జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Thursday, August 19, 2010

జగన్‌ ఔట్‌ ! * అష్టదిగ్బంధం - పద్మవ్యూహంలో జగన్ ! * పార్టీ సొత్తుగా వైఎస్‌ను చేసే వ్యూహం పదవి కోసం జగన్ పాకులాటను ప్రజల్లోకి తీసుకువెళ్లే యోచన


అధిష్ఠానం పద్మవ్యూహంలో కడప ఎంపీ వైఎస్ జగన్మోహనరెడ్డి చిక్కుకున్నారు.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీ సొత్తుగానే సంకేతాలు పంపింది. ఇప్పటివరకూ జగన్ ఓదార్పు యాత్రకు అధిష్ఠానం పూర్తిగా వ్యతిరేకిస్తూ వస్తోందన్న భావనలో ఉన్న కిందిస్థాయి కార్యకర్తలు, నాయకులకు గురువారం ఢిల్లీ పరిణామాలు కొత్త ఆలోచనకు తెరతీసేలా చేశాయి. అధిష్ఠానం ఓదార్పు యాత్రను పార్టీ కార్యక్రమంలా నిర్వహించాలని.. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం కూడా చెల్లించాలని .. అయితే.. ర్యాలీగా కాకుండా సంప్రదాయ రీతిలో ప్రతి జిల్లాలోనూ ఒకే వేదికను ఏర్పాటు చేసి .. అక్కడ వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి .. బాధిత కుటుంబాలకు సహాయం చేయాలని చేసిన సూచనను జగన్ తిరష్కరించడం ఏమిటన్న కొత్త ప్రశ్నలు పార్టీలో తలెత్తాయి. పార్టీ కార్యక్రమంగా జిల్లా కేంద్రంలో ఓదార్పును చేపడితే.. వైఎస్ పూర్తిగా కాంగ్రెస్‌పార్టీ సొత్తు అవుతారు. ఇదేసమయంలో పూర్తి క్రెడిట్ పార్టీకే దక్కుతుందే తప్ప జగన్‌కు మాత్రం దక్కదు. దీంతో.. జగన్ శిబిరంలో కొత్త కలకలం కూడా మొదలైంది.

పైగా .. ఇంతవరకూ దీన్ని పార్టీ కార్యక్రమంగా చేపడితే .. భవిష్యత్‌లో కాంగ్రెస్‌కే లాభమని.. 2014లో మళ్లీ అధికారంలోకి వస్తామని.. కేంద్రంలో రాహుల్ ప్రధాని అవుతారని జగన్ శిబిరం వాదిస్తూ వచ్చింది. గురువారం నాటి పరిణామాలు జగన్ శిబిరాన్ని ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరికిలోను చేశాయి. భవిష్యత్‌లో వైఎస్ అభిమానులపై అధిష్ఠానం కక్ష సాధింపు ధోరణిని ప్రదిర్శిస్తోందని చెప్పేందుకు వీల్లేకుండా పోయింది. పార్టీ పట్ల జగన్ అనుసరిస్తున్న ధిక్కార ధోరణి.. తత్పలితంగా పార్టీలో నెలకొన్న పరిస్థితుల కారణంగా జగన్ వర్గీయులపై అధిష్ఠానం సీరియస్‌గా ఉందని .. మరో వర్గానికి గట్టిగా చెప్పేందుకు వీలు చిక్కింది. ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యేలు ఇప్పటి వరకూ ఓదార్పు యాత్రలో పాల్గొనకపోవడానికి గల కారణాలను గురించి కార్యకర్తలకు ఏమని చెప్పాల్లో తెలియక నిన్నటి వరకూ సతమతమయ్యారు. ఇప్పుడు అధిష్ఠానం ద్వారా వారికి సరైన సమాధానం లభించింది. పార్టీ సూచించిన విధంగా జిల్లా కేంద్రంలో ఓదార్పును నిర్వహిస్తే జగన్ వెంట తాము వెళ్లేందుకు సిద్ధమేనని కార్యకర్తలకు వారు చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. కాగా.. ఇప్పటి వరకూ అధిష్ఠానం ఓదార్పు యాత్రకు ఎందుకో విముఖంగా ఉందని లిఖిత పూర్వకంగా చెప్పిన జగన్.. ఇప్పుడు అధినేత్రి సోనియాగాంధీ మాటలను కొట్టిపారేయలేరు. ఇదే సమయంలో అవునని చెప్పలేదు.

