గాంధీ కుటుంబానికి వీర విధేయత
కుటుంబం తరపున కృతజ్ఞతలు
శ్రీకాకుళం ఓదార్పునకు ముందే లేఖ
ప్రకాశం యాత్రకు ముందు వెల్లడి
కుటుంబం తరపున కృతజ్ఞతలు
శ్రీకాకుళం ఓదార్పునకు ముందే లేఖ
ప్రకాశం యాత్రకు ముందు వెల్లడి
కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహనరెడ్డికి సొంత కుటుంబంలోనే వ్యతిరేకత ఎదురైంది. ఆయన బాబాయ్, వైఎస్ రాజశేఖరరెడ్డి తమ్ముడు వైఎస్ వివేకానందరెడ్డి సోనియాకు విధేయత ప్రకటిస్తూ... ఆమెకు ఓ లేఖ రాశారు. 'గాంధీ కుటుంబానికి విధేయత' అన్న శీర్షికతో రాసిన లేఖలో సోనియా నాయకత్వాన్ని, పార్టీ మనోభావాలను దెబ్బతీసే చర్యలేవీ తాము తీసుకోబోమని ఆయన స్పష్టం చేశారు. గాంధీ కుటుంబం నాయకత్వంలో పార్టీ ఇచ్చిన అవకాశాలతోనే తాను పలు పదవులను అనుభవించానని విధేయత ప్రకటించారు.
తన తరఫునే కాక, మొత్తం కుటుంబం తరఫున సోనియా తమపట్ల ప్రదర్శించిన ప్రేమాభిమానాలకు, మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ వివేకానంద రెడ్డి లేఖ ప్రారంభించారు. సోనియా ఆదేశాలను ధిక్కరించి జగన్ శ్రీకాకుళం జిల్లాలో ఓదార్పుయాత్ర ప్రారంభించిన కొద్ది రోజులకే జూలై 17న వివేకా ఈ లేఖ రాయడం గమనార్హం. పార్టీలో మూడు దశాబ్దాలపైగా ఉంటూ, పలు పదవులు నిర్వహించిన వివేకా తనపై కాంగ్రెస్ అధిష్ఠానానికి అనుమానాలు రాకుండా ఉండేందుకే ఈ లేఖ రాసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
అమెరికాలో ఉన్న ఆయన అల్లుడితో పార్టీపెద్దలు మాట్లాడారని, అల్లుడి ప్రోద్బలంతోనే వివేకా లేఖరాశారని ఈ వర్గాలు తెలిపాయి. తనను ధిక్కరించిన నాటినుంచీ జగన్‌ను పార్టీలోనూ, కుటుంబంలోనూ ఏకాకి చేసేందుకు సోనియా తరఫున కొందరు నేతలు ప్రయత్నించారని స్పష్టమవుతున్నది. వివేకా మాత్రమే కాక వైఎస్ మరో ఇద్దరు సోదరులు కూడా యాత్ర పట్ల అంత సుముఖంగా లేరని, వైఎస్ అల్లుడు అనిల్‌తో కూడా కాంగ్రెస్ నేతలు కొందరు సంప్రదిస్తున్నారని పార్టీవర్గాలు అంటున్నాయి.
జగన్ మలివిడత ఓదార్పుయాత్ర ప్రారంభించేందుకు కొద్దిరోజుల ముందు, కాంగ్రెస్ ఎంపీలనే కాక, ప్రకాశం జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలను ఢిల్లీ పిలిపించి యాత్ర వద్దని చెప్పినరోజే ఈ లేఖ బయటకు వచ్చింది! వివేకానందరెడ్డికి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం లభించవచ్చునని ఏఐసీసీ వర్గాలు అంటున్నాయి. అసలు లేఖ రాయాలన్న నిర్ణయం ఒకటి రెండు రోజుల్లోనో.. అకస్మాత్తుగానో తీసుకున్నది కాదని కొందరు అంటున్నారు.
