జగన్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు
యువనేతపై ఎదురు దాడి...
ఆర్థిక లావాదేవీలపై అధిష్ఠానం ఆరా
ఏపీఐఐసీ అక్రమాలతో మొదలు..
అంబటి లక్ష్యంగా కదిలిన పావులు
తదుపరి వంతు జగన్ కంపెనీలదేనా?
గళమెత్తిన డీఎల్, జేసీ.. పూర్తి వివరాలతో ఢిల్లీకి బొత్స
కఠినంగా వ్యవహరిచాలంటూ సీఎంకు రాయపాటి సూచన
ఆర్థిక లావాదేవీలపై అధిష్ఠానం ఆరా
ఏపీఐఐసీ అక్రమాలతో మొదలు..
అంబటి లక్ష్యంగా కదిలిన పావులు
తదుపరి వంతు జగన్ కంపెనీలదేనా?
గళమెత్తిన డీఎల్, జేసీ.. పూర్తి వివరాలతో ఢిల్లీకి బొత్స
కఠినంగా వ్యవహరిచాలంటూ సీఎంకు రాయపాటి సూచన
దాడికి ఎదురు దాడి! అవతలి వాళ్లు ఒక్కటంటే... నాలుగు అనడం! వారి పాత చరిత్రను వారిపైకే అస్త్రాలుగా ప్రయోగించడం! ఇదంతా నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్షా... అంటూ జగన్ వర్గంపై భారీ స్థాయిలో ఎదురుదాడి మొదలైంది. ప్రభుత్వంపై, పాలనపై, ముఖ్యమంత్రి రోశయ్యపై, పథకాల అమలుపై వరుసగా విమర్శలు సంధిస్తూ వచ్చినప్పటికీ... కొన్నాళ్లపాటు సంయమనం పాటించిన వైరి వర్గం ఇప్పుడు జూలు విదిలిస్తోంది.
జగన్ వర్గంలోని ఒక్కొక్కరిని లక్ష్యంగా చేసుకుంటోంది. ఇది బయ్యారం గనులతో మొదలైంది. ఇప్పుడు వైఎస్ కుటుంబానికి వీర విధేయుడైన అంబటి రాంబాబుపై కన్నేసింది. ఆయన గతంలో చైర్మన్‌గా ఉన్న ఏపీఐఐసీ అక్రమాలపై సీబీఐ విచారణకు డిమాండ్ చేసింది. ఆ తర్వాతి గురి... కొండా సురేఖపైనే కావొచ్చు! అంతిమంగా జగన్ సొంత కంపెనీల ఆర్థిక లావాదేవీలపైనా విచారణ కోరే అవకాశాలనూ కొట్టివేయలేని పరిస్థితి! మొత్తంగా జగన్ చుట్టూ అధిష్ఠానం ఉచ్చు బిగిస్తోందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.
2004 నుంచి ఇప్పటిదాకా జరిగిన ఏపీఐఐసీ లావాదేవీలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని మాజీ మంత్రులు డీఎల్ రవీంద్రారెడ్డి, జేసీ దివాకరరెడ్డి కోరడం ఇందులో భాగమేనని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ఇటీవల రాయలసీమ ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి ఒకరు ఢిల్లీలో సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌తో భేటీ అయ్యారు. ఏపీఐఐసీతో సహా రాష్ట్రంలో చోటుచేసుకున్న పలు ఆర్థిక అక్రమాలపై ఫిర్యాదు చేశారు.
వీటిలో పలువురు ప్రభుత్వ పెద్దలు, సీనియర్ అధికారులకూ భాగస్వామ్యముందని తెలిపారు. ఆ వివరాలన్నీ విన్న అహ్మద్‌పటేల్... ఇంత పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏపీఐఐసీలో చోటు చేసుకున్న పలు అక్రమాలపై ఆరా తీశారు. ఈ క్రమంలోనే డీఎల్, జేసీ మంగళవారం ఏపీఐఐసీపై గళమెత్తడం గమనార్హం. ఈ పరిణామాలు ఇంతటితో ఆగలేదు. ఏపీఐఐసీ వ్యవహారం సమగ్ర విచారణ జరపాలని డీఎల్, జేసీలు ముఖ్యమంత్రి రోశయ్యను కోరారు.
