు. దేవుడు తనకు తోడుగా ఉన్నాడని, ఆపై తన తండ్రి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని.. తనకు ఇంకేమి కావాలని అన్నారు. కోట్లాది ప్రజల అభినందనలు అండదండలు తనకు నిండుగా ఉన్నాయని, వారి ప్రేమాభిమానాలకు అభివందనాలు అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
అనంతరం తూర్పు గోదావరి జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహించడానికి బయలుదేరి వెళ్లారు. అంతకుముందు జి.సిగడాం మండలం ముషిణివలసలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాల్లో నైతిక విలువలు కనుమరుగైపోతున్నాయని అన్నారు. వైఎస్ చనిపోయిన తర్వాతే ఈ పతనం ప్రారంభమైందన్నారు. వైఎస్ ఫొటోను పెట్టుకుని గెలిచిన ఎమ్మెల్యేలను సైతం తనతో ఓదార్పుయాత్రకు పంపేందుకు వెనుకాడుతున్నారని, ఓదార్పు యాత్ర జరపడం నేరమా? అని ప్రశ్నించారు. మహానేత మరణానికి గుండె చలించి చనిపోయిన కార్యకర్తల గురించి పట్టించుకోకపోవడం అన్యాయం కాదా? అని నిలదీశారు.
ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న మహానేత వైఎస్ ఆదర్శాలను అమలుచేయడానికి అంకితమై ముందుకు సాగుతానని అన్నారు. తన తండ్రి మరణాంతరం రాష్ట్రంలో సంక్షేమ పథకాల జోరు తగ్గిందని జగన్ ఆరోపించారు. బొద్దాంలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ పేద ప్రజలను, విద్యార్థులను ఆదుకునేందుకు తన తండ్రి సీఎం హోదాలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన సంగతి అందరికీ తెలిసిందేనన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ పథకాలే తననూ ప్రజలు గుర్తుంచుకునేలా చేశాయన్నారు.
అలాంటి పథకాల పరిస్థితి ప్రస్తుతం అయోమయంలో పడిందని, ఈ విషయం ఇప్పటికే మీరందరూ గ్రహించి ఉంటారని అన్నారు. జగన్ ఓదార్పు యాత్ర శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం అర్ధరాత్రితో ముగిసింది. ఈ నెల 8న ఇచ్ఛాపురం నుంచి ప్రారంభమై 11న రణస్థలంతో ఈ యాత్రలో 14 కుటుంబాలను పరామర్శించారు. 40 వరకు వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఆదివారం రాజాం నుంచి ప్రారంభమైన యాత్ర జి.సిగడాం మండలం ముషిణివలస, పొగిరి, పాలఖండ్యాం తదితర గ్రామాల మీదుగా పొందూరు చేరుకుంది.
తర్వాత పొందూరు మండలం నందివాడ వెళ్లి మజ్జి దాలినాయుడు కుటుంబాన్ని ఓదార్చారు. ఎచ్చెర్ల మండలం చిలకపాలెం జంక్షన్ చేరుకున్నారు. ఎచ్చెర్ల, చిలకపాలెంలో ప్రసంగించారు. లావేరు మండలం బుడుమూరు చేరుకొని పరసాన నర్సింహులు కుటుంబాన్ని ఓదార్చారు. అనంతరం లావేరులో అంబేద్కర్, వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు. సుభద్రపురం జంక్షన్, రణస్థలంలో వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా బయలుదేరి వెళ్లారు. అన్నవరంలో రాత్రి బస చేశారు. శ్రీకాకుళం జిల్లాలో యాత్రకు ఎంపీ కిల్లి కృపారాణి భర్త రామ్మోహనరావు, జిల్లా యూత్‌కాంగ్రెస్ అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్ అండగా నిలిచారు.
జగన్‌పై అటాక్
అవినీతి సంపాదనే టార్గెట్?
