జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Saturday, August 21, 2010

తెగతెంపులే !

pranab 
కాంగ్రెస్‌తో తెగ తెంపులు చేసుకునేందుకు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సిద్ధమయ్యారు. ఏ నెపం పెట్టి పార్టీ నుంచి బయటకు రావాలో మార్గాలు అన్వేషిస్తున్నారు. ఓదార్పు యాత్ర వద్దన్నందుకే పార్టీ నుంచి బయటకు వస్తే అలిగి వెళ్ళిపోయారన్న మాట వస్తుందని, అంతకు మించిన బలమైన కార ణాన్ని చూపిస్తూ, ఇటు ముఖ్యమంత్రి రోశ య్యను, అటు అధిష్ఠానాన్ని టార్గెట్‌ చేసి పదు నైన, పరుషమైన పదజాలంతో మాట్లాడిన తర్వాత ఇక మూటా ముల్లె సర్దుకోవాలని జగన్‌ ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అటుఅధిష్ఠానం సైతం పోతే పోనీ అనే రీతిలో వ్యవహరి స్తున్నది.
పార్టీలో సోనియా తర్వాత అంతటి స్థానంలో ఉన్న కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్‌ ముఖర్జీ శనివారం కోల్‌కతాలో మాట్లా డుతూ జగన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటం, పార్టీనుంచి పోతే పోనీ అని స్పష్టంగా ప్రకటిం చటంతో జగన్‌ తెగతెంపుల దిశగానే ఆలోచిస్తు న్నారనటానికి సూచన. తన ఓదార్పు యాత్ర పార్టీకి వ్యతిరేకం కాదని, తిరుగుబాటుఅంతకన్న కాదని, ఇందులో రాజకీయాలేవీ లేవని ఎంత చెబుతున్నా అధిష్ఠానం ఆ మాటే పట్టించుకోకుండా యాత్రపై ఆంక్షలు విధిం చటం, ఎమ్మెల్యేలు, ఎంపీలకు హుకుం జారీ చేయటం వంటి చర్యలు తీసుకుంటుండటంతో ఇక తాను ఇమిడే అవకాశం కనిపించటం లేదని, పొమ్మనక ముందే దుమ్మెత్తిపోసి వెళ్ళిపోతే తర్వాత సంగతి చూసుకోవచ్చునని జగన్‌ తన ఆంతరంగికులతో తరచుగా చెబుతున్నట్టు సమాచారం.

వచ్చేనెల రెండున దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రథమ వర్ధంతిని తన తెగతెంపుల వ్యూహానికి ముహూర్తంగా జగన్‌ నిర్ణయించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మాట నిజమే అన్నట్టుగా జగన్‌ విధేయులు అంబటి రాంబాబు లాంటి వారు ఓదార్పుయాత్రకే జగన్‌ కట్టుబడి ఉన్నారని బల్లగుద్ది మరీ చెబుతు న్నారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తన ఉద్యోగం ఊడినా ఫరవాలేదన్న రీతిలో మాట్లాడుతూ ఓదార్పు యాత్రకు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు.

బాలినేనితో జోరుగా మంతనాలు...
తన పట్ల అధిష్ఠానం వైఖరి మారే అవకాశం లేదని, ప్రణబ్‌ ముఖర్జీ, వీరప్ప మొయిలీ లాంటివారిని కలసి దగ్గుబాటి దంపతులపైన ఫిర్యాదు చేసినప్పటికీ హై కమాండ్‌ తనవైపే వేలెత్తి చూపిస్తున్నదన్న నిర్ణయానికి వచ్చిన జగన్‌, తెగతెంపులు చేసుకుని తన ప్రయత్నాలు తాను చేసుకోవాలన్న ఆలోచనతో కనిపిస్తు న్నారు. అందుకోసం తనవారనుకున్న వారితో ఎడతెరిపి లేని మంతనాలు సాగిస్తున్నారు. శుక్రవారం ఢిల్లీలో ప్రణబ్‌ ముఖర్జీని రెండు సార్లు, మొయిలీని చివరి ఆశగా మరోసారి కలసిన తర్వాత జగన్‌ రాత్రికి హైదరాబాద్‌ చేరుకున్నారు. శనివారం మంత్రి, వైఎస్‌ బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి, మరి కొందరు నేతలు జగన్‌తో కలసి ఓదార్పు యాత్రపై మంతనాలు జరిపారు. అధిష్ఠానం అనుసరిస్తున్న వైఖరిపై సైతం ఈ చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది.