సీబీఐ విచారణ కోరుతూ సోనియాకు కూడా లేఖ రాసేందుకు డీఎల్ సిద్ధమవుతున్నారు. ఏపీఐఐసీ లావాదేవీలపై ఫిర్యాదులు అందుకున్న అధిష్ఠానం దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయించాలనే నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ నేతలు అంటున్నారు. ఇటీవల బయ్యారం గనుల విషయంలో అధిష్ఠానమే జోక్యం చేసుకుని ముఖ్యమంత్రి రోశయ్యకు తగు ఆదేశాలు జారీ చేసిందని.. ఏపీఐఐసీపైనా ఇదే తరహా ఆదేశాలు ఇచ్చే అవకాశముందని చెబుతున్నారు.
ఇదే సమయంలో మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం ఢిల్లీకి వెళ్తున్నారు. అధిష్ఠానం పెద్దలను కలవనున్నారు. గతంలో ఆయన భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే ఎమ్మార్ ప్రాపర్టీస్‌తో ఒప్పందం కుదిరింది. ఒప్పందం తర్వాత జరిగిన ఉల్లంఘనల గురించి ఆయన అధిష్ఠానానికి వివరించే అవకాశం ఉంది.
ఎంపీ సందీప్ దీక్షిత్ ఢిల్లీలో జగన్‌తో విందు రాజకీయం నెరపుతున్న సమయంలోనే డీఎల్, జేసీలు ఏపీఐఐసీ అక్రమాలపై సీబీఐ విచారణ కోరడం గమనార్హం. అధిష్ఠానంతో సంధి యత్నాలు జరుగుతున్నాయనే అభిప్రాయం కల్పించేందుకే సందీప్ దీక్షిత్‌తో జగన్ విందు భేటీలో పాల్గొన్నట్లు ఒక వర్గం పేర్కొంటోంది.
సీఎంకు నివేదిక: బొత్స
ఎమ్మార్ ప్రాపర్టీస్‌తో సర్కారు కుదుర్చుకున్న ఒప్పందం, ఆ తర్వాతి పరిణామాలపై ముఖ్యమంత్రి రోశయ్యకు నివేదిక సమర్పించనున్నట్లు పంచాయితీరాజ్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. తాను పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న కాలంలోనే ఎమ్మార్ ప్రాపర్టీస్‌తో ఒప్పందం కుదిరిందని ఆయన వెల్లడించారు. ఎమ్మార్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం, దాంట్లో పేర్కొన్న నిబంధనలు, ఆ తర్వాత చోటుచేసుకుంటున్న ఉల్లంఘనలపై వాస్తవాలతో కూడిన నివేదికను సీఎంకు అందిస్తానని, ఈ విషయంపై బహిరంగంగా ఏదీ మాట్లాడనని మంగళవారం సచివాలయంలో విలేఖరులకు తెలిపారు.
కఠినంగా వ్యవహరించండి!
రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్న నేపథ్యంలో... ఇకనైనా కఠినంగా వ్యవహరించాలంటూ ముఖ్యమంత్రి రోశయ్యను ఎంపీ రాయపాటి సాంబశివరావు కోరినట్లు తెలిసింది. పార్టీ వ్యవహారాలపై పట్టు సాధించేందుకు వీలుగా, అదుపు తప్పినవారి పట్ల కాస్త కఠినంగా వ్యవహరించాలని సూచించినట్లు సమాచారం.
మంగళవారం సచివాలయంలో రాయపాటి, జేసీ, డీఎల్, టీజీ వెంకటేశ్ ముఖ్యమంత్రిని కలిశారు. "పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆశాజనకంగా లేవు. ముఖ్యమంత్రిగా కాస్త కఠిన నిర్ణయాలను తీసుకోవాలి. అధిష్ఠానం అండదండలు పుష్కలంగా ఉన్నందున మంత్రివర్గంతో సహా, ఇతర అంశాల్లోనూ స్వీయ నిర్ణయాలు తీసుకోవాలి'' అని రాయపాటి సూచించినట్లు తెలిసింది.
