వచ్చే నెలలో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు
జగన్‌పై వేటే అధిష్ఠానం తొలి ప్రాధాన్యత
స్పష్టం చేస్తున్న ఏఐసీసీ వర్గాలు
జగన్‌పై వేటే అధిష్ఠానం తొలి ప్రాధాన్యత
స్పష్టం చేస్తున్న ఏఐసీసీ వర్గాలు

ఇప్పటి వరకూ జగన్‌కు సన్నిహితుడుగా ముద్రపడ్డ మొయిలీ.. ఆ ముద్ర ను తొలగించుకునేందుకు సర్వయత్నాలూ చేస్తున్నారు. జగన్ మొండి ఘటమని, ఆయనలో మార్పు తేవడం కష్టమని మొయిలీతో సహా ఏఐసీసీలో సీనియర్ నేతలందరూ ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జగన్ విషయంలో మొయిలీ కూడా పార్టీ ఎంపీలతో అహ్మద్ పటేల్ లాగానే మాట్లాడుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
కాగా.. పార్టీని జగన్ మరింత నష్టపరచకుండా త్వరలోనే కీలక చర్యలు తీసుకునేందుకు అధిష్ఠానం నడుంబిగించినట్లు తెలిసింది. ఈ మేరకు సెప్టెంబర్ 3న జగన్ ఓదార్పు యాత్ర ప్రారంభించిన తర్వాత ఏ క్షణంలోనైనా ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేస్తారని పార్టీ వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. అయితే.. జగన్‌ను తప్ప ఏ ఎమ్మెల్యేనూ అధిష్ఠానం ప్రస్తుతం ముట్టుకునే అవకాశాలు లేవని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్యేలను జగన్ నుంచి దూరం చేసేందుకు చతుర్విధోపాయాలను ప్రయోగించడమే అధిష్ఠానం ధ్యేయంగా కనిపిస్తోంది.
జగన్ వ్యూహానికి ప్రతి వ్యూహం
జగన్ వ్యూహానికి అనుగుణంగా ప్రతి వ్యూహా న్ని తాము రచించామని రాష్ట్ర వ్యవహారాలను సన్నిహితం గా పరిశీలిస్తున్న ఏఐసీసీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. జగన్‌కు తాము చాలా అవకాశాలు ఇచ్చామని, అయినప్పటికీ ఓదార్పు యాత్ర తమ వ్యక్తిగతమంటూ, తాను తండ్రి సమాధి వద్ద ప్రజలకు చేసిన వాగ్దానమంటూ తమను జగన్ నమ్మించే యత్నం చేస్తున్నారని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీ కోటలకు బీటలు వేస్తూ, ఎమ్మెల్యేలను చేరదీస్తూ, ఓదార్పు యాత్రను ఆడంబరంగా నిర్వహిస్తూ.. అది వ్యక్తిగతమంటే నమ్మేంత అమాయకులం తాము కాదని ఆయన చెప్పారు. "జగన్ వద్ద ఎంత డబ్బు ఉన్నప్పటికీ, మూడు సంవత్సరాల్లో కొండలైనా కరిగిపోతాయి. డబ్బుతో పార్టీలను నిర్మించగలమనుకోవడం అమాయకత్వం. 125 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్‌కు ఎంతటి డబ్బున్నవారితోనైనా ఎలా వ్యవహరించాలో తెలుసు.
జగన్ మూలంగా పార్టీ దెబ్బతినే అవకాశాలు లేవు. వ్యక్తులు పార్టీని నష్టపరచలేరు. అందునా, కాంగ్రెస్ ఇలాంటివ్యక్తులెందరినో చూసింది,'' అని ఆయనన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిష్ఠను జగన్ దిగజారుస్తున్నారని, ఆయన మూలంగా వైఎస్‌పై ప్రతి ఒక్కరూ బురద చల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలంతా దేవుడిగా కీర్తిస్తున్న వైఎస్‌ను ఇవాళ కొందరు బజారుకీడుస్తున్నారంటే దానికి జగనే బాధ్యత వహించాలని అభిప్రాయపడ్డారు. జగన్ పట్ల అధిష్ఠానం సంతోషంగా లేదని ప్రతి ఒక్కరికీ తెలుసుననని చెప్పారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలందరికీ అధిష్ఠానం వైఖరి తెలుసునని, వారికి కొత్తగా చెప్పాల్సిన పనిలేదన్నారు.
No comments:
Post a Comment