జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Saturday, July 10, 2010

ఓదార్పు కాదు... రాజకీయ యాత్ర

శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ కోసం ఒక్కరూ చనిపోలేదు
    సాయం కోసమే వైఎస్ చిత్ర పటాలు: ఎర్రన్నాయుడు
ఆ 16 మంది జాబితా బూటకం
ఇందిర, రాజీవ్‌లకంటే వైఎస్ పెద్ద నాయకుడా?
వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణంతో శ్రీకాకుళం జిల్లాలో ఒక్కరు కూడా చనిపోలేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కింజరాపు ఎర్రన్నాయుడు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో 16 మంది వైఎస్ కోసం చనిపోయారని చెప్పడం విడ్డూరంగా ఉందని, అదంతా బూటకమని వ్యాఖ్యానించారు.

వైఎస్ కోసం గుండె ఆగి చనిపోయారని చెబితే ఆర్థిక సహాయం చేస్తారని చెప్పారని, అందుకే పేదరికం కారణంగా ఆ కుటుంబాల వారందరూ వైఎస్ చిత్రపటాలు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. వైఎస్ కోసం చనిపోయారని చెబుతున్న వారికి సంబంధించి తన వద్ద ఆ 16 మంది వివరాలూ ఉన్నాయని చెప్పారు. వారు ఏవిధంగా చనిపోయారన్న విషయాలను ఆయన వెల్లడించారు.

"ఇచ్ఛాపురం మండలం లొద్దిపుట్టిలో పైలా చంద్రమ్మ (65) సెప్టెంబర్ రెండో తేదీ ఉదయం 11 గంటలకు వడదెబ్బతో చనిపోయింది. అప్పటికి వైఎస్ చనిపోయిన వార్త కూడా తెలియలేదు. అలాంటిది.. వైఎస్ మృతి వార్త విని ఆవిడ ఎలా హఠాన్మరణం చెందుతుంది? రెడ్డి అప్పన్న (53) తాగుడుతో, మలేరియాతో మంచానపడి మరణిస్తే వైఎస్ ఖాతాలో వేసేశారు.

మర్లపాడులో రత్నాల నిర్మల (35) వైఎస్ మరణానికి ముందు 27 రోజుల నుంచి అనారోగ్యంతో బాధ పడుతోంది. భావనపాడులో బత్తిన రామారావు అనే రైతు పొలంలో దమ్ము పడుతూ నాగళ్ల నాళ్ల కింద పడ్డాడు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. నందివాడలో మజ్జి దాలినాయుడు (55) గ్రామ తగాదాల్లో ఘర్షణపడి చనిపోయాడు.

ఈ విషయమై పోలీసు స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఇలా ఆ 16 మందీ ఏదో కారణంతో చనిపోతే వైఎస్ మరణవార్త విని గుండె ఆగి చనిపోయారని ప్రచారం చేసుకున్నారు'' అని ఎర్రన్నాయుడు వివరించారు. ఇందిర, రాజీవ్ వంటి జాతీయ నాయకులు చనిపోతేనే ఎవరూ గుండె ఆగి మరణించిన దాఖలాలు లేవన్నారు. వైఎస్ వారికంటే పెద్ద నాయకుడా!? అని ఆయన ప్రశ్నించారు.

భ్రష్టుపట్టించింది వైఎస్సే
రాష్ట్ర రాజకీయాలు భ్రష్టుపట్టిపోయాయన్న జగన్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రోశయ్య కానీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కానీ వివరణ ఇవ్వాలని ఎర్రన్నాయుడు డిమాండ్ చేశారు.

"వైఎస్ చనిపోయిన తర్వాత రాజకీయాలు భ్రష్టుపట్టిపోయాయంటే.. కాంగ్రెస్ పార్టీలోనా? అన్ని పార్టీల్లోనూనా!? లేక రాష్ట్ర పరిపాలనలోనా? అన్న విషయం తేలాలి. అసలు ఆ మాటకొస్తే వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే రాష్ట్రంలో అన్ని వ్యవస్థలనూ భ్రష్టుపట్టించారు'' అని ధ్వజమెత్తారు.

వైఎస్ సీఎం అయిన తర్వాత ఆయన అనుయాయులు ప్రజా ధనాన్ని దోచుకున్నారని, వారే ఇప్పుడు జగన్ ఓదార్పు యాత్రకు పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేసి తమ రుణం తీర్చుకుంటున్నారని అన్నారు.

