జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Saturday, August 7, 2010

రాజకీయాలా... వ్యాపారమా ? అంతర్మ‘ధనం’

antharఅత్యున్నత పీఠంపై కన్నేసి, ఆ లక్ష్యం కోసం పనిచేస్తున్న కడప ఎంపీ వైఎస్‌ జగన్‌ అంతరంగం అయోమయంలో పడింది. అధిష్ఠానం అనుసరిస్తోన్న వ్యూహాత్మక వైఖరి వల్ల జగన్‌ భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. తన మద్దతు దారులను ఏరి వేస్తున్న నాయకత్వం తనంతట తాను పార్టీ నుంచి బయటకు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక గందరగోళంలో ఉన్నారు. నాయకత్వం తనను వేధిస్తున్న విషయం స్పష్టంగా కనిపిస్తున్న క్రమంలో పార్టీలోనే ఉండాలా? వ్యాపారాలు చేసుకోవాలా? ఢిల్లీకి లొంగిపోవాలా? ఎదిరించాలా? లొంగి పోతే ఎలా? ఎదిరిస్తే ఏమిటి పరిస్థితి? సొంత పార్టీ పెట్టాలా? పార్టీలోనే ఉంటూ సరర్దుకుపోవాలా?.. ఇవీ ఇప్పుడు జగన్‌ ముందున్న ప్రశ్నలు.

తనకు ముఖ్యమంత్రి పదవి దూరమయిందని ఉడికిపో తున్న జగన్‌ తన సత్తా ఏమిటో ఓదార్పు యాత్ర ద్వారా చూపి అధిష్ఠాన వర్గాన్ని బెదిరించాలనకున్న వ్యూహం బెడిసికొట్టడం తో జగన్‌ చిక్కుల్లో పడ్డారు. ఓదార్పు యాత్ర ప్రారంభించిన తర్వాతే ముగ్గురు ప్రధాన అనుచరులపై వేటు వేసేందుకు నాయకత్వం సిద్ధమయిన వైనం జగన్‌ను ఆలోచనలో పడ వేసింది. కేవీపీ ద్వారా ఒకవైపు ఢిల్లీతో రాయబారాలు నడుపు తూనే, మరోవైపు రాష్ట్రంలో సీఎం రోశయ్యపై కత్తి దూస్తున్న జగన్‌ ద్విముఖ వ్యూహం అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

మరో నాలుగురోజుల్లో జగన్‌కు సానుకూల వాతావరణం ఏర్పడుతుందని, నాయకత్వంతో రాజీ కుదిరే పరిస్థితి వస్తుందంటూ అనకాపల్లి ఎంపి సబ్బం హరి ఇచ్చిన సంకేతాలు జగన్‌ భవిష్యత్తేమిటన్న ప్రశ్నలకు తెరలేపింది. దీనిపై పార్టీ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. అధిష్ఠానంపై తిరుగుబాటు చేసి, సొంత పార్టీ స్థాపిం చదలచుకుంటే జగన్‌కున్న వ్యాపారాలపై యుపిఏ సర్కారు దృష్టి సారించడం ఖాయం. కేంద్ర-రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వమే అధికారంలో ఉండటం ప్రస్తావనార్హం. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో జగన్‌ బావ అనిల్‌కుమార్‌కు సంబంధించినదని ప్రచారం జరుగుతోన్న బయ్యారం గనుల లీజులు రద్దు చేసి, రీ సర్వే చేసేందుకు కేంద్రం నడుంబిగించింది.

మరోవైపు జగన్‌ అభివృద్ధిని కాంక్షించే గాలి జనార్దన్‌రెడ్డికి చెందిన బ్రాహ్మణి స్టీల్స్‌ భవిష్యత్తు కూడా అగమ్యగోచరంగా మారింది. గనుల ఎగుమ తులను రద్దు చేస్తూ రోశయ్య సర్కారు రేపో, మాపో నిర్ణయం తీసుకోనుంది. ఆ నిర్ణయం తీసుకుంటే కష్టపడకుండా సులభం గా వచ్చి పడుతున్న గనుల ఆదాయానికి గండి పడినట్టే. ఇవి కాక.. జగన్‌, ఆయన మిత్రుల బినామీ కంపెనీలు, ఆయనకు తెరచాటు మద్దతునిస్తున్న ఒక ఎంపికి సొంత రాష్ట్రంతో పాటు, పక్క రాష్ట్రాల్లో ఉన్న విద్యుత్‌ ప్రాజెక్టులు చిక్కుల్లో పడక తప్పవు. దీన్ని బట్టి చూస్తే లక్షల కోట్ల రూపాయల లాభసాటి వ్యాపారా లను రాజకీయాల కోసం వదులుకోక తప్పదు.