నేత్రుల, మంత్రుల ముక్తకంఠం
రోశయ్యతో అమాత్యుల సమావేశం
నేటి నుంచే తూర్పులో జగన్ యాత్ర
ముగిసే లోగా క్లైమాక్స్ ఖాయం
హాజరు కానున్న ఆరుగురు ఎమ్మెల్యేలు
ఎమ్మెల్యేలకు కడప ఎంపీ ఫోన్లు
భవిష్యత్తుపై నేతల అయోమయం
రోశయ్యతో అమాత్యుల సమావేశం
నేటి నుంచే తూర్పులో జగన్ యాత్ర
ముగిసే లోగా క్లైమాక్స్ ఖాయం
హాజరు కానున్న ఆరుగురు ఎమ్మెల్యేలు
ఎమ్మెల్యేలకు కడప ఎంపీ ఫోన్లు
భవిష్యత్తుపై నేతల అయోమయం
మాటకు మాట... ఒక మాటకు నాలుగు మాటలు... నోటి మాటలకు ధాటి జవాబులు.... ఘాటు మాటలకు తూటాల్లాంటి సమాధానాలు! ఓదార్పు పేరుతో పార్టీ అధిష్ఠానంపై, ముఖ్యమంత్రి రోశయ్యపై దండయాత్ర చేపట్టిన కడప ఎంపీ జగన్‌పై కాంగ్రెస్ నేతలు ఎదురుదాడి మొదలుపెట్టారు.
ఓదార్పు యాత్ర ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో ముగిసి, సోమవారం నుంచి తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభం కానున్న నేపథ్యంలో... నాలుగైదు రోజుల 'సంయమనం' ఒట్టు తీసి గట్టునపెట్టి, ప్రభుత్వం తరఫున మంత్రులు, పార్టీ తరఫున సీనియర్ నేతలు ఆదివారం ఒక్కుమ్మడిగా ముందుకొచ్చారు. జగన్ మాటలతో తాము ఏకీభవించడం లేదని స్పష్టంచేశారు. ఆయన విమర్శలకు సమాధానాలు చెప్పడంతోనే వారు ఆగిపోలేదు; ఆయనపై ప్రత్యారోపణలు చేశారు.
గత ఐదేళ్లలో అక్రమంగా సంపాదించిన వేల కోట్ల రూపాయల ధన బలంతో జగన్ విర్రవీగి పోతున్నారని, పార్టీని, అధిష్ఠానాన్ని శాసించ జూస్తున్నారని దుయ్యబట్టారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ను ఒకవైపు ప్రస్తుతిస్తూనే, ఆయన కుమారుడి 'అవినీతి'ని రచ్చబండ మీద చర్చకు పెట్టారు. వైఎస్ హయాంలో ఆయన వ్యతిరేకులుగా ముద్రపడ్డ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, వీహెచ్‌లాంటి వాళ్లతోపాటు, వైఎస్ మనుషులుగా భావించే తులసిరెడ్డి, శిల్పా మోహన్‌రెడ్డి వంటి సీమ నేతలు కూడా ముందుండి జగన్‌పై దాడి చేయడం గమనార్హం.
పార్టీని చీల్చే కుట్ర జరుగుతోందని పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. "ఏ వ్యాపారమూ, పరిశ్రమ లేకుండా ఐదేళ్లలో అన్ని వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించావు? దీన్ని తిరగదోడాలి. ప్రధానికి, సోనియాకు లేఖ రాస్తా. జగన్ నేతృత్వంలో పార్టీ బలపడుతుందనడం కంటే బుద్ధితక్కువ మరోటి లేదు'' అని ఆయన నిప్పులు చిమ్మారు. జగన్ చెప్పినట్టు "మేమేమీ నరకయాతన అనుభవించడం లేదు. చాలా ఫ్రీగా ఉన్నాం'' అని మంత్రులు మోపిదేవి వెంకటరమణ, శిల్పా మోహన్‌రెడ్డి, పసుపులేటి బాలరాజు తేల్చిచెప్పారు.