అధిష్ఠానం మాటను శిరసావహించాలని పలుమార్లు జగన్‌కు చెప్పినా ఫలింత లేకనే.. విసిగి వేసారి తన దారి తాను చూసుకోవాలనే ఉద్దేశంతో వివేకా ఈ లేఖ రాశారని, అందువల్లే లేఖలో 'తాము' అన్నారే తప్ప.. ఎక్కడా జగన్ పేరు ప్రస్తావించలేదని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మంగళవారం సచివాలయంలో ఒకరిద్దరు రాష్ట్ర మంత్రులతో వివేకా భేటీ అయ్యారు. అప్పుడే జగన్ ఓదార్పు.. తదితర అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఒక మంత్రితో వివేకా మాట్లాడుతూ, వైఎస్ ఎప్పుడూ అధిష్ఠానం మాట జవదాటలేదని గుర్తుచేసి, ప్రస్తుత పరిణామాలు పార్టీని నష్టపరిచేలా ఉన్నాయని చెప్పారని తెలుస్తోంది. తన సూచనను జగన్ పాటిస్తే, తర్వాత ఆయనను అధిష్ఠానం ఆదరించేదేమోనన్న అభిప్రాయం కూడా వ్యక్తమైనట్లు సమాచారం. గత పదకొండున్నర నెలలుగా రాష్ట్ర కాంగ్రెస్ పరిణామాలను పరిశీలిస్తే.. జగన్ ఎక్కడా రాజీ పడలేదని, ఓదార్పులోనూ ధిక్కారస్వరమే వినిపిస్తున్నారని, అందుకే వైఎస్ కుటుంబం తరఫున వివేకా మాట్లాడే ప్రసక్తి లేదని అంటున్నారు. వ్యక్తిగత అభిప్రాయంతోనే వివేకా ఈ లేఖ రాసి ఉంటారని చెబుతున్నారు.

వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి రోజురోజుకూ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి దూరం అవుతున్నట్టు స్పష్టం అవుతున్నది. తాజాగా జగన్ బాబాయ్ వై.ఎస్. వివేకానందరెడ్డికి, జగన్‌కూ మధ్య కూడా దూరం బాగా పెరిగినట్టు కనిపిస్తున్నది. జీవితాంతం పార్టీకి, పార్టీ అధినేత్రి సోనియాకు విధేయునిగా ఉంటానని స్పష్టం చేస్తూ వివేకానందరెడ్డి పార్టీ అధినేత్రి సోనియా గాంధికి లేఖ రాశారు. జగన్ సంగతి ఎలా ఉన్నా, తాను మాత్రం మీకే విధేయుడినని చెప్పడం ద్వారా వై.ఎస్. కుటుంబంలో కూడా జగన్ వ్యూహానికి సంపూర్ణ మద్దతు లేదనే విషయం స్పష్టమవుతున్నది.
మా సోదరుడు వై.ఎస్. రాజశేఖర రెడ్డిని మీరు ముఖ్యమంత్రిని చేశారు, మా కుటుంబానికి మీరు ఎంతో మేలు చేశారు, ఆ మేలును మేం జన్మ జన్మలకూ మరిచిపోమని ఆ లేఖలో వివేకానంద స్పష్టం చేశారు. రాజకీయ ప్రత్యర్థులు తమను రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బ తీసినప్పుడు సోనియా బాసటగా నిల్చిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. పి.సి.సి. అధ్యక్షుడు కాకున్నా వై.ఎస్.ను ముఖ్యమంత్రిని చేసిన విషయాన్ని కూడా వివేకా ఈ సందర్భంగా ప్రత్యేకించి ప్రస్తావించారు.
కాంగ్రెస్ పార్టీకి, అధినేత్రి సోనియాకు తాను ఎల్లవేళలా విధేయుడినై ఉంటానని, మీరు మా సోదరుని పట్ల, మా కుటుంబం పట్ల చూపించిన ప్రేమాభిమానాలు మర్చిపోలేనివని ఆయన పేర్కొన్నారు. జీవించినంతకాలం మా సోదరుడు వై.ఎస్. మీకు, మీ కుటుంబానికి విధేయుడై ఉన్నారని ఆయన గుర్తు చేశారు. అలాగే తాను కూడా విధేయుడిగానే ఉంటానని ఆయన చెప్పారు.