jagan-sirజగన్‌తో మంతనాలు జరిపిన తర్వాత బాలినేని మీడియాతో మాట్లాడుతూ ఓదార్పు యాత్ర జరిగి తీరుతుందని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పటాన్ని బట్టి చూస్తే జగన్‌ ఎంత గట్టి నిర్ణయానికి వచ్చారో అర్థం అవుతుంది. బాలినేనితో పాటు మరి కొందరు నేతలు సైతం జగన్‌ను కలుసుకుని చర్చించారు. జగన్‌ పట్ల అధిష్ఠానానికి ఎలాంటి సానుకూలతా లేదని ఇటీవలే మరోసారి రుజువైంది. లోక్‌సభలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ వెళ్తుండగా జగన్‌ తన స్థానం నుంచి లేచి అభివాదం చేసినా పట్టించుకోకుండా వెళ్ళిపోవటం ఇందుకు సంకేతం. సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్‌ పటేల్‌ ఓదార్పు యాత్ర విషయంలో మేడం తరఫున గట్టి ఆదేశాలు జారీ చేశారు. వీటన్నిటి నేపథ్యంలో పార్టీలో తాను ఇక ఇమిడే వాతావరణం లేదన్న నిర్ణయానికి జగన్‌ వచ్చినట్టు స్పష్టమవుతున్నది.

ప్రణబ్‌ ధమ్‌కీ...
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో జగన్‌ ఏ స్థాయికీ సరిపోరన్న నిర్ణయానికి అధిష్ఠానం వచ్చేసింది. యాత్రకు వెళ్ళరాదని ఆదేశాలు జారీ చేయటం తోనే ఆయనను సమర్థించిన వారు చల్లగా వెనక్కి తగ్గటమే అందుకు ఉదాహరణ అని హైకమాండ్‌ భావిస్తున్నది. జగన్‌ పట్ల అధిష్ఠానం పెద్దగా ఆలోచించటం లేదనటానికి ప్రణబ్‌ ముఖర్జీ శనివారం కోల్‌కతాలో చేసిన వ్యాఖ్యలే తాజా ఉదాహరణ. ఆయన ఏమన్నారంటే ‘ఓదార్పు యాత్రకు వెళ్ళవద్దని ఆయనకు స్పష్టంగా చెప్పాం...జగన్‌ పార్టీలో ఉంటే ఎంత? పోతే ఎంత?...ఒక వ్యక్తి గురించి ఇంతగా చెప్పాల్సినఅవసరం అధిష్ఠానా నికి లేదు...ఆయనను బుజ్జగించే ప్రసక్తే లేదు...’ అంటూ అధిష్ఠానం మదిలో ఏమున్న దో తేటతెల్లం చేశారు. ప్రణబ్‌ కానీ, అధిష్ఠానం నేతలు అహ్మద్‌ పటేల్‌ లాంటివారు కానీ ఇలా చెప్పటం ఇదే మొదటిసారి కాదు...గతంలోనూ ఓదార్పు యాత్ర విషయంలో తనను కలిసేందుకు వచ్చినప్పుడు సైతం ప్రణబ్‌ ఘాటుగానే మాట్లాడారు. బెంగళూరులో పత్రి కల వారితో కొద్దిరోజుల క్రితం మాట్లాడుతూ జగన్‌ ఇలాగే వ్యవహరిస్తే చర్యలు తీసుకునే అవ కాశాలు లేకపోలేదని కూడా సంకేతం ఇచ్చారు.

మాటల దాడికి మరింత పదను...
ప్రణబ్‌ వ్యాఖ్యలు అలా ఉంటే, అధిష్ఠానానికి, సోనియాగాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా పేరు పొందిన రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు సైతం మాటల దాడిని మరింత పెంచారు. ముఖ్యమంత్రి రోశయ్య సర్కారును కూల్చేందుకు గాలి జనార్దనరెడ్డిని, ఆయన సోదరులను రంగంలోకి దించి, వారితో కుమ్మక్కయి కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని వీహెచ్‌ శనివారం బాహాటంగా వ్యాఖ్యానించారు. జగన్‌ పేరును ప్రస్తావించకపోయినా ఆయన ఎవరిని ఉద్దేశించి విమర్శించిందీ అందరికీ సులభం గానే తెలిసిపోయింది.