ఈ విషయంలో జగన్‌కు అంత ధైర్యం ఉంటుందా అన్నది ప్రశ్న. స్వతహాగా వ్యాపారవేత్త అయిన జగన్‌ ఆ దిశగా అడుగులు వేస్తారా? అన్న సందేహాలూ వినిపిస్తున్నాయి. ఒకవే ళ ధైర్యం చేసి, ఆదాయం వదులుకుని, తన ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే ప్రయత్నాలను ఎదుర్కొని సొంత పార్టీ వైపు అడుగులు వేస్తే.. తనతో ఎంత మంది వస్తారన్నది మరో అయోమయం. కాంగ్రెస్‌లో ఉన్నంత సేపూ వైఎస్‌ తనయుడిగా వచ్చే గుర్తింపు వేరు. బయటకు వెళ్లిన తర్వాత వచ్చే స్పందన వేరని సీనియర్లు తమ అనుభవాలను గుర్తు చేస్తున్నారు.

ఓదార్పు యాత్రకు 25 మంది ఎమ్మెల్యేలు వచ్చినప్పటికీ, పార్టీ నుంచి జగన్‌ బయటకు వెళ్లిన తర్వాత వారిలో ఆయనతో పాటు వచ్చేది ఎంతమం దన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఈలోగా కేంద్రం తెలంగాణపై నిర్ణయం తీసుకుం టే సీమాంధ్రలో టీడీపీ బలపడుతుంది. చిరంజీవి కాంగ్రెస్‌తో కలిస్తే తనది ఒంటరిపోరే. ఈ సమీకరణలు కూడా జగన్‌ ముం దరి కాళ్లకు బంధాలు వేస్తున్నాయి. జగన్‌కు, అధిష్ఠానానికి మధ్య రాయబారాలు జరుగుతున్నాయన్న వార్తలు వెలువడు తున్నాయి. ఇటు రాజకీయంగా, అటు క్రైస్తవ మతకోణంలో అధిష్ఠానంతో రాజీ కుదిర్చే ప్రయత్నాలు ఊపందుకుంటున్నా యి. ఈ నేపథ్యంలో అవి ఫలిస్తే.. జగన్‌ భవిష్యత్తు ఏమిట న్న అంశంపైనా చర్చ జరుగుతోంది.

ఒకవేళ జగన్‌ అధిష్ఠానం తో రాజీ పడితే ఆయన పరిస్థితి ఇప్పటికన్నా పూర్తి భిన్నంగా ఉండే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. వైఎస్‌కు పోరాటవీ రుడన్న పేరు ఉంది. నమ్మిన వారి కోసం ఎవరినయినా రాజీ లేకుండా పోరాడతారన్న ప్రతిష్ఠ ఉంది. అదే ఆయనకు ఇమేజి తెచ్చింది. జగన్‌ కూడా ఇప్పుడు అదే ఇమేజ్‌ కోసం తపనపడుతున్నారు. తండ్రి మాదిరిగా జగన్‌ కూడా మడమ తిప్పని యోధుడిగానే కార్యకర్తలు, ఆయన అనుచరులు గట్టిగా విశ్వసిస్తున్నారు. అలాంటి జగన్‌ పోరు బాట విడిచి, రాజీ బాటలో నడిస్తే.. ఇప్పటి వరకూ ఉన్న ఇమేజ్‌ పోతుంది.

మీడియాలో ప్రస్తుతం ఉన్న ప్రాధాన్యం కూడా ఉండదు. అధిష్ఠానంతో రాజీపడితే వైఎస్‌తో జగన్‌ను పోల్చే సాహసం చేయడం కష్టం. జగన్‌ నాయకత్వంతో రాజీ పడితే.. ఆయన అనుచరులు, మద్దతుదారులయిన ఎమ్మె ల్యేలు ‘నాయకత్వంతో రాజీ పడే జగన్‌ను అనుసరించి కోరి కష్టాలు కొనితెచ్చుకునే కన్నా, నేరుగా పార్టీకే విధేయత కనబరి స్తే భవిష్యత్తు ఉంటుంద’ని భావిస్తే జగన్‌కు కష్టాలు తప్పవని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ విధంగా.. సొంత పార్టీకి ఇప్పుడు సమ యం కాదన్న అనుమానం ఒకవైపు, పార్టీలో ఉంటే లొంగిపో వాలా? పోరాడుతూ ఉనికి చాటుకోవాలా? అలాగయితే అది ఆ పోరాటం ఎంతకాలం అన్న అంశాలే జగన్‌ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి.

No comments:

Post a Comment