కాంగ్రెస్ అధిష్ఠానం జగన్ వేలితోనే ఆయన కన్ను పొడిచే దిశగా పావులు కదుపుతోంది. అంబుల పొదిలో దాచుకున్న అస్త్రాలను ఒకొక్కటిగా ప్రయోగించేందుకు సన్నద్ధమవు తోంది. జగన్ దూకుడు యాత్రకు కళ్లె వేసేందుకు అదే వేగంతో సమాయత్తమవుతోంది. ఓదార్పు యాత్ర ఎవరు కాదన్నా ఆపేది లేదని తెగేసి చెప్పిన జగన్ ధిక్కార స్వరానికి విరుగుడుగా అధిష్ఠానం వైఎస్ జపంతోనే తిప్పికొడు తోం ది. వైఎస్ కాంగ్రెస్‌కు చేసిన సేవలు అనంతమని కీర్తిస్తూనే జగన్ అనుసరిస్తున్న పంథాలోనే తిరిగి అస్త్రాలను సంధి స్తోంది. జగన్ యాత్రకు అధిష్ఠానం ఎప్పుడూ అడ్డు చెప్ప లేదని, ఎదురు దాడికి దిగుతోంది. జగన్ ఓదార్పును కొన సాగించాలని కోరడం ముందరకాళ్లకు బంధం వేస్తోంది. అయితే దానిని సొంత యాత్రగా కాకుండా పార్టీ యాత్రగా నిర్వహించుకోవాలని షరతు విధించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అక్కడ బాధితులకు పరిహారం చెల్లించాలని సుతిమెత్తగా చురక లంటించింది. దీంతో జగన్‌కు ఆయన అనునూయులు ఇరుకున పడ్డారు.
తన తండ్రి మృతి కారణంగా వీచిన సానుభూతి పవనాలను రాజకీయంగా వినియోగించే అవకాశం చేజారిపోతోందనే ఆందోళన జగన్ కూటమిలో మొదలైంది. తమ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారునున్నదనే మీమాంస ఎమ్మేల్యేలలో మొదలైనట్లు వెల్లడవుతోంది. అధిష్ఠానం సానుభూతితోనే వ్యవహరి స్తోందని, రాజకీయారాహిత్యంతో జగన్ కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెడుతున్నారనే సంకేతాలను వైఎస్ సానుభూతి పరులకు చేర్చేదిశగా అధిష్ఠానం అడుగులు వేస్తోంది. ఒక వైపు బుజ్జగింపు ధోరణిలోనే కొనసాగుతూ వేటు దిశగా ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకే హైకమాండ్ బుధవారం రాత్రి ప్రకాశం జిల్లా శాసన సభ్యులను పిలిపించి ఓదార్పు యాత్రకు హాజరు కావద్దని కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యు లకు హుకుం జారీ చేస్తూనే యాత్రను కొనసాగించవచ్చనే ఆటవిడుపును కొనసాగిస్తోంది.
ఈ ప్రకటన కారణంగా అధిష్ఠానం కాంగ్రెస్ శ్రేణులను జగన్ ప్రలోభాలనుంచి తప్పించే మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ మేరకు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో అవస రమైన సమయంలో జగన్‌పై వేటు వేసినా స్పందన తీవ్రత ను తగ్గించే ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ జగన్‌పై కక్షగట్టి ఏక పక్షంగా వ్యవహరి స్తోందని ప్రజలకు తప్పుడు సమాచారం చేరకుండా వివాదరహితులైన ఎంపీలు, మాగుంట సుబ్బరామి రెడ్డి, మంత్రులు పురంధేశ్వరి, పనబాక లక్ష్మిలను ఎంపిక చేసి వారి ద్వారా జగన్ వర్గంతో మంతనాలు సాగిస్తున్నది. జగన్ యాత్రను సొంత యాత్రగా కాకుండా ఓదార్పుగా చేయాలని, పార్టీ పరంగా చేయాలని గతంలోనే స్పష్టం చేసినట్లు అధికారికంగా పురంధేశ్వరి ద్వారా మీడియాకు గురువారం ప్రకటించేలా చేసింది. పార్టీ అదేశాల మేరకే పురంధేశ్వరి గురువారం అధినేత్రి సోనియా గాంధీతో భేటీ జరిగిందని పార్టీలో గుసగుసలు వినవస్తున్నాయి.
ధిక్కారం జరగలేదు: జగన్ కూటమిలోని ఎంపీలు
జగన్ ఏరోజూ పార్టీ అధిష్ఠానం ఆదేశాలను బేఖాతరు చేయలేదు. కాకపోతే కొందరు ఆయనకు వ్యతిరేకంగా హైకంమాండ్‌కు తప్పుడు సమాచారం అందించారు. ఆ విషయం అధిష్ఠానం దృష్టికి వెళ్లిందని, జగన్-అధిష్ఠానం మధ్య అగాధాలు తొలిగిపోయాయన్నారు. కేవలం గందరగోళ పరిస్థితిని కల్పించడం కోసమే వదంతులను వ్యాప్తి చేస్తున్నారని కొట్టి పారేశారు.జగన్ వర్గీయులకు ఉద్వాసన ?