ఇది ఇలా ఉండగా, జగన్ తన ఓదార్పు యాత్ర విషయంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదని ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలతో పునరుద్ఘాటించారు. ఏది ఏమైనా మాట మార్చేది లేదు, మడమ తిప్పేది లేదన్నదే జగన్ వ్యూహంగా తెలుస్తున్నది. ఎలా జరగాలో అలాగే జరుగుతుంది అని జగన్ అన్నట్టు తెలుస్తున్నది. జగన్ ఉద్దేశంలో జనం తన వెంటే ఉన్నారు, అటుంవంటప్పుడు పార్టీ పేర జనాన్ని దూరం చేసుకోవడం ఎందుకన్నది ఆయన ఉద్దేశంగా కనిపిస్తున్నది.
ఓదార్పు యాత్ర విషయమై ఢిల్లీలో రాజకీయ చర్చలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి నివాసంలో జరిగిన ఒక విందుకు కేంద్రమంత్రి పురందేశ్వరి భర్త వెంకటేశ్వరరావుతో కలిసి హాజరయ్యారు. పార్టీ అధిష్ఠానం సూచనలమేరకు జగన్ ఓదార్పు యాత్రకు హాజరు కారాదని ప్రకాశం జిల్లా నాయకులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో పార్టీ మాట వినండి, మీ చర్యలవల్ల మీకే కాదు, మాకు కూడా నష్టమే, పైగా మీ చర్యలవల్ల పార్టీకి నష్టం అని ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు జగన్‌కు స్పష్టం చేశారు.
నా చర్యలవల్ల పార్టీకి లాభమా, నష్టమా అన్నది పట్టించుకోనని ప్రకాశం జిల్లా శాసనసభ్యులతో జగన్ అన్నట్టు తెలుస్తున్నది. అధిష్ఠానాన్ని ధిక్కరించడం మంచిది కాదని తనకు చెప్పిన ప్రకాశం ఎమ్మెల్యేలతో కూడా జగన్ ఏది మంచో, ఏది చెడో మీరు నాకు చెప్పనక్కరలేదని అన్నట్టు తెలిస్తున్నది. తన సర్వేలు తనకు ఉన్నాయంటూ, మీరు వచ్చినా రాకున్నా యాత్ర మాత్రం ఆగేది లేదని జగన్ ఖండితంగా చెప్పేశారు.
తన ఉనికి తనకు చాలా ముఖ్యమని జగన్ అంటున్నారు. తండ్రి మరణానంతర పరిణామాల నేపథ్యంలో చేసిన ప్రకటన ప్రకారం ఓదార్పు యాత్ర చేపట్టానని, ఇప్పటికే ప్రయాణం ప్రారంభించినందువల్ల ఇక ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు. అధిష్ఠానం ఈ ఓదార్పు యాత్రపై మొదటినుంచీ ప్రతికూలంగానే ఉందని, కాని ఇచ్చిన మాట ప్రకారం యాత్ర జరగవలసిందేనని జగన్ తనను కలిసిన ప్రకాశం శాసనసభ్యులతో చెప్పినట్టు తెలుస్తున్నది.
వైఎస్ కుటుంబంలో చీలిక !
బాబాయ్.. అబ్బాయిలది చెరో దారి. అబ్బాయిది హైకమాండునే ‘కమాండ్’ చేయాలన్న మనస్తత్వం. బాబాయిది మాత్రం పార్టీకి విధేయుడిగా ఉండాలన్న వినమ్రత. ఈ రెండు ధృవాలు ఏడాది నుంచి కలసి ఉంటున్నా అది ఇప్పుడే విడిపోయినట్లు కనిపిం చాయి. ఫలితం కుటుంబంలో చీలిక వాసనలు. పార్టీలో సత్తా చూపేందుకు వేరు కుంపటి పెట్టే దారిలో ఉన్న జగన్‌కు భిన్నంగా ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి అడుగులు. ఆయన అంతా ‘అమ్మ దయ’ అంటుంటే.. అబ్బాయి జగన్ మాత్రం తాను సర్వ స్వతంత్రుడినన్న ‘యువరాజ’ భావన ప్రదర్శి స్తున్నారు. అధిష్ఠానం తన ఓదార్పు యాత్రకు బ్రేకులు వేస్తుందని