జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Wednesday, August 18, 2010

ఆఖరి అంకం * సర్కారు పోయినా సరే బ్లాక్ మెయిలింగ్‌కు లొంగం * ఒక రాష్ట్రంలో అధికారం కోల్పోయినా సరే! ప్రభుత్వం పడిపోయినా సరే! వైఎస్ జగన్ 'ఓదార్పు' యాత్రకు అనుమతించేది లేదని కాంగ్రెస్ అధిష్ఠానం తేల్చిచెప్పింది.

ఓదార్పునకు ఎవరూ వెళ్లొద్దు
యాత్రవద్దని మేం చెప్పలేదు
వైఎస్ కాంగ్రెస్ సీఎంగా మరణించారు
పార్టీ తరఫునే ఓదార్పు నిర్వహించాలన్నాం
మేం వద్దన్నట్లుగా జగన్ దుష్ప్రచారం
ఆయన వ్యవహారం పిచ్చి వాడిలా ఉంది
ఇలాంటి ఓదార్పు ఎక్కడైనా ఉంటుందా?
యువనేతపై సోనియా చిరాకుగా ఉన్నారు
మీరు దూరంగా ఉండండి.. మీకు మేం అండగా ఉంటాం
ప్రకాశం ఎమ్మెల్యేలతో అహ్మద్ పటేల్
మంత్రి బాలినేనిని బర్తరఫ్ చేస్తామని హెచ్చరిక
తన మాటగా చెప్పాలని రోశయ్యకు ఫోన్
ప్రణబ్ చెప్పినా వినని జగన్
ఒక రాష్ట్రంలో అధికారం కోల్పోయినా సరే! ప్రభుత్వం పడిపోయినా సరే! వైఎస్ జగన్ 'ఓదార్పు' యాత్రకు అనుమతించేది లేదని కాంగ్రెస్ అధిష్ఠానం తేల్చిచెప్పింది. 'మీరు కూడా యాత్రకు దూరంగా ఉండాల్సిందే' అని ఎమ్మెల్యేలకు స్పష్టం చేసింది. తద్వారా కడప ఎంపీ జగన్ పట్ల కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎంత అసహనం, ఆగ్రహంతో ఉన్నారో కూడా వెల్లడైంది.

ఢిల్లీలో బుధవారం ప్రకాశం జిల్లాకు చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ సమావేశమయ్యారు. వారికి కర్తవ్య బోధ చేశారు. ధైర్యం చెప్పా రు. 'ఓదార్పు యాత్రలో పాల్గొన వద్దు...' అని సూటిగా, స్పష్టంగా తెలిపారు. అంతేకాదు... ఈ యాత్ర పట్ల అధిష్ఠానం ఇలాంటి కఠిన వైఖరి తీసుకోవడానికి కారణమేమిటో కూడా సవివరంగా తెలిపారు.

ఇదంతా జగన్ సొంత నిర్వాక ఫలితమే అని పరోక్షంగా చెప్పారు. "వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడు. పార్టీ ముఖ్యమంత్రిగా మరణించారు. ఆయన మరణ వార్త విని చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్చే కార్యక్రమాన్ని పార్టీ పరంగా చేపట్టాలని జగన్‌కు సూచించాం. పార్టీ తరఫున సహాయం చేయాలని, పార్టీ డబ్బునే ఇవ్వాలని చెప్పాం. సభలు, సమావేశాలు నిర్వహించుకోవచ్చని... విగ్రహావిష్కరణలు చేసుకోవచ్చని... ఆయా చోట్ల పార్టీ నాయకులందరినీ పిలిచి, వారితో కలిసి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించాం.

కానీ... సోనియా గాంధీ ఓదార్పు పట్ల సుముఖంగా లేరని, యాత్రను అధిష్ఠానం వద్దంటోందని జగన్ దుష్ప్రచారం చేశారు. అధిష్ఠానం వైఖరికి భిన్నమైన ప్రచారాన్ని వాదనలను ప్రజల్లోకి పంపారు'' అని అహ్మద్ పటేల్ ఎమ్మెల్యేలకు వివరించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఇన్నేళ్లలో ఎప్పుడూ అధిష్ఠానం మాట జవ దాటలేదని గుర్తు చేశారు. జగన్ వ్యవహార శైలి మాత్రం పిచ్చి వాడిలా (హి ఈజ్ ఏ మ్యాడ్ బాయ్) ఉందని వ్యాఖ్యానించారు. ఈ తరహా ఓదార్పు దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎక్కడా ఉండదని కూడా అన్నారు.