జిల్లా కేంద్రంలో పార్టీ పరంగా ఓదార్పు చేసుకోవాలని .. ఇందుకు సహాయం కూడా చేస్తామని కుటుంబ సభ్యులతో కలని తాను అధినేత్రి సోనియాగాంధీని కలిసినప్పుడు సూచించారని చెబితే.. ఇంతకాలం ఆ విషయాన్ని ఎందుకు బహిర్గత పరచలేదన్న ప్రశ్న వైరివర్గీయుల నుంచే కాకుండా స్వీయవర్గం నుంచి కూడా వచ్చే వీలుంది. అదేవిధంగా అధిష్ఠానం ఆ విధంగా చెప్పలేదంటే.. సోనియాగాంధీని తప్పుపట్టినట్లుగా అవుతుంది. దీంతో .. ఏమి మాట్లాడాలో దిక్కుతోచని పరిస్థితిలో జగన్ వర్గం పడిపోయింది. అధిష్ఠాన పద్మవ్యూహంలో జగన్ చిక్కుకోవడంతో.. ఆయన శిబిరంలో ఒక్కసారిగా ఆందోళన కన్పిస్తోంది. ఇప్పుడు జగన్ ముందున్నవి రెండే రెండు దారులని.. ఒకటి అధిష్ఠానం సూచించిన విధంగా విధేయతను చూపుతూ జిల్లా కేంద్రాల్లో ఒక్కరోజు ఓదార్పు కార్యక్రమాన్ని చేపట్టడం.. లేదా అధిష్ఠానాన్ని ధిక్కరించి పార్టీనుంచి బయటకు వెళ్లడమేనని కాంగ్రెస్‌నేతలు అంటున్నారు. మొత్తానికి ఓదార్పు ప్రకాశం జిల్లా శాసనసభ్యుల సందేహానికి అధిష్ఠానం సరైన సమాధానమే చెప్పిందని పార్టీ నేతలంటున్నారు.
జగన్‌ ఔట్‌ !
jaganఅత్యంత క్లిష్ట సమయంలో కాంగ్రెస్‌ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన దివంగత వైఎస్‌ కుటుంబ పెద్దగా భావిస్తోన్న ఎంపి జగన్మోహన్‌రెడ్డి కథ ఇక కంచికి చేర నుంది. అధిష్ఠానం-జగన్‌ మధ్య ఏడాది నుంచి జరుగుతున్న దోబూచులాటకు ఎట్టకే లకూ అధికారికంగానే తెరపడింది. జగన్‌ వ్యవహారాన్ని తేల్చేందుకు స్వయంగా పార్టీ అధినేత్రి సోనియాగాంధీనే రంగంలోకి దిగారు. సెప్టెంబర్‌ 3 నుంచి జరపతలపెట్టిన జగన్‌ ఓదార్పు యాత్ర పార్టీకి వ్యతిరేకమని ఆమె విస్పష్టంగా ప్రకటించి, జగన్‌ను ఏకాకిని చేసే వ్యూహానికి తెరలేపారు. ఇటు.. ముఖ్యమంత్రి రోశయ్య కూడా ఢిల్లీ సందే శాన్ని సహచర మంత్రులు, ఎమ్మెల్యేలకు వినిపించి, హెచ్చరికలు జారీ చేస్తుండటంతో కాంగ్రెస్‌లో ఇక జగన్‌ భవితవ్యమేమిటన్న ప్రశ్న సర్వత్రా చర్చనీయాంశమయింది.

ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్‌లో గంద రగోళం సృష్టిస్తున్న జగన్‌ వ్యవహార శైలిని నిశితంగా గమనిస్తూ వస్తోన్న పార్టీ అధినేత్రి సోనియాగాంధీ.. రాష్ట్ర కాంగ్రెస్‌లో జగన్‌ పాత్ర, ప్రాధాన్యానికి తెరదించకపోతే పార్టీ మొత్తం పక్కదారిపడుతుందని గ్రహించారు. ఆమె గత రెండు రోజుల నుంచి రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై సీరియస్‌గా దృష్టి సారిం చారు. పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో జగన్‌ తనకు ఎదురుపడి నమస్కారం పెట్టినా దాన్ని పట్టించుకోకుండా వెళ్లిపోయిన వైనం.. ఆయనపై అధిష్ఠానం ఎంత ఆగ్రహంతో ఉందో చెప్పకనే చెప్పినట్టయింది.