ఓదార్పు యాత్రకు ఖర్చు పెడుతున్న డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. కరుణాకర్ రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే రమేష్ రెడ్డి తదితరులు ఓదార్పు యాత్రకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారని ఆరోపించారు. ఓదార్పు యాత్ర పేరిట జగన్ దండయాత్ర చేస్తున్నారని ఆరోపించారు.
జగన్ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలి: ఎర్రన్నాయుడు
 
రాష్ట్ర రాజకీయాలు భ్రష్టుపట్టిపోయాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రోశయ్య కాని, పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కాని వివరణ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రన్నాయుడు డిమాండ్ చేశారు.

శనివారం విలేఖరులతో మాట్లాడుతూ రాజకీయాల్లో చేరి ఏడాదికూడా గడవకముందే రాష్ట్ర రాజకీయాలు భ్రష్టుపట్టాయని వ్యాఖ్యలు ఏ ఉద్దేశ్యంతో చేశారో అర్ధం కావటం లేదని, దానికి వివరణ ఇవ్వాలని ఆయన కోరారు. తమ పబ్బం గడుపుకోవడానికి ఏదో ఒక వ్యాఖ్య చేసి ఊరుకుంటే కుదరదని, ప్రజలకు పూర్తి వివరణ ఇవ్వాలని జగన్ కోరారు.

వైఎస్ఆర్ చనిపోయిన తరువాత రాజకీయాలు భ్రష్టుపట్టిపోయాయంటే, కాంగ్రెస్ పార్టీలోనా ? లేక అన్ని పార్టీల్లోనా? లేక రాష్ట్ర పరిపాలనలోనా ? అన్న విషయం తేలాలని ఆయన అన్నారు. అసలు ఆ మాట కొస్తే వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యాకనే రాష్ట్రంలో అన్ని వ్యవస్ధలను భ్రష్టు పట్టించారని ఆరోపించారు.

వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన అనుయాయులు ఎక్కడ పడితే అక్కడ ప్రజా ధనాన్ని దోచుకున్నారని, వారే ఇప్పుడు జగన్ ఓదార్పు యాత్రకు పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేసి తమ ఋణం తీర్చుకుంటున్నారని అన్నారు. ఓదార్పు యాత్రకు ఖర్చు పెడుతున్న డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఓదార్పు యాత్ర పైరుతో ఆయన దండయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. కరుణాకర్ రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే రమేష్ రెడ్డి తదితరులు ఓదార్పు యాత్రకు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారని ఆరోపించారు. పార్టీలో తమ బలం నిరూపించుకోవడానికి ప్రజలను మభ్య పెట్టడం మంచి పద్దతి కాదని అన్నారు.

శ్రీకాకుళంలో ఒక్కరూ వైఎస్ఆర్ కోసం హఠాన్మరణం చెందలేదు. శ్రీకాకుళం జిల్లాలో 16 మంది వైఎస్ఆర్ మరణంతో హఠాన్మరణం చెందారని చెప్పడం విడ్డూరంగా ఉందని, అదంతా బూటకమని ఎర్రన్నాయుడు చెప్పారు. తన వద్ద ఆ 16 మంది వివరాలు ఉన్నాయని చెప్పారు.

ఇచ్చాపురం మండలం లొద్దిపుట్టిలో పైలా చంద్రమ్మ (65) వడదెబ్బతో సెప్టెంబర్ 2 గంటలకు ఉదయం 11 గంటలకు చనిపోయిందని చెప్పారు. అప్పటికి వైఎస్సార్ చనిపోయిన వార్త కూడా తెలియలేదన్నారు. అలాంటిది ఆవిడ ఎలా వైఎస్ఆర్ మతి వార్త విని హఠాన్మరణం చెందిందని ప్రశ్నించారు. అలాగే రెడ్డి అప్పన్న (53) త్రాగుడుతో, మలేరియాతో మంచాన పడి మరణిస్తే వైఎస్ఆర్ ఖాతాలో వేసారని చెప్పారు.