ఓదార్పునకు వెళ్లవద్దని సీఎం గానీ, అధిష్ఠానం గానీ తమకు చెప్పలేదని మంత్రి సునీతాలక్ష్మారెడ్డి చెప్పారు. "ఓదార్పునకు వెళ్లవద్దని ఎవరిని అడ్డుకున్నారో, ఎవరు నరకయాతన అనుభవిస్తున్నారో ఒక్క పేరు చెప్పగలరా? వైఎస్ కుమారుడు ఎంపీ, తమ్ముడు ఎమ్మెల్సీ. శ్రీమతి ఎమ్మెల్యే. బావమరిది కడప మేయర్. ఇంకా వైఎస్ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామా?'' అని పాలడుగు వెంకట్రావు, తులసిరెడ్డి నిలదీశారు. వ్యక్తిగత యాత్రకు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకని ప్రశ్నించారు. "గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన నట్వర్‌సింగ్‌నే సోనియా పక్కనబెట్టారు.
ఇక జగన్ ఒక లెక్కా. మాకూ అభిమానులున్నారు. అవసరమైతే సత్తా చూపిస్తాం'' అని వి.హనుమంతరావు హెచ్చరించారు. ఎదురుదాడికి ముందు సీఎం రోశయ్య మరోమారు చక్రం తిప్పారు. ఆదివారం మంత్రులు ధర్మాన ప్రసాదరావు, గాదె వెంకటరెడ్డి, వట్టి వసంతకుమార్, పినిపె విశ్వరూప్, మోపిదేవి వెంకటరమణ, పసుపులేటి బాలరాజు, శిల్పా మోహన్‌రెడ్డి, అహ్మదుల్లా రోశయ్యతో భేటీ అయ్యారు. ఇందులో రోశయ్య అమాత్యులను నిలదీశారు.
"వైఎస్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనవద్దని నేనేమైనా చెప్పానా? మంత్రులు, ఎమ్మెల్యేలను కట్టడి చేశానా? ఓదార్పు యాత్రకు అధిష్ఠానం సుముఖంగా లేనట్టు కనిపించిందని జగనే తన లేఖలో పేర్కొన్నారు. అదే విషయాన్ని నేను చెప్పాను. అందులో తప్పేమిటి? అధిష్ఠానం నిర్ణయం మేరకు నడుచుకోవాలనే సూచించాను. అది కూడా తప్పయితే ఎలా? అసెంబ్లీ సమావేశాలు, వైఎస్ జయంతి వేడుకల నిర్వహణపై సమష్టిగానే నిర్ణయం తీసుకున్నాం కదా. ఇవన్నీ తెలిసి కూడా జగన్ చేస్తున్న విమర్శలపై మీరు ఎందుకు స్పందించడం లేదు?'' అని రోశయ్య మంత్రులను ప్రశ్నించారు. రోశయ్య అభిప్రాయంతో మంత్రులు ఏకీభవించారు.
దీని తర్వాతే, శిల్పామోహన్‌రెడ్డి, పసుపులేటి బాలరాజు, మోపిదేవి వెంకట రమణ విలేఖరుల సమావేశం పెట్టి, జగన్‌పై విమర్శలు గుప్పించారు. అంతకుముందు వారు జగన్‌కు సన్నిహితుడైన మంత్రి రఘువీరారెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. ఉదయం పూట కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరి, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రినర్సారెడ్డి తదితరులు సీఎంతో మంతనాలు జరిపారు.
ఎమ్మెల్యేలకు జగన్ ఫోన్: అటు జగన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. పార్టీ నేతలు, మంత్రులు తనపై చేసిన ఎదురుదాడికి, వెంటనే ఆదివారం రాత్రే ఆయన అంతే దీటుగా ప్రతిస్పందించారు. ఇప్పటిదాకా పరోక్ష విమర్శలకే పరిమితమైన జగన్, రణస్థలంలో ఏకంగా రోశయ్య పేరు ప్రస్తావిస్తూ, ఆరోపణాస్త్రాలు సంధించి, ఇక వెనుకంజ ప్రసక్తే లేదని, తనది తిరుగుబాటేనని తేల్చిచెప్పారు.
