జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Friday, August 13, 2010

ఏపీఐఐసీ... పాపాల పుట్ట ! * కాంగ్రెస్‌ కాళ్ల కింద .. ల్యాండ్‌మైన్‌ !


apiic
భూ కుంభకోణాలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. రాష్ట్ర ప్రజలు ఏడున్నర వేల ఎకరాల సత్యం భారీ భూకుంభకోణాన్ని మరవక ముందే.. ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ రూపంలో మరో భారీ రియల్‌ కుంభకోణం తెరమీదకు రావడం విస్మయం కలిగిస్తోంది. అటు ప్రభుత్వం, ఇటు ఉన్నత స్థాయి అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఏ విధంగా ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ది సంస్థ(ఏపీఐఐసీ)కు నష్టం కలిగించినతీరు తెలిసిందే. 2002లో ఎమ్మార్‌కు ఒప్పందంలో భాగంగా 538 ఎకరాలు కేటాయిస్తే.. ఏపీఐఐసీకి సదరు సంస్థ చేపట్టే బహుళ అంతస్తుల ప్రాజెక్టులలో 48 శాతాన్ని వాటాగా నిర్ణయించారు. అనంతరం ఈవాటా 2004 నాటికి 26 శాతానికి తరిగిపోయింది. ప్రస్తుతం ఎమ్మార్‌లో 26 శాతం వాటా కూడా ఏపీఐఐసీకి ఉందోలేదో కూడా ప్రశ్నార్థకంలో పడడంతో తాజా కుంభకోణం బయట పడింది. మరోవైపు పరిశ్రమల ముసుగులో కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను కారుచౌకగా బడా బాబులు తన్నుకుపోతున్నారు. కానీ, ఒప్పంద సమ యంలో సదరు సంస్థలు పేర్కొంటున్న పారిశ్రామిక లక్ష్యాలుగాని, ఉపాధి అవకాశాలు కార్యరూపం దాల్చడం లేదు. ఈ కంపెనీలు ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పం దాలన్నీ పేపరుకే పరిమితమవుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Rajeha రాష్ర్టంలోని మెజారిటీ సెజ్‌ల్లో దాదాపు ఇదే పరిస్థితి. ఇదిలా ఉండగా, హైదరాబాద్‌లోని కోకాపేటలో ప్రభు త్వానికి చెందిన 110 ఎకరాల్లో గూగుల్‌, డీ క్యూ తదితర ప్రముఖ ఐటీ కంపెనీలకు భూములు కేటాయించి ఏళ్ళుగడుస్తున్నా... ఇప్పటికీ ఈ సంస్థలు కార్యకాలాపాలు చేపట్టకపోవడం విశేషం. అర్హులైన పలు ఐటీ, ఐటీఇఎస్‌ కంపెనీలు తమకు భూములు కేటాయించమని కాళ్ళు అరిగేలా ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నా వారికి అడుగు భూమి కూడా లేదని అధికారులు చెప్పడం గమనార్హం. రాష్ట్రంలోని 110 సెజ్‌ల్లో మెజారిటీ సెజ్‌లలో దాదాపు ఇదే పరిస్థితి చోటుచేసుకుంది. దీనిపై అసోసియేషన్ల నుంచి కూడా నిరసన వ్యక్తమవుతోంది.

తవ్వినకొద్దీ అక్రమాలే...
ఏపీఐఐసీ భూ కేటాయింపులను, సదరు సంస్థ చేసుకున్న ఒప్పందాలను తవ్వినకొద్దీ ఒక్కొక్కటిగా అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఎమ్మార్‌, రహేజా, కె సెజ్‌, వాన్‌పిక్‌ వంటి సంస్థల భూ కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏపీఐఐసీ కుంభకోణాలు కొన్ని బయటకు వచ్చినప్పటికీ.. ఇంకావెలుగులోకి రాని నిజాలు అనేకం ఏపీఐఐసీలో చోటుచేసుకున్నట్లు సదరు సంస్థ ఛైర్మన్‌ ఆవేదనతో చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం.

