జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Friday, August 13, 2010

వద్దే వద్దు! పార్టీ నేతలకు సోనియా ఆదేశం - కేంద్ర మంత్రి ద్వారా సందేశం * వైయస్ ఓదార్పు యాత్రకు వెళ్లొద్దు: సోనియా మరోసారి ఆదేశం

 
తాడోపేడో తేల్చేందుకే సిద్ధం
జగన్ వెంట ఎందరున్నారని ఆరా
వ్యతిరేకుల స్వరానికి ప్రోత్సాహం
ముందుకే వెళతానంటున్న జగన్
ప్రకాశంలో యాత్ర పొడిగింపు!
వైఎస్ సభ పోస్టర్ ఆవిష్కరణ
మళ్లీ ఆదేశం.... ఈసారి ఏకంగా అధినాయకురాలి నుంచే!
అదే నిర్దేశం... పార్టీ శ్రేణులన్నింటికీ స్పష్టమైన సందేశం!
'ఓదార్పు యాత్రలో కాంగ్రెస్ వాదులెవరూ పాల్గొన వద్దు!'
ఇదీ స్వయంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ జారీ చేసిన తాజా హుకుం!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ వర్ధంతి మరుసటి రోజు (సెప్టెంబర్ 3) నుంచి, ప్రకాశం జిల్లాలో ఓదార్పు (మూడో విడత) యాత్రను కొనసాగించాలని కడప ఎంపీ జగన్ నిర్ణయించుకోవడంతో ఇక మేడమ్ సోనియగాంధీయే రంగంలోకి దిగారు. యాత్రకు కాంగ్రెస్ నేతలెవరూ వెళ్లవద్దని, తన మాటగా దీన్ని పార్టీ శ్రేణులకు చెప్పాలని ఆమె ఓ కేంద్ర మంత్రికి సూచించారు. సదరు కేంద్ర మంత్రి శుక్రవారం పార్లమెంటు సెంట్రల్‌హాల్‌లో సోనియాను కలిశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... వారిద్దరి మధ్య సంభాషణ ఇలా సాగింది.

కేంద్ర మంత్రి: ఓదార్పు యాత్రలో పాల్గొనడంపై పార్టీ వాదుల్లో అయోమయం ఉంది. ఈ విషయంలో అధిష్ఠానం నుంచి ఇంతవరకూ స్పష్టత లేదు. సోనియా: అయోమయం లేనే లేదు. ఓదార్పు యాత్రలో మీరు పాల్గొనొద్దు. మీరు పాల్గొనక పోవడమే కాదు; మీ తోటి కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకు కూడా, యాత్రకు వెళ్లవద్దని స్పష్టంగా చెప్పండి.

కేంద్ర మంత్రి: యాత్ర విషయంలో దళిత ఎమ్మెల్యేలు, ఎంపిీలు, మంత్రులు ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. సోనియా: ఎలాంటి ఆందోళనా అవసరం లేదు. ఒత్తిడి ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు ధైర్యం చెప్పండి. వారికి అండగా నేనున్నాను. కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఇచ్చేది అధిష్ఠానమే అని, వారికి ఎలాంటి నష్టం ఉండదని భరోసా ఇవ్వండి.

కేంద్ర మంత్రి: ఎమ్మెల్యేలకు మా స్థాయిలో మేం చెబుతాం. అయితే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ ఈ విషయంలో పార్టీ నేతలకు సరైన మార్గదర్శక సూత్రాలు జారీ చేయలేదు. పైగా ఆ యాత్ర జగన్ వ్యక్తిగతమంటూ ప్రకటనలు చేస్తున్నారు. సోనియా: ఏడీ? వీరప్ప మొయిలీ ఎక్కడ? ఆయనతో నేను తర్వాత మాట్లాడతాను. ఇలా చెప్పిన సోనియా, అన్నట్టుగానే తర్వాత మొయిలీని పిలిపించుకుని మాట్లాడారు. ఆ తర్వాత మొయిలీ విలేఖరులకు అందుబాటులోకి వచ్చినప్పటికీ, ఓదార్పు గురించి మాట్లాడడానికి నిరాకరించారు. జగన్ సెప్టెంబర్ 3 నుంచి జగన్ యాత్ర చేస్తున్నట్లు తనకు సమాచారం లేదన్నారు.