అనుభవపూర్వకంగా తెలు స్తున్నా, వాటిని లెక్కచేయకుండా జిల్లాల పర్యటన లకు సిద్ధమవుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబంలో చీలిక రానుందా? తనను అధిష్ఠానం అణచివేస్తోందన్న ఆగ్రహంతో ‘ఈ సహనం ఇంకా ఎన్నాళ్లుం టుందో’నంటూ ఓవైపు జగన్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆయన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి మాత్రం ‘వైఎస్ కుటుంబం మీకు విధేయతతో ఉంటుందని, ఈ పదవులన్నీ పార్టీ ఇచ్చిన భిక్షే న’ంటూ పార్టీ అధినేత్రికి లేఖ రాశారు. తానెప్పుడూ కాంగ్రెస్‌కు విధేయుడిగానే ఉంటానని విస్పష్టమైన హామీ ఇచ్చారు. తన లేఖలో ఎక్కడా జగన్ పేరుగానీ, విజయలక్ష్మి పేరు గానీ ప్రస్తావించకపోవడం చర్చ నీయాంశమయింది. ఈ భిన్న మార్గాలు పరిశీలిస్తే.. వైఎస్ కుటుంబంలో చీలిక రానున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
తనను, తన అనుచరులను పార్టీ నాయకత్వం అన్యాయంగా అణచివేస్తోందని, తాను చేసిన తప్పేమిటని జగన్ తనను కలసిన నేతలతో స్పష్టం చేస్తున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా ఓదార్పు యాత్రను ఆపేదిలేదంటున్నారు. తనపై కొందరు సీనియర్లు చేస్తున్న ఫిర్యాదులను నాయకత్వంపరిగణనలోకి తీసుకుని తన ఓదార్పు యాత్రకు అడ్డంకులు సృష్టించడాన్ని జగన్ సహించలేక పోతున్నారు. అధిష్ఠానం, రోశయ్య తన యాత్రకు వెళ్లవద్దని ఎమ్మెల్యేలను ఆదేశించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన తన యాత్రలో ఎక్కడా ఇప్పటివరకూ సోనియాగాంధీ పేరు గానీ, కాంగ్రెస్ పార్టీ గురించి గానీ, ముఖ్యమంత్రి రోశయ్య పాలన గురించి గానీ ఎక్కడా ప్రస్తావిం చలేదు.
పైగా, ఇది పూర్తిగా వ్యక్తిగత యాత్ర అని జగన్ అనేకసార్లు స్పష్టం చేసినప్పటికీ, తన అనుచరులకు అన్యాయం జరుగుతోందని, వైఎస్ చనిపోతే కొందరు పండుగ చేసుకున్నా రంటూ రాజకీయ వ్యాఖ్యలు చేశారు. జగన్ తన యాత్రల్లో పార్టీ నేతలను కలుస్తున్నా, పార్టీ గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించకపోవడం, తనను పార్టీ నుంచి బయటకు పంపే వరకూ తన వైఖరిని ఇలాగే కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వ్యవహారశైలి చెప్పకనే చెబుతోంది. మొత్తానికి, జగన్‌ను కాంగ్రెస్ నుంచి బయటకు పంపేందుకు అధిష్ఠానం, తనను పార్టీ నాయకత్వమే బయటకు పంపేలా జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నా రన్నది సుస్పష్టం. ఈ నేపథ్యంలో.. వైఎస్ రాజశేఖరెడ్డి సోదరుడు, ఎమ్మెల్సీ వివేకానందరెడ్డి గత జూలై 17న పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి రాసిన లేఖ బుధవారం లీక్ కావడం, అందులో తాను, వైఎస్ కుటుంబం పార్టీకి విధేయులుగానే ఉంటామని హామీ ఇవ్వడం, అందులో వైఎస్ సతీమణి విజయలక్ష్మి పేరు గానీ, కొడుకు జగన్ ప్రస్తావన గానీ ఎక్కడా