కాలం కలసి రానప్పుడు ఓడలు బళ్ళు అవుతాయన్న సామెత కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పట్ల అక్షరాల నిజమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మహబూబాబాద్‌లో ఓదార్పు యాత్ర అర్ధంతరంగా నిలిపివేసి, చాలాకాలానికి ఉభయ గోదావరి జిల్లాల్లో జగన్ ఆ యాత్రను ప్రారంభించినప్పుడు మొదట్లో ఎమ్మెల్యేలు ఎవరూ ఆసక్తి కనబరచకపోయినా వారి సమీప బంధువులు, అన్నదమ్ములు తదితరులు జగన్‌కు అండగా నిలిచారు. ఉదాహరణకు శ్రీకాకుళంలో ఎంపీ కిల్లి కృపా రాణి బంధువులు, మంత్రి ధర్మాన ప్రసాదరావు కుమారుడు లాంటివారు ఓదార్పుయాత్రలో బాహాటంగానే పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు వచ్చేసరికి మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ లాంటివారు అడుగడుగునా వెంట ఉన్నారు. యాత్ర ముగింపు సందర్భంగా కాకినాడలో జరిగిన బిహ రంగ సభకు దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు, ఇద్దరు మంత్రులూ హాజరయ్యారు.
మారిన సీన్...
ఇప్పుడు వాతావరణం, పరిస్థితీ మారిపోయాయి. ఓదార్పు యాత్రకు అనుమతి లేదని, ఎవరూ వెళ్ళకూడదని ఎప్పుడైతే అధిష్ఠానం కరాఖండిగా చెప్పేసిందో ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు కిక్కురుమనకుండా మౌనం వహించారు. కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి లాంటి వారు తాము యాత్రకు వెళ్ళటం లేదని బహిరంగంగానే చెప్పేశారు. జగన్ బంధువు, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డి మినహా ఓదార్పు యాత్రలో పాల్గొం టామని ఇప్పటిదాకా ఎవరూ బాహాటంగా ప్రకటించలేదు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇప్పటికైతే యాత్రలో పాల్గొంటానని చెప్పినా, తనకు అధిష్ఠానం నుంచి స్పష్టమైన ఆదేశాలంటూ ఏవీ రాలేదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మరోవైపు కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసిం హారెడ్డి శుక్రవారం నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయం అడిగినప్పుడు యాత్రకు వెళ్ళా ల్సిందే అని అందరూ చెప్పినట్టు వార్తలు వచ్చాయి. దాన్ని మొదట్లో ఉగ్రనరసింహారెడ్డి అంగీకరించినా, ఆ తర్వాత మాట మార్చి ఈ నెల 24 తర్వాత కానీ ఏ విషయం చెప్ప బోనని స్పష్టం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజ శేఖరరెడ్డికి సన్నిహితులుగా పేరున్న సీనియర్ మంత్రులు గాదె వెంకటరెడ్డి, శిల్పా మోహన్‌రెడ్డి లాంటి వారు అధిష్ఠానం సూచన మేరకే నడుచుకుంటే బాగుంటుందని హిత వాక్యా లు పలుకుతున్నారు.
దగ్గుబాటి దంపతుల లాబీయింగ్?...
మరోవైపు ఢిల్లీలో కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి, ఆమె భర్త, ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఓదార్పు యాత్రకు, ప్రత్యేకించి వైఎస్‌జగన్‌కు వ్యతిరేకంగా భారీ ఎత్తున లాబీయింగ్ జరుపుతున్నట్టు వార్త లు తెలుపుతున్నా యి. జగన్‌కుతాము అందించిన నోట్‌ను పత్రికలు లీక్ చేద్దా మని దగ్గుబాటి చెప్పినప్పుడు తాను తీవ్రంగా వ్యతిరేకించా నని ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే, వైఎస్ సన్నిహితుడు మహీధర రెడ్డి బహిరంగంగానే చెప్పేశారు. తనకు అడ్డం తగులుతున్న దగ్గుబాటి దంపతులపై జగన్ కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీకి ఒకటికి రెండుసార్లు ఫిర్యాదు చేయటం విశేషం. తనకు వ్యతిరేకంగా ఈ స్థాయి ప్రయత్నాలు జరగటాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారనటానికి ఈ ఫిర్యాదు అద్దం పడుతుంది. ఈ నేపథ్యంలో జగన్ పరిస్థితి ఒక అడుగు ముందుకు, ఆరడుగులు వెనక్కు చందంగా తయారైంది. ఏకంగా అధిష్ఠానమే తనకు రెడ్ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఏమి చేయాలో తెలియక కొట్టుమిట్టాడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఒకరిద్దరు మద్దతుదారులు గట్టిగా తనను సమర్థించినా, పార్టీలో మెజారిటీ నేతలు అధిష్ఠానం మాటే తమ మాట అంటుండటం, అందులోనూ నిన్న మొన్నటిదాకా తానే ముఖ్యమంత్రి కావాలని సంతకాలు పెట్టిన వారు సైతం ఇప్పు డు తనకే హితోక్తులు నూరి పోసే ప్రయత్నాలు చేస్తుండటం జగన్‌కు ఏమాత్రం మింగుడు పడటం లేదు
No comments:
Post a Comment