అధికారులదీ అక్రమ దందాయే...
ఏపీఐఐసీలో చోటుచేసుకున్న అక్రమాలు పరిశీలిస్తే.. సదరు సంస్థలో సుదీర్ఘ కాలం పనిచేసిన అధి కారుల అక్రమ దందా ఏ స్థాయిలో ఉందో అర్థమవుతున్నది. ఏపీఐఐసీ బోర్డును సంప్రదించకుండా నే... ప్రైవేట్‌ ఒప్పందాల ద్వారా వేల కోట్లు విలువ చేసే ఏపీఐఐసీ వాటాలను నీరుగార్చినట్లు అధికార పార్టీ ఎమ్మెల్యేలు విమర్శించడం విశేషం. ప్రభుత్వ పెద్దలు, పలువురు ఉన్నత స్థాయి స్థాయి అధికారులకు ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ విల్లాలు, లగ్జరీ అపార్ట్‌మెంట్లలను కేటాయించి నట్లు ఇప్పటికే ఏపీఐఐసీ తన ప్రాథమిక నివేదికలో ప్రభుత్వానికి అందచేసింది. చాలామంది అధికారులకు విల్లాలు ఉచితంగానే ఇచ్చారన్న విమర్శలు వినవస్తున్నా యి. దీనికి సంబంధించిన తుది నివేదికను వచ్చే నెలలో ఇస్తామని, ఈ మొత్తం కుంభకోణానికి బాధ్యులైన అధికారులపైనా ప్రభుత్వానికి నివేదిక అందచేస్తామని ఏపీఐఐసీ ఛైర్మన్‌ తెలిపారు.

బీడుగా మారిన సెజ్‌లు
ఇదిలా ఉండగా సెజ్‌ల పేరుతో రైతుల నుంచి సేకరించిన భూముల్లో సదరు సంస్థలు ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకపోవడంతో అవి బీడు భూములుగా మారాయి. దీనికి తాజా ఉదాహరణ కాకినాడ సెజ్‌లో జిఎమ్‌ఆర్‌ రిఫైనరీ భూములే. ఈ భూముల్లో గతంలో ప్రభుత్వ రంగ సంస్థ ఒఎన్‌జిసి రిఫైనరీ ఏర్పాటుకు ముందుకు వచ్చినప్పటికీ.. అప్పటి ప్రభుత్వ పెద్దలు, ఏపీఐఐసీ పాలకవర్గం చేతివాటంతో సదరు సంస్థను బలవంతంగా వెళ్లగొట్టిన వైనం విమర్శలకు దారితీసింది. ఈ రకంగా సర్కార్‌ పెద్దల ప్రయోజనాల కోసం ప్రభుత్వ రంగ పెట్టుబడులుసైతం నీరుగార్చడం మన నేతలకే చెల్లింది.

కాంగ్రెస్‌ కాళ్ల కింద .. ల్యాండ్‌మైన్‌ !
Pranab,-ahmadకాంగ్రెస్‌ పార్టీ కాళ్ల కింద భూములు పేలుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన భూ కేటాయింపులపై మొదలయిన చర్చ రచ్చగా మారి.. చివరకు ఢిల్లీకి చేరింది. వైఎస్‌ వర్గాన్ని వ్యతి రేకిస్తున్న వర్గం ఇప్పటికే నాటి అక్రమాలు, ఒప్పందాలను అధిష్ఠానానికి చేర్చగా, దానిని తిప్పికొట్టేందుకు వైఎస్‌ అనుకూలవర్గం ఢిల్లీలో మోహరించింది. మరోవైపు.. దోషులంతా సొంత పార్టీ వారే కావడంతో జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్‌ పార్టీని భ్రష్టు పట్టించేలా మారు తున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అసలే పరి పాలనాపరంగా అత్యంత బలహీనంగా ఉన్న పార్టీ- ప్రభుత్వ పరిస్థితి, తాజాగా రచ్చగా మారిన భూ కుంభకోణాలతో రోడ్డున పడే ప్రమాదం ఏర్పడిందని పార్టీ వర్గాలు భయపడుతున్నాయి. వైఎస్‌ వర్గాన్ని దోషిగా నిలబెట్టేందుకు ఆయన వ్యతిరేకవర్గం కదుపుతున్న పావులు మొత్తం పార్టీనే వణిస్తున్నాయి. వైఎస్‌ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఆయనకు సన్నిహితంగా వ్యవహరించిన జేసీ దివాకర్‌రెడ్డి, డి.ఎల్‌. రవీందర్‌రెడ్డి ఇప్పుడు వైఎస్‌ హయాంలోజరిగిన 6 లక్షల ఎకరాల పంట భూమి, పారిశ్రామిక సెజ్‌ల కేటా యింపులు, రహేజా, ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌, ఓఎంసీ, బయ్యా రం, రింగ్‌రోడ్డు, భారతీ సిమెంట్స్‌, ఇందు, మెగా ఇంజనీరింగ్‌ కంపెనీ వ్యవహారాలు, వాటికి వైఎస్‌ చేసిన భూ కేటాయింపుల్లో వేల కోట్ల రూపాయల కుంభకోణం వెలుగులోకిరావడంతో పాటు.. వాటిపై సీబీఐ విచారణ చేయించే దిశగా పయనిస్తుం డటం కాంగ్రెస్‌ పార్టీని మరింత పలచన చేస్తోంది.