జగన్ ప్రవర్తన పట్ల మేడమ్ చాలా చాలా అసంతృప్తితో ఉన్నారని, ఇంకా చె ప్పాలంటే పరమ చిరాకుగా ఉన్నారని తెలిపారు. 'ఓదార్పు యాత్రకు మీరు కచ్చితంగా దూరంగా ఉండాల్సిందే' అని అహ్మద్ పటేల్ స్పష్టం చేశారు. అదే సమయంలో... అధిష్ఠానం తరఫున ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చారు. 'మీ ప్రయోజనాలను పరిరక్షిస్తాం. మీకు పార్టీ అండగా ఉం టుంది' అని తెలిపారు. అప్పటికప్పుడు సీఎం రోశయ్యకు ఫోన్ చేశారు. ఎమ్మెల్యేల సమస్యలు పరిష్కరించాలని, వారికి అండగా ఉండాలని కో రారు.

అదే సమయంలో... వైఎస్ సమీప బంధువైన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి ప్రస్తావించారు. 'గనుల మంత్రికి నా మాటగా చె ప్పండి! ఆయన పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాల్సిందే. లేదంటే... ఉ ద్వాసన తప్పదని స్పష్టం చేయండి' అని రోశయ్యకు పటేల్ సూచించా రు. 'మీకు టికెట్ ఇప్పించాం. డబ్బులు ఇచ్చాం. వచ్చే ఎన్నికల్లో మీకు ఎ వరు టికెట్ ఇస్తారనుకుంటున్నారు?' అంటూ జగన్ వర్గం హెచ్చరిక స్వ రంతో చేస్తున్న ప్రచారం గురించి కూడా ఆయన స్పందించారు.

'పార్టీ త ల్లిలాంటిది. ఎవరైనా తామే టికెట్ ఇచ్చామని, డబ్బులు పంచామని అ నుకుంటే అది తప్పు. ఏదైనా పార్టీ సొంతమే, ఇదంతా పార్టీ వ్యవహార మే' అని పటేల్ స్పష్టం చేశారు. ఏది ఏమైనా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా జగన్ ఒత్తిళ్లకు లొంగేది లేదని కూడా తేల్చిచెప్పారు. 'బ్లాక్ మెయి ల్ చేస్తే ఎలా? ఒక రాష్ట్రంలో అధికారం కోల్పోయినా ఫర్వాలేదు. చెడు సంప్రదాయాలకు మాత్రం తలొగ్గే ప్రసక్తే లేదు' అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు.

తమాషా చేస్తున్నారా!
హైదరాబాద్: సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌ను మంగళవారం రాత్రి రాష్ట్రానికి చెందిన నాయకుడొకరు కలిశారు. విశ్వసనీ య వర్గాల సమాచారం ప్రకారం... రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పై అహ్మద్ పటేల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహారాలు జరుగుతుంటే రాష్ట్ర మంత్రులు ఏం చేస్తున్నారు? పార్టీని ఏ దిశగా తీసుకు వెళ్లాలనుకుంటున్నారు?' అని కోపంగా ప్రశ్నించారు.

ఓదార్పు ప్రస్తావన వచ్చినప్పుడు పటేల్ ఆగ్రహంతో ఊగిపోయా రు. 'తమాషా చేస్తున్నారా? రాష్ట్రంలో పార్టీని ఎవరి ఇష్టం వచ్చినట్లు వా రి చేతుల్లోకి తీసుకుంటారా? అధిష్ఠానం అంటే కనీస గౌరవం లేకుండా వ్యవహరిస్తారా? ఇదంతా సొంత జాగీరనుకుంటున్నారా?' అని ప్రశ్నల వర్షం కురిపించారు.

ప్రణబ్ చెప్పినా బేఖాతరు
ఓదార్పును పార్టీ వ్యతిరేక కార్యక్రమంగా భావిస్తున్న అధిష్ఠానం చి వరి ప్రయత్నంగా... యాత్ర వద్దని ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీతో జగన్‌కు చెప్పించినట్లు తెలిసింది. మంగళవారం రాత్రి వీరి మధ్య భేటీ జరిగినట్లు సమాచారం. అయినా జగన్ యాత్రకే సిద్ధపడుతున్నట్టు తెలిసింది.

No comments:

Post a Comment