కడప నియోజకవర్గం ఎంపీ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న ఓదార్పు యాత్రలో పాల్గొనవద్దని అధిష్టానం మాటగా ముఖ్యమంత్రి రోశయ్య గురువారంనాడు రాష్ట్ర గనులశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి సూచించారు. హైకమాండ్‌ను ధిక్కరిస్తే పరిణామాలు భిన్నంగా ఉంటాయని కూడా ముఖ్యమంత్రి తెలిపారు. అయితే అందుకు సమాధానంగా తాను జగన్‌తోనే ఉంటానని ఎటువంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉన్నానని బాలినేని ధీటుగా సమాధానం చెప్పారు.
జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొంటానని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గురువారం స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రోశయ్యకు తెలియజేశారు. తాను ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మాకుటుంబానికి, వైఎస్ కుటుంబానికి ఉన్న అనుబంధం రీత్యా ఓదార్పు యాత్రలో పొల్గొనదలచుకున్నానని స్పష్టం చేశారు.
అంతకు ముందు ముఖ్యమంత్రి రోశయ్య అధిష్టానం తరఫున రాష్ట్ర గనులశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేశారు. ప్రకాశంజిల్లాలో సెప్టెంబర్ మూడున జరగనున్న జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొనవద్దని సూచించారు. ఇది తనమాటకాదని హైకమాండ్ ఆదేశమని, దీనిని అందరూ పాటించాలని రోశయ్య తెలిపారు. అధిష్టానం ఓదార్పు యాత్రకు వ్యతిరేకంగా ఉందని, మీరు కూడా హైకమాండ్ మాట వింటే బాగుంటుందని అన్నారు. ఈ ఆదేశాలను ధిక్కరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా పేర్కొన్నారు.

No comments:
Post a Comment