రాష్ట్ర మంత్రి వర్గంలో జగన్‌కు వీర విధేయులుగా ఉన్న మంత్రు లపై వేటు పడనున్నది. తమ ఆదేశాలను ధిక్క రించి కడప ఎంపి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్రలో అమిత ఉత్సాహంతో పాల్గొనే, పాల్గొం టున్న మంత్రులను కేబినెట్ నుంచి తొలగించాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్లు ఢిల్లీలోని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లపై వేటు వేసేందుకు పార్టీ నాయకత్వం ఇప్పటికే రంగం సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా వైఎస్‌కు బంధువు, పార్టీ హైకమాండ్‌ను, ముఖ్యమంత్రి రోశ్యయ్యను సైతం ఖాతరు చేయని బాలినేని మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని దాదాపుగా హైకమాండ్ నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇలా చేయడం ద్వారా మరో 19 జిల్లాల్లో జగన్ చేపట్టనున్న ఓదార్పు యాత్రలో పాల్గొంటే పరిణామాలు ఎలా ఉంటాయనే సంకేతాన్ని మిగతా మంత్రులకు అందజేయడమే అధిష్ఠానం ఉద్దేశ్యంగా స్పష్టమవుతోంది.
పార్టీ నాయకత్వాన్ని వ్యతిరేకించే రీతిలో జగన్ వ్యవహరిస్తున్న తీరు అధిష్ఠానానికి1 అగ్రహం కలిగిస్తోంది. తాము వద్దని వారించినా జగన్ మొండి పట్టుతో యాత్రకు వెళ్ళడం, అతని వెంట పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా నడుస్తుండడంతో విధిలేని పరిస్థితుల్లోహైకమాండ్ కఠినంగా వ్యవహరించే పరిస్థితి వచ్చిందని పార్టీలో వినిపిస్తోంది.
మరో వైపు అధిష్టానం వైఖరి తెలిసి కూడా పలువురు మంత్రులు జగన్ యాత్రలో పాల్గొనడం, ఇటూ పార్టీ నాయకత్వాన్ని, అటూ సిఎం రోశయ్యను ధిక్కరించే విధంగా వ్యవహరిస్తుండడంతో ఇలాంటి వారిని మంత్రివర్గం నుంచి తొలగించక పోతే రానున్న రోజుల్లో పాలనా పరంగా, పార్టీ వ్యవహరాల పరంగా ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందని హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే జగన్ యాత్రలో పాల్గొనే మంత్రులను మంత్రి వర్గం నుంచి తొలగించడమే మార్గమనే నిర్ణయానికి పార్టీ నాయకత్వం వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొన్నారు. సిఎం, పార్టీ నేతలు కొందరు ఓదార్పు యాత్రకు వెళ్ళొద్దని ఆయన్ని పరోక్షంగా నివారించినా బేఖాతరు చేస్తూ ఆయన జగన్ వెంట జిల్లా వ్యాప్తంగా జరిగిన ఓదార్పు యాత్రలో పాల్గొన్నారు.
జగన్ వెంటే తాను అని స్పష్టం చేశారు. మరో వైపు వచ్చే నెల3 నుంచి ప్రకాశం జిల్లాలో ప్రారంభం కానున్న జగన్ యాత్రలో తాను కచ్చితంగా పాల్గొని తీరుతానని ఓంగోలుకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తాజాగా గురువారం స్పష్టం చేశారు. ఓదార్పు యాత్రకు వెళ్ళవద్దని సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ చెప్పమన్నారంటూ ముఖ్యమంత్రి రోశయ్య స్వయంగా బాలినేనికి ఫోన్ చేసి చెప్పారు. అయితే తాను జగన్‌తోనే ఉంటానని, వైఎస్ కుటుంబంతో తనకు బంధుత్వం ఉందని, మంత్రి పదవులు తమకు శాశ్వతం కాదని, ఎవరూ వచ్చినా, రాక పోయినా తాను మాత్రం ఓదార్పు యాత్రలో పాల్గొంటానని బాలినేని తేల్చి చెప్పారు. బాలినేని వ్యవహారంపై ముఖ్యమంత్రి రోశయ్య, పార్టీ అధిష్ఠానం అగ్రహంతో ఉన్నట్లు సమాచారం. మా మాటను కాదని, ధిక్కరించే ధోరణిని అవలంభిస్తున్న బాలినేని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం తప్ప మరో మార్గం లేదని హైకమాండ్ నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.
ఇప్పటికి రెండు విడుతల్లో జగన్ ఓదార్పు యాత్ర పశ్చిమగోదావరి, ఖమ్మం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లో పూర్తయింది. 3వ విడతలో ఆయన ప్రకాశం, ఒంగోలు జిల్లాల్లో పర్యటించబోతున్నారు. ఆ తరువాత విడతల వారిగా మిగతా జిల్లాల్లో తన ఓదార్పు యాత్ర ఉంటుందని జగన్ ఇది వరకే ప్రకటించారు. ఇంకా 19జిల్లాల్లో జగన్ ఓదార్పు యాత్ర పూర్తి కావాల్సి ఉండటంతో జిల్లా మంత్రులు ఎవరూ కూడా ఈ యాత్రలో పాల్గొనకుండా ఉండేందుకు హైకమాండ్ అడ్డుకట్ట వేయబోతున్నది. జగన్‌కు వీర విధేయతను ప్రదర్శిస్తున్న బాలినేని, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లను మంత్రి వర్గం నుంచి తొలగించడం ఖాయమైపోయిందని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. మిగతా మం త్రులు కూడా వైఖరి మార్చుకోక పోతే వారికి కూడా ఇలాంటి గతే పడుతుందని అధిష్ఠానం హెచ్చరించేందుకే బాలినేని, పిల్లిలపై చర్యలు తీసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
No comments:
Post a Comment