జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Thursday, August 19, 2010

ఓదార్పుపై సోనియా మాటలు వక్రీకరించారని పురందేశ్వరి వెల్లడి * వైయస్ జగన్ ఓదార్పుకు కౌంటర్ ఓదార్పు : పురంధేశ్వరి


వై.ఎస్. మరణాన్ని జీర్ణించుకోలేక ఆత్మార్పణం చేసినవారిని ఓదార్చవద్దని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి చెప్పారా ? ఓదార్పు విషయంలో అసలు ఆమె ఏమి చెప్పారు, బయటకు ఆ మాట ఎలా వచ్చింది ? ఈ విషయమై కేంద్ర మంత్రి పురందేశ్వరి గురువారంనాడు ఢిల్లీలో సోనియాను కలిసిన అనంతరం ఒక వివరణ ఇచ్చారు.

ఈ వివరణ ప్రకారం ఓదార్పు విషయంలో సోనియా గాంధి ఓదార్పు జరగాలనే కోరుకున్నారు. అయితే అది కాంగ్రెస్ పార్టీ పరంగా జరగాలి. అలాగే మరణించిన కుటుంబాలవారికి ఆర్థిక సహాయం చేయవలసిందే. అయితే ఆ సాయం కూడా పార్టీ పరంగానే అందాలి. సోనియా గాంధి కోరుకున్నది ఇదే. అయితే ఈ విషయమై తన మాటలు వక్రీకరణకు గురైనట్టు సోనియా గాంధి చెప్పారని పురందేశ్వరి వివరించారు.

ప్రకాషం జిల్లా ప్రజాప్రతినధులతో అహమ్మద్ పటేల్ బుధవారంనాటి సమావేశంలో చెప్పిన మాటలను కూడా సోనియా ధ్రువీకరించిన ట్టు పురందేశ్వరి వెల్లడించారు.

వైయస్ జగన్ ఓదార్పుకు కౌంటర్ ఓదార్పు: పురంధేశ్వరి


Purandeswari
పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్ర కొత్త మలుపు తిరిగింది. కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఆయన ఓదార్పునకు సరికొత్త కౌంటర్ ను రూపొందించింది. పార్టీయే స్వయంగా ఓదార్పు యాత్ర నిర్వహించాలని కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచించినట్లు కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావు చెప్పారు. పురంధేశ్వరి గురువారం సోనియా గాంధీతో సమావేశమయ్యారు. సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ను కూడా ఆమె కలిశారు. ఈ భేటీ సమయంలో వారిద్దరు పురంధేశ్వరికి జగన్ ఓదార్పు యాత్రకు కౌంటర్ ప్లాన్ ఇచ్చారు.

వైయస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మృతికి తట్టుకోలేక మరణించినవారి కుటుంబాలను పార్టీ వరంగా ఆదుకోవాలని సోనియా ఆదేశించినట్లు పురంధేశ్వరి చెప్పారు. ఓదార్పు కార్యక్రమం పార్టీ పరంగానే జరగాలని సూచించినట్లు తెలిపారు. బాధితులను సమీకరించి సహాయం అందించాలని సోనియా చెప్పినట్లు ఆమె తెలిపారు. ప్రతి జిల్లాలో వైయస్ విగ్రహాలను పార్టీపరంగా నెలకొల్పాలని సూచించినట్లు ఆమె తెలిపారు. వైయస్ కేవలం కుటుంబానికి చెందిన నాయకుడు కారని, కాంగ్రెసుకు సంబంధించిన నాయకుడని చాటి చెప్పడానికి కాంగ్రెసు ఈ కౌంటర్ వ్యూహాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది.

No comments:

Post a Comment