కడప ఎంపి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శిబిరానికి చెందిన నేతలు రాష్ట్ర కాంగ్రెస్‌లో ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలను రెచ్చగొట్టే ధోరణి అవలంబిస్తున్నారంటూ పార్టీలో విమర్శలు గుప్పుమంటున్నా యి. మరో వైపు జగన్ శిబిరం నేతల వైఖరి చూస్తుంటే ఈ విమ ర్శ లకు బలం చేకూరుతున్నది. ఓదార్పు యాత్రకు బ్రేకు వేసేం దుకు పార్టీ అధిష్ఠానం ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు ఎవరూ కూడా యాత్రలో పాల్గొనవద్దంటూ నేతల ద్వారా తమ వైఖరి స్పష్టం చేసిన నేపథ్యంలో జగన్ శిబిరం దాన్ని తిప్పి కొట్టేందుకు రంగంలో దిగింది. ఓదార్పు యాత్రలో పాల్గొనకుంటే, యాత్ర ను వ్యతిరేకించినా జనం రాళ్ళతో కొడతారంటూ తాజాగా ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలపై ఒత్తిడి పెంచడానికి సరికొత్త తరహా ప్రచారాన్ని ప్రారంభించింది. తద్వారా ఓదార్పును వ్యతిరేకిస్తున్న వారిని, ఓదార్పు యాత్రలో పాల్గొనే విషయంలో ఊగిసలాడు తున్న వారికి జనం భయం చూపించి యాత్రకు రప్పించే ప్రయ త్నాలను ఆ శిబిరం ముమ్మరం చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అప్పటికి యాత్రకు రాని నేతలపై కార్యకర్తల రూ పంలో తమ వర్గం క్యాడర్‌ను రెచ్చగొట్టి, దాడులు చేయిం చేందుకు వ్యూహ రచన చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.
తాజాగా ఆదివారం ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కొండా సురేఖ తదితరులు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే జగన్ ఓదార్పు యాత్రను వ్యతిరేకిస్తున్న ప్రజా ప్రతినిధులపై పార్టీ ద్వితీయశ్రేణు నేతలు, క్యాడర్‌ను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని పలువురు నేతలు విమర్శించారు. కేంద్ర మంత్రులు దగ్గుబాటి పురంధేశ్వరి, పనబాక లక్ష్మి ద్వారా అధిష్ఠానం ఓదార్పు యాత్ర విషయంలో ఇచ్చిన సంకేతాలు జగన్ వర్గానికి ఎంత మాత్రం మింగుడు పడటం లేదు. హైకమాండ్ పేరుతో పురంధేశ్వరి మాట్లాడటమేమిటి, యాత్ర విషయంలో అధిష్ఠానం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలనుకుంటే పార్టీ అధికార ప్రతినిధులు, ఎఐసీసీ ప్రధాన కార్యదర్శుల ద్వారా విడుదల చేస్తుందని, అలా కాకుండా పురంధేశ్వరి ద్వారా ఓదార్పు యాత్రకు ఆదేశాలివ్వాల్సిన కర్మ పార్టీకి పట్టలేదని ఇప్పటికే జగన్ శిబిరం నిప్పులు చెరిగింది. దగ్గుబాటి దంపతులే ఓదార్పును అడ్డుకునేందుకు ఈ వ్యూహం వేశారని ఆరోపించింది. కాగా సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ చెప్పమన్న విషయాలను మాత్రమే తాను చెప్పడం జరిగిందని, పైగా ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీల ఎదుట హైకమాండ్ ఓదార్పు యాత్రపై తన వైఖరి స్పష్టం చేసిందని పురంధేశ్వరి ఆదివారం వైజాగ్‌లో స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన మరో ఎంపి పనబాక లక్ష్మి కూ డా స్పందిస్తూ ఓదార్పు యాత్ర పార్టీకి లాభమా? నష్టమా అన్నది ప్రజలే నిర్ణయిస్తారని, తాను మాత్రం యాత్ర కు వెళ్ళేది లేదని, ఇప్పటికే తన వైఖరి స్పష్టం చేశాను, ఇక పదే పదే దీనిపై మాట్లాడాల్సిన అవసరం లేదని ఆమె ఆదివారం తేల్చి చెప్పారు.