యాత్రలో బిజీగా గడుపుతూనే జగన్, భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై కూడా దృష్టి సారించినట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. అవి అందజేసిన సమాచారం ప్రకారం... పలువురు ఎమ్మెల్యేలతో జగన్ ఫోన్లో మాట్లాడారు. రాజకీయంగా తాను తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కోరారు. బల ప్రదర్శనకు సిద్ధం కావాలని, మధ్యంతర ఎన్నికలకు సిద్ధపడాలని సూచించినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు యాత్రలో పాల్గొంటామని ప్రకటించారు. జగన్‌కు మద్దతుగా నిలిచిన, తూర్పుగోదావరి జిల్లాకే చెందిన మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, 16న జరిగే కేబినెట్ సమావేశంలో రాజీనామా పత్రాన్ని అందిస్తారా అనే కుతూహలం నెలకొంది.
వ్యవహారం ముదిరిన ఈ తరుణంలో, వర్గ రాజకీయాలకు పెట్టనికోట వంటి తూర్పుగోదావరి జిల్లాలో జరగనున్న జగన్ యాత్ర పార్టీ, ప్రభుత్వ భవిష్యత్తును తేలుస్తుందని సీనియర్ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. పది రోజుల పాటు సాగే ఈ యాత్ర చివరి అంకానికి వచ్చే సరికి కాంగ్రెస్ రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయని నేతలు భావిస్తున్నారు. జిల్లాను దాటి వెళ్లేలోగానే, జగన్ తన మసులోని మాటను బహిర్గతం చేసే అవకాశం ఉందని ఆయన వర్గీయులు అంటున్నారు.
జిల్లాలో ప్రస్తుత ప్రజాప్రతినిధులతో పాటు, ముద్రగడ పద్మనాభం, జక్కంపూడి రామ్మోహనరావు తదితరులు రాజకీయాలు నెరపుతుండడం, కుల, వర్గ రాజకీయాలు అధికంగా ఉండడంతో ఎవరికి వారు స్థానికంగా రాజకీయ భవిష్యత్తు కోణంలోనే పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి బోస్ రాజీనామా చేస్తే ఆయన సామాజిక వర్గానికి చెందినవారు జగన్ వెంట నడుస్తారా? కాంగ్రెస్‌తోనే ఉంటారా? ఒకవేళ పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి కాంగ్రెస్‌కు సన్నిహితంగా మారితే, జిల్లాలో అత్యధికంగా ఉన్న ఆయన సామాజిక వర్గానికి చెందినవారు ఏ నిర్ణయం తీసుకుంటారు? అన్నవి చర్చనీయాంశాలయ్యాయి.
రాయబారాలు లేనట్టే!: ఈనేపథ్యంలోనే చివరి ప్రయత్నంగా మంత్రులందరూ ఢిల్లీకి వెళ్లి, జగన్ వ్యవహారంలో అధిష్ఠానంతో సయోధ్యకు రాయబారం నెరపుతారని, వైఎస్‌కు సన్నిహితంగా మెలిగిన ఇద్దరు మంత్రులు రఘువీరారెడ్డి, ధర్మాన ప్రసాదరావు ఇందుకు చొరవ తీసుకుంటున్నారని ఆదివారం రాత్రి వార్తలు వచ్చాయి. అవి నిజం కాదని వారిద్దరూ 'ఆన్‌లైన్'కు స్పష్టంచేశారు.
తాము ఢిల్లీకి వెళ్లట్లేదని తేల్చిచెప్పారు. "ఢిల్లీకి, జగన్‌కు, జగన్‌కు, రాష్ట్ర నేతలకు మధ్య అగాధం పెరిగింది. ఈ తరుణంలో కొత్తగా ఢిల్లీకి వెళ్లి చేసేది ఏముంటుంది? రాష్ట్ర రాజకీయాలంటే ఢిల్లీ ఏవగించుకుంటోంది. అక్కడ మన నేతలకు అపాయింట్‌మెంట్ ఇచ్చేవారు కూడా లేరు. అందువల్ల మంత్రులు ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర పరిస్థితులను వివరించే అవకాశమే లేదు'' అని సీనియర్ మంత్రి ఒకరు స్పష్టంచేశారు. "వైఎస్‌పై మా అందరికీ ప్రేమ ఉంది. కానీ జగన్ వ్యవహారం శ్రుతి మించుతోంది.