మర్లపాడు గ్రామంలో రత్నాల నిర్మల (35) అనే మహిళ వైఎస్ఆర్ మరణానికి ముందు 27 రోజులనుంచి ఆనారోగ్యంతో బా«ధపడుతున్నదని చెప్పారు. భావనపాడు గ్రామంలో బత్తిన రామారావు అనే రైతు పొలంలో దమ్ము పడుతూ నాగళ్ళనాళ్ళ క్రింద పడగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని, నందివాడలో మజ్జి దాలినాయుడు(55) గ్రామ తగాదాల్లో ఘర్షణ పడి చనిపోయాడని, ఈ విషయం పోలీసు ఠానాలో ఎఫ్ఐఆర్ నమోదయిందని చెప్పారు.

ఇలా 16 మంది ఏదో కారణంతో చనిపోతే వైఎస్ఆర్ మరణవార్త విని గుండెఆగి చనిపోయారని ప్రచారం చేసుకున్నారని, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలాంటి జాతీయ నాయకులు వారు చనిపోతేనే ఎవరూ గుండె ఆగి చనిపోయినట్లు దాఖలాలు లేవని అన్నారు. వారికంటే వైఎస్ఆర్ పెద్ద నాయకుడా? అని ఆయన ప్రశ్నించారు.

అయితే పేదరికం కారణంగా వైఎస్ఆర్ చనిపోతే గుండెఆగి చనిపోయారని ఆర్ధిక సహాయం చేస్తారని చెప్పడం వల్ల ఆ కుటుంబాలవారందరూ వైఎస్ఆర్ చిత్రపటాలు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. అయితే ఎంతో మంది రైతులు, చేనేత కార్మికులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారని, నిజంగా జగన్‌కు ఆ ప్రజలపై అంత ప్రేమ ఉంటే ఆ కుటుంబాలనెందుకు ఓదార్చటంలేదని ప్రశ్నించారు.
అధిష్టానం ఆయన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుంటుంది: వీహెచ్
 జగన్ ఓదార్పు యాత్రలో చేస్తున్న వ్యాఖ్యలన్నింటిని పార్టీ అధిష్టానం పరిగణలోకి తీసుకుంటుందని రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు అన్నారు. శనివారం తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నరకయాతన అనుభవిస్తున్నాడని చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.

అధిష్టానానికి ఎప్పటికప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో నివేదక అందుతున్నదని, ఇంటెలిజెన్స్ రిపోర్టు కూడా వస్తుందని ఆయన అన్నారు. మొదలు ఓదార్పు యాత్ర రాజకీయం ఏమీ లేదన్నాడని, అందుకే అధిష్టానం మొదటి విడత ఓదార్పు యాత్రకు అడ్డు చెప్పలేదన్నారు. ఓదార్పు యాత్ర అంటే డప్పలతో, బాజా భజంత్రీలతో, జిందాబాద్ లతో, వందల కార్లతో వెళ్ళటం కాదని అన్నారు.

మొదటి యాత్రలో ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల, తెలంగాణా వివాదంతో రెండవ దఫా ఓదార్పు యాత్ర అధిష్టానం వద్దంటూ సూచించిందని అన్నారు. సోనియాతో భేటీలో వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారో ఎవరికీ తెలియకపోయినా, జగనే స్వయంగా ఓదార్పు యాత్రకు ఆమె సుముఖంగా లేరని బహిరంగ లేఖ ద్వారా తెలిపాడన్నారు.

శుక్రవారం వైఎస్ఆర్ మరణం తరువాత రాష్ట్రంలో రాజకీయం భ్రష్టుపట్టిందని, శనివారం ఓదార్పు యాత్రలో ఎమ్మెల్యేలు పాల్గొనకుండా అడ్డుకుంటున్నారని, వారు నరకయాతన అనుభవిస్తున్నారని చేసిన వ్యాఖ్యలు చేయడాన్ని అధిష్టానం గమనిస్తున్నదని అన్నారు. అయితే వెంటనే అధిష్టానం ప్రతిస్పందించాల్సిన అవసరం లేదని, అధిష్టానం ముందు ఎన్నో సమస్యలున్నాయన్నారు.

ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడు, ఎం.పి. అయిఉండి అలాంటి వ్యాఖ్యలు చేయవచ్చా? అని ఆయన ప్రశ్నించారు. జగన్ యాత్రకు ప్రజల మద్దతుందన్న వాదనపై స్పందిస్తూ వైఎస్ఆర్ కుమారుడిగా ప్రజలు ఆయనను చూడటానికి రావడంలో పెద్ద ఆశ్చర్యం లేదన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ కీ ప్రజలు వచ్చారన్నారు. వైఎస్ఆర్ కి కూడా 1984 లో మొదటి సారి, 1999 లో రెండవసారి ముఖ్యమంత్రి పదవికి పరిశీలన చేసిందని, రెండు సార్లు వేరొకరు ముఖ్యమంత్రి అయినా ఆయన అధిష్టానాన్ని ఎదిరించలేదని చెప్పారు.
2004 లో వైఎస్ఆర్ పాదయాత్ర తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలందరూ ఒక్కటై పనిచేసారన్నారు. రెండవసారి కేంద్రంలో మన్మోహన్ ప్రధానిగా అమలు చేసిన అభివధ్ధికార్యక్రమాలతో పాటు, రాష్ట్రంలో అమలు చేసిన కార్యక్రమాలు, అన్నింటి కన్నా సోనియా నాయకత్వాన్ని దేశ ప్రజలు సమర్ధించారని అన్నారు. సోనియా ముందు ఎంత పెద్ద నాయకుడైనా బలాదూరేనని అన్నారు.
 వైఎస్సార్ ఆకస్మక మరణంతో తరువాత తనను ముఖ్యమంత్రిని చేయాలని జగన్ కోరుకున్నా, అధిష్టానం అన్నికోణాల్లో ఆలోచించి రోశయ్యను ముఖ్యమంత్రి చేసిందన్నారు. అయితే జగన్ కు పార్టీలో భవిష్యత్తు బాగుంటుందని, అధిష్టానం ఆదేశాన్ని పాటిస్తే ఆయనకే మంచి జరుగుతుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు.

ఓదార్పు కాదు... రాజకీయ యాత్ర: నారాయణ

 రాష్టంలో జగన్ చేస్తున్నది ఓదార్పు కాదని, రాజకీయ యత్రని, రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలు భ్రష్టుపట్టాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ విజయవాడలో వ్యాఖ్యానించారు.

శనివారం విజయవాడకు వచ్చిన ఆయన సీపీఐ జిల్లా, నగర పార్టీ అంతర్గత సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు- సీపీఐ పాత్ర అనే అంశంపై ఆయన పార్టీ అంతర్గత సమావేశంలో చర్చించినట్లు తెలుస్తున్నది.

మరోవైపు ఇటీవల నగరంలో జరిగిన పార్టీ రాష్ట్ర సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలు ఏమేరకు అమలవుతున్నాయి? విజయవాడలో పార్టీ భవన నిర్మాణ పనులు ఏ మేరకు వచ్చింది? అనే అంశాలపై కూడా పార్టీ నాయకులతో చర్చించినట్లు తెలిసింది. ఇంకా పలు రాజకీయ అంశాలపై ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంలో తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలు పూర్తిగా భ్రష్టుపట్టాయని వ్యాఖ్యానించారు. ప్రజా సంక్షేమాన్ని మరచి, పదవుల కోసం కొట్లాడుకుంటున్నారని విమర్శించారు. జగన్ యాత్ర ఓదార్పు యాత్ర కాదని, కేవలం రాజకీయ యాత్ర అని ఆయన అభివర్ణించారు. బలమైన పదవి కోసం చేస్తున్న యాత్రగా దీనిని భావించవచ్చునని వ్యాఖ్యానించారు.

ఉన్నత పదవిని ఆశించి చేస్తున్న ఈ యాత్రపై కాంగ్రెస్ అధినాయకత్వం తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్రం అంతా జగన్ యాత్రపై చర్చ జరుగుతున్నదని, మరోవైపు ఆ పార్టీ నాయకులలో కూడా లుక లుకలు బయలుదేరాయని పేర్కొన్నారు. రాజకీయ పరిణామాలు ఏవిధంగా మారనున్నాయన్నదానిపై వేచి చూడాలని తెలిపారు. 

జగన్‌ది రాజకీయ యాత్ర: నిరంజన్

జగన్ వ్యాఖ్యలతో ఆయనది ఓదార్పు యాత్ర కాదు .. రాజకీయ యాత్ర అని తేలిపోయిందని పీసీసీ ప్రధాన కార్యదర్శి జి.నిరంజన్ అన్నారు. శనివారం ఆయన ఆన్‌లైన్‌తో మాట్లాడుతూ బాధితుల ఓదార్పుకు మంత్రులు, శాసనసభ్యుల అవసరం ఏమిటి అని ప్రశ్నించారు. జగన్ వ్యవహరిస్తున్న తీరు వల్లనే వారు ఆ యాత్రకు దూరంగా ఉంటున్నారని అన్నారు. తాను, కాంగ్రెస్ వేరు అన్నట్టు మాట్లాడి తన తండ్రి ఆత్మను క్షోభకు గురిచేస్తున్నాడని విమర్శించారు.