దింపుడు కళ్ళం ఆశ...
ఒకవైపు అధిష్ఠానం ఇంత స్పష్టంగా సంకేతాలు ఇస్తుంటే, ఇక వారితో మాటలేమిటి? తెగతెంపులు చేసుకుందామని జగన్‌, ఆయన ఆంతరంగికులు భావిస్తుంటే...మరి కొందరు మాత్రం దింపుడు కళ్ళం ఆశలు వదులుకోవటం లేదు. అనకాపల్లి ఎంపీ సబ్బం హరి లాంటి వారు ఏదో ఒక మూల తమకు ఇంకా ఆశ మిగిలి ఉందన్నట్టు మాట్లాడుతున్నారు. జగన్‌ తలపెట్టిన యాత్రకు రాజకీయ రంగు పులమాల్సిన అవసరం లేదని సబ్బం మళ్ళీ మళ్ళీ చెబుతున్నారు.

కాంగ్రెస్‌ పార్టీపై కానీ, ముఖ్యమంత్రి రోశయ్యపై కానీ జగన్‌ ఒక్కసారైనా వ్యతిరేక వ్యాఖ్యలు చేశారా అని సవాల్‌ విసిరారు. జగన్‌పై రాజకీయ, వ్యక్తిగత కక్షలతో కొన్ని శక్తులు చేస్తున్న కుట్ర వల్లనే అధిష్ఠానానికీ, జగన్‌కూ మధ్య అగాథం పెరిగిందని వెనకేసుకు వచ్చే ప్రయత్నం చేశారు. ఓదార్పు యాత్ర వల్ల పార్టీకి మరింత బలం చేకూరుతుందని సబ్బం హరి పదే పదే చెప్పారు. మరోవైపు నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి సోదరుడు, ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సైతం ఓదార్పుయాత్రను, జగన్‌ను సమర్థిస్తూ మాట్లాడారు.

డెడ్‌లైన్‌ సెప్టెంబర్‌ రెండు?...
తాను ఏమి చెప్పినా అధిష్ఠానం వినే ప్రసక్తి లేదని తేల్చుకున్న జగన్‌, ఇక తెగతెంపులు చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. తన తండ్రి ప్రథమ వర్ధంతి రోజున కానీ, ఆ తర్వాత ఏ క్షణంలో అయినా తెగతెంపుల ప్రకటన బహిర్గతమవుతుందని, ఆలోగా తన వెంట ఎవరెవరు వస్తారో చూసుకుని, రాని వారి నియోజకవర్గాలలో వారి ప్రత్యర్థులు, రెండవ శ్రేణి నేతలందరినీ తన వైపు తిప్పుకునే కార్యక్రమం పూర్తి అయిన తర్వాత కడపలో లేదా మరో ప్రాంతంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి తెగతెంపులు చేసుకుంటున్నట్టు ప్రకటిస్తారని విశ్వసనీయ సమాచారం. అటు అధిష్ఠానం మాత్రం ఈ అంశాలను పెద్దగా పట్టించుకోవటం లేదు.

ఒక వ్యక్తికి ఇంత ప్రాధాన్యం ఇస్తే ఇక పార్టీ మనుగడ కష్టతరమవుతుందని, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచటమే మేలన్న ఆలోచనతో హై కమాండ్‌ ఉంది. జగన్‌ తెగతెంపులు చేసు కున్నా ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో రోశయ్య సర్కార్‌కు ముంచుకు వచ్చే ప్రమాదం ఏమీ లేదన్న ధీమా హైకమాండ్‌లో వ్యక్తం అవుతున్నది. ఒకవేళ ఏ కొందరు ఎమ్మెల్యేలో ఆయన వెంట వెళ్ళినా ఆదుకోవటానికి ప్రజా రాజ్యం పార్టీ, మజ్లిస్‌ తదితర పార్టీలు ఉండనే ఉన్నాయి కనుక పెద్ద ఇబ్బందేమీ ఎదురుకాదన్నది హై కమాండ్‌ ఆలోచన. ఒకవేళ జగన్‌ మరీ గణనీయ సంఖ్యలో ఎమ్మెల్యేలను చీల్చి మధ్యంతర ఎన్నికలకు మార్గం వేసే వ్యూహాన్ని అనుసరిస్తే దాన్ని కూడా ఎదుర్కునేందుకు లేదా రాష్టప్రతి పాలన విధించి, ఆరు మాసాల్లోగా మళ్ళీ పుంజుకుని ఎన్నికలకు వెళ్ళేందుకైనా వెనుకాడకూడదన్న ఆలోచనతో హై కమాండ్‌ ఉన్నట్టు చెబుతున్నారు.

1 comment:

  1. Sep 2 Dead line kanna munde Jagan ni pampinchestaru... A rojuli Sonia YS Nivali lo palgontaru...

    ReplyDelete