దుందుడుకు, దూకుడు, సంయమనం లేకపోవడం, పెద్దల పట్ల గౌరవ లేమి... ఇవన్నీ జగన్‌లో నాయకత్వ లోపాన్ని సూచిస్తున్నాయి. వైఎస్ పట్ల మాకున్న ప్రేమ జగన్ వ్యవహార శైలి కారణంగా పరీక్షగా మారింది'' అని మరో సీనియర్ మంత్రి వాపోయారు. శ్రీకాకుళం జిల్లాలో స్థానిక రాజకీయాల కారణంగానే తన కుమారుడిని జగన్ యాత్రకు పంపాల్సి వచ్చిందని ధర్మాన తన సన్నిహితులతో చెప్పినట్టు సమాచారం. మొత్తమ్మీద... మున్ముందు జగన్ ఇదే విధంగా వ్యవహరిస్తే, అధిష్ఠానం ఆయనను పార్టీ నుంచి బయటకు పంపక తప్పదని పార్టీ నేతలు భావిస్తున్నారు.
ఈ పరిస్థితిలో జగన్ కొత్త పార్టీని స్థాపిస్తే, ఆయన వెంట ఎందరు వెళ్తారో, ఎందరు పార్టీకి కట్టుబడి ఉంటారో ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. "40 మందికి పైగా ఎమ్మెల్యేలు జగన్ వెంట వెళ్తేనే ప్రభుత్వం పడిపోతుంది. అప్పుడైనా కేంద్రం వెంటనే ఎన్నికలకు వెళ్తుందా అన్నది చెప్పలేం. మధ్యంతరానికైనా సిద్ధపడవచ్చు.
లేదా అసెంబ్లీని అది సుప్త చేతనావస్థలో ఉంచవచ్చు'' అని కొందరు నేతలు విశ్లేషించారు. మొత్తమ్మీద రాష్ట్రంలో కాంగ్రెస్ రాజకీయాలు ఎటు పోతున్నాయో తెలియని పరిస్థితి నెలకొందని నేతలు వాపోతున్నారు. "ప్రస్తుత పరిణామాలన్నింటినీ చూస్తూ మధన పడడం తప్ప చేయగలిగింది ఏముంది?'' అని రాయలసీమ ప్రాంతానికి చెందిన సీనియర్ మంత్రి ఒకరు ఆవేదన వ్యక్తంచేశారు.
మరణ సంకటం
ఆ మరణాలు సహాజమైననా? వైఎస్ కోసమా?
శ్రీకాకుళం జిల్లాలో 'ఆన్‌లైన్' పరిశోధన
జూ పైల చంద్రమ్మ, లొద్దపుట్టి, ఇచ్ఛాపురం (మం): ఈమె 2009 సెప్టెంబర్ 2న వృద్ధాప్య పింఛను తీసుకోడానికి ఉదయం 11గంటలకు బయల్దేరింది. కానీ బయటకొచ్చేసరికి నీరసంతో పడిపోయింది. సాయంత్రం 4 గంటల వరకూ అపస్మారక స్థితిలో ఉండి, చనిపోయింది. అప్పటికి వైఎస్ మరణవార్త ఎవరికీ తెలీదు. కానీ ఆమెనూ ఈ జాబితాలో కలిపేశారు.