సోనియాతో గురువారం నాటి తన సమావేశం వివరాలు మీడియాలో రావడం పట్ల మొయిలీ అసహనం వ్యక్తం చేశారు. కాగా జగన్ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో ఎంతమంది ఆయనకు మద్దతుగా ఉన్నారని సదరు కేంద్ర మంత్రిని సోనియా ఆరా తీశారు. జగన్ యాత్రకు వ్యతిరేకంగా బహిరంగంగా, గట్టిగా మాట్లాడే వారు రాష్ట్రంలో ఎవరెవరు ఉన్నారని కూడా మేడమ్ అడిగినట్టు సమాచారం. అలాంటి వారిని గుర్తించి, తనకు తెలియజేయాలని, వారిని ప్రోత్సహిద్దామని ఆమె అన్నట్టు తెలిసింది.

మొత్తమ్మీద వద్దన్నా యాత్రకు వెళుతున్న జగన్ విషయంలో అధిష్ఠానం క్రమంగా పట్టు బిగిస్తున్నట్టే కనిపిస్తోంది. ఇప్పటిదాకా ఈ విషయంలో ఎలాంటి ప్రత్యక్ష వ్యాఖ్యలు చేయని సోనియా, స్వయంగా రంగంలోకి దిగడం హైకమాండ్ సీరియస్‌నెస్‌ను సూచిస్తోందని పార్టీ నేతలు చెబుతున్నారు. చూస్తుంటే, రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని హైకమాండ్ త్వరలోనే చక్కదిద్దబోతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు. గీత దాటితే సహించేది లేదన్న స్పష్టమైన సంకేతాలే ఇందుకు స్పష్టమైన ఉదాహరణ అని చెబుతున్నారు.
Sonia Gandhi
అధిష్ఠానం వైఖరి ఎలా ఉన్నా, ఓదార్పు యాత్రలో ముందుకు వెళ్లడానికే జగన్ నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. యాత్రలో పార్టీ వాదులు పాల్గొన వద్దన్న సోనియా నిర్దేశం వెలువడిన కొద్ది గంటల్లోనే జగన్, ఓదార్పు ఆపే ప్రసక్తే లేదని సన్నిహితులకు స్పష్టంచేశారు. అంతేకాదు, ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్రకు ముందు అనుకున్నట్టుగా వారం రోజులు సరిపోదని, పొడిగించాలని నిర్ణయించడం గమనార్హం.

ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన జగన్‌ను ఎమ్మెల్యేలు కొండా సురేఖ, ఆదినారాయణరెడ్డి, శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కలిశారు. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి రూపొందించిన వైఎస్ సంస్మరణ సభ పోస్టర్లను జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్ర విషయం చర్చకు వచ్చింది.

జిల్లా వ్యాప్తంగా వైఎస్ విగ్రహాల స్థాపనకు కార్యకర్తలు పట్టుబడుతున్నందున యాత్రకు వారం రోజులు చాలదని, చాలా రోజులు పట్టేలా ఉందని జగన్ పేర్కొన్నారు. అధిష్ఠానం అవునన్నా కాదన్నా ఓదార్పు ఆగే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అటు నెల్లూరు యాత్రకూ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎంపీ మేకపాటి సోదరులు ఈ బాధ్యత తీసుకున్నారు. ఇది ఆనం (రామనారాయణరెడ్డి, వివేకానందరెడ్డి) సోదరులకు మింగుడు పడడం లేదన్న ప్రచారం సాగుతోంది.