లేకపోవడంతో వైఎస్ కుటుంబంలో చీలిక రావ డం ఖాయమన్న వ్యాఖ్యలు, విశ్లేషణలు వినిపిస్తున్నా యి. వైఎస్ కుటుంబంలో సాత్వికుడు, మృదుభాషి, వివాదరహితుడిగా పేరున్న వివేకానందరెడ్డిని పార్టీలకు అతీతంగా అంతా గౌరవిస్తారన్నది నిర్వివాదం. అలాంటి వివేకానందరెడ్డి రాసిన లేఖలో ఆయన పేర్కొన్న అంశాలు పరిశీలిస్తే.. జగన్ ఘర్షణ వైఖరి ఆయనకు నచ్చడం లేదని, జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను మాత్రం పార్టీ వెంటే ఉంటానని హామీ ఇచ్చినట్లు స్పష్టమవుతూనే ఉంది. ఆయన రాసిన లేఖ బహిర్గతమయి, పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
అసలు వివేకా పార్టీ అధినేత్రి సోనియాకు రాసిన లేఖలో ఏమి వివరించారంటే.. తాను పార్టీకి విధేయుడిగానే ఉంటానని, వైఎస్ రాజశేఖరరెడ్డికి రెండు సార్లు పిసిసి అధ్యక్షపదవి దక్కడానికి ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ భిక్షే కారణమన్నారు. 2004- 2009లో వైఎస్ పిసిసి అధ్యక్షుడు కాకపోయినప్పటికీ ముఖ్యమంత్రి కావడానికి సోనియాగాంధీ భిక్షే కారణమని స్పష్టం చేశారు. మీ కుటుంబం మాపై చూపిన అపార ప్రేమానురా గాలను ఈ జన్మలో మర్చిపోలేమని కొనియాడారు. అన్న వైఎస్ జీవితాంతం సోనియా కు రుణపడి ఉన్నారని, అందుకే విధేయుడిగా ఉన్నారన్నారు. వైఎస్‌పై ప్రత్యర్థులు ఆర్థికంగా -రాజకీయంగా దెబ్బతీసిన సమయంలో పార్టీ అండగా నిలిచిన వైనాన్ని ఎప్పటికీ మర్చిపోలే మన్నారు. పార్టీకి విధేయుడిగా ఉండాలని, పార్టీనే సుప్రీం అయినం దున హైకమాండ్ మాట వినాలని తాను జగన్‌కు నచ్చ చెప్పే ప్రయత్నం చేశానన్నారు.
అయితే జగన్ ఉడుకునెత్తురు గల యువకుడయి నందునే కొంచెం దూకుడుగా వ్యవహరిస్తున్నారని వివరించారు. పార్టీకి, మీ కుటుంబానికి తాను ఎప్పటికీ విధేయుడిగానే ఉంటానని హామీ ఇచ్చారు. నెహ్రు-ఇందిర-రాజీవ్-సోనియా నాయకత్వాన్ని తమ కుటుంబం బలపరించిందని, వారికి విశ్వాసంగా ఉందని వివరించారు. కాగా.. వివేకా లేఖ పరిశీలిస్తే.. జగన్‌తో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా తాను, తమ కుటుంబం పార్టీకి మద్దతునిస్తుందని స్పష్టంగా చెప్పడమేన ని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఒకవైపు జగన్ నాయకత్వంపై కత్తులు దూస్తుంటే.. మరోవైపు అదే కుటుంబం నుంచి ఎంపి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పనిచేసిన వివేకానందరెడ్డి మాత్రం జగన్‌తో నిమిత్తం లేకుండా తాను, తన కుటుంబం సోనియాకు విధేయులమని ప్రకటించడం బట్టి వైఎస్ కుటుంబంలో చీలిక స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు. అసలు తన లేఖలో జగన్, విజయలక్ష్మి పేరు ఎక్కడా ప్రస్తావించకపోవడం బట్టి.. వారి వైఖరితో పని లేకుండా తాను మాత్రం అధిష్ఠానానికి విశ్వసనీయుడిగా ఉంటానని చెప్పకనే చెప్పినట్టయిందని విశ్లేషిస్తున్నారు.
