
కాగా జగన్ వర్గీయులైన మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద రెడ్డి, వైఎస్ తోడల్లుడు వైవీ సుబ్బారెడ్డి మాత్రం వచ్చేనెల 3వ తేదీ నుంచి జరగనున్న ఓదార్పు యాత్రకు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీ చేరిన ప్రకాశం జిల్లా శాసనసభ్యుల్లో దగ్గుబాటి మినహా మిగిలిన వారు మంగళవారం రాత్రే జగన్‌తో భేటీ అయినట్లు తెలుస్తోంది. అధిష్ఠానం సుముఖంగా లేనందున యాత్రను విరమించుకోవాలని వారు సూచించినట్లు వార్తలు వచ్చాయి. అది కుదరదని జగన్ తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో వీరు దగ్గుబాటితో కలిసి బుధవారం అహ్మద్ పటేల్‌తో భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యేలను అధిష్ఠానం పూర్తిస్థాయిలో నియంత్రిస్తున్న నేపథ్యంలో శ్రీకాకుళంలో లాగే ద్వితీయ శ్రేణి నేతలతో ఓదార్పు నిర్వహించాలని జగన్ వర్గం భావిస్తోంది.
జగన్‌పై తనకున్న వ్యతిరేక భావాన్ని సోనియా ఏమాత్రం దాచుకోవడంలేదు. మంగళవారం సెంట్రల్ హాలులో సోనియా నడుచుకుంటూ వెళుతుండగా జగన్ ఆమెకు నమస్కరించారు. ఆమె దీనిని పెద్దగా పట్టించుకోకుండా, చూసీ చూడనట్లు తిరస్కారభావంతో వెళ్లడం కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులను ఆశ్చర్యపరిచింది.
No comments:
Post a Comment