దీనిపై రోశయ్య స్పందిస్తూ... "నేను అధిష్ఠానం సూచనలు తు.చ. తప్పక పాటిస్తాను. ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తించమంటే నిర్వర్తిస్తున్నాను. ఈ క్షణంలో దిగిపోమంటే దిగిపోతాను'' అని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలు కిందస్థాయి వరకూ చేరేందుకు వీలుగా పాలనా పరమైన చర్యలు చేపట్టాలనే రాయపాటి సూచించగా... ముఖ్యమంత్రి సమ్మతించినట్లు తెలిసింది.
‘భూ’తల యుద్ధం
కాంగ్రెస్‌లో అంతర్యుద్ధం రసకందాయంలో పడింది. ముఖ్యమంత్రి రోశయ్య- కడప ఎంపీ జగన్ మధ్య జరుగుతున్న రాజకీయ అధిపత్య పరోక్ష యుద్ధంలో ఇప్పుడు భూములు వచ్చి చేరాయి. వైఎస్ హయాంలో జరిగిన భూ కేటాయింపులపై న్యాయ విచారణ చేయించాలని ఇప్పటికే డిమాండ్ చేస్తున్న జగన్ ప్రత్యర్థి వర్గం.. తాజాగా ఆయన హయాంలో జరిగిన ఏపీఐఐసీ భూ కేటాయింపు లను వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చింది. వాటిపై సీబీఐతో విచారణ చేయించాలని గళం విప్పింది. అదే సమయంలో.. ముఖ్యమంత్రి రోశయ్య హయాంలో జరిగిన అమీర్‌పేటలోని హెచ్‌ఎండీఏ అక్రమాలపై జగన్ గురిపెట్టింది. ఇరు వర్గాలు భూములను కేంద్రంగా చేసుకుని ఆరోపణ- ప్రత్యారోపణలు చేసుకుం టున్నాయి. దీనితో కాంగ్రెస్ రాజకీయాలు హటాత్తుగా వేడెక్కాయి.వర్గానికి చెందిన ప్రముఖులను రాజకీయంగా అణచి వేసేందుకు వైఎస్ హయాం నాటి నిర్ణయాలపై ముఖ్యమంత్రి రోశయ్య, ఆయన వర్గీయులు దృష్టి పెడుతుంటే.. రోశయ్య హయాంలో తొలిసారి ‘తెలిసి’ వెలుగు చూసిన అక్రమంపై జగన్ శిబిరం ధ్వజమెత్తుతుతోంది. తాజాగా.. అమీర్‌పేటలో 200 కోట్ల రూపాయల విలువ కాగల హెచ్‌ఎండీఏ భూమి వ్యవహారంలో ముఖ్యమంత్రి రోశయ్య ప్రభుత్వం కొందరు ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా ఇచ్చిన ఉత్తర్వు జగన్ వర్గానికి బ్రహ్మాస్త్రంగా మారింది. రోశయ్య హయాం లో వెలుగుచూసిన తొలి కుంభకోణం అయినందున, దానిని సద్వి నియోగం చేసు కునేందుకు జగన్ వర్గం ప్రయత్నిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్నేహితుడితోపాటు.. కాంగ్రెస్‌లో తనను వ్యతిరేకిస్తున్న ప్రత్యర్థి వర్గం కూడా ఈ కుంభకోణంలో ఉండటంతో జగన్ వర్గం ఉత్సాహంతో పావులు కదుపుతోంది. దానికి సంబంధించి జగన్‌కు చెందిన మీడియా సంస్థల్లో గత రెండు రోజుల నుంచి వార్తా కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో జగన్‌ను వ్యతిరేకించే సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, జగన్ వర్గం వారి జోలికి వెళ్లకుండా , కేవలం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సన్నిహిత సహచరు డినే వ్యూహాత్మకంగా తెరపైకి తెస్తోంది. దాని ద్వారా.. రోశయ్య ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు హవా ఏ స్థాయిలో ఉంది, ప్రభుత్వం -ప్రధాన ప్రతిపక్షం ఏ స్థాయిలో కలసి పనిచేసు కుంటున్నాయో ప్రజలు- అధిష్ఠానం దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. జగన్ వర్గం ఈ అంశంలో దానికే పరిమితమయినట్లు కనిపిస్తోంది.
