జగన్ ఒత్తిళ్ల రాజకీయాలను అనుమతించేది లేదని, ఇలాంటి శక్తులకు లొంగితే, ఇక ఎవరూ ఏ పార్టీనీ నడపలేరని రాహుల్ అన్నారు. తాను అనుకున్నది సాధించడానికి ఎంతకైనా సిద్ధపడిన జగన్‌ను ఇక ఉపేక్షించదలచుకోలేదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోయినా ఫరవాలేదని అధిష్ఠానం భావిస్తున్నదంటే జగన్ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్టు పరిగణించాలని ఢిల్లీ రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ తీవ్రంగా ప్రతిస్పందించారు. ఈ మేరకు టీవీ న్యూస్ చానెల్ వార్తను ప్రసారం చేసింది. తాను అనుకున్నది సాధించడానికి ఎంతకైనా తెగించడానికి జగన్ సిద్దపడ్డారనేది స్పష్టమని, జగన్ ఆగడాలను సహించేది లేదనేది కూడా అంతే స్పష్టమని రాహుల్ అన్నారు. జగన్ ఒత్తిళ్లకు, బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. వాటికి పార్టీ అధిష్టానం లొంగబోదని ఆయన స్పష్టం చేశారు.
జగన్ ఒత్తిళ్లకు, బ్లాక్ మెయిల్ రాజకీయాలకు లొంగితే ప్రతి రాష్ట్రంలోనూ ఓ జగన్ ముందుకు వస్తాడని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ వెళ్లిపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ లో పార్టీ నష్టపోయినా ఫరవా లేదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం కూలిపోయినా తాము జగన్ ఒత్తిళ్లకు, బ్లాక్ మెయిల్ రాజకీయాలకు లొంగబోమని ఆయన స్పష్టం చేశారు.

No comments:
Post a Comment