జగన్‌ ఓదార్పు యాత్ర, సమాంతర పార్టీ కార్యకలాపాలు, రోశయ్యను ఇబ్బంది పెడుతున్న తీరును గమనిస్తున్న సోనియా వాటిలో నేరుగా జోక్యం చేసుకోకుండా రాష్ట్ర పార్టీ ఇన్చార్జి వీరప్ప మొయిలీకి, తన రాజకీయకార్యదర్శి అహ్మద్‌ పటేల్‌కూ అప్పగించారు. వీరిలో పటేల్‌ ఒక్కరే జగన్‌ పట్ల వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉండగా, మొయిలీ మాత్రం కేవీపీ ఒత్తిళ్లతో జగన్‌ శిబిరంవైపు మొగ్గు చూపిస్తున్నారు. సీనియర్లు కూడా మొయిలీ కేవలం జగన్‌ వైపే మొగ్గు చూపిస్తున్నారని, మొయిలీ- కేవీపీ కలసి జగన్‌ వర్గ ప్రయోజనాలను రక్షిస్తూ వస్తున్నా రన్న ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఓదార్పు యాత్రకు దాదాపు 30 మంది పార్టీ ఎమ్మెల్యేలు హాజరయిన వైనంతో సోనియా గాంధీ రాష్ట్రంపై దృష్టి సారించవలసి వచ్చింది. అప్పుడు పటేల్‌, రోశయ్య ద్వారా ఎమ్మెల్యేలకు నచ్చ చెప్పే బాధ్యత అప్పగించారు. యాత్రకు వెళ్లవద్దంటూ రోశయ్య ఎమ్మె ల్యేలకు స్వయంగా ఫోన్లు చేసినప్పటికీ, వారు ఆయన మాటను బేఖాతరు చేసి జగన్‌తో కలసి వెళ్లారు.

sonia1 దీనితో ఇక రోశయ్య వల్ల కాదని గ్రహించిన సోనియా తానే స్వయంగా రంగంలో దిగారు. అంతకంటే ముందు.. రాహుల్‌ సన్నిహితుడైన ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ తనయుడు జగన్‌తో రాయబారం నడిపారు. రాహుల్‌ కూడా జగన్‌ వ్యవహార శైలిని పరిశీలిస్తున్నారు. తాజాగా.. గత రెండు రోజుల నుంచి జగన్‌ కార్యకలాపాలు, ప్రధానంగా ఓదార్పు యాత్రపై సోనియా సీరియస్‌గా దృష్టి సారించారు. జగన్‌తో షీలా దీక్షిత్‌ తనయుడు నెరపిన రాయబారం విఫలం కావడం, ఎవరు చెప్పినా యాత్రకు వెళ్లేది ఖాయమని జగన్‌ కూడా స్పష్టం చేయడంతో సోనియా ఇక ఆయన ప్రాధాన్యం తగ్గించే ఎత్తుగడకు శ్రీకారం చుట్టారు. జగన్‌ యాత్రకు పార్టీ అనుమతి లేదని స్వయంగా చెప్పడం ద్వారా జగన్‌ వెంట ఎవరూ వెళ్లకుం డా నివారించే ప్రయత్నాలు ప్రారంభిం చారు. గతంలో ఎప్పుడూ సోనియా ఈవిధంగా ఒక రాష్ట్ర పార్టీ వ్యవహారా లపై దృష్టి సారించిన దాఖలాలు లేవు.