అయితే ముఖ్యమంత్రి రోశయ్య వర్గం హెచ్‌ఎండీఏ అక్రమాలపై నుంచి దృష్టి మళ్లించేం దుకు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగింది. వైఎస్ హయాం లో ఏపిఐఐసిలో జరిగిన భూ కేటాయింపులపై సిబిఐతో విచారణ చేయించాలని తాజాగా జెసి దివాకర్‌రెడ్డి, డిఎల్ రవీంద్రారెడ్డి, కంతేటి సత్య నారాయణరాజు, టిజి వెంకటేష్ వంటి ప్రము ఖులు మంగళవారం ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించారు. అందుకు స్పందించిన ముఖ్యమంత్రి రోశయ్య కూడా సిబిఐ విచారణ చేయిస్తానని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. మంత్రి పదవులు ఆశిస్తున్నారన్న ప్రచారం జరుగు తున్న జెసి, డిఎల్, టిజి వెంకటేష్‌తో పాటు.. శాసనమండలి పునరుద్ధరణకు కృషి చేసినప్పటికీ, వైఎస్ హయాంలో మండలి సీటు ద క్కని కంతేటి గత కొద్దిరోజుల నుంచి జగన్ వర్గానికి వ్యతి రేకంగా మంత్రాంగం నెరుపుతున్నారు. రెండు రోజుల క్రితం ఇదే బృందం ఒక ప్రముఖుడిని కూడా కలిసిన విషయం తెలిసిందే. వైఎస్ హయాం లో జరిగిన ఏపిఐఐసి భూ కేటాయింపుల వ్యవ హారంపై సిబిఐ విచారణ డిమాండ్ ముఖ్యమంత్రి రోశయ్యకు తెలిసే జరిగిందని జగన్ వర్గం అనుమా నిస్తోంది. అమీర్‌పేట మైత్రీవనం సమీపంలోని హెచ్‌ఎండిఏ భూ సేకరణ ఉపసహంరణ ఉత్తర్వు తనకు అప్రతిష్టగా మారటం, అందులో చంద్ర బాబు మిత్రుడయిన టీడీపీ నేత నాయుడు కూడా ఉండటంతో తాను-టీడీపీ కుమ్మక్కయ్యానన్న భావన విస్తృతమవుతున్నందున.. వాటిని ప్రజల దృష్టిని మళ్లించేందుకే రోశయ్య ఏపిఐఐసి భూ కేటాయింపుల అక్రమాలను నేర్పుగా తెరపైకి తెచ్చారని జగన్ వర్గీయులు చెబుతున్నారు.
అయితే, ఈ వ్యవహారంలో ఎట్టి పరిస్థితిల్లోనూ వెనక్కి తగ్గకూడదని జగన్ వర్గం భావిస్తోంది. ఆ వ్యూహంతో జగన్ అధికార ప్రతినిధిగా భావించే పీసీసీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు మంగళవారం ఎదురుదాడి ప్రారంభించారు. ఏపిఐఐసిలో జరిగిం దని ఆరోపిస్తున్న పదివేల కోట్ల అక్రమాలపై సిబిఐతో విచారణ జరిపించాల్సిందేనని, లేకపోతే ఆ డిమాండ్ చేసిన వారు అందులో భాగస్వాము లుగా ఉన్నట్లు అనుమానించవలసి వస్తుందని మెలిక పెట్టారు. ఏపిఐఐసి నిర్ణయాలు తీసుకున్న సమయంలో ఇప్పటి ముఖ్యమంత్రి రోశయ్య ఆర్థిక మంత్రిగా, బొత్స సత్యనారాయణ, జెసి దివా కర్‌రెడ్డి మంత్రులుగా ఉన్నందున వీరంతా అప్పుడెందుకు మాట్లాడలేదని లా పాయింటు తీయడం ద్వారా.. ‘అప్పటి నిర్ణయాల్లో ఆ ముగ్గురి బాధ్యత కూడా ఉంద’ని చెప్పి నేరుగా ఇరికించినట్టయింది. రోశయ్య-జగన్ మధ్య జరుగుతున్న పరోక్ష యుద్ధంలో భూములు కేంద్రబిందువు కావడంతో వీరి అంతర్గత పోరు ఆసక్తిగా మారింది. భవిష్యత్తులో ఒకరినొకరు బలహీనపరుచుకు నేందుకు ఇంకెన్ని ఎత్తులు వేస్తారోనన్న ఆసక్తి రాజకీయవర్గాల్లో కనిపిస్తోంది.
No comments:
Post a Comment