జూ మజ్జి దాలినాయుడు, నందివాడ, పొందూరు (మం): ఈయన సెప్టెంబర్ 2న గ్రామస్థులతో జరిగిన ఘర్షణలో గాయపడ్డాడు. వినాయక నిమజ్జనం సందర్భంగా బాణాసం చా కాలుస్తుంటే.. ఘర్షణకు దిగా డు. ఈ ఘర్షణపై పొందూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. గాయాల పాలైన దాలినాయుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 5న మృతిచెందాడు. ఈయన పేరూ ఈ జాబితాలో చేరిపోయింది.
జూ ఆరాచాడ శ్రావణ్‌కుమార్, కంబర, వీరఘట్టం (మం): ఈ విద్యార్థి ఎప్పటినుంచో మూత్రపిండాల వ్యాధితో బా ధ పడేవాడు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 2న మరణించాడు. ఆస్పత్రిలో ఈ వివరాలు ఉన్నా యి. ఇతని పేరూ 'వైఎస్.. బాధ.. మృతుల జాబితా'లో ఉంది. మేకా ప్రసాదరావు, రేగిడి -ఆముదాలవలస: ఈయన పౌరోహిత్యం చేసుకునేవారు. సెప్టెంబర్ 13న గ్రామం లో నిర్వహించిన వైఎస్ సంస్మరణ సభలో పాల్గొన్నారు. పేదరికంతో మానసిక వ్యథ అనుభవించేవారు. దీంతో గుండెపోటుకు గురై మరణించారు. అయినా.. ఈ జాబితాలో ఆయన పేరు కలిపేశారు.
రెడ్డి అప్పన్న, జగతి, కవిటి (మం): చాలాకాలంగా మద్యానికి బానిస. అనారోగ్యమూ ఉంది. సెప్టెంబర్ 5న మాజీ సర్పంచి ఇంటి వద్ద టీవీ చూస్తూ సొమ్మసిల్లి.. చనిపోయారు. ఈయన పేరూ లిస్టులో ఉంది.
పిలక గణపతి, కేసరిపడ, కంచిలి(మం): ఈయన వ్యవసాయదారుడు. ఎప్పుడు నీర సంగా ఉంటూ.. అనారోగ్యం పాలయ్యాడు. వైఎస్ మరణవార్త తెలియకముందే పొలంలో పనిచేసేటప్పుడే గుండెపోటుతో మరణించాడు.
రత్నాల నిర్మల, మర్లపాడు, నందిగాం (మం): ఈమె ఉపాధి కూలీ. అప్పులబాధతో మనోవ్యథ వల్ల అనారోగ్యం వచ్చింది. సెప్టెంబర్ 4న అనారోగ్యంతోనే మరణించారు. దాంతో ఆమెనూ ఈ మృతుల జాబితాలో కలిపేశారు.
మరువాడ జానకిరామ్, హుకుంపేట, గార (మం): ఈయనకు 70 ఏళ్లు. అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. వైఎస్ చనిపోయిన మూడోరోజు వృద్ధాప్యం తో చనిపోయాడు. ఈయననూ వైఎస్ అభిమానుల జాబితాలో కలిపేశారు.
దేవగుప్తపు నర్సింగరావు, ముషిణివలస, జి.సిగడాం (మం):
ఈయన రిటైర్డ్ ఉద్యోగి. వైఎస్ మరణించిన 8 రోజుల తర్వాత గుండెపోటుతో మరణించారు. ఈయననూ వైఎస్ అభిమానిగానే లెక్కించారు.
ఐదేళ్లలో వేల కోట్లు ఎలా వచ్చాయి?