జగన్‌ వ్యవహారం లో మొయిలీ ద్వారా కథ నడిపిస్తూ వచ్చిన ఆమె.. గత రెండురోజుల నుంచి హటాత్తుగా తానే రంగంలోకి దిగి, పార్లమెంటు సభ్యులు, కేంద్రమంత్రు లతో మంతనాలు సాగించడం చర్చనీయాంశమయింది. జగన్‌ యాత్రకు అధ్యక్షురాలి అనుమతి లేదని అహ్మద్‌ పటేల్‌ పార్టీ ఎంపీలందరికీ విస్పష్టంగా చెప్పారు. అదే విషయాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలకు చెప్పి, వారిని యాత్రకు వెళ్ల కుండా అడ్డుకోవాలని సూచిం చారు. ఇది సోనియా గాంధీ మాట అని స్పష్టం చేశారు. అయితే, వాటిని విశ్వసించని కేంద్ర మంత్రులు పనబాక లక్ష్మి, పురంధీశ్వరి, మాగుంట శ్రీనివాసరెడ్డి వంటి ప్రముఖులు సోనియాను కలిశారు. యాత్రకు వెళ్లవద్దని ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు చెప్పాలని తాను అహ్మద్‌పటేల్‌ను ఆదేశిం చానని సోనియా స్పష్టం చేయడంతో జగన్‌ యాత్రకు అధి ష్ఠానం అనుమతికి సంబంధించి ఇప్పటివరకూ ఉన్న దోబూచులాటకు తెరపడి, జగన్‌ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇటు రాష్ట్ర స్థాయిలో కూడా సోనియా ఆదేశాలు వెంటనే అమలులోకి వచ్చాయి.

ముఖ్యమంత్రి రోశయ్య ఈ విషయంలో చొరవ తీసుకున్నారు. ప్రకాశం జిల్లాలో జగన్‌ యాత్రను పర్యవేక్షిస్తున్న మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డికి రోశయ్య స్వయంగా ఫోన్‌ చేసి, అధిష్ఠానం ఆదేశాల మేరకు యాత్రకు వెళ్లి, ఇబ్బందుల్లో పడవద్దని హెచ్చరిం చారు. పరోక్షంగా యాత్రకు వెళితే మంత్రి పదవి పోతుం దని చెప్పకనే చెప్పారు. అయితే, తాను యాత్రకు వెళ్లేది ఖాయమని బాలినేని కూడా జగన్‌ మాదిరిగానే ఖరాఖం డిగా చెప్పారు. సోనియా-పటేల్‌తో సమావేశ మయిన ప్రకాశం జిల్లా పార్టీ ఎమ్మెల్యేలపై భేటీ ప్రభావం బాగానే పడినట్లు కనిపిస్తోంది. జగన్‌ యాత్రకు వెళితే వచ్చే ఎన్నికల్లో తిరిగి టికెట్లు కూడా ఇచ్చేది లేదని స్పష్టం చేయ డంతో అంతా ఒక్కసారి ఆత్మరక్షణలో పడిపోవలసి వచ్చిం ది.

తాజా పరిణామాల నేపథ్యంలో.. ప్రకాశం జిల్లా కు చెందిన ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డి మినహా.. కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, ఎమ్మెల్యేలు దగ్గుబాటి వెంక టేశ్వరరావు, ఆమంచి కృష్ణమోహన్‌, గొట్టిపాటి రవి, ఉగ్ర నరసింహా రెడ్డి, జివి శేషు, సురేష్‌ , మహీధర్‌రెడ్డి దూరంగా ఉండనున్నారు. తూర్పు గోదావరి జిల్లా మాదిరి గానే ఎమ్మెల్యేలను వెంటేసుకుని యాత్ర సాగించాలన్న జగన్‌ వ్యూహానికి బ్రేక్‌ పడినట్టయింది. యాత్రకు అధిష్ఠానం ఆశీస్సులు లేవని స్వయంగా సొనియా, అహ్మద్‌ స్పష్టం చేయడంతో ద్వితీయ శ్రేణి నేతలు సైతం యాత్రకు దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫలి తంగా.. ఇప్పటివరకూ ద్వితీయ శ్రేణి నేతలను తన వెంట తెచ్చుకోవడం ద్వారా ఎమ్మెల్యేలను యాత్రకు వచ్చే పరిస్థితి సృష్టించిన జగన్‌ వ్యూహం ప్రకాశం జిల్లాలో బెడిసికొట్టినట్టయింది. జగన్‌ యాత్రకు తన అనుమతి లేదని స్పష్టం చేయడం ద్వారా.. జగన్‌కు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యం లేదని నాయకత్వం చెప్పినట్టయింది.

No comments:

Post a Comment