ఇందులో ప్రస్తుతం మంత్రు లుగా కొనసాగుతున్న వారు సైతం ముద్దాయి లుగా నిలుస్తున్న వైనం కాంగ్రెస్‌లో కల్లోలానికి కారణ మవుతోం ది. ప్రధానంగా.. ఈ వ్యవహారాలన్నీ వైఎస్‌ జగన్‌ చుట్టూ తిరుగు తున్నాయి. వైఎస్‌ హయాంలో జరిగిన భూ కేటాయింపులలో వేలాది కోట్ల రూపాయలు చేతులు మారాయన్న విమర్శలు చర్చనీయాంశమ య్యాయి. వీటిపై జగన్‌ ప్రత్యర్థి శిబిరం ఇప్పటికే ఢిల్లీలో అధిష్ఠానం వద్ద తన పని ప్రారంభించింది. సోనియాకు విశ్వసనీ యులైన ప్రణబ్‌ ముఖర్జీ, అహ్మద్‌పటేల్‌ వద్ద భూముల పంచాయ తీకి తెరలేపారు. వీటన్నింటినీ రచ్చ చేయడం ద్వారా జగన్‌ను దెబ్బతీయడం ఆయన ప్రత్యర్థి వర్గం లక్ష్యమయితే.. వాటిని అడ్డుపెట్టుకుని ఆయనను లొంగదీసుకోవడం అధిష్ఠానం వ్యూహంలా కనిపిస్తోంది. అయితే.. ఈ వ్యవహారంలో వైఎస్‌ అనుకూల-ప్రత్యర్థి వర్గాలు జన్‌పథ్‌లో పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. తాజాగా జగన్‌ వర్గం హైదరాబాద్‌ అమీర్‌ పేట 220 కోట్ల విలువ గల హెచ్‌ఎండిఏ భూ కుంభకోణాన్ని అధి ష్ఠానానికి ఫిర్యాదు చేసింది. అందులో చాలామంది ప్రముఖు లున్నందున దానిపై కూడా సిబిఐ విచారణ చేయించాలన్న డిమాండుకు తెరలేపింది. వైఎస్‌ హయాంలో తిరస్కరించిన ఫైలును రోశయ్య ప్రభుత్వం ఎలా ఆమోదించిందన్న ప్రశ్న లేవనెత్తింది. ఈ నేపథ్యంలో జగన్‌ వ్యతిరేక వర్గం రూటు మార్చింది.

జగన్‌ ఇప్పటికే ఆత్మరక్షణలో పడినందున ఇక తర్వాత దృష్టి ఆయనకు అండగా నిలుస్తున్న ఒక సలహాదారుపైన మళ్లించింది. వైఎస్‌ హయాంలో సలహాదారుగా ఉంటూ చక్రం తిప్పిన నాయకుడిని లక్ష్యంగా చేసుకుని అడుగులు వేస్తోంది. ఆ మేరకు ముఖ్యమంత్రి రోశయ్యపైనా ఒత్తిడి ప్రారంభించింది. ఏపీఐఐసీ భూముల వ్యవహారంలో సలహాదారు చెప్పినట్లు నడుచుకుని, రాష్ట్ర ఖజనాకు తూట్లు పొడిచిన బిపి ఆచార్యను మళ్లీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించడం వెనుక ఆ సలహాదారు హస్తం ఉందని జగన్‌ వ్యతిరేక వర్గం ఆరోపిస్తోంది. దీనిపై వారు రోశయ్యకు తన నిరసన తెలిపినట్లు తెలిసింది. వాన్‌పిక్‌, కృష్ణపట్నం, గంగవరం ఓడరేవు, ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌, సత్యం, మేటాస్‌, రహేజా, ఓఎంసి, బయ్యారం గనులు, సెజ్‌ల కేటాయింపు, ఇందు, మెగా ఇంజనీరింగ్‌, ఈస్ట్‌కోస్ట్‌, నాగార్జున పవర్‌ ప్రాజెక్టు వ్యవహారాలన్నీ వైఎస్‌ ఉండగా సదరు సలహాదారే చూశారని అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఈ కంపెనీలకు చెందిన అధిపతులు చాలామంది జగన్‌కు చెందిన మీడియా సంస్థల్లో భారీ షేర్లు కొన్నారని ఫిర్యాదు చేశారు.

రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కీలకమైన నిర్ణయాలు ఆయనకు తెలియకుండా జరగడం లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ కంపెనీలలో చాలావరకు ఆ సలహాదారు, ఆయన కుమారుడు బినామీలుగా వ్యవహరిస్తున్నారని, ఆయన కుమారుడి కంపెనీలకు సైతం ప్రాజెక్టులు కట్టబెట్టారన్న ఆరోపణలను వారు ప్రణబ్‌, అహ్మద్‌పటేల్‌ దృష్టికి తీసుకువెళ్లారు. అదే సమయంలో టిడిపి ప్రచురించిన ‘రాజా ఆఫ్‌ కరప్షన్‌’ పుస్తకాన్ని కూడా వారిద్దరికీ అందచేశారు.

మరోవైపు.. కొందరు తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్లు సాగునీటి ప్రాజెక్టులు, తెలంగాణలో మైనింగ్‌, రింగురోడ్డు, జాతీయ రహదారుల ప్రాజెక్టుల కేటాయింపులలో జరిగిన అవినీతిని అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లారు. వీటికి సైతం వైఎస్‌ ఆత్మబంధువయిన సలహాదారు హస్తం ఉందని పేర్కొంటూ అందుకు ఆధారాలను సమర్పించారు. అసలు జగన్‌ను ఇప్పటికీ ఆ సలహాదారుడే రక్షిస్తున్నాడని, రోశయ్య ప్రభుత్వంలో జగన్‌ పనులన్నీ జరిగిపోవడానికి ఆ సలహాదారే కారణమని తెలంగాణ సీనియర్లు అధిష్ఠానం వద్ద చర్చ ప్రారంభించినట్లు తెలిసింది.

అయితే.. వైఎస్‌ ఉండగా పదవులు రాలేదన్న దుగ్థతోనే జేసీ, డిఎల్‌, కంతేటితో పాటు మిగిలిన తెలంగాణ సీనియర్లు పనిగట్టుకుని జగన్‌పై దుష్ర్పచారం చేస్తున్నారని ఆయన వర్గం వాదిస్తోంది. వీరిలో ఒకరు వైఎస్‌ తొలిసారి సీఎం అయిన కొత్తలో పేషీలో పెత్తనం చేశారని, సలహాదారు ప్రవేశించకముం దు ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, ఇతర కాంట్రాక్టుల్లో మధ్యవర్తిగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. అదేవిధంగా అనంతపురంలో ఒక మాజీ మంత్రి నిర్మించిన సిమెంటు కంపెనీకి డబ్బు ఎక్కడిదని ప్రశ్నిస్తున్నారు. వైఎస్‌ ఉండగా లబ్థి పొంది, ఇప్పుడు అడ్డం తిరిగిన నేతల జాతకాలు తమ వద్ద కూడా ఉన్నాయని, వాటిని అధిష్ఠానానికి అందించామని జగన్‌ వర్గీయులు చెబుతున్నారు.

ఇవన్నీ మీడియాలో పతాక శీర్షికలకెక్కడంతో పార్టీ పరువు బజారున పడుతోందని పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్‌ అధికారంలో ఉన్నంత వరకూ అక్రమాల గురించి మాట్లాడని నేతలంతా ఇప్పుడు వాటిని రచ్చ చేస్తున్నారని, దాని వల్ల చనిపోయిన వైఎస్‌ తిరిగిరానప్పటికీ, పార్టీ ప్రతిష్ఠ మంటగలసి, ప్రతిపక్షాల చేతికి బ్రహ్మాస్త్రాలు ఇచ్చినట్టవుతోందని నేతలు చెబుతున్నారు.

No comments:

Post a Comment