ఈ వ్యవహారాన్ని తిరగదోడాలి..సోనియాకు, ప్రధానికి లేఖ రాస్తా
జగన్‌తో పార్టీ బలపడుతుందా?.. అలా అనుకోవడం బుద్ధి తక్కువ: పాల్వాయి
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని చీల్చేందుకు కుట్ర జరుగుతోందని సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఏ వ్యాపారమూ, పరిశ్రమా లేకుండా ఐదేళ్లలో వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించావంటూ కడప ఎంపీ జగన్‌ను ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ వ్యవహారాన్ని తిరగదోడి, విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీనిపై సోనియాకు, ప్రధానికి లేఖ రాస్తానని తెలిపారు.ఈ వ్యవహారాన్ని తిరగదోడాలి..సోనియాకు, ప్రధానికి లేఖ రాస్తా
జగన్‌తో పార్టీ బలపడుతుందా?.. అలా అనుకోవడం బుద్ధి తక్కువ: పాల్వాయి
జగన్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందనుకోవడం కంటే బుద్ధి తక్కువ మరొకటి లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఓదార్పు యాత్రలో పాల్గొనకుండా మంత్రులు, ఎమ్మెల్యేలను కొందరు అడ్డుకుంటున్నారన్న జగన్ వ్యాఖ్యలను పాల్వాయి ఆదివారం విలేఖరుల సమావేశంలో తిప్పికొట్టారు. "ప్రేమ ఉంటే ఎవరూ నీ వెంట రాకుండా ఉండరు. పార్టీని చీల్చే కుట్ర జరుగుతోందని గ్రహించే, పార్టీపై ప్రేమ ఉండడం వల్లే వారు నీ వెంట రావడం లేదు. యాభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటున్నాం. ఒక్కసారిగా ఊడిపడలేదు. నాలుగైదేళ్లలో కోట్లు కూడబెట్టలేదు. ఆ కోరికా లేదు. ఆ కోరిక ఉన్న 'నియో రిచ్ క్లాస్' వ్యక్తులు, పరిజ్ఞానం లేని వారు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కావొచ్చు. కానీ వారికి పార్టీ బతకాలని లేదు'' అని ఆయన జగన్‌కు చురకలు అంటించారు.
"జగన్ వద్ద ఉన్న వేల కోట్ల డబ్బుతో సోనియాను, కాంగ్రెస్ పార్టీని శాసించే స్థితికి వచ్చారు. ఆ డబ్బు కోసమే కొద్ది మంది ఓదార్పు యాత్రలో చేరి సోనియా, రోశయ్య గురించి మాట్లాడుతున్నారు. తాటాకు చప్పుళ్లకు అధిష్ఠానం బెదరదు'' అని పాల్వాయి స్పష్టంచేశారు. ఓదార్పు యాత్రకు 15 శాతం మంది మాత్రమే స్వచ్ఛందంగా వస్తున్నారని, మిగతా వారంతా డబ్బుతో తరలిస్తున్న వారేనని ఆయన అన్నారు. "అసలు ఏ వ్యాపారం లేకుండా వేల కోట్లు ఎలా వచ్చాయి? ఏ పరిశ్రమా లేకుండా ఇంత ధనం ఎలా కూడబెట్టగలిగారు? ఐదేళ్లలో ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారు? వీటన్నింటినీ తిరగదోడాలి. దీనిపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీకి లేఖరాస్తా. జాతి, రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ లేఖ రాయాలనుకుంటున్నా'' అని పాల్వాయి చెప్పారు.
"వైఎస్ అకాల మృతిని జీర్ణించుకోలేక, అంతకుముందు ఆయన వెంట ఉండి కోట్లు గడించిన వారిలో ఎంతమంది చనిపోయారు?'' అని పాల్వాయి ప్రశ్నించారు. తాను ఐదుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యానని, తనను విమర్శించేవారు తన కాలి గోటికి కూడా సరిపోరని గోవర్ధన్‌రెడ్డి తీసిపారేశారు.
పాల్వాయి టీడీపీ కోవర్టు: బాజిరెడ్డిఎంపీ వైఎస్ జగన్‌పై పాల్వాయి చేసిన వ్యాఖ్యలు బాధాకరమని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాటలు పాల్వాయి నోటి నుంచి వస్తున్నాయంటే, పార్టీలో టీడీపీ కోవర్టుగా ఆయనను భావించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. 'మాలాంటి వారు ఆయన కాలి గోటికి సరిపోరని ఒక దొర, పెత్తందారులా అనడం పాల్వాయి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తోంది' అని బాజిరెడ్డి విమర్శించారు.
No comments:
Post a Comment