వైఎస్‌ను మహాత్మునితో పోల్చడమా?: కృష్ణా టీడీపీ

లక్ష కోట్ల రూపాయల రాష్ట్ర సంపదను దోచిన వైఎస్‌ను మహాత్మాగాంధీతో పోల్చడం దుర్మార్గమని కష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రంగా మండిపడ్డారు. విజయవాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన జగన్ పర్యటనపై విరుచుకుపడ్డారు. జగన్ తన తండ్రి మరణ వార్త విని మరణించిన వారి కుటుంబాలను పరామర్శించే నెపంతో బల ప్రదర్శన చేసుకుంటున్నాడని విమర్శించారు.

ఆయన వెంట పెద్ద సంఖ్యలో కార్ల ర్యాలీ కూడా ఉంటోందని, బాధితులకు ఒక్కొక్కరికి లక్ష చొప్పున డబ్బు ఇస్తున్నారని, ఇందుకు సుమారు ఏడుకోట్లు అవుతుందని అంచనా ఉందని, వాస్తవంగా ఒక ముఖ్యమంత్రి మరణానికి గుండెలవిసేలా ఏడ్చి గుండెలు ఆగి మరణిస్తే వారి వివరాలను అధికారికంగానే బయటపెట్టి, ప్రభుత్వమే ఆ కుటుంబాలకు సానుభూతిగా పరిహారం ఇవ్వచ్చుకదా అని ప్రశ్నించారు. జగన్ తన పర్యటనలో తన తండ్రిని గాంధీతో పోల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

రాజా ఆఫ్ కరప్షన్‌గా పేరొందిన వైఎస్ రాజశేఖరరెడ్డిని గాంధీతో పోల్చడమంటే అంతకంటే సిగ్గుచేటయిన విషయం ఇంకొకటి ఉండదన్నారు. లక్ష కోట్ల రాష్ట్ర సంపదను దోచుకున్న అవినీతి పరుడైన వైఎస్ ఏ విధంగా నిజాయితీ పరుడో, ఆయన గాంధీతో ఏ విధంగా పోల్చదగిన వాడో చెప్పడానికి కాంగ్రెస్‌లో ఏ ఒక్క నాయకుడు స్పందించలేదన్నారు.

టీడీపీ తరఫున వైఎస్ అవినీతి గురించి ప్రధానమంత్రి, ప్రణబ్‌ముఖర్జీలకు నివేదిక ఇచ్చామన్నారు. వైఎస్ ఆయన బావమరది, తోడల్లుడులు దోచుకున్న లక్ష కోట్ల రూపాయలను తిరిగి తీసుకువస్తే ట్రిపుల్ ఐటీ సీట్లు, ఇంజనీరింగ్ విద్యార్థుల ఫీజులు అన్నీ చక్కబడతాయని తెలిపారు.

ఇడుపుల పాయలో ట్రిపుల్ ఐటీ భవనాలు కట్టుకోవడం వెనుకాల ఎంతో అవినీతి ఉందని విమర్శించారు. జగన్ కూడా బెంగుళూరులో 30 ఎకరాల స్థలంలో నివాసం కట్టించుకున్నాడని, హైదరాబాద్‌లో ఎకరం స్ధలంలో నివాసం కట్టిస్తున్నాడని చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి రోశయ్య కూడా నోరు విప్పాలన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన దర్యాప్తు సంస్థలయినా స్పందించి జగన్ సంపదను వెలికి తీయాలన్నారు. సాక్షి టీవీ, సాక్షి పత్రికల ద్వారా 250 కోట్లు నష్టం వచ్చిందని చెబుతున్నారని, ఈ డబ్బు ఎలా వచ్చిందో కూడా తేలాలని డిమాండ్ చేశారు. 2004లో జగన్ ఆదాయపుపన్ను నివేదికలో ఏముంది? ఇప్పుడు ఎన్నికోట్లు ఉందీ తేలాలన్నారు. ఈ డబ్బంతా ఎవడబ్బ సొమ్ము అంటూ ఆయన తీవ్రంగా స్పందించారు.

No comments:

Post a Comment