ఈ పరిణా మాల్లో పులివెందులలోని వైఎస్ సోదరులు ఎటు వైపు నిలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అయి తే.. వివేకా ఈ విషయంలో వ్యూహాత్మకంగానే వ్యవ హరించారని మరికొందరు పార్టీ నేతలు విశ్లేషిస్తు న్నారు. జగన్‌ను పార్టీకి దగ్గర చేయడానికి, తమ కుటుంబానికి తిరుగుబాటు చేసే ఉద్దేశం చేసేది లేదని సంకేతాలివ్వడమే వివేకా లక్ష్యమంటున్నారు. అయితే అదే సమయంలో ఒకవేళ జగన్ పార్టీకి దూరమయినప్పటికీ, వైఎస్ కుటుంబానికి చెందిన వ్యక్తిగా తాను మాత్రం కాంగ్రెస్‌లోనే ఉండిపోతానని, తనకు జగన్ కన్నా పార్టీనే ముఖ్యమన్న సంకేతాలు కూడా ఇచ్చినట్టయిందని విశ్లేషిస్తున్నారు. కాగా.. తాను సోనియాకు లేఖ రాసిన మాట వాస్తవమేనని వివేకానందరెడ్డి ధృవీకరించారు. జగన్‌కు మేడం ఆశీస్సులు పెంచడమే తన ప్రయత్నమని, మేడం సమయం ఇస్తే అన్నీ వివరిస్తానన్నారు.
అది వ్యక్తిగత యాత్రే!
'ఓదార్పు యాత్రను మొదటి నుంచి వివాదాస్పదం చేశా రు. పార్టీ అంటే రాజకీయ యాత్ర అంటారు. సొంతంగా పో తున్నాడంటారు. ఆయా ఊళ్లకు వెళ్లినప్పుడు కాంగ్రెస్ నాయకులు జగన్‌ను పలుకరించకుండా ఎలా ఉంటారు. అందరూ దీన్ని సానుకూల దృక్పథంతో ఆలోచించి, వివాదాస్పదం చే యకుండా, సుహృద్భావ వాతావరణంలో ముందుకు తీసుకుపోవాలి. కళ్యాణ ఘడియల్లో పోయేకంటే విషాదాన్ని తగ్గించే కార్యక్రమం చేసి, దుఃఖాన్ని పంచుకోవడమే నిజమైన ఓదార్పు.
మానవ ధర్మంగా పోతున్నాం కాబట్టి పార్టీ కార్యక్రమంగా తీ సుకుంటే పార్టీ పటిష్టతకు దోహదపడుతుంది' అని యాత్రలో సోనియా, రాహుల్ బొమ్మలు పెట్టకపోవడంపై వివేకానంద వివరణ ఇచ్చారు. సోనియా అపాయింట్‌మెంట్ ఇప్పిస్తే తన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరతానన్నా రు.
వైఎస్ కుటుంబ సభ్యులకు సోనియా లోగడే అపాయింట్‌మెంట్ ఇచ్చారు కదా అన్న ప్రశ్నకు, 'అంతా దేవుడి చిత్తం. వై ఎస్, కాంగ్రెస్.. మేమంతా ఒక కుటుంబంగా కలిసిమెలిసి ఉ న్నాం. రాజీవ్‌గాంధీ.. వైఎస్‌ను రాజా అని పిలిచేవారు. సమ యం బాగాలేకపోతే ఇలాంటివి జరుగుతుంటా యి. కాలం క లిసొచ్చి, జగన్‌కు మంచి చేకూర్చేలా భగవంతు డు ఆశీర్వదించాలని, సోనియా దీవెనలతో ముందుకు పోవాల ని ఆశిస్తున్నా' అని వివేకా వ్యాఖ్యానించారు.
ఈ చర్చలో ప్ర ముఖ విశ్లేషకుడు, సీనియర్ జర్నలిస్టు తెలకపల్లి రవి, పీసీసీ అ« దికార ప్రతినిధి తులసిరెడ్డి, ఫోన్ లైన్‌లో ఎంపీ మేకపాటి రాజమోహన్, ఎమ్మెల్యేలు విష్ణు, ఉగ్రనరసింహారెడ్డి పాల్గొన్నారు.
ఓదార్పుపై కొందరి దుష్ప్రచారం!
పులివెందుల: కాంగ్రెస్‌కు తమ కుటుంబ సభ్యులందరూ ఎ ప్పటికీ విధేయులేనని వివేకానందరెడ్డి స్పష్టం చేశారు. జగన్ ఓదార్పుయాత్ర వల్ల కాంగ్రెస్‌కు నష్టమని కొందరు దుష్ప్రచా రం చేస్తున్నారన్నారు. జగన్‌కు, అధిష్ఠానానికి మధ్య కొందరు అగాథాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు.

No comments:
Post a Comment