జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Thursday, August 26, 2010

జగన్‌ను మందలిస్తే చాలు * హుటాహుటిన హస్తిన చేరిన గవర్నర్ * , తెలంగాణా ఇవ్వక తప్పకపోతే, హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయమంటున్న నరసింహన్


ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ నరసింహన్‌కు కేంద్ర హోమ్ శాఖ నుంచి పిలుపు వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పరిస్థితిపై సమగ్ర నివేదికను తీసుకురావలసిందిగా కేంద్రం గవర్నర్‌ను కోరినట్టు తెలుస్తున్నది. అంతటితో హుటాహుటిన గవర్నర్ ఢిల్లీ చేరుకున్నారు.

జగన్‌వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని రోశయ్య ప్రభుత్వం ఇప్పటికిప్పుడు పడిపోయే ప్రమాదం ఏమీ లేదన్నది గవర్నర్ అభిప్రాయంగా కనిపిస్తున్నది. జగన్ వెంట ఎంత మంది ఉంటారన్న ప్రశ్నకు, సుమారు 27 మంది శాసనసభ్యులు, ముగ్గురు నలుగురు పార్లమెంటు సభ్యులు ఉండవచ్చునన్నది గవర్నర్ సమాధానంగా తెలుస్తున్నది. అయితే జగన్‌పై వేటు వేయడం కంటె గట్టిగా మందలించి ఆయన నడవడికను మార్పించాలన్నది గవర్నర్ సూచనగా కనిపిస్తున్నది.

తెలంగాణా అంశం కూడా గవర్నర్‌తో కేంద్ర హోమ్ శాఖ చర్చించే అవకాశం కనిపిస్తున్నది. ఒకవేళ తెలంగాణా సమస్యపై రాష్ట్రాన్ని విభజించవలసివస్తే, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలన్నది కూడా నరసింహన్ సూచనగా తెలుస్తున్నది. తెలంగాణాకు హైదరాబాద్ గుండెకాయ కావడంవల్ల హైదరాబాద్ లేని తెలంగాణాను తెలంగాణా ఉద్యమ నేతలు అంగీకరిస్తారా అన్నది తేలవలసి ఉంది.

No comments:

Post a Comment