ఒక వైపు అధిష్ఠానం యాత్రకు వెళ్ళొద్దంటూ ఆదేశించినట్లు వార్తలు రావడం, మరో వైపు ప్రకాశం జిల్లాకు చెందిన ఎంపీలు, మరి కొందరు ఎమ్మెల్యేలు తాము అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, అందుకే యాత్రకు వెళ్ళబోమని స్పష్టం చేయడంతో జగన్ శిబిరం ఆందోళనలో పడింది. ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్రను సక్సెస్ చేయడానికి, అధిష్ఠానం కల్పిస్తున్న అడ్డంకులను అధిగమించేందుకు జగన్ శిబిరం సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ‘ఓదార్పు యాత్రకు వెళ్ళక పోతే జనం రాళ్ళతో కొడతారు’ అనే సరికొత్త నినాదాన్ని జగన్ శిబిరం తెరమీదకు తీసుకొచ్చి బహుళ ప్రచారం సాగిస్తోంది. ‘90 శాతం మంది వైఎస్ అభిమానులు ఉన్నారు, వైఎస్‌ను వ్యతిరేకించినా, ఓదార్పు యాత్రను వ్యతిరేకించినా జనం సహించే పరిస్థితుల్లో లేరు, రాళ్ళతో కొట్టే పరిస్థితి ఉంది’ అని ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ప్రకటించడం, ‘ఓదార్పు యాత్రలో పాల్గొనవద్దని పార్టీ హైకమాండ్ స్పష్టంగా ఎక్కడా చెప్పలేదు.
ఈ యాత్రకు వెళ్ళక పోతే ప్రజలు నిలదీస్తారు. రాళ్ళతో కొడతారు. యాత్రను వ్యతిరేకించే నేతలకు కనిగిరి ఎమ్మెల్యేకు పట్టిన గతే పడుతుంది’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ నెల్లూరులో చేసిన వ్యాఖ్యలు పార్టీ ప్రజా ప్రతినిధుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలను రెచ్చగొట్టడం ద్వారా ఓదార్పుకు దూరంగా ఉండే ప్రజా ప్రతినిధులపై ఉసిగొల్పే వ్యూహంలో ఇది భాగమేనని పార్టీ నేతలు కొందరు భగ్గుమంటున్నారు. ఢిల్లీ వెళ్ళి అహ్మద్ పటేల్‌తో కలిసి వచ్చిన ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలలో సభ్యుడైన కనిగిరి ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి ఓదార్పు యాత్రలో పాల్గొనే విషయంలో తమ కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆ మేరకు రెండు రోజుల క్రితం తన నియోజకవర్గం కనిగిరిలో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి అభిప్రాయం తెలుసుకున్నా రు.
జగన్ శిబిరం నేతలు, కార్యకర్తలుగా చెబుతున్న వారు యాత్రకు వెళ్ళవలసిందే నని పట్టుబట్టి ఒక దశలో ఎమ్మెల్యేపై దాడికి దిగినంత పనిచేశారు. దీంతో ఇదే ఘటన ను జగన్ శిబిరం తెరపైకి తీసుకొచ్చి విస్తృత ప్రచారం సాగిస్తూ ప్రజాప్రతినిధుల్లో భయాందోళనలు కల్పిస్తున్నదనే కొందరు నేతలు విమ ర్శిస్తున్నారు. మరో వైపు ఓంగోలు ఎంపి మేకపాటి రాజ్‌మోహ న్‌రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే, మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి తాము జగన్ యాత్రలో ఎట్టి పరిస్థితుల్లో పాల్గొంటామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా మరో వైపు జగన్ శిబిరం ఓదార్పు యాత్రలో పాల్గొనాలంటూ ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి పెంచడా నికి వివిధ జిల్లాల్లో పలు కార్యక్రమాలు చేపట్టింది. అనం తపురం, ఖమ్మం జిల్లాల్లో జగన్ శిబిరం నేతలు ఓదార్పు యాత్ర కు మద్దతుగా ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. అనంతపు రంలో రఘువీరాను సైతం ఘెరావ్ చేసినంత పనిచేశారు.
విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ మరో అడుగు ముందుకు వేసి జగన్‌కు బాసటగా నిలిచారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలను జిల్లాకు ఒకటి చొప్పున ఆవిష్కరించాలంటూ హైకమాండ్ ఆంక్షలు విధించడాన్ని తప్పుపట్టారు. కేంద్ర మంత్రి పురంధేశ్వరి ద్వారా అహ్మద్ పటేల్ ఇదే చెప్పించారు. అంతే కాకుండా జిల్లాల్లో వైఎస్ విగ్రహాం ఆవిష్కరించే చోటనే బాధితులను పిలిపించి ఆర్ధిక సహాయం చేయాలని ఆయన సూచించారు. అయితే హైకమాండ్ సూచనలను లగడపాటి వ్యతిరేకించడమే కాకుండా పరోక్షంగా జగన్ కు బాసటగా నిలిచిచారని పార్టీ వర్గాల్లో విమర్శలు భగ్గుమన్నాయి.
No comments:
Post a Comment