నెల్లూరు జిల్లా పర్యటన విషయంలో జగన్, ఆనం సోదరులను ఇప్పటి వరకూ సంప్రదించకపోవడం చర్చనీయాంశమైంది. అధిష్ఠానం తాజా నిర్దేశం నేపథ్యంలో జగన్ ప్రకాశం యాత్రలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు పాల్గొంటారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. వరంగల్ జిల్లా మహబూబాబాద్ ఘటన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన యాత్రలో ప్రజా ప్రతినిధులెవరూ పాల్గొన లేదు. అయితే వారి కుటుంబ సభ్యులు, బంధువులు హాజరయ్యారు. తూర్పు గోదావరి జిల్లాలో మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌తో సహా పలువురు ప్రజా ప్రతినిధులు యాత్రలో పాల్గొన్నారు. ఇక ప్రకాశంలో ఏం జరుగుతుందో చూడాలి.
తమ పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్రను విఫలం చేసి, జగన్ ను ఒంటరి చేసేందుకు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వయంగా రంగంలోకి దిగారు. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యే జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొనవద్దని, శాసనసభ్యులకు తన మాటగా ఆ విషయం చెప్పాలని ప్రకాశం జిల్లా పార్లమెంటు సభ్యులు పనబాక లక్ష్మి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి లకు ఆమె స్వయంగా చెప్పారు. వ్యక్తిగత యాత్రలో పార్టీ ప్రజాప్రతినిధులు పాల్గొనాల్సిన అవసరం లేదని ఆమె మంగళవారం తనను కలిసిన ప్రకాశం జిల్లా ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, పనబాక లక్ష్మిలకు తేల్చిచెప్పారు. జగన్‌కు వీరవిధేయులైన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, దర్శి ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డి మినహా జిల్లాలోని పార్టీ శాసనసభ్యులందరినీ ఢిల్లీ పిలిపించారు. జేసీ దివాకరెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారమంతా వారితో సంప్రదింపులు జరిపి దేశ రాజధానికి రప్పించారు. మంగళవారం రాత్రి జేసీ దివాకర్‌రెడ్డి సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్‌ పటేల్‌తో భేటీ అయ్యారు. ప్రకాశం జిల్లా శాసనసభ్యులు కూడా అహ్మద్ పటేల్ ను కలిసే అవకాశం ఉంది. స్థానిక శాసనసభ్యులపై జగన్ వర్గం నుంచి తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా శాసనసభ్యులకు ధైర్యం కల్పించి జగన్ కు దూరం చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.

ఓదార్పు యాత్ర తమ నియోజక వర్గాల్లో సాగనుండటంతో అందులో పాల్గొనాలా? వద్దా? అన్న సందేహంతో ఎంపీలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పనబాక లక్ష్మిలు మంగళవారం ఉదయం పార్లమెంటు హాల్లో సోనియాను కలిశారు. ఓదార్పు యాత్రలో పాల్గొనాలని స్థానిక నేతల నుంచి ఒత్తిళ్లు వస్తున్నందున ఈ విషయమై తమకు మార్గదర్శనం చేయాలని కోరారు. వ్యక్తుల యాత్రల్లో పాల్గొనాల్సిన అవసరం లేదని సోనియా నర్మగర్భంగా తన మనోభావాన్ని చెప్పినట్లు తెలిసింది. ఈ సందర్భంగా వారు ఓదార్పు యాత్రకు జగన్‌ వర్గం చేస్తున్న అట్టహాసాల గురించి, అందులో పాల్గొనాలని నేతలకు ఫోన్లుచేసి బలవంత పెడుతున్న విషయాన్ని సోనియా దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

ప్రకాశం జిల్లాకు చెందిన ఎనిమిది మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఈ విషయంలో కలిసికట్టుగా ఉండాలని, అధిష్ఠానం వైఖరికి అనుగుణంగా నడచుకోవాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా శాసనసభ్యులు మహీధర్ ‌రెడ్డి, గొట్టిపాటి రవికుమార్‌, జి.వి.శేషు, ఉగ్రనరసింహారెడ్డిలు జేసీ దివాకర్‌రెడ్డిని సీఎల్‌పీ కార్యాలయంలో కలిశారు. మిగతా ఎమ్మెల్యేలతో బొత్స మాట్లాడారు. అనంతరం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మహీధర్‌ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్‌, జి.వి.శేషు, ఉగ్రనరసింహారెడ్డి, సురేష్‌ కుమార్‌, ఆమంచి కృష్ణమోహన్‌, విజయ్‌ కుమార్‌ ఢిల్లీకి బయల్దేరారు. గొట్టిపాటి రవికుమార్‌, ఉగ్రనరసింహారెడ్డిలను ఇదివరకే రాహుల్‌గాంధీ పిలిపించుకుని మాట్లాడారు. కేంద్రమంత్రి పనబాక లక్ష్మి తాను ఓదార్పు యాత్రలో పాల్గొనబోనని, కాంగ్రెస్‌ కార్యకర్తలు కూడా పాల్గొనరని ప్రకటించారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు సతీమణి పురందేశ్వరి కూడా కేంద్రమంత్రిగా ఉన్నందువల్ల సోనియా మాటను గౌరవించడం ఆయనకు అనివార్యమని పార్టీ నాయకులు చెబుతున్నారు.

No comments:

Post a Comment